Digital-Divide/D0/First-Aid-on-Fever/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:21, 4 June 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:05 మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది.
00:13 బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది.
00:18 బాలిక వద్దకు ఆందోళనతో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది.
00:25 డిజిటల్ డివైడ్కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం.
00:30 ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం.
00:37 ఏవ్యక్తిదైన ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు.
00:51 ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం:
00:54 ఉష్ణోగ్రతలో పెరుగుదల
00:57 నొప్పులు మరియు బాధలు
00:59 వణుకుట మరియు చలి
01:02 తీవ్రమైన తలనొప్పి మరియు
01:04 గొంతునొప్పి.
01:06 బాలిక వణుకుట గమనించిన తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను దుప్పటితో తో చుట్టినది.
01:14 ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం.
01:20 రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి.
01:24 రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి.
01:28 ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు.
01:33 మీ సొంత మందులు ఇవ్వద్దు.
01:36 యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి.
01:41 చల్లనిగాలి అడ్డగించవద్దు.
01:43 వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది.
01:48 ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి.
01:55 క్రమరహిత ఊపిరితీయటం.
01:58 కుత్తిక పట్టుకొనుట
02:00 నిరంతర గొంతునొప్పి
02:03 దద్దుర్లు.
02:04 వాంతిచేయుట
02:06 నొప్పిగా ఉన్న మూత్ర విసర్జన మరియు అతిసారము.
02:11 మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
02:16 క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి.
02:20 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును.
02:23 ఒక వేళా మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
02:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది.
02:35 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రములను ఇస్తుంది.
02:40 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకు వ్రాయండి.
02:49 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
02:54 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
03:02 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
03:15 స్క్రిప్ట్ లో తోడ్పడిన వారు అశ్విని పాటిల్, అనిమేషన్ చేసిన వారు ఆర్తి.
03:22 చిత్రలేఖనము చేసినది శౌరభ్ గాడ్గిల్.
03:25 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య.
03:29 సహకరించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya, Yogananda.india