PHP-and-MySQL/C4/User-Registration-Part-5/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | యూజర్ రిజిస్ట్రేషన్ ట్యుటోరియల్ ఐదవ భాగానికి మీకు స్వాగతం. మనం చిన్న చిన్న వాటిని ఒక చోట చేర్చి, మన లాగిన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం |
0:11 | తరువాత ఇది పనిచేస్తుందో లేదో అని మనం పరీక్షించాలి. |
0:14 | ఆఖరి భాగములో, నేను ఈ డాటాబేస్ లో నాపేరును రిజిస్టర్ చేసుకున్నాను. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కాబట్టి, నేను లాగిన్ తెరకు వెళతాను. |
0:24 | నేను లాగిన్ కాగలనో లేదో చూద్దాం. యూజర్ నేమ్ ను "అలెక్స్" గానూ, మునుపు వాడిన పాస్వర్డ్ ను నా పాస్వర్డ్ గానూ అనుకుందాము. |
0:33 | నేను లాగిన్ ను క్లిక్ చేయడంతో, "ఇన్కరెక్ట్ పాస్వర్డ్" అని వస్తుంది. |
0:37 | దీనర్థం నా యూజర్ నేమ్ పనిచేయలేదని మాత్రం కాదు. |
0:40 | దీన్ని యూజర్ నేమ్ లోనూ, పాస్వర్డ్ ను టైప్ చేస్తాను. ఇది "దట్ యూజర్ డస్నాట్ ఎక్సిస్ట్స్!" అని అది చెబుతుంది. |
0:50 | కానీ, ఇక్కడ, నా యూజర్ నేమ్ ఉంది, కానీ, నా పాస్వర్డ్ తప్పుగా ఉంది అని చెబుతోంది. |
0:55 | ఇపుడు, నా పాస్వర్డ్ తప్పు అవడానికి కారణమేమిటంటే, ఇక్కడ గల, నా టెక్ట్స్ పాస్వర్డ్ ను, డాటా బేస్ లోపల గల, నా "md5-ఎన్క్రిప్టెడ్" పాస్వర్డ్ తో పోలుస్తుంది. |
1:07 | దీనిని మనం చేయాలంటే, మన మునుపటి ట్యుటోరియల్ అయిన యూజర్ లాగిన్ ట్యుటోరియల్ లో చెప్పినట్టుగా, మనం మన లాగిన్ పేజ్ కు తిరిగి వెళ్ళాలి. |
1:18 | మనం మన పాస్వర్డ్ , సరిగా ఉన్నాయో, లేదో అని చెక్ చేయు భాగానికి, వెళ్ళాలి. అది మన యూజర్ నేమ్ ను చెక్ చేస్తుంది మరియు ఇది పాస్వర్డ్ ను చెక్ చేస్తుంది. |
1:34 | మన పాస్వర్డ్ ను చెక్ చేయాలి. ఇప్పుడు, నా పాస్వర్డ్ ను "స్లైసర్ యు కె 1" అని టైప్ చేస్తాను. |
1:47 | అందుచేత, ఈ పాస్వర్డ్ ను నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇది చాలా పాతది. |
1:56 | "స్లైసర్ యు కె 1". ఓకే, దీన్ని చెక్ చేస్తోంది మరియు ఇక్కడ, ఈ పాస్వర్డ్ sliceruk1 కు సమానము. |
2:06 | కానీ, ఈ "పాస్వర్డ్", "డిబి పాస్వర్డ్" కు సమానము. కాబట్టి, మనం పోలిక దొరకలేదు. |
2:12 | మనం, మన పాస్వర్డ్ ను ఎప్పుడు మరుగు పరుస్తామో, అప్పుడు దీనిని ఎంపిక చేద్దాం. |
2:19 | అందుచేత, ఇది నిజానికి దీనితో సమానం. కాబట్టి, ఇదే మరుగుపరచ బడిన, "స్లైసర్ యు కె 1", మరియు ఈ "స్లైసర్ యు కె 1" కు సమానము. |
2:30 | అందుచేత, మనం, ఒక md5 మరుగుపరచబడిన పాస్వర్డ్ ను, మన డాటాబేస్ లోని ఇంకొక మరుగుపరచబడిన పాస్వర్డ్ తో పోలుస్తున్నాము. |
2:37 | ఈ ఫాం ను తిరిగి సబ్మిట్ చేసి, లాగిన్ అవుతాను. ఓహ్! మరలా ఎర్రర్ వచ్చింది! |
2:42 | నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. లాగిన్ పై క్లిక్ చేస్తాను. లేదు, ఇది పనిచేయడం లేదు. |
2:47 | ఈ "పాస్వర్డ్" ను, "పోస్ట్ పాస్వర్డ్" తో చెక్ చేద్దాం. అందుచేత, md5 అనేది పాస్వర్డ్. తిరిగి వెళ్ళి, రిఫ్రెష్ చేద్దాం. |
3:01 | నా పాస్వర్డ్ ను టైప్ చేస్తాను. సరే, నాకు ఇక్కడ ఏ సమస్య ఉందో తెలిసింది. |
3:10 | ఇక్కడ సమస్యేమిటంటే, మన md5 పాస్వర్డ్ సరియైనదే అయినా మన డాటాబేస్ లో చిన్నదిగా చేసి ఉంచిన పాస్వర్డ్ తో పోలుస్తోంది. |
3:22 | ఇది ఎందుకంటే, మనం మన నిర్మాణమును చూసి, పాస్వర్డ్ ఫీల్డ్ కు వెళ్ళి, దాన్ని ఎడిట్ చేసినట్లయితే,
పొడవు 25 కు పరిమితమైనట్లు గా, మనం చూడవచ్చు. |
3:37 | అందుచేత, మనం ఈ పరిమితిని 100 కు పెంచుదాం. |
3:43 | నాకు ఈ md5 స్ట్రింగ్ ఎంత పొడవైనదో ఖచ్చితంగా తెలియదు, కానీ దాని విలువ = 100 అని వ్రాస్తాను. దాన్ని సేవ్ చేస్తాను. |
3:50 | నేను, మన టేబుల్ ని డొన్లోడ్ చేసి దాని విలువను తొలగిస్తాను. తరువాత, నేను తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ చేస్తాను. |
4.00 | కాబట్టి, రిజిస్టర్ చేయండి. మీ యూజర్ నేమ్ ను ఎంచుకోండి. నేను ముందుగా చెప్పినట్లే, అలెక్స్ అని అనుకుందాము. ఒక పాస్వర్డ్ ను, అంటే, "స్లైసర్ యు కె 1" ను ఎంచుకొని, "రిజిస్టర్" ను క్లిక్ చేయండి. |
4:14 | "మీరు రిజిస్టర్ చేసుకున్నారు. లాగిన్ పేజ్ కు తిరిగి వెళ్ళండి." |
4:17 | ఇపుడు, మన డాటాబేస్ ను తిరిగి చెక్ చేద్దాం. అది చాలా పొడవుగా కనబడుతోంది, నేను దాని పొడవును మార్చినందువల్ల, అది చిన్నగా చేయబడలేదు. |
4:27 | అందుచేత, ఇపుడు తిరిగి లాగ్ ఇన్ కావడానికి, నేను సరిగా టైప్ చేస్తాను. |
4:33 | మనం లాగిన్ అయ్యాము మరియు లోపలికి ప్రవేశించ గలిగాము. సరే, స్ట్రింగ్ పొడవును చెక్ చేయండి. |
4.43 | మీకు వచ్చేసిందని అనుకుంటాను. |
4.45 | ఈ ట్యుటోరియల్ ను ఇంకా విశదింగా వివరించాలంటే, నాకు తెలపండి. |
4:52 | అది యూజర్ రిజిస్ట్రేషన్ అన్నమాట. |
4:55 | దీన్ని, మన యూజర్ లాగిన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి, ఈ రెండిటిని కలిపితే, మనకు యూజర్ రిజిస్టర్ మరియు లాగిన పద్ధతులు పూర్తిగా, నేర్చుకోవడానికి వీలవుతుంది. |
5:04 | నా ప్రాజెక్ట్ వర్క్ లో, నేను దీన్ని చాలా ఉపయోగిస్తాను. ఉదాహరణకు, |
5:12 | ఒక యూజర్ లాగిన్ మరియు ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఉపయోగించడంపై, నేను ఒక ప్రాజెక్ట్ ను క్రియేట్ చేయవచ్చు. దీనిని బాగా ఉపయోగించవచ్చు. |
5:19 | కాబట్టి, మరిన్ని వివరములకు, యూజర్ లాగిన్ మరియ రిజిస్ట్రేషన్ నా ప్రాజెక్ట్స్ ను చెక్ చేయండి. |
5:28 | మీకు ఏవేని సందేహాలు ఉంటే లేదా ఏదైనా వివరించాలని అనిపిస్తే, దయచేసి నాకు తెలపండి. |
5:35 | భవిష్యత్తులో, అప్డేట్స్ కొరకు, సబ్క్స్రైబ్ చేయండి. వీక్షించినందుకు ధన్యవాదములు. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నది, సునీత. |