Moodle-Learning-Management-System/C2/Courses-in-Moodle/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:57, 9 March 2019 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Courses in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:06 ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది,

ఒక కోర్సు ఎలా సృష్టించాలి మరియు కోర్సుల మీద చర్యలు ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము.

00:16 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,
00:24 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,

Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.

00:38 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:42 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
00:50 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులకు Moodle లో కేటగోరీస్ ని ఎలా సృష్టించాలో తెలుసిఉండాలి.
00:56 లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి.
01:03 బ్రోసేర్ కి వెళ్ళి, మీ Moodle హోమ్ పేజీ ని తెరవండి.

XAMPP service అమలు అవుతుందని నిర్ధారించుకోండి.

01:11 మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి.
01:16 మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము.
01:19 ఎడమ వైపు ఉన్న నావిగేషన్ మెను ని తెరవడానికి ద్రవార్(drawer) మెను పై క్లిక్ చేయండి.
01:25 ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి.
01:29 Coursesట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి.
01:36 ఇక్కడ మనకు Mathematics అనే ఒకే ఒక్క క్యాటగిరీ మాత్రమే ఉందని గమనించండి.
01:41 మరియు మేము ఇంతకు ముందుగా సృష్టించిన రెండు subcategories అనగా 1st Year Maths మరియు '2nd Year Maths ఉన్నాయి.
01:50 .ఇప్పుడు మనం Mathematics క్రింద ఒక కొత్త courseని సృష్టిద్దాము
01:55 Create new course పై క్లిక్ చేయండి.
01:59 మరియు అన్ని ఫీల్డ్ లను వీక్షించడానికి Add a new course స్క్రీన్లో, ఎగువ కుడి వైపున Expand All పై క్లిక్ చేయండి
02:12 Course full name టెక్స్ట్ బాక్స్ లో Calculus అని టైపు చేద్దాం.
02:18 Course short name లో Calculus అని మళ్ళి టైపు చేద్దాం.
02:24 Course short name , breadcrumbs మరియు కోర్సు కు సంబంధిత ఇమెయిల్లలో ఉపయోగించబడుతుంది.
02:31 ఇది course full name లో భిన్నంగా ఉండవచ్చు.
02:35 Course Category, Mathematics అని మనం ఇక్కడ చూడవచ్చు.
02:40 తదుపరి ఎంపిక Course visibility. డిఫాల్ట్ గా Show ను ఎంచుకోబడింది.
02:48 Visible సెట్టింగు ఒక కోర్సు ను ఇతర కోర్సులతో పాటు చూపించాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది.
02:56 ఒక దాచిపెట్టిన కోర్సు, ఆ కోర్సు కు కేటాయించిన వారికి మాత్రమే అనగా Admin, Course creator, Teacher, Manager లకు కనిపిస్తుంది.
03:08 ఈ సెట్టింగ్ను ఎలాగ ఉందో అలాగే వదిలివేస్తాము.
03:12 తర్వాత Course start dateవస్తుంది.
03:16 ఒక వేళా ఒక కోర్స్ ఒక నిర్దిష్ట తేదీన ప్రారంభమైతే అనగా సెమిస్టర్ ప్రారంభ తేదీ, దానిని start date లో ఎంచుకోండి.
03:25 అంటే start date వరకు విద్యార్థులకు ఆ కోర్సు కనిపించదని అర్థం .
03:32 Course end date, అప్రమేయంగా, ఎనేబుల్ చెయ్యబడింది మరియు కోర్సు రూపొందించబడిన అదే తేదీకి సెట్ చేయబడింది.
03:42 చెక్ బాక్స్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని డిసేబుల్ చేస్తాను.

దీని అర్ధం కోర్సు ఎప్పటికీ ముగించదు.

03:51 అయితే, కోర్సు కోసం ముగింపు తేదీ ఉంటే, మీరు ఇక్కడ చెక్బాక్స్ ను ఎనేబుల్ చేయవచ్చు.

మీరు మీ అవసరానికి అనుగుణంగా తేదీని ఎంచుకోండి.

04:02 ముఖ్యమైన గమనిక: ఎంచుకున్న end date తరువాత కోర్సు విద్యార్థులకు కనిపించదు.

నేను దానిని డిసేబుల్ చేస్తాను

04:13 కోర్సు ID నంబర్, Category ID numberకు సమానంగా ఉంటుంది

Course ID numberఅనేది ఒక ఐచ్ఛిక ఫీల్డ్.

04:22 ఇది ఆఫ్లైన్ courses తో కోర్సు ని గుర్తించడానికి admin users కోసం .
04:28 ఒక వేళ మీ కళాశాల కోర్సుల కోసం ఐడిలు ఉపయోగిస్తే, అప్పుడు మీరు ఆ course ID ని ఇక్కడ ఉపయోగించవచ్చు.

ఈ ఫీల్డ్ ఇతర Moodle usersకు కనిపించదు.

04:40 ఈ ఫీల్డ్ ఐచ్ఛికం మరియు వెబ్సైట్లో ఎక్కడా కనిపించదు.

నేను దీన్ని ఖాళీగా వదిలేస్తాను.

04:49 Description క్రింద మనము Course Summary మరియు Course Summary files 2 ఫీల్డ్ లను చూడవచ్చు.
04:59 Course summary ఐచ్ఛికమైన కానీ, అది ముఖ్యమైన ఫీల్డ్.

ఎందుకంటే ఒక యూసర్ ఒక శోధన ని చేసేటప్పుడు course summary టెక్స్ట్ కూడా స్కాన్ చేయబడుతుంది.

05:13 టాపిక్ పేర్లను జాబితా గా చూపించడం ఇక్కడ ఒక మంచి ఆలోచన.

ఈ క్రింది వాటిని టైప్ చేయండి: Topics covered in this Calculus course are:Limits, Graph of a function, Factorial.

05:29 Course summary కోర్సులు జాబితాతో పాటు ప్రదర్శించబడుతుంది.
05:35 కోర్సు సారాంశం ఫైళ్ళను Course summary files ఫీల్డ లో అప్లోడ్ చేయాలి.
05:42 అప్రమేయంగా, jpg, gif మరియు png ఫైల్ types, course summary filesగా అనుమతించబడతాయి.

నేను ఎటువంటి ఫైల్ను అప్లోడ్ చేయ దలచుకోలేదు అందుకే దానిని దాటవేస్తాను.

05:57 కోర్సు ఫార్మాట్ విద్యార్థులకు వనరులు మరియు కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్గం సూచిస్తుంది.
06:06 ఫార్మాట్ డ్రాప్ డౌన్లో 4 ఎంపికలు ఉన్నాయి, అవి

Single Activity Format , Social Format , Topics Format మరియు Weekly Format.

06:20 ఈ కోర్సులు ప్రతి వారం నడుస్తాయి.
06:24 మీ కోర్సు ఆలా ఉంటే, Weekly format ఎంచుకోండి.
06:30 Moodle ప్రతి వారం కోర్సు కొరకు ఒక స్పష్టమైన ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీతో ఒక విభాగాన్ని సృష్టిస్తుంది.
06:39 కొన్ని courses టాపిక్ వారీగా(ప్రకారం) నడుస్తాయి.

మీ కోర్సు ఇలా ఉంటే , అప్పుడు Topics ఫార్మాట్ ఎంచుకోండి.

06:49 Moodle కోర్సు యొక్క ప్రతి టాపిక్ కి ఒక విభాగాన్ని సృష్టిస్తుంది.
06:55 ఈ ఫీల్డ్ యొక్క డిఫాల్ట్ టాపిక్స్ ఫార్మాట్ .

అది ఎలా వుందో అలాగే ఉంచుదాం .

07:03 డిఫాల్ట్ గా విభాగాల సంఖ్య, 4.
07:07 ఒక వేళ మీ కోర్సు 4 కంటే ఎక్కువ, లేదా తక్కువ విషయాలలో విభజించబడితే, మీ అవసరాన్ని బట్టి ఈ ఫీల్డ్ను మార్చండి.

నేను ఈ సంఖ్య ను 5 మారుస్తాను.

07:20 మనం తరువాతి ట్యుటోరియల్లో ఇతర ఫార్మాట్స్ గురించి చర్చించాము.
07:25 మిగిలిన ఎంపికలను ఎలా ఉన్నాయో అలాగే వదిలేద్దాం .

పేజీ ని క్రిందికి వరకు స్క్రోల్ చేసి Save and displayబటన్ పై క్లిక్ చేయండి.

07:36 మనము Enrolled Users పేజీకి మళ్ళించబడుతాము.

మనము user enrollment గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.

07:46 .ప్రస్తుతానికి, మనము మన మొదటి course Calculusని Mathematics( మ్యాథమెటిక్స్) category కింద సృష్టించాము.
07:56 మనము ఈ కోర్సు పేజీ లో ఉన్నప్పుడు, ఎడమ వైపున ఉన్న మెను మారిందని గమనించండి.
08:03 ఎడమ వైపున ఉన్న navigation మెను లో మనం సృష్టించిన కోర్సు కు సంబంధించిన మెనూలు ఉన్నాయి.

.వీటిలో Participants, Grades మొదలైనవి ఉన్నాయి.

08:15 ఎడమవైపున Calculus అనే కోర్సు పేరు పై క్లిక్ చేయండి.
08:20 ఇక్కడ 5 విషయాలు కనిపిస్తాయని ఇక్కడ చూడవచ్చు. వీటి పేర్లు టాపిక్ 1, టాపిక్ 2 మరియు మొదలైనవి. ఈ సంఖ్య 5ని ఇంతకు ముందు ఇచ్చామని గుర్తుతెచ్చుకోండి.
08:34 పేజీ యొక్క కుడి ఎగువన ఉన్న గేర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
08:39 ఆపై Edit settings క్లిక్ చేయండి.

మనము ఈ కోర్సు ని సృష్టించినప్పుడు ఉన్న పేజీకి సమానంగా ఈ పేజీ తెరుచుకుంటుంది.

08:51 మనము ఈ పేజీ పై మునుపటి సెట్టింగులలో మార్పులు చేయవచ్చు.

నేను Course start date 15 అక్టోబరు 2017 కు మారుస్తాను.

09:04 పేజీ ని క్రిందికి వరకు స్క్రోల్ చేసి Save and display బటన్ పై క్లిక్ చేయండి.
09:11 మనం తరువాత గేర్ మెనూ క్రింద ఉన్న ఇతర సబ్మెనస్ను అన్వేషిస్తాము.
09:17 ఇప్పుడు మన కోర్సు యొక్క ఆకృతిని కొంచం మార్చుదాం.
09:22 Site administration పై క్లిక్ చేయండి.

Courses మరియు ఆపై Manage courses and categories పై క్లిక్ చేయండి

09:31 మనము సృష్టించిన కోర్సుచూడటానికి Mathematics category పై క్లిక్ చేయండి.

కోర్సు యొక్క కుడివైపు ఉన్న 3 చిహ్నాలను గమనించండి.

09:42 అవి ఏమిటో చూసేందుకు చిహ్నాలపై కర్సర్ ని కడుపండి.
09:46 గేర్ ఐకాన్ ఒక కోర్సును సవరిస్తుంది మరియు delete లేదా trash ఐకాన్ ఒక కోర్సు ను తొలగిస్తుంది.
09:55 మరియు eye ఐకాన్ ఒక కోర్సు ని దాచడానికి ఉంది.
10:01 ఒక దాచిపెట్టి ఉన్న కోర్సు eye crossed చే సూచించబడుతుంది.
10:07 కోర్సు పేరు యొక్క కుడి వైపు ఉన్న గేర్ ఐకాన్పై క్లిక్ చేసి course settings ను సవరించవచ్చు.
10:14 నేను Course Summary ను సవరించాలి ఇంకా ఇప్పటికే ఉన్న అంశాలకు Binomials చేర్చలి అనుకుంటున్నాను.

మిగిలిన సెట్టింగులు ఒకే అలాగే ఉండనివండి.

10:25 పేజీని క్రింది వరకు స్క్రోల్ చేసి ఈసారి Save and return బటన్ పై క్లిక్ చేయండి.
10:34 మీ కోసం ఒక చిన్న అసైన్మెంట్ ఉంది: category Mathematics లీనియర్ ఆల్జీబ్రా అనే కొత్త కోర్సును సృష్టించండి.
10:44 ఇప్పటి కోసం ఈ కోర్స్ ని దాచిపెట్టండి
10:47 .ఈ కింది అంశాలను course summary లో పేర్కొనండి: Linear equations, Matrices మరియు Vectors .

Save and Return బటన్ క్లిక్ చేయండి.

11:00 ట్యుటోరియల్ని పాజ్ చేసి, అసైన్మెంట్ పూర్తి చేశాక మళ్ళి కొనసాగించడానికి.
11:06 Mathematics క్రింద 2 courses, Calculus మరియు Linear Algebra ఉన్నాయి.
11:14 ఇప్పుడు కోర్సుల ప్రక్కన ఒక క్రొత్త ఐకాన్ కనిపిస్తుందని గమనించండి.
11:20 కోర్సుల యొక్క క్రమాన్ని తిరిగి మార్చడానికి up మరియు down బాణాలు ఉపయోగపడుతాయి.
11:26 మనము డ్రాగ్ మరియు డ్రాప్ ఫీచర్ ఉపయోగించి ఆర్డర్ మార్చవచ్చు.

మనము Linear Algebra course కు పైన Calculus courseని కదిలిద్దాం.

11:36 ఈ రెండూ కోర్సులు మొదటి సంవత్సరం విద్యార్థుల కొరకు.

కాబట్టి, వాటిని 1st Year Maths subcategory కిందకు కదిలిద్దాము.

11:47 వాటిని ఎంచుకోవడానికి 2 కోర్సుల యొక్క ఎడమ వైపు న ఉన్నా చెక్ బాక్స్ ను చెక్ చేయండి.
11:53 Move selected courses to అనే డ్రాప్ డౌన్ లో Mathematics / 1st year Maths ని ఎంచుకోండి.
12:02 మరియు Move బటన్ పై క్లిక్ చేయండి.
12:04 మనకు Successfully moved 2 courses into 1st year Maths అనే ఒక విజయం సందేశం కనిపిస్తుంది.
12:14 Mathematics కింద కోర్సులు సంఖ్య 0 గా మారింది మరియు 1st year Maths కింద 2 గా మారింది.
12:24 1st year Maths sub-category పై చేయండి
12:28 మనము ఈ subcategory క్రింద జాబితా చేయబడిన మన కోర్సులను చూడవచ్చు.
12:33 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
12:38 ఈ ట్యుటోరియల్ లో మనము : ఒక కోర్సు ఎలా సృష్టించాలి

కోర్సుల పై సవరణ, తరలింపు, మొదలైన చర్యలు ఎలా నిర్వహించాలో నేర్చుకున్నాము.

12:50 ఇక్కడ మీకు ఒక్క అసైన్మెంట్ ఉంది

Mathematics కింద ఉన్న subcategory 2nd Year Maths కు 2 courses జోడించండి, అనగా

13:00 Multivariable calculus' మరియు Advanced Algebra.
13:06 వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్స్ లింకును చూడండి.
13:12 15th October 2017న మొదలైనందుకు కోర్సులను సవరించండి.
13:18 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:26 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
13:36 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
13:40 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

13:53 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya