PERL/C3/File-Handling/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 13:27, 4 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | PERL లో File Handling పై Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము ఫైల్ ను read mode లో తెరవడం , ఫైల్ ను వ్రాయడం ,ఫైల్ ను append mode లో తెరవడం, file handleను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:37 | ఒక వేళ లేకపోతే సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:43 | Perl లో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలు ఫైల్ ను తెరవడం , ఫైల్ నుండి చదవడం , ఫైల్ కు వ్రాయడం , ఫైల్ ను మూసివేయడం. |
00:54 | డిఫాల్ట్ file handle లు: STDIN, STDOUT మరియు STDERR |
01:02 | ఇది open ఫంక్షన్ కొరకు సింటాక్స్. |
01:05 | సింటాక్స్ లో, FILEHANDLE అనేది open ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన file handle . |
01:11 | MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం , మొదలైనవి. |
01:18 | EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, “First.txt” అనేది ఫైల్ పేరు. |
01:27 | ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది. |
01:32 | ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం. |
01:38 | మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminal కు వెళ్ళి, gedit first.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
01:51 | first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి. |
01:55 | ఫైల్ ను Save చేసి gedit ను ముసివేయండి. |
01:59 | ఇప్పుడు, first.txt ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం ను చూద్దాం. |
02:07 | నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.pl ను ఓపెన్ చేద్దాం. |
02:13 | gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:19 | openfile dot pl ఫైలులో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
02:25 | ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
02:28 | open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది. |
02:33 | మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది. |
02:40 | రెండవ పారామిటర్ “<” less than గుర్తు READ మోడ్ ను సూచిస్తుంది. |
02:44 | మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ” మోడ్ లో తెరవబడుతుంది. |
02:50 | మూడవ పారామితి, first.txt, డేటా చదవవలసిన ఫైల్ పేరు. |
02:57 | ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది? |
03:02 | స్క్రిప్ట్ , dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error messageను నిల్వ చేస్తూ ముగుస్తుంది. |
03:08 | while లూప్ అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది. |
03:17 | Print dollar underscore ( $_ ) వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది. |
03:22 | చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతో ఫైల్ ను మూసివేయండి. |
03:29 | ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును. |
03:36 | ఇప్పుడు ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి. |
03:40 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
03:42 | టెర్మినల్ కు మారి, perl openfile dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:51 | చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
03:54 | ఇది మనం first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్. |
03:59 | తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం. |
04:03 | greater than (>) గుర్తు తో ఉన్న open స్టేట్మెంట్ WRITE మోడ్ ను సూచిస్తుంది. |
04:08 | Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది. |
04:13 | నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి. |
04:19 | terminal కు మారండి. |
04:21 | ఇప్పుడు gedit writefile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:29 | స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl ఫైల్ లో టైప్ చేయండి |
04:34 | నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. |
04:37 | "write"మోడ్ లో open ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది |
04:44 | ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than "" అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది. |
04:49 | మొదటి పారామితి "FILE1" అనేది FILEHANDLE |
04:53 | print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది. |
04:59 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
05:03 | ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం. |
05:05 | టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:12 | ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం. |
05:18 | gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:23 | మన second.txt file లో మనం"Working with files makes data storage and retrieval a simple task!"అనే టెక్స్ట్ ను చూడవచ్చు |
05:32 | second.txt ను క్లోజ్ చేద్దాం |
05:35 | ఒకవేళ అదే ఫైల్ ను మనం"write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం. |
05:41 | writefile.pl లో మునుపటి print స్టేట్మెంట్ ను comment చేద్దాం. |
05:46 | క్రింద చూపిన print కమాండ్ ను జోడించండి. |
05:48 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం |
05:54 | టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:00 | ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం. |
06:04 | "gedit second.txt" అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:09 | “Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు |
06:14 | Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి. |
06:19 | ఎందుకంటే, మనము ఫైల్ ను "write" మోడ్లో మళ్ళీ తెరిచాము. |
06:24 | second.txt ఫైల్ ను మూసివేయండి |
06:27 | తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం. |
06:32 | రెండు greater than (>>) గుర్తులతో ఉన్న open స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది. |
06:38 | నేను మళ్ళీ gedit లో writefile dot pl ను తెరుస్తున్నాను. |
06:44 | open స్టేట్మెంట్ లో రెండు greater (>>) than గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్ append mode మోడ్ లో ఉంది అని సూచిస్తుంది |
06:52 | Comment మునుపటి print ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది . |
06:57 | print FILE1 లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్ లో "Two greater than symbols (>>) open the file in append mode". |
07:07 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
07:11 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం |
07:14 | terminal కు తిరిగి మారి, perl writefile dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:20 | ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం. |
07:26 | gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి. |
07:31 | టెక్స్ట్ , మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు. |
07:36 | Second.txt ఫైల్ ను మూసివేద్దాం. |
07:39 | అదేవిధంగా, ఇతర మోడ్ లు కూడా ఉన్నాయి. |
07:42 | మీ సొంతం గా ఈ ఎంపికలను ప్రయత్నించి, ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి. |
07:49 | ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం |
07:53 | ఈ ట్యుటోరియల్ లో మనము:
ఫైల్ ను read మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం. |
08:03 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో file attribute ను "+>" కు మార్చండి. |
08:11 | ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి. |
08:14 | అవుట్ పుట్ ను చూడడానికి second.txt ఫైల్ ను తెరవండి. |
08:17 | file attribute "+>" ఉపయోగాన్ని విశ్లేషించండి. |
08:22 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
08:29 | "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
08:37 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
08:41 | NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. |
08:48 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
08:53 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |