Linux/C2/Basics-of-System-Administration/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:46, 20 June 2014 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 హలో, లైనక్స్ తో సిస్టం అడ్మిన్స్ట్రేషన్ యొక్క బేసిక్స్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము.
00:13 adduser
00:14 su
00:16 usermod
00:17 userdel
00:18 id
00:19 du
00:20 df
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
00:27 దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి.
00:35 అది ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.
00:39 చూపించిన కమాండ్స్ ను ఎక్జిక్యూట్ చేయటానికి ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి.
00:47 ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము.
00:53 “adduser” కమాండ్ మనకి అతన్టికేషణ్ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ ను క్రియేట్ చేస్తుంది.
01:01 “sudo” కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ ఎకౌంట్ ని అయినా యాడ్ చెయ్యవచ్చు.
01:06 “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
01:11 Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా ఎగ్జిక్యూట్ చెయ్యటానికి అనుమతిస్తుంది.
01:19 Sudo కమాండ్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఆ ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాము.
01:27 ఒక “కొత్త యూజర్” ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము.
01:32 మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు t” ని ఒకేసారి ప్రెస్ చేయటం ద్వారా “టర్మినల్” ని ఓపెన్ చేయండి.
01:45 నేను ముందే ఇక్కడ “టెర్మినల్” ను ఇన్వోక్ చేసాను.
01:49 “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:58 మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
02:01 నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కుతాను.
02:07 టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు
02:11 కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి.
02:16 ఒకసారి అలా చేసిన తరువాత “adduser : కేవలం ఒకటి లేదా రెండు పేర్లు మాత్రమే అనుమతించబడతాయి” అనే మెసేజ్ డిస్ప్లే చేయబడుతుంది.
02:27 కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్ క్రియేట్ చేద్దాం.
02:34 కమాండ్ ను టైప్ చేయండి :
02:36 sudo space adduser space duck, ఎంటర్ ప్రెస్ చేయండి.
02:45 మనం “duck” అనే కొత్త యూజర్ ని క్రియేట్ చేసాము.
02:49 ఒక కొత్త యూజర్ ని క్రియేట్ చేసే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా క్రియేట్ చేయబడింది.
02:58 మనకి “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ కనిపిస్తుంది..
03:05 మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” ని నా పాస్వర్డ్ గా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను.
03:17 కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి.
03:20 భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ రెండుసార్లు అడగబడింది.
03:26 ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ అప్డేట్ అయింది.
03:31 మిమ్మలిని ఇతర వివరాలు కూడా అడుగుతుంది.
03:35 ప్రస్తుతానికి, నేను కేవలం “ఫుల్ నేం” ను “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను.
03:46 ఎంటర్.
03:47 “y” ని ఎంటర్ చెయ్యటం ద్వారా నేను దీన్ని ద్రువీకరిస్తాను..
03:51 సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి.
03:55 యూజర్ ఎకౌంట్ క్రియేట్ అయ్యిందో లేదో చూద్దాం.
04:00 ఇది చెయ్యటానికి, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి
04:04 “ls space /(slash) home”
04:09 మరియు ఎంటర్ ప్రెస్ చేయండి.
04:11 హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగించబడుతుంది.
04:17 ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసిన “duck” అనే యూజర్ ఉంది.
04:23 స్లైడ్స్ వద్దకి వెనక్కి వెళతాను.
04:26 ఇప్పుడు, తరువాత కమాండ్ “su”
04:30 “su” అనగా “స్విచ్ యూజర్”.
04:34 ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్ కి మారటానికి సహాయపడుతుంది.
04:39 ఇప్పుడు టెర్మినల్ కి వెళదాం.
04:43 కమాండ్ ను ఎంటర్ చేయండి.
04:45 టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:53 మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
04:56 నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్ టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి..
05:04 టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్ కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”.
05:14 ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి,
05:17 “logout” మరియు ఎంటర్ ప్రెస్ చేయండి.
05:22 ఇప్పుడు టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి ముందరి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai” కి తిరిగి వస్తుంది.
05:31 “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము.
05:35 “usermod” కమాండ్
05:37 సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్స్ ను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకి,
05:46 పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కి మార్చటం.
05:50 యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం.
05:55 ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం.
05:57 నేను టెర్మినల్ కి వెళతాను.
05:59 Duck అనే యూజర్ ఎకౌంట్ కి ఎక్స్పైరీ తేదీని ఎలా సెట్ చేయాలో నేను మీకు చూపిస్తాను..
06:05 కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి
06:09 sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck
06:33 ఎంటర్ ప్రెస్ చేయండి
06:37 ఆప్షన్ “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ఎక్స్పైరీ తేదీ సెట్ చేయబడింది..
06:46 ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కి ఎక్స్పైరీ తేదీని సెట్ చేయాలి.
06:52 “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం.
06:57 “id – కమాండ్ ” అన్ని యూజర్స్ మరియు గ్రూప్స్ యొక్క ఐడెంటిటీలు చెక్ చేయటానికి ఉపయోగించబడుతుంది.
07:04 యూజర్ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవటానికి, మనం “id space -(hyphen)u” ఉపయోగిస్తాము.
07:12 గ్రూప్ యూజర్స్ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ఉపయోగిస్తాము
07:20 ఇప్పుడు దీని పై పనిచేద్దాం.
07:22 టెర్మినల్ వద్ద,
07:25 “id” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
07:29 మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDs మరియు Group IDs చూడవచ్చు.
07:37 యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఆప్షన్ ఉపయోగిస్తాము.
07:43 “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం.
07:49 ఎంటర్ ప్రెస్ చేయండి.
07:50 ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు.
07:55 కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవాలి అంటే ఎలా?
08:00 దాని కోసం,
08:02 టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
08:13 ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి పేర్లను చూడవచ్చు.
08:20 ఇప్పుడు మనం Group Ids కొరకు కమాండ్స్ నేర్చుకుందాం.
08:24 “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం.
08:29 ఇక్కడ మనం గ్రూప్ ids చూడవచ్చు.
08:32 ఒకవేళ మనం ప్రస్తుత యూజర్ల Ids అన్నీ చూడాలనుకుంటే
08:38 “id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
08:46 నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి.
08:50 ఫలితాన్నిమీ మటుకు మీరు గమనించండి.
08:53 ఇప్పుడు ఒక యూజర్ ఎకౌంట్ ఎలా డిలీట్ చేయాలో నేర్చుకుందాం.
08:57 దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం.
09:00 “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా డిలీట్ చెయ్యవచ్చు.
09:07 దీనిని టెర్మినల్ పై ట్రై చేద్దాం.
09:09 “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి.
09:22 నేను ఇక్కడ -(hyphen)r ఆప్షన్ ఉపయోగించాను.
09:25 ఇది యూజర్ ను అతని హోమ్ డైరెక్టరీతో పాటుగా తొలగిస్తుంది.
09:30 ఎంటర్ ప్రెస్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం.
09:34 ఇప్పుడు “duck” అనే యూజర్ డిలీట్ చెయ్యబడింది.
09:38 దీనిని చెక్ చేయటానికి
09:41 “ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:47 “duck” అనే యూజర్ ఎకౌంట్ డిలీట్ అవ్వడాన్ని మనం చూడొచ్చు.
09:53 స్లైడ్స్ వద్దకి వెనక్కి వెళదాం.
09:56 “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని కమాండ్స్.
10:03 “df” కమాండ్ డిస్క్ లో అందుబాటులో ఉన్న ఫ్రీ స్పేస్ గురించి ఒక రిపోర్ట్ ఇస్తుంది.
10:08 మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది.
10:13 ఈ రెండు కమాండ్స్ ను ప్రయత్నించండి మరియు అవుట్ పుట్ ను ఒక ఎసైన్మెంట్ వలె మీరే ప్రయత్నించండి.
10:19 టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఆప్షన్స్ ను నేను మీకు చూపిస్తాను.
10:26 df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:33 ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్పేస్ ను చూపిస్తుంది.
10:38 ఇది మౌంట్ అయ్యి ఉన్న స్పేస్ ను కూడా మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది.
10:46 “du” కమాండ్ తో కొన్ని ఆప్షన్లను ప్రయత్నిద్దాం.
10:50 ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని txt ఫైల్స్ క్రియేట్ చేసారని నేను అనుకుంటాను.
10:57 ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను రిఫర్ చేయండి.
11:04 ఈ కమాండ్స్ ను ఎక్జిక్యూట్ చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేసాను.
11:11 cd space /(slash) home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా
11:15 టెర్మినల్ పై హోమ్ ఫోల్డర్ కి వెళ్ళండి
11:20 du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
11:33 ఈ కమాండ్ డైరెక్టరీలో అందుబాటులో ఉన్న txt ఫైల్స్ మరియు ఫైల్ పరిమాణాల పై ఒక రిపోర్ట్ ఇస్తుంది.
11:43 ఒక అసైన్మెంట్ వలె, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి
11:47 “du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం.
11:59 స్లైడ్స్ వద్దక్కి వెనక్కి వెళతాను.
12:01 మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా:
12:03 కొత్త యూజర్ ను క్రియేట్ చేయటానికి “adduser” కమాండ్ ను ఉపయోగించుట.
12:06 ఒక యూజర్ నుండి మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ ఉపయోగించుట.
12:09 యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చటానికి “usermod” కమాండ్ ఉపయోగించుట.
12:12 యూజర్ ఎకౌంట్ డిలీట్ చేయటానికి “userdel” కమాండ్ ఉపయోగించుట.
12:15 యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిలు గురించి సమాచారం తెలుసుకోవటానికి id కమాండ్ ఉపయోగించుట.
12:20 ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను చెక్ చేయటానికి “df” కమాండ్ ఉపయోగించుట.
12:24 ఫైల్ ఆక్రమించుకున్న స్పేస్ ను చెక్ చేయటానికి “du” కమాండ్ ఉపయోగించుట.
12:27 ఇది మనల్ని “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
12.33 ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో
12:37 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
12:40 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీనిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
12:44 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి.
12:53 స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది.
13:03 ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది
13:08 ఈ రచనకి సహాయపడినది నిఖిల.
13:12 దిస్ ఈజ్ నిఖిల, సైనింగ్ ఆఫ్. వీక్షించినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Sreeharsha, Udaya