KTurtle/C3/Question-Glues/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:11, 6 March 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం. కే టర్టల్ లో Question Gluesఅనుspoken tutorialకు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -question glueలుand, not.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 12.04
కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
00:29 మీకు KTurtle మరియు KTurtle లో “if-else” స్టేట్మెంట్ పై ప్రాధమిక అవగాహన ఉన్నదని మేము భావిస్తున్నాము.
00:39 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.

http://spoken-tutorial.org

00:46 కొనసాగించే ముందు,question glue పదాల గురించి వివరిస్తాను.
00:51 Question glue పదాలు,చిన్న ప్రశ్నలను ఒక పెద్ద ప్రశ్నగా మార్చగలిగేలా చేస్తాయి.
01:00 “and”, “or” మరియు“not” అనేవి కొన్ని గ్లూ పదాలు. గ్లూ పదాలు 'if-else' కండీషన్స్ తో కలిసి ఉపయోగిస్తాము.
01:11 ఒక కొత్త KTurtle Applicationతెరుద్దాం.
01:15 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
01:18 సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
01:22 ఎంపిక పై క్లిక్ చేయండి.
01:24 గ్లూ పదం "and" తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
01:28 ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది.
01:33 నేను కోడ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ని కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
01:40 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
01:46 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
01:50 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,
01:52 బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
01:56 కోడ్ ని వివరిస్తాను.
01:59 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సెట్ చేస్తుంది.
02:04 ఒక ప్రోగ్రామ్ లో సందేశం డబుల్ కోట్స్ లో"message"కీవర్డ్ తర్వాత ఇవ్వబడుతుంది.
02:10 “message” కమాండ్ string ని ఇన్పుట్ గా తీసుకుంటుంది.
02:14 ఇది string లో కలిగి ఉన్న టెక్స్ట్ ను ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ లాగా చూపిస్తుంది, ఇంకా నాన్-నల్ స్ట్రింగ్స్ కొరకు ఒక బీప్ ను ఉత్పత్తి కూడా చేస్తుంది.
02:24 $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
02:30 “ask” కమాండ్,వేరియబుల్స్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కొరకు ప్రేరేపిస్తుంది.
02:36 if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” కండీషన్ ను చెక్ చేస్తుంది.
02:49 “and” తో గ్లూ చేయబడ్డ రెండు ప్రశ్నలు true అయితేనే, ఫలితము true' అవుతుంది.
02:55 if(($a != $b) and ($b != $c) and ($c != $a)) “if” కండీషన్ ను చెక్ చేస్తుంది.
03:05 ఎప్పుడైతే పై ఉన్న'if' కండీషన్ true అవుతుందో, కంట్రోల్ nested if బ్లాక్ లోకి కదులుతుంది.
03:12 ఒకవేళ త్రిభుజం యొక్క అన్ని భుజాలు అసమానం అని చెక్ చేస్తే.
03:17 fontsize 18, print కమాండ్ తో ఉపయోగించబడే ఫాంట్ సైజు ని సెట్ చేస్తుంది.
03:22 go 10,100టర్టల్ ను, కేన్వాస్ నుండి కుడివైపు10 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
03:35 'if' కండీషన్ చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది.
03:41 ఎప్పుడైతే బ్లాక్ లోని 'if' కండీషన్ falseఅవుతుందో 'else' కమాండ్ else కండీషన్ ను చెక్ చేస్తుంది.
03:48 else కండీషన్ ను చెక్ చేసిన తరువాత 'print' కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
03:54 చివరి కండీషన్ ను'else' కమాండ్ చెక్ చేస్తుంది.
03:57 ఇక్కడ, పైన కండీషన్స్ అన్ని false అయినప్పుడు మాత్రమే else చెక్ చేయబడుతుంది
04:03 'else' కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్string ను ప్రదర్శిస్తుంది. అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను కోడ్ ని runచేస్తున్నాను.
04:12 ప్రొగ్రామ్ ను run చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
04:15 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేనుOKక్లిక్ చేస్తాను.
04:20 AB యొక్క పొడవు కొరకు 5 ని ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి.
04:25 BC యొక్క పొడవు కొరకు 8 మరియుOKక్లిక్ చేయండి.
04:29 AC యొక్క పొడవు కొరకు 9 మరియుOKక్లిక్ చేయండి.
04:33 “A scalene triangle”(ఒక విషమభుజం ) కేన్వాస్ పై ప్రదర్శించబడుతుంది.
04:37 మళ్ళీ run చేద్దాం.
04:40 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ అప్ అవుతుంది. నేను OKక్లిక్ చేస్తాను.
04:44 'AB'పొడవు కొరకు 5 ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, 'BC' పొడవు కొరకు 6 ఇంకా OKక్లిక్ చేయండి, 'AC' పొడవు కొరకు 6 ఇంకా OKక్లిక్ చేయండి.
04:58 “Not a scalene triangle” (విషమభుజం కానిది )కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
05:02 default కండీషన్ ను చెక్ చేయటానికి మళ్ళీrun చేద్దాం.
05:06 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేను OKక్లిక్ చేస్తాను.
05:11 'AB' యొక్క పొడవు కొరకు 1 ను ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి,
05:16 BC యొక్క పొడవు కొరకు 1 మరియుOKక్లిక్ చేయండి.
05:20 AC యొక్క పొడవు కొరకు 2 మరియుOKక్లిక్ చేయండి.
05:24 "Does not satisfy triangle's inequality" (త్రిభుజం యొక్క అసమానత సంతృప్తి కానిది ) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
05:30 ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను క్లియర్ చేద్దాం, "clear" కమాండ్ టైప్ చేసి runచేస్తాను. clear కమాండ్ కేన్వాస్ ను శుభ్రం చేస్తుంది.
05:40 తరువాత "not" కండీషన్ ఆచరణలో పెడదాం.
05:43 నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
05:51 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:56 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
06:01 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
06:05 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
06:09 $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
06:15 if not(($a==$b) and ($b==$c)and ($c==$a)), if not కండీషన్ ను చెక్ చేస్తాయి.
06:27 "not" అనేది ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ గ్లూ -వర్డ్. ఇది దాని operand యొక్క తార్కిక స్థితి కి విరుద్ధంగా పనిచేస్తుంది
06:36 ఉదాహరణకు ఇచ్చిన కండీషన్ "true"అయితే, "not" దానిని "false"గా చేస్తుంది.
06:42 ఇంకా కండీషన్ falseఅయినపుడు, అవుట్ పుట్ trueఅవుతుంది.
06:48 if not కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
06:55 if కండీషన్ false అయినపుడుelse కమాండ్ అమలవుతుంది.
07:01 else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
07:07 go 100,100టర్టల్ ను, కేన్వాస్ నుండి ఎడమవైపు 100 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
07:20 repeat 3{turnright 120 forward 100} టర్టల్ ను కేన్వాస్ పైన ఒక సమ్బహు త్రిభుజాన్ని గీయమని ఆదేశిస్తుంది.
07:32 అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను ప్రోగ్రామ్ ను runచేస్తున్నాను.
07:36 కోడ్ నిrun చేయటానికి F5 కీ ని నొక్కండి.
07:40 AB యొక్క పొడవు కొరకు 6 ఎంటర్ చేసి,OKక్లిక్ చేయండి.
07:45 BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి.
07:48 AC యొక్క పొడవు కొరకు 7 ఇంకా OKక్లిక్ చేయండి.
07:54 “Triangle is not equilateral”(సమబాహు కానీ త్రిభుజం) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
07:58 మళ్ళి run చేద్దాం. 'AB' యొక్క పొడవు కొరకు 5 ను ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి,
08:05 BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి.
08:09 AC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి.
08:13 “Triangle is equilateral” కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. ఒక సమబాహు త్రిభుజం కేన్వాస్ పైన గీయబడుతుంది.
08:21 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
08:25 సారాంశం చూద్దాం.
08:28 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- question glueలుand, not.
08:35 ఒక అసైన్మెంట్ గా,
08:40 క్వశ్చన్ గ్లూ “or” ఉపయోగించి కుడి కోణ త్రిభుజం కోసం కోణ భావన గుర్తించటానికి ఒక ప్రోగ్రామ్ రాయండి.
08:48 "if or" కండీషన్ యొక్క నిర్మాణం:
08:51 if బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition.
08:59 కర్లీ బ్రాకెట్స్ లో do something
09:02 else కర్లీ బ్రాకెట్స్ లో do something.
09:06 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

09:10 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
09:13 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
09:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
09:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
09:23 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
09:27 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

09:34 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:38 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:44 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro.

09:49 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya