Linux/C3/The-grep-command/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:29, 14 August 2018 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో grep command గురించి,
00:09 మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము.
00:11 ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను
00:15 ఉబుంటు Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:20 GNU BASH వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను.
00:24 ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతును ఇచ్చేది, GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్.
00:32 మీకు కనీసం Linux టర్మినల్ యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి.
00:36 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి.
00:41 ముందుగా మనం regular expressions గురించి తెలుసుకోవాలి .
00:45 Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో
00:50 కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు.
00:56 ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి అనుకున్నా,
01:02 ఒక లైన్ లో లేదా , ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం.
01:11 grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది
01:17 ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది.
01:23 ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ లో శోధిస్తుంది.
01:30 నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను.
01:37 మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం.
01:40 ఈ ఫైలు 13 ఎంట్రీలను కలిగి ఉంది.
01:44 ప్రతి ఎంట్రీలో రోల్-నెంబర్, నేమ్ , స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే 6 ఫీల్డ్స్ ఉన్నాయి.
01:52 ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము.
01:56 మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం.
02:00 మన computers స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి grep command ను ఉపయోగించాలని అనుకుందాం.
02:07 ఇందుకోసం terminal ను తెరవాలి.
02:10 మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో నొక్కండి.
02:16 ఇప్పుడు terminal నందు
02:18 grep space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo .txt అని టైపు చేసి,
02:27 ఎంటర్ నొక్కండి. ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది.
02:33 ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి,
02:37 తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం.
02:40 Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు.
02:45 ఈ తేడా ఎందుకు వచ్చినట్లు ? ఇది ఎందువల్లనంటే grep చిన్న c తో గల computers నమూనా కోసం శోధించును.
02:52 Zubin లో, స్ట్రీమ్ నందు గల Computers క్యాపిటల్ C తో మొదలైనది.
02:57 నమూనా పోలిక అనేది case sensitive.
03:00 grep ను minus i (-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు.
03:06 ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి , grep space(minus) i space డబుల్ కోట్స్ తర్వాత computers డబుల్ కోట్స్ లో space grepdemo.txt అని టైప్ చేసి,
03:20 ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి.
03:25 కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు.
03:32 మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు.
03:34 grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము.
03:40 అందుకోసం మనం minus v ఎంపికను ఉపయోగిస్తాము.
03:43 మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము.
03:48 మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు.
03: n52 దీని కొరకు grep space minus iv space డబుల్ కోట్స్ లో pass డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space greater than చిహ్నం space notpass.txt అని టైప్ చేసి,
04:11 Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి cat space notpass.txt అని టైప్ చేసి,
04:20 Enter ను నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
04:24 ఇప్పుడు prompt దగ్గర,
4:26 grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి.
04:37 Enter నొక్కండి. ఇది భిన్నంగా ఉంటుంది.
04:41 ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి విద్యార్థులు వివరాలు కలిగి ఉండును.
04:46 మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, , మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు.
04:54 మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
04:58 ఇప్పుడు grep space -in space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి,
05:09 Enter నొక్కండి
05:11 లైన్ నెంబర్ ప్రదర్శించబడుతుంది.
05:15 నమూనాలు ఇప్పటివరకు ఒకే పదం గా ఉన్నాయి.
05:18 మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు
05:21 కానీ నమూనా మొత్తం కోట్స్ లోపల ఉండాలి.
05:24 కాబట్టి, grep space minus i space డబుల్ కోట్స్లో ankit space saraf డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేయండి.
05:38 Enter నొక్కండి.
05:40 మనకు Ankit Saraf యొక్క రికార్డు ప్రదర్శించబడుతుంది.
05:44 మనం నమూనాలను బహుళ ఫైళ్ళలో కూడా కనుగొనవచ్చు.
05:48 దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి,
06:03 Enter నొక్కండి . అవుట్పుట్ ప్రదర్శించ బడుతుంది.
06:07 బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt
06:18 ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుండి వచ్చిన రికార్డులు.
06:26 మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం.
06:31 దీనికి మైనస్ c ఎంపికను ఉపయోగిస్తాము.
06:35 కాబట్టి, grep space minus c space డబుల్ కోట్స్ లో fail capital F తో డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి,
06:48 Enter నొక్కండి .
06:50 ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది.
06:55 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
0 6:59 సంగ్రహంగా,
07:01 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాది.
07:03 ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం ఉదాహరణకు cat filename
07:07 ఒక నిర్దిష్ట స్ట్రీమ్లో గల ఎంట్రీల జాబితాను చేయడము, ఉదాహరణకు grep “computers” grepdemo.txt
07:14 cases విస్మరించడం ఉదాహరణకు, grep -i “computers” grepdemo.txt
07:21 నమూనాకు పోలికలేని లైన్లు. ఉదాహరణకు, grep -iv “pass” grepdemo.txt
07:30 ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు, grep -in “fail” grepdemo.txt
07:38 మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము ఉదాహరణకు, grep -iv pass grepdemo.txt> గుర్తు notpass.txt
07:50 count తెలుసుకోవటానికి, ఉదాహరణకు grep -c "Fail" grepdemo.txt .
07:57 అసైన్మెంట్-గా, -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి.
08:04 ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియో ను చూడండి.
08:06 ఇది Spoken Tutorial project యొక్క సారాంశం ను ఇస్తుంది.
08:10 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
08:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
08:16 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్-షాప్ లను నిర్వహిస్తుంది,
08:19 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:23 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org
08:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం
08:33 దీనికి NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క, మద్దతు ఉంది.
08:40 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది.
http://spoken-tutorial.org\NMEICT-Intro  
08:45 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india