BASH/C3/Basics-of-functions/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:43, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, BASHలోBasics of functions పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో, మనము: |
00:11 | Functions యొక్క ప్రాముఖ్యత |
00:13 | function ని గుర్తించడం |
00:15 | function ను పిలవడం |
00:17 | function యొక్క పని ప్రవాహాన్ని |
00:19 | ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాం. |
00:22 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. |
00:34 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System ఉపయోగిస్తున్నాను. |
00:40 | ఇప్పటివరకు మనం GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాం. |
00:46 | ఇప్పటి నుండి మనం GNU BASH వర్షన్ 4.2 ఉపయోగిద్దాం. |
00:52 | దయచేసి, GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి. |
00:58 | function అంటే ఏమిటో మరియు దాని ఉపయోగం చూద్దాం. |
01:03 | function అనేది commands లేదా algorithm ల సమాహారం. |
01:08 | ఇది ఒక నిర్దిష్టమైనా పని చేయడానికి ఉద్దేశించబడింది. |
01:12 | ఇది సంక్లిష్ట ప్రోగ్రాంలను వేర్వేరు పనులుగా విభజించడానికి ఉపయోగించబడుతుంది. |
01:18 | ఇది మొత్తం స్క్రిప్ట్ ను చదువుటకు మరియు వాడుక సౌలభ్యతను మెరుగుపరుస్తుంది. |
01:24 | function డిక్లరేషన్ కొరకు రెండు సింటాక్స్ లు ఉన్నాయ్. |
01:28 | మొదటి సింటాక్స్- function space function_name' |
01:32 | కర్లీ బ్రాకెట్స్ లోపల, |
01:34 | అమలు చేయవలసిన commands. |
01:37 | రెండవ సింటాక్స్- |
01:39 | function_name open and close round brackets |
01:42 | కర్లీ బ్రాకెట్స్ లోపల, |
01:44 | అమలు చేయవలసిన commands. |
01:47 | Function call- Function ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది. |
01:53 | function name ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి. |
01:58 | function_name దానంతట అదే సింటాక్స్ అవుతుంది. |
02:02 | ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం. |
02:07 | నేను ఇప్పటికే కోడ్ నుfunction.sh ఫైల్ లో టైప్ చేసాను. |
02:12 | ఇది shebang line. |
02:14 | function name తో అనుసరించబడిన function అనే పదం Function ను డిక్లేర్ చేస్తుంది. |
02:21 | ఇక్కడ,function name అనేది machine. |
02:26 | కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్ ను function definitionఅంటారు. |
02:32 | నేను వివిధ మెషిన్ వివరాలను ఈ విధంగా ప్రదర్శించాను- |
02:36 | uname hyphen a మెషిన్ సమాచారాన్ని ఇస్తుంది. |
02:41 | w hyphen h సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను ఇస్తుంది. |
02:46 | uptime మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయాన్ని చుపిస్తుంది. |
02:51 | free మెమరీ స్టేటస్ ను తెలుపుతుంది. |
02:54 | df hyphen h ఫైల్ సిస్టం స్థితిని తెలుపుతుంది. |
02:57 | ప్రధాన ప్రోగ్రాం ఇక్కడ మొదలవుతుంది. |
03:01 | మనము “Beginning of main program” అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
03:06 | ఇక్కడ, machine అనేది function call. |
03:09 | తరువాత మనము “End of main program”సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
03:13 | పని ప్రవాహాన్ని అర్ధం చేసుకుందాం. |
03:16 | bash interpreter' function definition ను పర్యటించినప్పటి నుండి function ను స్కాన్ చేస్తుంది. |
03:23 | function అనేది స్క్రిప్ట్ లో దాని పేరు ఉన్నప్పుడు మాత్రమే పిలువబడుతుంది. |
03:28 | ఎప్పుడైతే interpreter function name ను చదువుతుందో అది function definition ను అమలు చేస్తుంది. |
03:36 | interpreter function name ను కమాండ్ గా ట్రీట్ చేస్తుంది. |
03:41 | దయచేసి మనం calling ముందు function ని define చేయాలని గుర్తుంచుకోండి. |
03:47 | ఇప్పుడు terminal కు వెళ్లండి. ఈ కోడ్ ఫైల్ ను అమలు చేయడానికి, |
03:52 | chmod space plus x space function dot shఅని టైప్ చేయండి. |
03:59 | Enterనొక్కండి. |
04:01 | dot slash function dot sh అని టైప్ చేయండి. |
04:05 | Enterనొక్కండి. |
04:07 | output అనగా నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు terminal పై చూడవచ్చు. |
04:14 | గమనిక: output అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది. |
04:19 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
04:22 | తిరిగి మనslides కు రండి. |
04:24 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము: |
04:28 | functions యొక్క ప్రాముఖ్యతను |
04:30 | Function declaration |
04:32 | Function call మరియు function యొక్క పని ప్రవాహాన్ని |
04:35 | ఒక ఉదాహరణతో నేర్చుకున్నాము. |
04:37 | ఒక అసైన్మెంట్ గా-రెండు ఫంక్షన్స్ తో ఒక ప్రోగ్రామ్ ను రాయండి. |
04:42 | మొదటి ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో డిస్క్-స్పేస్ వినియోగాన్ని ప్రదర్శించాలి
(సూచన: df hyphen h). |
04:51 | రెండవ ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో ఫైల్ సిస్టం వినియోగాన్ని ప్రదర్శించాలి
(సూచన: du hyphen h).
|
05:00 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
05:03 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
05:07 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:12 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
05:17 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
05:21 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
05:29 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
05:33 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
|
05:41 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:47 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
05:52 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
05:56 | మీకు ధన్యవాదాలు. |