Java-Business-Application/C2/Creating-a-Java-web-project/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:05, 2 November 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Creating a Java web project పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము
00:09 Java Web Project ను సృష్టించడం,
00:12 Deployment Descriptor గురించి, మరియు
00:15 web.xml ఫైల్ ల గురించి నేర్చుకుంటాము.
00:19 ఇక్కడ మనము Ubuntu వెర్షన్ 12.04
00:23 Netbeans IDE 7.3
00:26 JDK 1.7
00:28 Firefox web-browser 21.0 ను ఉపయోగిస్తాము.
00:32 మీకు నచ్చిన ఏ web-browser ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:35 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
00:39 Core Java ఉపయోగించి Netbeans IDE మరియు
00:42 HTML గురించి అవగాహన ఉండాలి.
00:44 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:50 ఇప్పుడు, మనం ఒక సాధారణ Java web projectను NetBeans IDEను ఉపయోగించి ఎలా సృష్టించాలో చూద్దాం.
00:56 దీని కొరకు మనం NetBeans IDE కు మారాలి.
01:01 IDE యొక్క ఎగువ ఎడమ మూలలో, File పై క్లిక్ చేసి, New Project పై క్లిక్ చేయండి.
01:08 ఒక New Project విండో తెరుచుకుంటుంది.
01:12 Categories నుండి, Java Web ను మరియు Projects నుంచి Web Applicationను ఎంచుకోండి.
01:18 తరువాత Next పై క్లిక్ చేయండి.
01:20 తరువాత తెరుచుకున్న window పై,
01:23 Project Name ను MyFirstProject గా టైప్ చేయండి.
01:27 Project location మరియు Project Folder ను అలానే వదిలివేయండి.
01:31 తరువాత Next పై క్లిక్ చేయండి.
01:35 GlassFish Server ను Server గా ఎంచుకోండి.
01:39 ఇక్కడ MyFirstProject అనేది Context Path అని గమనించండి, ఇది మన Project పేరు మాదిరిగానే ఉంటుంది.
01:47 మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము.
01:50 ఇప్పుడు, Next పై క్లిక్ చేసి, తరువాత Finish పై క్లిక్ చేయండి.
01:55 Projects టాబ్ పై క్లిక్ చేయండి.
01:58 మనం, ఇక్కడ అనేక nodeలను మరియు My First Project పేరుతో ఒక web applicationను సృష్టించడంను చూడవచ్చు.
02:08 ఇప్పుడు మనం ఈ nodeల అన్నింటి గురించి ప్రస్తుతం ఆలోచించవలసిన అవసరం లేదు.
02:11 కానీ దానియందు ఏమీ ఉందో క్లిక్ చేసి చూద్దాం.
02:16 ఇప్పుడు, మనము Deployment Descriptor అంటే ఏమిటో తెలుసుకుందాము.
02:21 web application యొక్క deployment descriptor,
02:25 application యొక్క configuration,classes, resources గురించి మరియు
02:31 వెబ్ requestsను సర్వ్ చేయడానికి, వాటిని web server ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది.
02:37 web server, application కొరకు ఒక request ను స్వీకరిస్తుంది.
02:42 ఇది deployment descriptor ను request యొక్క URL కు మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తుంది.
02:48 ఇది request ను నిర్వహించగలిగే కోడ్ కు URLను మ్యాప్ చేస్తుంది.
02:52 deployment descriptor అనేది web.xml పేరు గల ఫైల్.
02:57 ఇప్పుడు మనం IDEకు తిరిగి వెళ్దాము.
03:00 మనం web.xml ఫైల్ ను ఇక్కడ అందుబాటులో ఉన్న nodes నుండి కనుగొనలేకపోయాము.
03:07 దీన్ని గుర్తించడానికి, IDE కు పైన ఎడమవైపున, File పై క్లిక్ చేసి, తరువాత New File పై క్లిక్ చేయండి.
03:16 Categories నుండి, Webను ఎంచుకుని,
03:19 File Types నుండి Standard Deployment Descriptor (web.xml) ను ఎంచుకోండి.
03:25 తరువాత Next పై క్లిక్ చేసి,
03:27 Finish పై క్లిక్ చేయండి.
03:30 IDE కు ఎడమ వైపున ఉన్న Files టాబ్ పై క్లిక్ చేయండి.
03:34 web.xml అనేది Web node యొక్క WEB-INF ఫోల్డర్ క్రింద కనిపిస్తుంది అని గమనించండి.
03:42 మీరు ఇప్పుడు source-codeను చూడవచ్చు.
03:46 మనకు ఇక్కడ ఒక xml header ఉన్నది.
03:50 అదేవిధంగా web-app node కూడా ఉన్నది.
03:53 ఇప్పుడు, మనం applicationను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
03:57 అలా చేయుటకు, MyFirstProject పై రైట్ క్లిక్ చేయండి.
04:02 Clean and Build పై క్లిక్ చేయండి.
04:04 ఇది గతంలో కంపైల్ చేసిన ఫైళ్ళను మరియు ఇతర build output ల ను తొలగిస్తుంది.
04:10 ఇది applicationను మళ్ళీ కంపైల్ చేస్తుంది.
04:14 మళ్ళీ, MyFirstProject పై right క్లిక్ చేసి, తరువాత Run పై క్లిక్ చేయండి.
04:20 అప్పుడు, సర్వర్ అప్ అయి, రన్ అవుతుంది మరియు ఇది My first Project ను deploy చేస్తుంది.
04:27 ఒక బ్రౌజర్ window తెరచుకుని, అందులో Hello World అని ప్రదర్శిస్తుంది.
04:32 ఇలా ఎందుకంటే మనం project ను run చేస్తున్నప్పుడు, web application చూపబడిన page ను రెండర్ చేస్తుంది.
04:39 ఇప్పుడు, ఇక్కడ pageను రెండర్ చేసిన URL ను చూద్దాం.
04:44 ఇది localhost colon 8080 slash MyFirstProject.
04:49 కాబట్టి, ఎప్పుడైతే MyFirstProject ను అమలు చేస్తామో HelloWorld! అని చెప్పే JSP పేజీని మనం డిఫాల్ట్ గా పొందుతాము.
04:57 ఇప్పుడు, మన IDE కు తిరిగి వెళ్ళండి.
05:00 మనం WEB-INF folder క్రింద index.jsp ను చూడవచ్చు.
05:07 index.jsp పై డబల్ క్లిక్ చేయండి.
05:10 మనం ఇక్కడ source code ను చూడవచ్చు.
05:12 ఇది HTML tags తో సాధారణ JSP page మాత్రమే.
05:17 ఇది title JSP Pageను మరియు heading Hello World ను కలిగి ఉంటుంది.
05:24 మనం web applicationను run చేస్తున్నపుడు, సర్వర్ index.jspను డిఫాల్ట్ గా అందిస్తుంది.
05:30 మనం ContextPath గురించి ముందు తెలుసుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
05:36 మనం ContextPath ను MyFirstProject గా సెట్ చేసాము.
05:41 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి వెళ్ళండి.
05:44 URLను localhost colon 8080 గా టైప్ చేసి, Enter నొక్కండి.
05:50 మనం Glassfish Server యొక్క Home page ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
05:56 ఇక్కడ, 8080 అనేది సర్వర్, మెషిన్ పై అమలు చేసే డిఫాల్ట్ పోర్ట్.
06:01 ఈ Glassfish Server instance దానిపై run అయ్యే చాలా applicationలను కలిగి ఉండవచ్చు.
06:08 ఒక ప్రత్యేకమైన applicationను పొందడానికి ఆ అప్లికేషన్ పేరును URL లో టైప్ చేయండి.
06:15 కాబట్టి, మనము ప్రత్యేక application ను instance పై అమలు చేయబడే విధంగా టైప్ చేయాలి.
06:21 కాబట్టి, మనము slash MyFirstProject ను టైప్ చేసి, Enter నొక్కండి.
06:26 మనం Hello World ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
06:31 ఇప్పుడు సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనము:
06:35 సాధారణ Java Web project ను సృష్టించుట,
06:38 web ప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడం మరియు
06:41 web.xml ఫైల్ గురించి నేర్చుకున్నాము.
06:44 ఈ spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాల లు తెలుసుకొనుటకు,
06:46 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో ను చూడండి.
06:50 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది.
06:54 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:58 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
07:00 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపు లను నిర్వహిస్తుంది.
07:04 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:13 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:17 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:23 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:27 http://spoken-tutorial.org/NMEICT- Intro
07:34 ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది.
07:44 వారు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు.
07:48 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india