Java-Business-Application/C2/Servlet-Methods/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:53, 2 November 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Servlet Methods పై spoken-tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:08 | JSP ని ఉపయోగించి ఒక సాధారణ login form ను సృష్టించడం, |
00:13 | doGet method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట, |
00:16 | doPost method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట, |
00:20 | doGet మరియు doPost మెథడ్స్ మధ్య తేడా నేర్చుకుంటాము. |
00:25 | ఇక్కడ మనము Ubuntu Version 12.04, |
00:30 | Netbeans IDE 7.3, |
00:33 | JDK 1.7, |
00:36 | Firefox వెబ్ బ్రౌజర్ 21.0 ఉపయోగిస్తున్నాము. |
00:39 | మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:43 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు |
00:46 | Netbeans IDE ఉపయోగించి Core Java మరియు |
00:49 | HTML |
00:51 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు తెలుసుండాలి. |
00:56 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
01:00 | మనము మన వెబ్ అప్లికేషన్ ను సృష్టించడం ద్వారా Library Management System ను ప్రారంభిస్తాము. |
01:06 | ముందుగా మనము Home page ని క్రియేట్ చేద్దాము. |
01:09 | Home page ఒక సాధారణ login form ను కలిగి ఉంటుంది. |
01:14 | ఇది Library Management System కు login అధికారం గల వినియోగదారులను అనుమతిస్తుంది. |
01:20 | ఇప్పుడు, Netbeans IDE కి మారుదాం. |
01:23 | మనం, ఇంతకు ముందు మార్పు చేసిన index dot jsp పేజీకి వెళ్దాము. |
01:30 | home page ని సృష్టించేందుకు నేను ఈ పేజీని మార్చాను. |
01:35 | మనము title గా Home Page అని ఇచ్చాము. |
01:38 | body లోపల border విలువ 1 గా కలిగిన ఒక table ఉన్నది. |
01:44 | మీరు ఇక్కడ కోడ్ ను చూడవచ్చు. |
01:47 | table లోపల, మనము Welcome to Library Management System అనే ఒక శీర్షిక ని చేర్చాము. |
01:54 | తరువాత, "This is the home page for Library Management System" ను శీర్షిక గా కలిగివున్న paragraph tag ఉన్నది. |
02:03 | ఆపై, visitorHomePage dot jsp అనే page కు ఒక hyperlink ఉన్నది. |
02:11 | మనము ఈ పేజీని తరువాత సృష్టిస్తాము. |
02:13 | తరువాత, మనకు చాలా సులభమైన login form ఉంది. |
02:18 | ఈ form, registered user ను login కు అనుమతిస్తుంది. |
02:22 | formను సృష్టించే ముందు, మీరు GreetingServlet అను పేరు గల servlet ను సృష్టించాలి. |
02:28 | కాబట్టి, ఇక్కడ ట్యుటోరియల్ కి విరామం ఇచ్చి, మునుపటి ట్యుటోరియల్‌లో వివరించిన విధంగా ఒక కొత్త servlet ను క్రియేట్ చేయండి. |
02:35 | servlet పేరు GreetingServlet అని గమనించండి. |
02:39 | అదేవిధంగా URL pattern గా GreetingServletPath ను ఇవ్వాలి. |
02:44 | ఈ form లో రెండు input elements, Username మరియు Password లు ఉన్నాయి. |
02:50 | దీనిలో Sign In అనే Submit button కూడా ఉంది. |
02:55 | తరువాత, addUser.jsp కు link ను కలిగి ఉన్న paragraph tag ఉంటుంది. |
03:03 | ఇది రిజిస్టర్ కానీ users కు registration page. |
03:09 | ఇప్పుడు, మనము GreetingServlet.java కు వెళదాము. |
03:14 | GreetingServlet.java అనేది org.spokentutorial. అనే ప్యాకేజీ లో సృష్టించబడింది. |
03:23 | ఇప్పుడు, ఈ servlet request object నుండి form data ను యాక్సెస్ చేయగలుగుతుంది. |
03:30 | ఈ servlet controller గా వ్యవహరిస్తుంది. |
03:33 | మీరు ముందుగా controller ను గురించి నేర్చుకున్నట్టు గుర్తు తెచ్చుకున్నారా? |
03:38 | ఇప్పుడు, servlet ఒక controller గా ఏమి చేస్తుందో చూద్దాం. |
03:42 | form data request object లో ఉంటుంది. |
03:46 | మొదటి పని form data Parameterలను తిరిగి పొందడం. |
03:51 | request object పై getParameter method ను ఉపయోగించడం ద్వారా ఇది జరుగుతుంది. |
03:57 | కాబట్టి, Netbeans IDE కి మారుదాం. |
04:02 | doGet method లోపల టైప్ చేయండి |
04:04 | PrintWriter space out equal to response dot getWriter(). |
04:14 | తరువాత, మనము form data యొక్క parameters ను తిరిగి పొందుతాము. |
04:18 | కాబట్టి తదుపరి వరసలో, |
04:20 | String space username ఈక్వల్ టు request dot getParameter బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో userName మరియు semicolon అని టైప్ చేయండి. |
04:35 | ఈ userName, User Name కొరకు ఫార్మ్ టాగ్ లో మనం చేర్చిన పేరు |
04:43 | అదేవిధంగా, పాస్వర్డ్ ను తిరిగి పొందుతాము. |
04:48 | తరువాత లైన్ లో, String space password ఈక్వల్ టు request dot getParameter బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో password semicolon అని టైప్ చేయండి. |
05:03 | తరువాత, మనము output లో UserName ప్రింట్ చేస్తాము. |
05:08 | కాబట్టి, తదుపరి లైన్లో, |
05:10 | out dot println బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో Hello from GET Method plus username అని టైప్ చేయండి. |
05:21 | ఇప్పుడు, project run చేయడానికి, MyFirstProject పై రైట్-క్లిక్ చేసి, |
05:27 | Clean and Build పై క్లిక్ చేయండి. |
05:29 | మళ్ళీ MyFirstProject, పై రైట్-క్లిక్ చేసి, Run పై క్లిక్ చేయండి. |
05:35 | కాబట్టి, server అప్ అయ్యి, అమలు అవుతుంది. |
05:38 | ఇది MyFirstProjectను deploy చేస్తుంది. |
05:41 | browserలో మన Home page కనపడింది. |
05:45 | page టైటిల్ Home Page. అని గమనించండి. |
05:50 | ఇక్కడ మనము చాలా సాధారణ login form ను చూడవచ్చు. |
05:54 | Username మరియు Password లను ఎంటర్ చేయండి. |
05:58 | నేను Username గా arya అని టైప్ చేస్తాను. |
06:02 | arya*123 as the Password గా ఇస్తాను. |
06:06 | అప్పుడు Sign In పై క్లిక్ చేయండి. |
06:09 | Hello from GET Method arya , అవుట్ ఫుట్ గా రావడం మనము చూడవచ్చు. |
06:15 | ఇప్పుడు, user login కోడ్ లోపల ఏ ధ్రువీకరణనూ చేర్చలేదు. |
06:24 | మనము దీన్ని తరువాత ట్యుటోరియల్‌లో చేస్తాము. |
06:28 | ఇప్పుడు, ఇక్కడ URL ను చూడండి. |
06:31 | ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServletPath question mark userName equal to arya మరియు password equal to arya *123 . |
06:49 | ఇప్పుడు, form data ను page information నుంచి ఒక ప్రశ్న గుర్తు ద్వారా వేరు చేయబడుతుంది. |
06:56 | form లో మనము ఇచ్చిన username మరియు password కూడా URL లోనే ఉన్నాయని చూడవచ్చు. |
07:05 | ఇప్పుడు POST Method ను వాడతాము. |
07:10 | కాబట్టి, IDE కు తిరిగి మారండి. |
07:12 | doGet method కోసం వ్రాసిన కోడ్ ను కాపీ చేసి doPost method లో ఉంచండి. |
07:20 | ఇప్పుడు, println ప్రకటనను Hello from POST Method కు మార్చండి |
07:27 | ఇప్పుడు, మనము index dot jsp తెరుద్దాం. |
07:31 | ఇక్కడ, form tag యొక్క method attribute ని POST కు మార్చాలి. |
07:37 | మీరు ఇప్పుడు ఈ కోడ్ ను చూడవచ్చు. |
07:42 | form action ఈక్వల్ టు GreetingServletPath method ఈక్వల్ టు POST |
07:49 | ఇప్పుడు, మళ్ళీ ఈ Projectని రన్ చేద్దాము. |
07:53 | కాబట్టి, MyFirstProject పై రైట్-క్లిక్ చేసి, Run పై క్లిక్ చేయండి. |
07:58 | మనకు GET method ను ఉపయోగించినప్పుడు మనకు లభించిన మాదిరిగా అవుట్‌పుట్ వచ్చింది. |
08:04 | కాబట్టి, UserName మరియు Password లను మళ్ళీ టైప్ చేద్దాం. |
08:08 | తరువాత Sign In పై క్లిక్ చేయండి. |
08:12 | మనము Hello from POST Method arya అని పొందాము. |
08:17 | ఇప్పుడు, URL ను చూడండి. |
08:19 | ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServlet Path. |
08:25 | ఇక్కడ, request యొక్క URL లో form data ను చూడము. |
08:30 | doGet మరియు doPost methods మధ్య ప్రధాన తేడా ఇదే. |
08:35 | ఇప్పుడు GET మరియు POST methods లను ఎక్కడ ఉపయోగిస్తామో నేర్చుకుందాం. |
08:42 | form చిన్నది మరియు data తక్కువగా ఉనప్పుడు, |
08:44 | user డేటా యొక్క కంటెంట్లను URL లో కనిపించాలని అనుకున్నప్పుడు, |
08:48 | GET method ను ఉపయోగిస్తాము. |
08:53 | form పెద్దది మరియు data ఎక్కువగా ఉనప్పుడు, |
08:55 | user డేటా యొక్క కంటెంట్లను URL లో కనిపించనివకూడదు అనుకున్నప్పుడు, |
09:00 | POST method ను ఉపయోగిస్తాము. |
09:06 | ఉదా: passwords |
09:08 | సారాంశం గా |
09:10 | ఈ ట్యుటోరియల్ లో మనము |
09:12 | JSP ఉపయోగించి simple login form సృష్టించడం, |
09:16 | doGet method ఉపయోగించి పారామితులను పాస్ చేయడం, |
09:19 | doPost method ఉపయోగించి పారామితులను పాస్ చేయడం, |
09:22 | doGet మరియు doPost లమధ్య తేడా నేర్చుకున్నాము. |
09:26 | దయచేసి ముందుకు సాగుటకు ముందుగా మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి. |
09:32 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:38 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
09:45 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:48 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:52 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
09:58 | Spoken Tutorial ప్రాజెక్ట్ లో Talk to a Teacher ప్రాజెక్ట్‌లో భాగం. |
10:02 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:09 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:19 | ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది. |
10:28 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
10:32 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |