Python/C4/Using-python-modules/Telugu
Time | Narration | ||||||||
0:01 | హలో ఫ్రెండ్స్, "Using Python Modules" పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. | ||||||||
0:06 | 1 ఈ ట్యుటోరియల్ చివరికి, మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు.
2 కమాండ్ లైన్ నుండి పైథాన్ స్క్రిప్ట్లు ఎక్సిక్యూట్ చేయగలుగుతారు. 3 స్క్రిప్ట్లలో ఇంపోర్ట్ ఉపయోగించుతారు. 4 scipy మరియు pylab మాడ్యూల్స్లను ఇంపోర్ట్ చేయగలుగుతారు. 5 పైథాన్ స్టాండర్డ్ మాడ్యూల్స్ మరియు 3rd పార్టీ మాడ్యూల్స్ ఉపయోగిస్తారు. 6 7 |
0:20 | ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టేముందు, "Using plot interactively", "Embellishing a plot" మరియు "Saving plots" మొదలైన వాటిపై ట్యుటోరియల్ పూర్తి చేయాలని సూచిస్తున్నాము
|
0:32 | hello world అని ప్రింట్ చేయుటకు ఒక సామాన్యమైన పైథాన్ స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాము.
|
0:36 | మీ టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేయండి మరియు ఈ క్రిందివి టైప్ చేయండి.
|
0:41 | డబల్ కోట్స్లో Hello world ఎక్స్క్లమేషన్ ప్రింట్ చేయండి
|
1:02 | ఇప్పుడు మనము ఈ స్క్రిప్ట్ను hello.py అని సేవ్ చేద్దాము. | ||||||||
1:11 | ipython ఇంటర్ప్రిటర్ మొదలు పెట్టండి. | ||||||||
1:14 | టర్మినల్ ఓపెన్ చేయండి మరియు ipython అని టైప్ చేయండి. | ||||||||
1:20 | ఇంతకు ముందరి ట్యుటోరియల్స్లో, IPython ఇంటర్ప్రిటర్ మరియు పర్సెంటేజ్ రన్ ఉపయోగించి ఒక స్క్రిప్ట్ను ఎలా రన్ చేయాలో చూసాము | ||||||||
1:29 | కాబట్టి పర్సెంటేజ్ రన్ హైఫెన్ i hello.py అని టైప్ చేయండి. | ||||||||
1:40 | కాని ఒక పైథాన్ స్క్రిప్ట్ రన్ చేయుటకు ఇది సరైన పద్ధతి కాదు. | ||||||||
1:45 | Python ఇంటర్ప్రెటర్ ఉపయోగించి రన్ చేయడము సరైన పద్ధతి. | ||||||||
1:50 | టర్మినల్ ఓపెన్ చేయండి మరియు hello.py ఉన్న డైరెక్టరీకి వెళ్ళండి. | ||||||||
1:57 | ఇప్పుడు Python స్క్రిప్ట్ను python hello.py గా రన్ చేయండి. | ||||||||
2:12 | అది స్క్రిప్ట్ ఎక్సిక్యూట్ చేసింది మరియు మనకు Hello World! అవుట్పుట్ వచ్చింది. | ||||||||
2:20 | పైథాన్ స్పేస్ ఫైల్ పేరు ఇక్కడ సింటాక్స్. | ||||||||
2:24 | ఇప్పుడు, ఒక సింగిల్ ఫిగర్లో నాలుగు ప్లాట్స్ ను ప్లాట్ చేసిన చోట ఫోర్ ప్లాట్ సమస్య ఉంది. | ||||||||
2:34 | కమాండ్ లైన్ నుండి స్క్రిప్ట్ రన్ చేద్దాము. | ||||||||
2:40 | పైథాన్ ఫోర్ అండర్ స్కోర్ plot.py అని టైప్ చేయండి. | ||||||||
2:50 | ఊప్స్! అది పని చేయాలి కాని చేయలేదు. | ||||||||
2:55 | అది linspace() is not defined అని ఒక ఎర్రర్ ఇచ్చింది. అంటే linspace() ఫంక్షన్ ప్రస్తుత నేం-స్పేస్లో అందుబాటులో లేదు. | ||||||||
3:02 | కాని ఇదే స్క్రిప్ట్ను మీరు మీ IPython ఇంటర్ప్రిటర్లో హైఫెన్ pylab ఆప్షన్తో మొదలుపెట్టి %run -i ఫోర్ అండర్ స్కోర్ plot.py ఉపయోగించి రన్ చేస్తే, అది పనిచేస్తుంది. ఎందుకంటే హైఫెన్ pylab ఆప్షన్ ipython ఇంటర్ప్రిటర్ మొదలైనప్పుడు మన నేం-స్పేస్కు అవసరమైన మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవడము ద్వారా మనకు కొంత పని చేస్తుంది. | ||||||||
3:25 | ఈ విధంగా మనము మాడ్యూల్స్ను ప్రత్యేకముగా ఇంపోర్ట్ చేసుకోనవసరము లేదు. | ||||||||
3:28 | కాబట్టి ఇప్పుడు మనము సమస్యను సరిచేద్దాము మరియు స్క్రిప్ట్ను కమాండ్ లైన్లో రన్ చేద్దాము. | ||||||||
3:33 | ఈ లైన్ను స్క్రిప్ట్లో మొదటి లైన్గా చేర్చండి. | ||||||||
3:43 | scipy నుండి star ఇంపోర్ట్ చేసుకో | ||||||||
4:12 | ఇప్పుడు స్క్రిప్ట్ను మనము తిరిగి రన్ చేద్దాము. | ||||||||
4:15 | python four అండర్ స్కోర్ plot.py అని టైప్ చేయండి. | ||||||||
4:25 | అది ఇప్పుడు మరొక ఎర్రర్ చూపుతోంది -- plot not defined, | ||||||||
4:32 | ఫైల్ను మనము తిరిగి ఎడిట్ చేద్దాము మరియు ఈ లైన్ను రెండవ లైన్గా మన స్క్రిప్ట్లో చేర్చుదాము మరియు దానిని సేవ్ చేద్దాము. | ||||||||
4:38 | కాబట్టి లైన్ను four underscore plot.py లో రెండవ లైన్గా చేర్చండి మరియు సేవ్ చేయండి. | ||||||||
4:47 | pylab నుండి star ఇంపోర్ట్ చేయండి. | ||||||||
5:05 | ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేయండి, | ||||||||
5:07 | కాబట్టి python four underscore plot.py అని టైప్ చేయండి | ||||||||
5:19 | అవును! ఇది పనిచేసింది | ||||||||
5:21 | మనము ఏమి చేసాము? | ||||||||
5:24 | నిజానికి మనము ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఉపయోగించి కావలసిన మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము. | ||||||||
5:29 | ఇది scipy నుండి ఇంపోర్ట్ చేయి అనేదానికి బదులుగా scipy నుండి linspace ఇంపోర్ట్ చేయి అని ఉపయోగించడము ద్వారా కూడా చేయవచ్చు. | ||||||||
5:39 | కాబట్టి వాడుకలో ఎప్పుడు asterisk లేక star లకు బదులుగా ఫంక్షన్ పేర్లు ఉపయోగించడము మంచిది. | ||||||||
5:45 | ఒక మాడ్యూల్ నుండి ఇంపోర్ట్ చేసుకొనుటకు మనము asterisk ఉపయోగిస్తే, అది ఇదివరకే ఉన్న ఫంక్షన్లను అదే పేరుతో మన నేం-స్పేస్లో రీప్లేస్ చేస్తుంది. | ||||||||
5:56 | కాబట్టి four underscore plot.py ను మార్చుదాము. మన కోడ్లో మనము చేర్చిన మొదటి రెండు లైన్లను తొలగిద్దాము మరియు ఈ లైన్లను చేర్చుదాము. | ||||||||
6:08 | scipy నుండి linspace ఇంపోర్ట్ చేయి అని టైప్ చేయండి
scipy నుండి linspace కామా pi కామా sin ఇంపోర్ట్ చేయి pylab నుండి plot కామా legend కామా annotate ఇంపోర్ట్ చేయి pylab నుండి xlim కామా ylim కామా title కామా show ఇంపోర్ట్ చేయి | ||||||||
7:08 | ఇప్పుడు కోడ్ను python four underscore plot.py లాగా తిరిగి రన్ చేయుటకు ప్రయత్నిద్దాము మరియు ఎంటర్ ప్రెస్ చేద్దాము. | ||||||||
7:19 | అది పనిచేస్తుంది! ఈ పద్ధతిలో మనము ప్రస్తుత నేం-స్పేస్కు ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసాము. | ||||||||
7:24 | దీనిని చేయుటకు మరొక పద్ధతి కూడా ఉంది. | ||||||||
7:26 | అది, | ||||||||
7:35 | ఇంతకు ముందు పద్ధతిలో లాగా pi అని మాత్రమే కాకుండా ఇక్కడ మనము scipy.pi అని ఉపయోగిస్తామని గమనించండి మరియు ఫంక్షన్లు pylab.plot() మరియు pylab.annotate() అని పిలువబడతాయి. plot() మరియు annotate() అని పిలువబడవు. | ||||||||
7:55 | ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి. ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించండి మరియు వీడియోను తిరిగి ప్రారంభించండి. | ||||||||
8:01 | minus two pi నుండి two pi వరకు sine wave ప్లొట్ చేయుటకు ఒక స్క్రిప్ట్ వ్రాయండి. | ||||||||
8:09 | <Pause> ఇది ఈ విధముగా చేయవచ్చు, | ||||||||
8:13 | మొదటి లైన్లో మనము మాడ్యూల్ scipy నుండి linspace(), sin() మరియు constant pi వంటి కావలసిన ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసుకుంటాము. | ||||||||
8:24 | రెండు మరియు మూడవ లైన్లో మనము plot(), legend(), show(), title() xlabel() మరియు ylabel() ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసుకుంటాము. | ||||||||
8:34 | తరువాత ప్లాట్ జెనరేట్ చేయుటకు కావలసిన కోడ్. | ||||||||
8:43 | దీనిని మనము python.sine.py లాగా రన్ చేయవచ్చు. | ||||||||
8:50 | python sine.py | ||||||||
8:56 | మనము చూస్తున్నట్టుగా, మన sine plot ఉంది. | ||||||||
9:01 | మన టాపిక్లో ముందుకు వెళ్దాము. | ||||||||
9:06 | ఇంతవరకు మనము మాడ్యూల్స్ను ఇంపోర్ట్ చేయుట గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మాడ్యూల్ అంటే ఏమిటి? | ||||||||
9:11 | ఒక మాడ్యూల్ అంటే Python నిర్వచనములు మరియు స్టేట్మెంట్లు కలిగిన ఒక ఫైల్. | ||||||||
9:18 | మాడ్యూల్ నుండి నిర్వచనములను ఇతర మాడ్యూల్స్లోనికి లేక ప్రధాన మాడ్యూల్లోనికి ఇంపోర్ట్ చేయవచ్చు. | ||||||||
9:24 | Python లో మాడ్యూల్స్ యొక్క ఉత్తమ ప్రమాణమైన లైబ్రరీ ఉంది. | ||||||||
9:29 | అది చాలా విస్తృతమైనది మరియు అనేకమైన సదుపాయములను అందిస్తుంది. | ||||||||
9:33 | కొన్ని ప్రామాణికమైన మాడ్యూల్స్, | ||||||||
9:36 | Math కొరకు: మ్యాత్, రాండం Internet యాక్సెస్ కొరకు: urllib2, smtplib సిస్టం, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కొరకు: ,sys ఆపరేటింగ్ సిస్టం ఇంటర్ఫేస్ కొరకు:, os రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కొరకు, : re కంప్రెషన్ కొరకు: gzip, zipfile, tarfile మరియు మరెన్నో ఉన్నాయి. | ||||||||
10:13 | Python Library రిఫరెన్స్ వద్ద మరింత సమాచారమును పొందవచ్చు. | ||||||||
10:25 | pylab, scipy, Mayavi మొదలైన ఎన్నో ఇతర మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి ప్రామాణికమైన పైథాన్ లైబ్రరీలో భాగము కావు. | ||||||||
10:32 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | ||||||||
10:35 | ఈ ట్యుటోరియల్లో, మనము నేర్చుకున్నది, 1. కమాండ్ లైన్నుండి స్క్రిప్ట్స్ రన్ చేయడము, | ||||||||
10:39 | ఒక asterisk తో కలిపి మాడ్యూల్ పేరు నిర్దేశించడము ద్వారా మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేయడము | ||||||||
10:45 | ఫంక్షన్ పేరు నిర్దేశించడము ద్వారా మాడ్యూల్స్ నుండి కావలసిన ఫంక్షన్లు మాత్రమే ఇంపోర్ట్ చేయడము | ||||||||
10:50 | పైథాన్ ప్రామాణిక లైబ్రరీ ఉపయోగించడము. | ||||||||
10:54 | మీరు సాధించుటకు కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి. | ||||||||
10:58
● ||వీటిలో ఏది సరైనది? ● scipy నుండి plot ఇంపోర్ట్ చేయి ● numpy నుండి plot ఇంపోర్ట్ చేయి ● matplotlib నుండి plot ఇంపోర్ట్ చేయి ● pylab నుండి plot ఇంపోర్ట్ చేయి ● ● |
11:11
● ||ఈ క్రింది వాటిలో ఏది పైథాన్ ప్రామాణిక లైబ్రరీలో ఒక భాగము? ● Mayavi ● scipy ● matplotlib ● urllib2 ● ● |
11:23
● ||xlim() మరియు ylim() ఫంక్షన్లు ప్రస్తుత నేం-స్పేస్కు ఇలాగ ఇంపోర్ట్ చేయబడతాయి, ● pylab నుండి xlim కామా ylim ను ఇంపోర్ట్ చేయి ● pylab ను ఇంపోర్ట్ చేయి ● scipy నుండి xlim కామా ylim ఇంపోర్ట్ చేయి ● scipy ఇంపోర్ట్ చేయి ● ● |
11:44 | జవాబులు | |||||
11:49
1 ||pylab నుండి plot ఇంపోర్ట్ చేయి అనే ఆప్షన్ సరైనది. ఎందుకంటే plot మాడ్యూల్ యొక్క ఫంక్షన్. 2 3 |
11:59
4 ||urllib2 పైథాన్ ప్రామాణిక లైబ్రరీలో ఒక భాగము. 5 6 |
12:06
7 ||xlim() మరియు ylim() ఫంక్షన్లు ప్రస్తుత నేం-స్పేస్కు ఇలా ఇంపోర్ట్ చేయబడతాయి - pylab నుండి xlim కామా ylim ఇంపోర్ట్ చేయి. 8 9 |
12:16 | ఈ ట్యుటోరియల్ మీరు ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాను | |||||
12:19
ధన్యవాదములు! |