KTurtle/C3/Control-Execution/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:19, 3 March 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:03 KTurtle'లో కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి
00:13 'వైల్' లూప్ మరియు
00:15 'ఫర్' లూప్.
00:17 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 12.04.

కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .

00:32 మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:38 ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.

http://spoken-tutorial.org

00:45 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
00:48 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
00:50 సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి,
00:53 ఎంపిక పై క్లిక్ చేయండి.కే టర్టల్ అప్లికేషన్ తెరుచుకుంటుంది.
00:59 ముందుగా నేను కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి అనేది వివరిస్తాను
01:05 కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
01:10 ప్రోగ్రామ్ అమలును నియంత్రించడానికి వివిధ పరిస్థితులు ఉపయోగపడతాయి.
01:16 లూప్ అనేది కోడ్ యొక్క ఒక బ్లాక్,ఇది ఒక నిర్నీత condition సంతృప్తి పడేవరకు దానిని పలుమార్లు అమలు చేస్తుంది.
01:25 ఉదాహరణకు “వైల్” లూప్ మరియు “ఫర్” లూప్ .
01:30 “వైల్” లూప్ తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
01:34 “వైల్”లూప్ లో, బూలియన్ విలువ "ఫాల్స్"గా నిర్దారణ అయ్యేవరకు లూప్ లోపలి కోడ్ రిపీట్ అవుతూనే ఉంటుంది.
01:42 “వైల్” లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను:

వైల్ 'లూప్ కండీషన్ { డు సమ్ థింగ్ విత్ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్ }

01:56 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
01:59 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి'copy 'చేసి 'KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను.
02:07 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి.
02:13 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
02:18 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
02:25 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
02:27 '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
02:32 అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాదని అర్ధం.
02:38 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
02:43 $x=0 వేరియబుల్ 'x'విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
02:52 ఒక ప్రోగ్రామ్ లోని సందేశం కీవర్డ్ "మెసేజ్ "తరువాత డబుల్ కోట్స్ లో ఇవ్వబడుతుంది. మెసేజ్ కమాండ్ స్ట్రింగ్ ను ఇన్పుట్ గా తీసుకుంటుంది.
03:04 ఇది స్ట్రింగ్ నుండి టెక్స్ట్ ను కలిగిన ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ ను చూపిస్తుంది.
03:11 while $x<30,“వైల్” కండీషన్ ను పరీక్షిస్తుంది.
03:17 $x=$x+3,వేరియబుల్ $ x విలువ ను 3 చేత పెంపు చేస్తుంది.
03:27 ఫాంట్ సైజ్15 ,ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
03:35 ఫాంట్ సైజ్ నెంబర్ ను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సరి చేస్తుంది.
03:42 forward 20, టర్టల్ ను కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
03:52 print $x వేరియబుల్ 'x' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
04:01 నేను ప్రొగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేస్తాను.
04:05 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్ -అప్ అవుతుంది .నేను OK క్లిక్ చేస్తాను.
04:11 3 యొక్క గుణింతాలు, 3 నుండి 30 వరకు ఉన్నవి కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి.
04:17 టర్టల్ కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదులుతుంది.
04:22 తరువాత “ఫర్” లూప్ ప్రయత్నిద్దాం.
04:26 “ఫర్”లూప్ అనేది ఒక లెక్కించే లూప్ .
04:29 ప్రతిసారీ ఫర్ లూప్ లోన ఉన్న కోడ్ అమలవుతుంది.
04:34 ఇందులో ముగింపు విలువను చేరేవరకు, వేరియబుల్ విలువ పెంచబడుతుంది.
04:41 “ఫర్” లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను.
04:46 ఫర్ వేరియబుల్ = మొదటి నెంబర్ నుండి ముగింపు నెంబర్ { స్టేట్మెంట్}
04:55 నేను ప్రస్తుత ప్రొగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
04:59 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
05:05 నేను ప్రొగ్రామ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి'copy 'చేసి KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:14 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:20 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
05:25 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
05:32 ఇప్పుడు నేను ప్రొగ్రామ్ ను వివరిస్తాను.
05:34 '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
05:39 “రిసెట్” కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
05:44 $r =0 వేరియబుల్ 'r'విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
05:52 for $x= 1 to 15,“ ఫర్” కండీషన్ ను 1 నుండి 15 మధ్య పరీక్షిస్తుంది.
06:01 $r=$x*($x+1)/2 వేరియబుల్ 'r' విలువను లెక్కిస్తుంది.
06:12 ఫాంట్ సైజ్18 ,ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
06:19 print $r వేరియబుల్ 'r' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
06:26 forward 15, టర్టల్ ను కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
06:34 go 10, 250 ','టర్టల్' ను కేన్వాస్ ను ఎడమవైపు నుండి10 పిక్సల్స్ మరియు కేన్వాస్ పైనుండి 250 పిక్సల్స్ దూరం లో వేళ్ళ మని నిర్దేశిస్తుంది.
06:48 “టర్టల్” అన్ని ప్రింట్ కమాండ్స్ ను ఎటువంటి టైం గ్యాప్ లేకుండా ప్రదర్శిస్తుంది.
06:54 Wait 2 కమాండ్, తరువాతి కమాండ్ అమలుచేసే ముందు 2 సెకన్లు వేచి ఉండమని నిర్దేశిస్తుంది.
07:04 “ప్రింట్” కమాండ్ డబుల్ కోట్స్ లో ఉన్నస్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది. మరియు వేరియబుల్'$r' ను కూడా ప్రదర్శిస్తుంది.
07:13 నేను ప్రొగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేస్తాను.
07:17 మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం యొక్క ఒక శ్రేణి మరియు "మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం" కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి.
07:27 టర్టల్ కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదులుతుంది.
07:32 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము
07:37 సారాంశం చూద్దాం.
07:40 ఈ ట్యుటోరియల్ లో, మనము ఉపయోగించటం నేర్చుకున్నవి
07:44 “వైల్“లూప్ మరియు“ఫర్“లూప్.
07:47 ఒక అసైన్మెంట్ గా, క్రింది వాటిని విశ్లేషించడానికి ప్రోగ్రాములను రాయండి-
07:54 “వైల్“లూప్ ను ఉపయోగించి 2 యొక్క గుణిజాలు,
07:58 “ఫర్” లూప్ ఉపయోగించి ఒక నెంబర్ యొక్క గుణాకార పట్టిక.
08:03 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

08:08 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
08:12 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
08:17 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
08:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
08:23 *ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
08:27 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

08:36 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
08:41 దీనికి,ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:48 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

08:54 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya