BASH/C2/Command-Line-arguments-and-Quoting/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:55, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 BASH లోని Command line arguments and Quoting పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:11 Command line Arguments మరియు
00:13 Quoting గురించి నేర్చుకుంటాం.
00:15 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:20 ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:26 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:29 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం


00:33 GNU BASHవర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:37 GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 Shell script arguments ను command line నుండి అంగీకరించవచ్చు.


00:46 argument అది పిలువబడే program కు పంపబడుతుంది.
00:52 ఎన్ని arguments లను అయినా program కు పంపవచ్చు.
00:57 'terminal ను Ctrl, Alt మరియు'T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:06 నేను ఇప్పటికే కోడ్ ను arg.sh పేరుగల ఫైల్ లో వ్రాశాను.
01:12 terminalఫై, నన్ను ఈ ఫైల్ ని టైప్ చేయడం ద్వారా తెరవనివ్వండి-
01:16 gedit space arg.sh space ampersand sign(&).
01:23 మనం అంపెర్సన్డ్ ని prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.
01:27 ఇప్పుడు, Enterనొక్కండి
01:30 text editor తెరవబడుతుంది.
01:33 ఇప్పుడు నన్నుcode ను వివరించనివ్వండి.
01:36 ఇది shebang లైన్.
01:39 ఈ లైన్ జీరోత్ argument ను ముద్రిస్తుంది.
01:43 ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది.
01:48 దీని అర్థం zeroth argument అనేది దానంతట అదే program పేరు అవుతుంది.
01:55 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం మరియు పరిశీలిద్దాము.
01:59 terminal కు మారండి.
02:01 మొదట, టైప్ చేయడం ద్వారా ఫైల్ ఎగ్జిక్యూట్ చేద్దాం:
02:05 chmod space plus x space arg.sh
02:12 Enter నొక్కండి.
02:14 ఇప్పుడు dot slash arg.sh అని టైప్ చేయండి
02:18 Enter నొక్కండి. output Zeroth argument is arg.sh గా ప్రదర్శింపబడింది.
02:26 ఇప్పుడు, మన editor కు వెళ్ళండి మరియు మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
02:33 $1 command line నుండి program కు పంపబడిన మొదటి argument ను సూచిస్తుంది.
02:40 $2 (Dollar two) program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది.
02:44 మరియు $3 (Dollar three) మూడవ argument ను సూచిస్తుంది.
02:48 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ని execute చేద్దాం మరియు గమనిద్దాం.
02:52 up-arrow కీ ని నొక్కండి, Enter నొక్కండి.
02:57 మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు
03:00 కానీ మొదటిది, రెండవది మరియు మూడవ arguments ఖాళీలు.
03:05 ఇది ఎందుకంటే command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
03:11 అందువల్ల up-arrow కీని నొక్కండి మరియు టైప్ చేయండి: sunday monday and tuesday
03:18 Enter నొక్కండి.
03:21 మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday and tuesdayఅని చూడవచ్చు.
03:28 ఇప్పుడు మన editor కు మారండి. Enter నొక్కండి.
03:33 ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
03:37 $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది.
03:41 ఒక argument ను 9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి.
03:46 లేదంటే, bash ten's placeలో ఉన్న పూర్ణంకం యొక్క argument ని మాత్రమే తీసుకుంటుంది
03:53 మరియు మీరు output ఊహించలేరు.
03:57 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.


03:59 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:01 terminal కు మారండి.
04:04 నన్ను prompt ని క్లియర్ చేయనివ్వండి.
04:07 ఇప్పుడు మనం 12 లేదా 13 arguments ప్రోగ్రాం కు ఇవ్వవలసిన అవసరం ఉంది.
04:12 అందువల్ల, dot slash arg.sh space 1 to 13 అని టైప్ చేయండి. ఇప్పుడు Enter నొక్కండి.
04:23 మీరు 12 వ argument 12అని చూడవచ్చు.
04:27 మన editor కు వెళ్ళండి
04:30 మరియు లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
04:34 $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను ఇస్తుంది.
04:40 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
04:43 ప్రోగ్రాం ని execute చేద్దాం. terminal కు మారండి.
04:46 ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కండి మరియు Enter నొక్కండి.
04:52 మనం మొత్తం arguments లు 13 అని చూడవచ్చు.
04:57 ఇప్పుడు editor కు వెళ్ళండి.
05:00 Enter నొక్కండి మరియు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
05:04 '$ *' (Dollar asterisk) అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:10 మనం దీనిని ఒక సాధారణ for loop సహాయంతో పరిక్షిద్దాం.
05:14 మనం ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.
05:18 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. terminal కు వెళ్ళండి.
05:22 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
05:26 ఇప్పుడు, మనం dot slash arg.sh space sunday monday and tuesday అని టైప్ చేద్దాం.
05:35 Enter నొక్కండి.
05:38 మన ప్రోగ్రాం కు మనం పంపిన మొత్తం arguments యొక్క సంఖ్య3 ను 3 arguments గా మీరు చూడవచ్చు.
05:46 చెప్పిన విధంగా, '$ *' అన్నిarguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:54 మరియు ఇది for loop యొక్క అవుట్ పుట్.
05:57 మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూసాం.
06:02 ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళండి మరియు ఇక్కడ చూపించిన విధంగా లైన్ లను టైప్ చేయండి.
06:09 $@ (Dollar at) కూడా అన్ని arguments లను ముద్రిస్తుంది.
06:13 ఏదేమైనా, ఈ సారి ప్రతి argument ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
06:20 ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రించే మరొక for loop ఇది.
06:26 ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి.
06:29 terminal కు వెళ్ళండి.
06:32 up-arrow keyని నొక్కండి.
06:34 ' Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.
06:39 arguments $@ ద్వారా ముద్రించబడినవి.


06:43 $@ ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.
06:47 output అనేది రెండవ for loop కోసం.
06:52 ఇప్పుడు BASH లో 'quoting కు వెళ్దాము.
06:55 slides కు మారండి.
06:57 ఇక్కడ మూడు రకాల quote లు ఉన్నాయి:
06:59 Double quote Single quote
07:02 Backslash. Double quote variables మరియు commands యొక్క ప్రత్యామ్నాయం.
07:09 ఉదాహరణకు echo “Username is $USER”.
07:13 ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది.
07:17 Terminalకు మారండి.
07:20 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
07:23 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్ లోపల Username స్పేస్ is dollar USER capitalsలో టైప్ చేయండి.
07:34 Enterనొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది.
07:39 మీ సిస్టమ్ ప్రకారం output మారుతుంది.
07:42 ఇప్పుడు slides కు వెళ్ళండి.
07:46 Single quotes ఇచ్చిన string యొక్క అక్షరాల స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
07:53 ఇది అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు



07:58 Terminalకు వెళ్ళండి.
08:01 echo స్పేస్ సింగల్ కోట్ లోపల Username is dollar USER capitalలో టైప్ చేయండి.
08:10 Enter నొక్కండి.
08:12 Username is $USER అనేది అవుట్ పుట్.
08:16 ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను ముద్రిస్తుంది.
08:23 ఇది variable $USER యొక్క విలువను ప్రత్యామ్నాయం చేయలేదు.
08:28 మన slides కు వెళ్ళండి.
08:31 Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
08:37 దీన్నిBASH లో escape character గా ఉపయోగిస్తారు.
08:42 Terminalకు వెళ్ళండి.
08:44 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి.
08:55 మేము డబుల్ కోట్స్ ఇచ్చినందున,మేము username ను ప్రదర్శించడానికి echo కమాండ్ ఉంటుందని భావిస్తున్నాము.
09:02 ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి.
09:06 అవుట్ పుట్ Username is $USER.
09:10 ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) '$' గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
09:16 $USER ఏ ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string గా వ్యవహరిస్తుంది.
09:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.



09:25 మన slides కు వెళ్ళండి.
09:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం:
09:31 Command line arguments
09:33 డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ ల పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం.
09:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:45 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:00 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:07 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:10 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:24 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:30 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india