BASH/C2/Logical-Operators/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:19, 11 December 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 Logical AND
Logical OR
Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు
00:22 if-else statement
command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:30 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:36 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:38 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:43 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:47 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.
00:53 Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.
00:57 Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
01:02 Logical operators రెండు expressions ను లేదా conditions ను కలపడంలో సహాయపడతాయి.
01:09 ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.
01:15 logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.
01:19 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:38 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
01:41 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:53 Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది
02:00 Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.
02:04 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:22 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
02:24 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:36 Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది
02:43 Logical OR మరియు Logical AND ల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
02:50 నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
02:55 ctrl+alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:04 gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
03:18 నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను.
03:21 ఇది shebang line .
03:25 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
03:29 - (hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది.
03:33 string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable.
03:39 if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
03:45 - (hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది.
03:50 terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి.
03:57 ఏమీ నమోదు చేయకపోతే echo statement ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
04:02 ఒకవేళ string ఖాళీ కాకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది.
04:08 ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:16 ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:20 ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి
04:24 అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
04:31 అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.
04:37 ఇక్కడ, అది string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
04:43 ఒకవేళ yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:47 ఇక్కడ logical OR ఉపయోగించబడింది అని గమనించండి
04:52 ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది.
04:59 చివరగా, మనకు డిఫాల్ట్ else statement ఉంది.
05:02 పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది.
05:08 "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు.
05:12 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
05:15 terminal కు మారండి.
05:17 ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
05:30 ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి.
05:36 ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది.
05:38 నేను "jitinraj" అని ఎంటర్ చేస్తాను.
05:42 అవుట్పుట్: "jitinraj contains both the words raj and jit ".
05:48 దీని అర్థం control రెండవ statement కు పంపబడింది.
05:52 conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:57 ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం.
06:00 up-arrow కీ ని నొక్కండి.
06:02 ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి.
06:07 ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది.
06:09 ఈసారి నేను "abhijit" అని ఎంటర్ చేస్తాను.
06:13 అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: "abhijit contains the word raj or jit ".
06:19 దయచేసి, వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి.
06:25 మన slides కు తిరిగి వెళదాం.
06:27 logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
06:31 ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది.
06:35 దీని అర్ధం, expression విలువ False అయితే అది True ను రిటర్న్ చేస్తుంది.
06:40 expression విలువ True అయితే False ని రిటర్న్ చేస్తుంది.
06:44 logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-
06:48 ఆశ్చర్యార్ధకం గుర్తు space expression
06:52 లేదా ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
07:00 ఒక ఉదాహరణని చూద్దాం.
07:03 నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను.
07:05 అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్ ,చేసి Enter నొక్కండి.
07:18 ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
07:24 ఇది shebang line .
07:28 $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument .
07:33 - (hyphen) f , మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
07:41 కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.
07:48 ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది.
07:52 దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
07:58 కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది..
08:02 ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
08:07 ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:13 fi, if loop యొక్క ముగింపును సూచిస్తుంది.
08:16 terminal కు మారండి.
08:18 నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
08:20 test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం.
08:25 touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:32 తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
08:45 ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:55 మన shell script ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
09:00 మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి , విలువ True అవుతుంది.
09:07 తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది.
09:12 మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది.
09:18 ప్రదర్శించబడిన సందేశము - File test.txt exists .
09:23 test1.txt ను argument గా ప్రోగ్రాం ను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.
09:29 ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
09:33 తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం.
09:37 మనం
logical AND
logical OR and
logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. .
09:45 ఒక అసైన్మెంట్ గా,
09:47 ఫైల్ ఉన్నదో లేదో అని మరియు
09:49 అది executable అవునో కాదో అని
09:51 ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.
09:56 (సూచన: man space test )
09:59 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:02 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
10:05 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:12 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
10:26 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:30 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:37 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:42 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
10:47 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
10:51 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india