BASH/C2/Case-statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:49, 26 March 2018 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యత, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వర్షన్ 4 లేదా దానికంటే, పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:47 Bash shell లో రెండు రకాలైన conditional statements ఉన్నాయి. if statement మరియు case statement.
00:56 Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
01:03 ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు, case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
01:09 ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:14 ఇప్పుడు సింటాక్స్ చూద్దాం.

case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సెమికోలన్ లు.

01:27 match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round-bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac.
01:45 VARIABLE అనేది match_1 తో పోల్చబడుతుంది.
01:48 ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్ match_n కు వెళ్తుంది.
01:54 ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.
02:01 ఒకవేళ yes అయితే డబల్ సెమికోలన్ వరకు గల అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:07 ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:14 ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే, asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.
02:21 esac అనేది case block ముగింపును సూచిస్తుంది.
02:26 మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.
02:32 నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
02:38 డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు, ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
02:45 ఇది shebang line.
02:47 bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే, CentOS, RedHat మొదలైన వాటిలో కంటే భిన్నంగా ఉంటుంది.
02:55 గతంలో ఉపయోగించిన /bin/bash నేరుగా binary file ను పాయింట్ చేస్తుంది.
03:01 ఇక్కడ ఉపయోగించిన env, bash యొక్క నిజమైన స్థానమును abstract చేస్తుంది.
03:07 ఈ shebang line, ఏ GNU/Linux సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది.
03:16 df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.
03:22 దీని output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది.
03:31 తరువాత వచ్చిన అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది.
03:38 ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను బయటకు తెస్తుంది.
03:43 చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు cut -(hyphen)d “% -(hyphen)f1” కు పంపబడుతుంది.
03:55 ఇది case statement యొక్క మొదటి లైన్.
03:59 ఇక్కడ మనం space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము.
04:04 ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది
04:08 తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది.
04:17 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There is a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది.
04:27 ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
04:30 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There is a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది.
04:39 ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే asterisk అన్ని stringsకు మ్యాచ్ అగును.
04:45 ఇది case statement ముగింపు.
04:48 ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి terminalకు వెళ్ళండి.
04:52 chmod plus x case dot sh అని టైప్ చేయండి.
04:57 dot slash case dot sh అని టైప్ చేయండి.
05:02 "Everything is OK". అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి.
05:10 నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది.
05:18 మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
05:20 ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి.
05:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
05:31 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం.
05:41 ఒక అసైన్మెంట్ గా ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి.
05:47 అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి:
05:51 ఇది (plus +, minus -, division / and multiplication *) మాథెమటికల్ ఆపరేటర్ కోసం అడగాలి. గణన చేసి, అవుట్ పుట్ ను ముద్రించండి.
06:02 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:06 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
06:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
06:16 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:31 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:35 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:48 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india