Koha-Library-Management-System/C3/Installation-of-MarcEditor/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Windows పై Installation of MarcEditor అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనము ఒక 64-bit Windows మెషిన్ పై MarcEditor ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను:
Windows 10 Pro Operating System మరియు Firefox వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:27 | లైబ్రరీ సిబ్బందికి ఈ ట్యుటోరియల్ చాలా అనుకూలంగా ఉంటుంది. |
00:32 | ముందుకు వెళ్ళడానికి డానికి ముందు, మీ మెషిన్ పై కిందివి ఉన్నాయని నిర్దారించుకోండి,
Windows 10, 8 లేదా 7, |
00:43 | ఏదయినా వెబ్ బ్రౌజర్. ఉదాహరణకు: Internet Explorer, Firefox లేదా Google Chrome. |
00:51 | మీ ప్రస్తుత లైబ్రరీలో, మీరు Excel spreadsheet లో లైబ్రరీ రికార్డులను కలిగి ఉండవచ్చు. |
00:58 | మరియు, ఇప్పుడు మీ లైబ్రరీ Koha Library Management System కు తరలించబడుతుంది. |
01:05 | కనుక, అన్ని రికార్డ్స్ Excel నుండి MARC ఫార్మాట్ కు మార్చవలసిన అవసరం ఉంది. |
01:12 | ఇది తెలుసుకోవడం ముఖ్యం:
Excel spreadsheet లోని రికార్డు లు మొదట MARC ఫార్మట్ లోనికి మార్చబడతాయి ఆపై Koha లోనికి దిగుమతి చేయబడతాయి. |
01:26 | ఇది ఎందుకంటే Excel format లోని డేటాను నేరుగా దిగుమతి చేసుకునే సదుపాయం కోహ లో లేదు. |
01:35 | ప్రారంభిద్దాం. |
01:37 | Excel data ను MARC ఫైల్ లోనికి అంటే (dot) mrc ఫార్మాట్ లోకి మార్చడానికి MarcEdit software ను ఉపయోగిస్తాము. |
01:48 | ఈ software ను ఇన్స్టాల్ చేయడానికి, బ్రౌజర్ కి వెళ్ళి ఈ URL ను టైప్ చేయండి. |
01:55 | Downloads అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
02:00 | Current Development కింద, MarcEdit 7.0.x/MacOS 3.0.x కు వెళ్ళి Windows 64-bit download ను కనుగొనండి. |
02:17 | ఏమైనా, ఒకవేళ మీరు 32-bit మెషిన్ ను కలిగిఉంటే, అప్పుడు మీరు Windows 32-bit download లింక్ పై క్లిక్ చేయాల్సిఉంటుంది. |
02:26 | మీ మెషిన్ 32-bit లేదా 64 -bit అని తనిఖీ చేయటానికి, మెషిన్ యొక్క దిగువ ఎడమ మూలకు వెళ్ళండి. |
02:35 | Start ఐకాన్ పై క్లిక్ చేయండి. |
02:38 | స్క్రోల్ చేసి Settings పై క్లిక్ చేయండి. |
02:43 | ఈ ఐకాన్స్ నుండి, System- Display, notifications, apps, power పై క్లిక్ చేయండి. |
02:51 | ఇది ఎడమభాగం పై కొన్ని ఎంపికలతో మరొక విండో ని తెరుస్తుంది. |
02:56 | About ట్యాబు ను కనుగొని దానిపై క్లిక్ చేయండి. |
03:00 | అదే పేజీపై, కుడిభాగం వైపు, PC సెక్షన్ కింద System type ను కనుగొనండి. |
03:08 | మీ మెషిన్ యొక్క operating system వివరాలు కనిపిస్తాయి. |
03:13 | నా మెషిన్ కొరకు, ఇది 64-bit operating system, x64-based processor అని చూపిస్తుంది. |
03:21 | వివరాలను చదివిన తరువాత, window ను మూసివేయండి. |
03:25 | ఆలా చేయడానికి, ఎగువ కుడి మూలకు వెళ్ళి cross mark పై క్లిక్ చేయండి. |
03:31 | మనం తిరిగి మళ్ళీ అదే పేజీ Downloads కు వస్తాము. |
03:36 | నా మెషిన్ 64-bit గా ఉంది కనుక, నేను 64-bit download పై క్లిక్ చేస్తాను. |
03:42 | 64 -bit డౌన్ లోడ్ శీర్షికతో మరో కొత్త విండో రెండు విభాగాలతో తెరుచుకుంటుంది-
Non-Administrator మరియు Administrator. |
03:53 | తరువాత, నేను Administrator సెక్షన్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Download MarcEdit 7 లింక్ పై క్లిక్ చేస్తాను. |
04:02 | ఇది ఎందుకంటే, నా లైబ్రరీ యొక్క Koha administrator ని నేనే కనుక. |
04:09 | ఒక డైలాగ్- బాక్స్ MacrEdit_Setup64Admin.msi కనిపిస్తుంది. |
04:16 | ఇక్కడ మనం రెండు ఎంపికలను చూస్తాము -
Save File మరియు Cancel. |
04:22 | దిగువభాగం వద్ద ఉన్న Save File పై క్లిక్ చేయండి. |
04:26 | ఆలా చేసిన తరువాత, మీ మెషిన్ యొక్క Downloads ఫోల్డర్ కు వెళ్ళండి. |
04:31 | ఇక్కడ, మీరు సేవ్ చేయబడిఉన్న MacrEdit_Setup64Admin.msi ఫైల్ ను చూడవచ్చు. |
04:40 | ఇప్పుడు, సేవ్ చేయబడిఉన్న ఫైల్ పై రైట్-క్లిక్ చేసి కనిపించే కింది ఎంపికల నుండి Install పై క్లిక్ చేయండి. |
04:48 | User Account Control డైలాగ్ - బాక్స్ లో Yes పై క్లిక్ చేయండి. |
04:56 | Welcome to the MarcEdit 7 Setup Wizard అనే పేరుతో మరొక విండో కనిపిస్తుంది. |
05:04 | పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
05:08 | License Agreement అనే శీర్షికతో మరొక విండో తెరుచుకుంటుంది. |
05:14 | License Agreement ను జాగ్రత్తగా చదవండి. |
05:18 | మరియు రెండు ఎంపికలు I do not agree ఇంకా I agree ల నుండి, I agree రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
05:28 | తరువాత, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
05:33 | Select Installation Folder అనే పేరుతో ఒక కొత్త విండో తెరుచుకుంటుంది. |
05:39 | ఇది ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ ను ఎక్కడ సేవ్ చేయాలో ఆ ఫోల్డర్ యొక్క పాత్ ని చూపిస్తుంది. |
05:45 | ప్రత్యామ్నాయంగా, మీరు ఈ సాఫ్ట్వేర్ ను మీకు నచ్చిన వేరే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఫోల్డర్ ఫీల్డ్ లో కావలసిన పాత్ ని టైప్ చేయడం ద్వారా చేయవచ్చు. |
05:56 | మీరు Browse ట్యాబు పై క్లిక్ చేసి అవసరమైన పాత్ ను ఎంచుకోవచ్చు. |
06:03 | ఏమైనా, నేను ఫోల్డర్ ఫీల్డ్ లో, ఫోల్డర్ పాత్ ని ఎలా ఉన్నది అలా వదిలివేస్తాను. |
06:09 | ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
06:14 | Confirm Installation అనే మరొక కొత్త విండో తెరుచుకుంటుంది. |
06:19 | ఇప్పుడు, అదే విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
06:25 | Installing MarcEdit 7 విండో తెరుచుకుంటుంది. |
06:30 | దీని తరువాత, మనము
Installation Complete. MarcEdit 7 has been successfully installed అనే విజయ సందేశం విండోను చూస్తాము. |
06:42 | విండో నుండి నిష్క్రమించడానికి, Close బటన్ పై క్లిక్ చేయండి. |
06:47 | MarcEdit 7.0.250 By Terry Reese అనే శీర్షికతో ఒక విండో తెరుచుకుంటుంది. |
06:56 | ఇప్పుడు తెరిచి ఉన్న అన్ని విండో లను మినిమైజ్ చేయండి. |
07:01 | Desktop పైన సృష్టించబడిన ఒక shortcut ను మీరు చూస్తారు. |
07:06 | దీనితో, మనం Desktop యొక్క 64-bit Windows మెషిన్ పై MarcEditorను విజయవంతంగా ఇన్స్టాల్ చేసాము. |
07:14 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:22 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
07:32 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
07:36 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
07:48 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |