BASH/C3/More-on-Redirection/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:02, 17 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Timee Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, More on redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, standard error మరియు output యొక్క Redirection ను గురించి,
00:13 redirected output ను జోడించండం గురించి,
00:15 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
00:25 ఒకవేళ లేకపోతే,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org
00:30 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 Operating System
00:35 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:46 మునుపటి ట్యుటోరియల్ లో,మనం standard output మరియు standard errors గురించి నేర్చుకున్నాం.
00:52 stderr మరియు stdout లు రెండిటిని ఒకే ఫైల్ కు మళ్ళించవచ్చు.
00:58 దీనిని పలు మార్గాల్లో చేయవచ్చు.
01:01 ఈ ట్యుటోరియల్లో మనము redirection చేయుటలో అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
01:08 standard output మరియు error రెండింటిని redirect చేయుటకు మొదటి పద్దతి &> ను ఉపయోగించడం.
01:18 సింటాక్స్ command space ampersand greater than space filename .
01:25 నేను redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరుస్తాను.
01:30 నేను ఈ ఫైల్ లో కొంత code ను టైప్ చేశాను.
01:32 ఇది shebang line.
01:36 ls అనేది /usr and /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.
01:44 / user డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
01:48 అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది.
01:52 &> stdout మరియు stderr లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది.
02:03 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
02:05 ఫైల్ redirect.sh ఫైల్ ను run చేద్దాం.
02:07 CTRL + ALT మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి.
02:15 chmod space plus x space redirect dot sh అని టైప్ చేసి,
02:23 Enter నొక్కండి.
02:25 dot slash redirect dot sh అని టైప్ చేసి,
02:28 Enter నొక్కండి.
02:30 మనము out_(underscore)file.(dot)txt ను తెరచి, output ను చూడవచ్చు.
02:36 cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
02:42 మనము error మరియు output రెండింటిని చూడవచ్చు.
02:48 / user డైరెక్టరీ యొక్క error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
02:51 ఇది /user అనే directory దొరకలేదు అని చెప్తుంది.
02:56 / Usr కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
03:00 దయచేసి మీ సిస్టమ్ పై /usr directory నందు కంటెంట్ వ్యత్యాసం ఉండవచ్చని గమనించండి.
03:06 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం.దానికి terminal పై, rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
03:15 మరొక పద్ధతి ఫైల్ పేరు తరువాత 2 greater than ampersand 1 ను ఉపయోగించడం.
03:24 సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1 .
03:33 మనము slash dev slash null (/dev/null) ఫైల్ ను కూడా రీడైరెక్ట్ చేయవచ్చు.
03:39 మనము slash dev slash null (/dev/null) ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం.
03:45 ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైలు.
03:48 ఇది ఒక null file లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం.
03:52 ఇది output మరియు error సందేశాలను కలిగి ఉంటుంది.
03:57 దీనిని bit bucket అని కూడా పిలుస్తారు.
04:00 ఇప్పుడు మనం మన gedit లోని code కు తిరిగి వెళ్దాము.
04:04 మనం "standard output" మరియు " error రెండింటిని " null file కు redirect చేద్దాము.
04:11 నేను ఈ లైన్ కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను.
04:16 నాకు “output” మరియు “error ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.
04:21 కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను మారుస్తాను. > (greater than) means truncate లేదా write .
04:30 slash dev slash null ఒక null file. 2>&1 (2 greater than ampersand 1)
04:37 నెంబర్ 2 standard error నుండి standard output కు అంటే నెంబర్ 1 కు రీడైరెక్ట్ చేస్తుంది.
04:45 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. code ను Save చేయండి.
04:48 redirect.sh ఫైల్ ను run చేద్దాం.
04:52 ఇప్పుడు “‘terminal కు వెళ్ళండి.
04:54 మునుపటి command ను up-arrow కీ నొక్కి మళ్ళీ పిలవండి. dot slash redirect.sh మరియు Enter నొక్కండి.
05:03 cat out_(underscore)file.(dot)txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు.
05:11 తిరిగి slides కు వెళ్ళండి.
05:15 ఒక ఫైల్ నుండి standard output లేదా error ను పొందవచ్చు అలాగే జోడించవచ్చు.
05:21 output లేదా error ఫైలు చివరిన చేర్చబడుతుంది.
05:26 ఒక వేళ ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది.
05:31 సింటాక్స్ command space greater than greater than space తరువాత filename .
05:41 మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము.
05:45 నేను redirect.(dot)sh ఫైల్ ను తెరుస్తాను.
05:49 ఇప్పుడు, ఇక్కడ date space greater than greater than space out_(underscore)file.(dot)txt అని టైప్ చేద్దాం.
06:00 date కమాండ్ system date ను output గా చూపిస్తుంది.
06:06 terminal పై date అని టైప్ చేయడం ద్వారా ఈ command తనిఖీ చేయవచ్చు.
06:11 terminal కు వెళ్ళండి. date అని టైప్ చేయండి. మీరు system date అనగా current date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
06:23 date కమాండ్ యొక్క output, out_(underscore)file.(dot)txt ఫైల్ కు జోడించబడును.
06:31 మనం ఈ ఫైల్ ను ls కమాండ్ యొక్క standard output మరియు error ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము.
06:39 Save పైన క్లిక్ చేసి terminal కు మారండి.
06:43 ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను పిలవండి.
06:50 Enter నొక్కండి.
06:52 output ను out_(underscore) file.(dot)txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం.
06:59 cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
07:05 date కమాండ్ యొక్క అవుట్పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి.
07:12 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
07:15 సారాంశం చూద్దాము.
07:17 ఈ ట్యుటోరియల్ లో మనము
07:19 standard error మరియు output రెండింటి యొక్క Redirection గురించి మరియు redirected output ను చేర్చడం గురించి నేర్చుకున్నాం.
07:27 ఒక అసైన్మెంట్ గా:
07:29 X_(underscore)file.(dot)txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి.
07:34 out_(underscore)file.(dot)txt మరియు X_(underscore)file.(dot)txt రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్ళించండి.
07:44 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:47 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
07:51 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:06 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:13 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:17 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
08:30 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
08:37 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india