LibreOffice-Suite-Writer/C2/Introduction-to-LibreOffice-Writer/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:39, 19 June 2014 by Chaithaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
Time Narration
0:01 లీబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యూటోరియల్ లో ఈ విషయాలను నేర్చుకుంటాం.

రైటర్ పరిచయం.

0:10 రైటర్లో విభిన్న టూల్బార్స్
0:13 కొత్త డాక్యుమెంట్ను ఎలా ఓపెన్ చేయాలి మరియు డాక్యుమెంట్ నుంచి ఎలా నిష్క్రమించాలి.
0:17 ఒక డాక్యుమెంట్ను ఎలా సేవ్ చేయాలి.
0:20 రైటర్లో ఒక డాక్యుమెంట్ను ఎలా క్లోజ్ చేయాలి
0:22 లీబ్రే ఆఫీస్ రైటర్, లీబ్రే ఆఫీస్ సూట్లోని వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్
0:27 ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లోని మైక్రోసాఫ్ట్ వర్డ్ కు సమానమైనది.
0:33 ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచుకోవచ్చు, మార్పుచేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కావడాంతో ఎలాంటి లైసెన్స్ ఫీస్ చెలించకుండానే దీనిని పాచుకోవచ్చు
0:41 ఇది ఫ్రీ సాఫ్ట్ వేర్ కావడంతో, ఎలాంటి లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే, దీన్ని పంచుకోవచ్చు.
0:47 లీబ్రే ఆఫీస్ సూట్ను ప్రారంభించడం కోసం మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 మరియు దాని యొక్క ఉన్నత వెర్షన్లు అయిన MS విండోస్ XP లేదా MS విండోస్ 7 లేదా జిఎన్యు/లీనక్స్ ను ఆపరేటింగ్ సిస్టమ్గా వినియోగించవచ్చు.
1:04 మనం ఉబుంటూ లినక్స్ 10.04ను ఆపరేటింగ్ సిస్టమ్గాను మరియు లీబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాం.
1:16 మీరు లీబ్రే ఆఫీస్ సూట్ను ఇన్ స్టల్ చేయనట్లయితే, “Synaptic Package Manager" (సిన్యప్టిక్ ప్యాకేజ్ మేనేజర్) ద్వారా రైటర్ను ఇన్ స్టల్ చేయవచ్చు.
1:24 “Synaptic Package Manager" (సైనాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్) కి సంభంధించిన మరింత సమాచారం కొరకు దయచేసి Ubuntu Linux ట్యూటోరియల్స్ ని రెఫర్ చేయండి.
1:31 ఈ వెబ్‌సైట్లోని సూచనలు పాటించడం ద్వారా లిబ్రే ఆఫీస్ సూట్ ని డౌన్‌లోడ్ చేసుకోండి
1:37 లీబ్రే ఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్లో సవిస్తరమైన సూచనలు లభ్యమవుతాయి.
1:43 ఇన్ స్టల్ చేసే సమయంలో ‘ రైటర్ను ఇన్ స్టల్ చేసే ఆప్షన్ “Complete”(‘కంప్లీట్’)ను ఉపయోగించడం మర్చిపోవద్దు.
1:50 ఒకవేళ మీరు ఇప్పటికే లీబ్రే ఆఫీస్ సూట్ను ఇన్ స్టల్ చేసినట్లయితే
1:54 స్క్రీన్ ఎడమ వైపు పైన ఉండే “Applications”(‘ అప్లికేషన్’) మీద క్లిక్ చేసి, ఆ తరువాత “Office”(‘ఆఫీస్’) ఆపై (LibreOffice)‘లీబ్రే ఆఫీస్’ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా
2:02 'లీబ్రే ఆఫీస్ రైటర్’ను చూడగలుగుతారు.
2:08 లీబ్రే ఆఫీస్ కాంపోనెంట్స్ తో కూడిన కొత్త డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
2:13 లీబ్రే ఆఫీస్ రైటర్ యాక్సెస్ కోసం, ఈ సూట్ యొక్క వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ అయినటువంటి “Text Document” ‘టెక్స్ డాక్యుమెంట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.



2:23 ఇది మెయిన్ రైటర్ విండోలో ఖాళీ డాక్యుమెంట్ను ఓపెన్ చేస్తుంది.
2:28 రైటర్ విండోలో టైటిల్ బార్,
2:33 మెనూ బార్ ,+ స్టాండర్డ్ టూల్బార్,
2:36 ఫార్మెటింగ్ బార్ మరియు స్టేటస్ బార్ వంటి వివిధ టూల్బార్స్ ఉంటాయి. ఇవే విస్త్రతంగా వినియోగించబడే ఆప్షన్లు. ట్యుటోరియల్స్ ముందుకు సాగుతున్న కొద్దీ వీటి గురించి మనం నేర్చుకుంటాం.
2:47 రైటర్లో ఒక కొత్త డాక్యుమెంట్ను ఎలా ఓపెన్ చేయాలన్న ట్యుటోరియల్ ద్వారా మనం ఇప్పుడు ప్రారంభిద్దాం.
2:53 స్టాండర్డ్ టూల్బార్లోని ‘New Icon"(న్యూ ఐకాన్)’ మీద క్లిక్ చేయడం ద్వారా
3:00 లేదా మెనూ బార్లో ‘ఫైల్’ ఆప్షన్ మీద క్లిక్ చేసి
3:05 ‘కొత్త’ ఆప్షన్ మీద క్లిక్ చేసి, చివరగా ‘టెక్ట్స్ డాక్యుమెంట్’ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త డాక్యుమెంట్ ఓపెన్చేయవచ్చు.
3:12 రెండు సందర్భాల్లోనూ రైటర్ విండో తెరుచుకోవడాన్ని గమనించవచ్చు.
3:17 ఎడిటర్ ప్రాంతంలో కొంత టెక్ట్స్ ను టైప్ చేయండి.
3:21 కనుక 'Resume'(‘రెజ్యూం’) అని టైప్ చేద్దాం
3:24 మీ డాక్యుమెంట్ రాయడం పూర్తయిన తరువాత భవిష్యత్ వినియోగం కోసం దాన్ని సేవ్ చేయాలి.
3:29 ఈ ఫైల్ను సేవ్ చేయడం కోసం, మెనూబార్లోని “File”‘ఫైల్’ మీద క్లిక్ చేయండి.
3:33 ‘Save as’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
3:36 స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.'నేమ్ ఫీల్డ్’లో మీరు మీ ఫైల్ పేరును నమోదు చేయాలి.
3:44 ఫైల్ యొక్క పేరును ‘రెజ్యూం’గా ఎంటర్ చేయండి.
3:48 ‘Name’ ఫీల్డ్ కు దిగువన 'Save in folder”(‘సేవ్ ఇన్ ఫోల్డర్’) ఉంటుంది.
3:53 ఫోల్డర్ పేరు ఎంటర్ చేసే ఫీల్డ్ లో మీరు సేవ్ చేసిన ఫైల్ ఉంటుంది.
3:58 కనుక “Save in folder”(‘సేవ్ ఇన్ ఫోల్డర్)’ ఫీల్డ్ లో డౌన్ యారో క్లిక్ చేసి ‘డెస్క్ టాప్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
4:02 మెనూలో ఫోల్డర్ల జాబితా చూస్తారు, వీటిలో ఫైల్ను సేవ్ చేయవచ్చు.
4:08 ‘డెస్క్ టాప్’ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఫైల్ డెస్క్ టాప్ మీద సేవ్ అవుతుంది.
4:14 “Browse for other folders”(‘బ్రౌజ్ ఫర్ అదర్ ఫోల్డర్స్’)ని కూడా క్లిక్ చేయవచ్చు.
4:18 ఎక్కడైతే మీ డాక్యుమెంట్ను సేవ్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫోల్డర్ను ఎంచుకోండి.
4:23 డైలాగ్ బాక్స్ లో “File type”‘ ఫైల్ టైప్’ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
4:27 ఇది ఫైల్ టైప్ ఆప్షన్ల జాబితాను లేదా ఫైల్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తుంది, వీటి ద్వారా మీరు మీ ఫైల్ను సేవ్ చేయగలుగుతారు.
4:34 లీబ్రే ఆఫీస్ రైటర్లో డిఫాల్ట్ ఫైల్ టైప్ ‘ODF టెక్ట్స్ డాక్యుమెంట్’. ఇది dot ODt ఎక్స్టెన్షన్ను కల్పిస్తుంది.
4:45 ODT ఓపెన్డాక్యుమెంట్ ఫార్మెట్ లేదా ODF ఫార్మెట్,కి సంభందించినది ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ఓపెన్ స్టాండర్డ్ ఫోర్ వర్డ్ డాక్యుమెంటస్.
4:56 ఇది భారత ప్రభుత్వ పాలసీ అయిన ఓపెన్స్టాండర్డ్స్ లోని e-గవర్నెన్స్ చేత కూడా ఆమోదించబడింది
5:04 “dot odt” టెక్ట్స్ డాక్యుమెంట్లగా సేవ్ చేయడంతో పాటు లీబ్రే ఆఫీస్ రైటర్లో ఓపెన్చేయవచ్చు.
5:11 మీ ఫైల్ను as “dot doc” మరియు “dot docx” ఫార్మెట్లలో సేవ్ చేయవచ్చు. దీన్ని MS ఆఫీస్ వర్డ్ ప్రోగ్రామ్లో ఓపెన్చేయవచ్చు.
5:23 చాలా ప్రోగ్రామ్స్ లో వినియోగించే మరో పాపులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ “dot rtf. "దీన్ని రిచ్ టెక్ట్స్ పార్మెట్ అని అంటారు.
5:33 ‘ODF టెక్ట్స్ డాక్యుమెంట్ ఆప్షన్’ మీద క్లిక్ చేయండి.
5:37 ఫైల్ టైపును ODF టెక్ట్స్ డాక్యుమెంట్గా చూడవచ్చు మరియు ఫైల్ టైప్ ఆప్షన్ తరువాత బ్రాకెట్ల లోపల dotODF అని కనిపిస్తుంది.
5:48 ఇప్పుడు సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి
5:50 ఇది ఫైల్ పేరు మరియు టైటిల్ బార్ మీద మీరు ఎంచుకున్న ఎక్స్ టెన్షన్తో మిమ్ముల్ని తిరిగి రైటర్కు తీసుకెళుతుంది.
5:58 రైటర్ విండోలో టెక్ట్స్ డాక్యుమెంట్ రాసేందుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు.
6:03 పైన చర్చించిన ఫార్మెట్లకు అదనంగా, రైటర్ డాక్యుమెంట్లను “dot html” ఫార్మెట్లో సేవ్ చేయవచ్చు. ఇది వెబ్ పేజీ ఫార్మెట్.
6:13 ఇంతకు ముందు వివరించినట్లుగానే దీనిని చేస్తారు.
6:17 కనుక మెనూబార్లో ‘ఫైల్’ ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత “Save as”(‘సేవ్ యాజ్’) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
6:24 File Type(‘ఫైల్ టైప్’ )ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత (ఒపెన్ ఆఫీస్) Open Office dot org రైటర్ ఆప్షన్ యొక్క బ్రాకెట్ల మధ్య HTML డాక్యుమెంట్ ఎంచుకోండి.
6:35 ఈ ఆప్షన్ డాక్యుమెంట్ను “dot html” ఎక్స్ టెన్షన్ను ఇస్తుంది.
6:40 సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి
6:42 డైలాగ్ బాక్స్ లోని " Ask when not saving in”( ‘ ఆస్క్ వెన్ నాట్ సేవింగ్ ఇన్ ODF ఫార్మెట్’) ఆప్షన్ మీద చెక్ను పెట్టండి.
6:50 చివరగా “Copy Current Format” (‘ కీప్ కరెంట్ ఫార్మెట్’) ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
6:55 డాక్యుమెంట్లు “dot html " ఎక్స్ టెన్షన్లో సేవ్ కావడాన్ని మీరు చూడవచ్చు.
7:00 స్టాండర్డ్ టూల్ బార్లోని “Export Direct as PDF”(‘ఎక్స్ పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ PDF’) ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డాక్యుమెంట్ను PDF ఫార్మెట్లోకి ఎక్స్ పోర్ట్ చేయవచ్చు.
7:10 ఇంతకు ముందులానే, ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఎంచుకోండి.,
7:15 ప్రత్యామ్నాయంగా, మెనూబార్లోని “File”( ‘ఫైల్’ ) ఆప్షన్ను మీరు క్లిక్ చేసి, తరువాత ‘ఎక్స్ పోర్ట్ యాజ్ pdf” ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారానూ చేయవచ్చు.
7:24 డైలాగ్బాక్స్ లో కనిపించే ఎక్స్ పోర్ట్ మీద క్లిక్ చేసి తరువాత ‘సేవ్’ బటన్ మీద క్లిక్ చేయండి.
7:32 ఒక pdf ఫైల్ ఏర్పడుతుంది.
7:35 “File”(‘ఫైల్’ )మరియు “Close”(‘క్లోజ్’ )మీద క్లిక్ చేయడం ద్వారా, ఈ డాక్యుమెంట్ను క్లోజ్ చేద్దాం.
7:40 ఇప్పటికే సృష్టించిన ఒక డాక్యుమెంట్ను లీబ్రే ఆఫీస్ రైటర్లో ఎలా ఓపెన్చేయాలో చూద్దాం.
7:47 ఇప్పుడు ‘ Resume. odt ’ డాక్యుమెంట్ను ఓపెన్చేద్దాం.
7:51 ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ను ఓపెన్ చేయడం కోసం పైన ఉండే మెనూ బార్లోని “File”(‘ఫైల్’)మెనూ మీద క్లిక్ చేయాలి, తరువాత "Open”‘(ఓపెన్’) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
8:00 స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనపడటాన్ని మీరు చూడవచ్చు.
8:04 మీ డాక్యుమెంట్ను ఎక్కడ సేవ్ చేశారో, ఆ ఫోల్డర్ను ఇక్కడ కనుగొనండి.
8:08 డైలాగ్ బాక్స్ యొక్క ఎడమవైపు పైన ఉండే చిన్న పెన్సిల్ బటన్ను క్లిక్ చేయండి
8:14 “Type a file name”(‘టైప్ ఎ ఫైల్ నేమ్’) అనే పేరు దీనికి ఉన్నది.
8:16 ఇది Location bar‘(లొకేషన్ బార్’) ఫీల్డ్ ను తెరుస్తుంది.
8:19 ఇక్కడ, ఏ ఫైల్ను అయితే వెతుకుతున్నారో, ఆ ఫైల్ యొక్క పేరు టైప్ చేయండి.
8:24 కనుక, ఫైల్ యొక్క పేరును ‘రెజ్యూం’గా రాస్తాం.
8:27 రెజ్యూంతో కనిపించే ఫైల్ పేర్ల నుంచి ‘Resume.odt”ని ఎంచుకోండి.
8:34 “Open”(‘ఓపెన్’) బటన్ మీద క్లిక్ చేయండి
8:37 ఫైల్ “Resume.odt” ఓపెన్కావడాన్ని గమనించవచ్చు.
8:41 ప్రత్యామ్నాయంగా మీరు పైన ఉన్న టూల్బార్లోని “Open”(‘ఓపెన్’) ఐకాన్ మీద క్లిక్ చేసి, తరువాత పైన పేర్కొన్న విధంగా కొనసాగించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ను ఓపెన్చేయవచ్చు.
8:52 మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉపయోగించే , dot doc”మరియు “dot docx” ఎక్స్ టెన్షన్ ఫైల్స్ ను రైటర్లోనూ ఓపెన్చేయవచ్చు.
9:03 తరువాత అదే ఫైల్ పేరు కింద ఒక ఫైల్ను ఎలా మార్చాలి మరియు సేవ్ చేయాలన్న అంశాలను మనం చూద్దాం.
9:10 మొదట ఎడమ ‘ మౌస్' బటన్ ను క్లిక్ చేసి ‘Resume’ టెక్ట్స్ ను సెలక్ట్ చేసుకోండి, తరువాత టెక్ట్స్ తో పాటు దానిని డ్రాగ్ చేయండి.
9:17 ఇది టెక్ట్స్ ను ఎంచుకొని దాన్ని హైలెట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ను రిలీజ్ చేయండి.
9:24 టెక్స్ట్ ఇంకనూ హైలైట్ చేయబడి ఉంది.
9:26 స్టాండర్డ్ టూల్ బార్లోని “Bold”(‘బోల్డ్’‘)ఐకాన్’ మీద క్లిక్ చేస్తే టెక్ట్స్ బోల్డ్ అవుతుంది.
9:33 పేజీ మధ్యలో ఈ టెక్స్ట్ అలైన్ చేయడానికి, టూల్బార్లో ని "Centered"చిహ్నం పై క్లిక్ చెయ్యండి.
9:41 మీరు చూడవచ్చు టెక్స్ట్ పేజ్ మధ్య లోకి అలైన్ అయింది
9:45 టెక్ట్స్ యొక్క ఫాంట్ సైజును పెంచుదాం.
9:48 దీనికి టూల్బార్లోని “Font Size”(‘ఫాంట్ సైజ్’ ) ఫీల్డ్ లోని డౌన్ యారో మీద క్లిక్ చేయండి.
9:53 డ్రాప్ డౌన్ మెనూలో మనం 14మీద క్లిక్ చేద్దాం
9:57 తద్వారా టెక్ట్స్ ఫాంట్ సైజు 14కు పెరుగుతుంది.
10:01 “Font Name”(‘ఫాంట్ నేమ్’) ఫీల్డ్ లో డౌన్ యారో మీద క్లిక్ చేసి, ఫాంట్ పేరును “UnDotum” గా ఎంచుకోండి.
10:09 టూల్బార్లోని “Save”(‘సేవ్’)ఐకాన్ మీద క్లిక్ చేయండి
10:13 మార్పు చేసిన తరువాత, అదే ఫైల్ పేరు మీద సేవ్ కావడాన్ని గమనించవచ్చు.
10:21 డాక్యుమెంట్ను సేవ్ చేసిన తరువాత,క్లోస్ చేయాలంటుటే.
10:25 మెను బార్ లోని “File”("ఫైల్")మెను పై క్లిక్ చేసి తరువాత “Close”("క్లోస్") ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీనితో ఫైల్ క్లోస్ అవుతుంది
10:33 దీనితో ఈ లీబ్రె ఆఫీస్ రైటర్ స్పోకన్ ట్యూటోరియల్ చివరకు వచ్చాం. సంక్షిప్తంగా చేపలంటే మనం ఈ విషయాలను నేర్చుకొన్నం
10:41 రైటర్ యొక్క పరిచయం.

రైటర్లోని వివిధ టూల్బార్లు.

10:45 కొత్త డాక్యుమెంట్ మరియు రైటర్ లో ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ని ఎలా తెరావలి. డాక్యుమెంట్ను ఎలా సేవ్ చేయాలి.
10:52 రైటర్లో ఒక డాక్యుమెంట్ను ఎలా క్లోజ్ చేయాలి.
10:55 కాంప్రెహెన్సివ్ అసైస్న్‌మెంట్. రైటర్లో కొత్త డాక్యుమెంట్ తెరవండి
11:01 ‘ప్రాక్టీస్. odt”’’ అనే పేరు మీద దాన్ని సేవ్ చేయండి.
11:05 "ఇది న మొదటి అస్సీన్మెంట్"అనే టెక్స్ట్ రాయండి
11:08 ఫైల్ ని సేవ్ చేయండి

టెక్ట్స్ను అండర్లైన్ చేయండి.

ఫాంట్ పరిమాణం 16కు పెంచండి.

ఫైల్ను క్లోజ్ చేయండి

11:18 ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను చూడండి.ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
11:24 మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే, దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది. ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి.
11:38 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కి వ్రాయండి
11:45 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టూ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం
11:48 ఇది జాతీయ విద్య మిషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వం చే మద్దతు పొందింది
11:56 ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు.
12:07 ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో కి అనువదించింది దేశిక్రు సల్యూషన్స్. అనుకరణ చేసింది చైతన్య ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Gaurav, Madhurig, Udaya