Inkscape/C4/Trace-bitmaps-in-Inkscape/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 08:10, 29 August 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 Inkscape ను ఉపయోగించి Trace bitmap in Inkscape అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం రాస్టర్ మరియు వెక్టార్ చిత్రాల మధ్య వ్యత్యాసం, వివిధ రకాల రాస్టర్ మరియు వెక్టార్ ఫార్మాట్లు, రాస్టర్ చిత్రాన్నివెక్టార్ కు మార్చడం నేర్చుకుంటాం.
00:20 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను: Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను.
00:29 ఈ ట్యుటోరియల్ లో ఉదాహరణలుగా ఉపయోగించిన చిత్రాలు Code Files లింకులో ఇవ్వబడ్డాయి.
00:36 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి మీ మెషిన్ పై చిత్రాలనుదిగుమతి(డౌన్లోడ్) చేయండి.
00:42 ఇక్కడ నా desktop పైన 2 చిత్రాలు ఉన్నాయి.
00:45 Linux.png అనే రాస్టర్ ఇమేజ్ మరియు Linux.pdf అనే వెక్టర్ ఇమేజ్.
00:51 నేను వాటిని తెరుస్తాను.
00:53 రెండు చిత్రాలు ఒకే విధంగా కనిపిస్తాయి. మనం చిత్రం లోనికి జూమ్(పెద్దది) చేసినపుడు మాత్రమే తేడాను తెలుసుకోగలం. అలా చేద్దాం.
01:02 మొదటి చిత్రం పిక్సల్స్ తో రూపొందించబడినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే రాస్టర్ చిత్రం పిక్సల్స్ తో తయారు చేయబడుతుంది కనుక.
01:09 కానీ రెండవ చిత్రం పిక్సల్స్ తో చేసినట్టు ఉండదు ఎందుకంటే ఒక వెక్టార్ చిత్రం పాత్స్ తో చేయబడుతుంది కనుక.
01:15 రాస్టర్ చిత్రం (ఇమేజ్) యొక్క ఫార్మాట్లలో కొన్ని JPEG, PNG,TIFF,GIF, BMP మొదలైనవి.
01:27 SVG,AI, CGM మొదలైనవి వెక్టార్ చిత్రం యొక్క ఫార్మట్స్ లో కొన్ని.
01:34 వెక్టార్ మరియు రాస్టర్ రెండు ఫార్మటు లలో ఉండేవి, PDF, EPS, SWF
01:43 ఇప్పుడు ఈ రాస్టర్ చిత్రాన్ని వెక్టార్ కు ఎలా మార్చాలో నేర్చుకుందాం.
01:47 Inkscape ను తెరుద్దాం. మనం రాస్టర్ చిత్రాన్ని దిగుమతి చేసుకుందాం.
01:52 File కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి.
01:57 ఇప్పుడు,Path menu కి వెళ్ళి Trace Bitmap పై క్లిక్ చేయండి.
02:02 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. మనము Mode ట్యాబ్ క్రింద వివిధ రకాల ఎంపికలు చూడవచ్చు.
02:08 చిత్రాన్ని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. అప్రమేయంగా, Brightness cutoff ఎంపిక ఎంచుకోబడింది.
02:14 Preview కింద, మార్పులను గమనించడానికి Live Preview ఎంపికను తనిఖీ చేయండి.
02:20 మీరు Preview విండోలో చూస్తున్నట్లుగా, Brightness cutoff ప్రకాశంలో తేడాను కనుగొంటుంది.
02:26 ఇప్పుడు రెండవ ఎంపిక పై క్లిక్ చేయండి, అది Edge detection.
02:31 పేరు సూచిస్తున్నట్లుగా, ఇది అంచులను మాత్రమే కనుగొంటుంది.
02:35 Color quantization తగ్గిన రంగుల యొక్క సరిహద్దుల వెంట జాడను కనుగొంటుంది.
02:41 ఒకవేళ మీరు ఇది బాగా విలోమం చేయబడినట్టు కనిపిస్తుంది అని అనుకుంటే,Invert image బిట్మ్యాప్ యొక్క రంగులను విలోమం చేస్తుంది.
02:47 నేను ఇన్వెర్ట్ (విలోమ) చిత్రాన్ని అన్ చెక్ చేస్తాను.
02:51 Multiple scans అనేది బహుళ రంగుల కొరకు బాగుంటుంది.
02:54 Brightness steps ప్రకాశంలో వ్యత్యాసాలను కనుగొంటుంది.
02:58 Colors నిర్దిష్ట రంగుల యొక్క మొత్తాన్ని కనుగొంటుంది.
03:01 Grays, Colors ను పోలి ఉంటుంది, కానీ ఇది గ్రేస్కేల్ రంగులను మాత్రమే గుర్తిస్తుంది. Smoothఎంపికను అన్ చెక్ చేయండి, ఎందుకంటే ఇది అంచులలో మరిన్ని సున్నితమైన రేఖలను సృష్టిస్తుంది కనుక.
03:13 ఇప్పుడు మనం అన్ని ట్రేసింగ్ ఎంపికలను చూశాము. మీరు మీ అవసరానికి అనుగుణంగా వీటిలో దేని నుండైనా ఎంచుకోవచ్చు.
03:20 నేను Colors ఎంపికల క్లిక్ చేసి వాటిని ఎంచుకుంటాను.
03:24 OK పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
03:28 సృష్టించబడిన వాటిలో గుర్తించిన చిత్రం, అసలు చిత్రం యొక్క పైభాగంలో ఉంటుంది.
03:33 రెండు చిత్రాలను చూడడానికి ఒక చిత్రాన్ని క్లిక్ చేసి, ఒక పక్కకి కదిలించండి.
03:38 చిత్రం ఇప్పుడు వెక్టార్ కు మార్చబడింది. చిత్రాల లోనికి జూమ్ చేయండి.
03:43 ముందు చెప్పినట్లుగా మొదటి చిత్రం పిక్సల్స్ గా రూపొందించబడుతుంది,రెండవది పిక్సలేటెడ్ చేయబడదు.
03:50 మనం చాలా స్పష్టంగా మార్గాలను(పాత్స్) చూడవచ్చు.
03:56 ఇప్పుడు, అసలు చిత్రాన్ని తొలగించండి.
03:58 చిత్రాన్ని ఎంచుకోండి. Path కి వెళ్ళి Break Apart పై క్లిక్ చేయండి.
04:03 ఇప్పుడు చిత్రం పై డబుల్ క్లిక్ చేయండి. చిత్రాల యొక్క స్టేక్ ఒక దాని పైన ఒకటి సృష్టించబడుతాయి.
04:10 వాటిని కనిపించేలా చేయడానికి వాటిని క్లిక్ చేసి ఒకపక్కకి లాగండి.
04:13 తరువాత వెక్టర్ చిత్రాన్ని ఎలా సవరించాలో నేర్చుకుందాము. నేను నలుపు రంగు చిత్రాన్ని సవరిస్తాను(ఎడిట్ చేస్తాను).
04:19 కాబట్టి ఇతర చిత్రాలను తొలగించండి.
04:23 చిత్రం ఎంచుకోబడింది అని నిర్ధారించుకోండి.
04:26 Path కి వెళ్ళి Break Apart పై క్లిక్ చేయండి.
04:29 Fill and Stroke కింద,పారదర్శకతను 50 కి తగ్గించండి. ఇప్పుడు మీరు భాగాలను స్పష్టంగా చూడవచ్చు.
04:37 చిత్రం యొక్క రంగులను మార్చుదాం.
04:40 మీరు మీ ఊహ ప్రకారం రంగులను మార్చవచ్చు.
04:44 ఇప్పుడు అన్ని భాగాలను ఎంచుకుని opacity ని 100 కు పెంచండి.
04:51 వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి.
04:55 ఇప్పుడు మనం కొన్ని హెయిర్ స్టైల్ లను జోడిద్దాం. అలా చేయటానికి, చిత్రాన్ని ఎంచుకుని, Nodes టూల్ పై క్లిక్ చేయండి.
05:02 నోడ్స్ ను తల భాగానికి జోడించండి. ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్టుగా నోడ్స్ ను కొద్దిగా పైకి కదిలించండి.
05:09 చిత్రాన్ని రాస్టర్ మరియు వెక్టార్ ఫార్మట్స్ రెండింటిలో సేవ్ చేయండి.
05:13 ముందుగా దానిని రాస్టర్ అనగా PNG ఫార్మాట్ లో భద్రపరచండి, File కు వెళ్ళి తరువాత Save As పై క్లిక్ చేయండి.
05:21 పేరును Image-raster గా మార్చి Save పై క్లిక్ చేయండి.
05:29 తరువాత చిత్రాన్ని వెక్టార్ అనగా PDF ఫార్మాట్లో భద్రపరుద్దాం.
05:34 మరోసారి, File కు వెళ్ళి, Save As పై క్లిక్ చేయండి.
05:39 ఎక్స్టెన్షన్ ను PDF కు మార్చండి. పేరును Image-vector గా మార్చండి.Save పై క్లిక్ చేయండి.
05:48 ఇప్పుడు మనం డెస్క్ టాప్ కు వెళ్ళి రెండు చిత్రాలను చెక్ చేద్దాం.
05:53 మీరు రెండు చిత్రాల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు.
05:58 ఈ ట్యుటోరియల్ కోసం ఇంతే, సారాంశం చూద్దాం.
06:01 ఈ ట్యుటోరియల్ లో, మనం రాస్టర్ మరియు వెక్టార్ చిత్రాల మధ్య తేడాను, వివిధ రకాల రాస్టర్ మరియు వెక్టార్ ఫార్మాట్ లు, రాస్టర్ చిత్రాన్నివెక్టార్ కు మార్చడం నేర్చుకున్నాము.
06:12 ఒక అసైన్మెంట్ గా, మీ కోడ్ ఫైల్స్ లింక్ లో ఇవ్వబడిన రైలు చిత్రాన్ని ఎంచుకుని, దానిని వెక్టార్ లో Grays కు మార్చండి.
06:20 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
06:23 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
06:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
06:38 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
06:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:51 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya, Yogananda.india