Java/C2/Arithmetic-Operations/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 00:08, 5 August 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అర్థమెటిక్ ఆపరేషన్స్ పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ టుటోరియల్ లో మీరు వివిధ అరిధమేటిక్ ఆపరేటర్లు అనగా,

కూడిక తీసివేత గుణకారం భాగాహారం మరియు వాటి ఉపయోగించటం నేర్చుకుంటారు.

00:16 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0

JDK 1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం.

00:24 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో ఎక్లిప్స్ స్థాపించబడి ఉండాలి.
00:28 ఇంకా మీకు ఎక్లిప్స్ లో ఫైల్ని ఎలా క్రియేట్, సేవ్ మరియు రన్ చేయాలో తెలిసిఉండాలి.
00:32 లేదంటే, తత్సంబంధిత టుటోరియల్ కోసం, మావెబ్సైట్ ను చూడండి.
00:42 ఇవి ఆపరేటర్లు మరియు వాటి గణిత ప్రక్రియల జాబితా,

ప్లస్ (+) గుర్తు కూడడానికి మైనస్(-) గుర్తు తీసివేతకు ఆస్తేరిక్స్(*) గుణించడానికి మరియు స్లాష్(/) గుర్తు భాగహారానికి.

00:54 మనం వాటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
01:05 ఇక్కడ మనకు ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం.
01:10 మనం ArithmeticOperations అనే పేరుగల “క్లాస్” క్రియేట్ చేసి, దానికి మెయిన్ మెథడ్ జత చేద్దాం.
01:17 మనం కొన్ని వేరియబుల్స్ చేర్చుదాం.
01:22 int x = 5;
01:26 int y = 10;

int result;

01:35 'x' మరియు 'y' లు operands మరియు result ఆపరేషన్స్ యొక్క ఔట్పుట్ ను నిల్వ చేస్తుంది.
01:41 మనం వాటిని కూడి చేసి, ఫలితాన్ని ముదిరిద్దాం. result= x+y; system. out. println పరాంతసిస్ లో result.
02:10 దాన్ని Control S తో సేవ్ చేసి, control F11 తో రన్ చేద్దాం.
02:17 సంకలనం యొక్క ఔట్పుట్ result లో నిల్వచేయబడి ముద్రించబడడం మనం చూస్తాం.
02:24 ఇప్పుడు మనం విలువలని మారుద్దామ్. x=75, y = 15;
02:37 సేవ్ చేసి రన్ చేయండి.
02:42 ఔట్పుట్ తదనుగుణంగా మారడం మనం చూస్తాం.
02:48 ఇప్పుడు ఋణసంఖ్య విలువలతో ప్రయత్నిద్దామ్. y = -25
02:57 సేవ్ చేసి, రన్ చేద్దాం.
03:02 75 ప్లస్ -25 యొక్క అవుట్ ఫుట్ ముద్రించబడింది.
03:10 ఇప్పుడు తీసివేత చేసి చూద్దాం. y = 5 మరియు x+y ని x-y మారుద్దామ్.
03:25 సేవ్ చేసి రన్ చేద్దాం.
03:32 75-5 యొక్క ఔట్పుట్ ముద్రించబడింది.
03:38 ఇప్పుడు గుణకారం చేసి చూద్దాం. మైనస్(-)ను ఆస్టెరిస్క్ (*) తో మారుద్దాం.
03:46 సేవ్ చేసి రన్ చేయండి.
03:52 ఆస్టెరిక్(*) ఉపయోగించి 75 ని 5 తో గుణిద్దామ్.
03:58 ఇప్పుడు భాగాహారం చేయడానికి ఆస్టెరిక్(*) ని తీసి, స్లాష్ (/) వేయండి.
04:07 సేవ్ చేసి రన్ చేయండి.
04:13 మనం ఊహించిన ఫలితం వచ్చింది.
04:18 ఇప్పుడు ఒకవేళ ఫలితం దశాంశసంఖ్య అయితే ఏమవుతుందో చూద్దాం.
04:24 5 ని 10 కు మారుద్దామ్.
04:28 ఫలితం 7.5 ఉండాలి.
04:30 అందుకు మనం ఫలితాన్ని float కు మారుద్దామ్.
04:43 సేవ్ చేసి రన్ చేయండి.
04:50 ఫలితం 7.5 రావలసి ఉండగా, 7.0 రావడం గమనించండి.
04:57 ఎందుకంటే భాగాహారం లో ఉన్న రెండు ఓపెరాన్ద్స్ పుర్ణాంకాలు గనక.
05:01 మనం 'y' ని float, y = 10f; కు మారుద్దాము.
05:15 సేవ్ చేసి రన్ చేయండి.
05:21 మనం ఊహించిన ఫలితం వచ్చింది.
05:24 మనం అనుకున్న ఫలితం float, అయితే, ఒకానొక ఓపెరాండ్ కూడా float కావాలని గుర్తుంచుకోండి.
05:32 ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ ఓపెరాన్ద్స్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. అన్ని operand లను తీసివేయండి.
05:48 int result= 8+4-2; సేవ్ చేసి, రన్ చేయండి.
06:09 ఫలితం మనం ఊహించినట్లే వచ్చిందని చూడవచ్చు.
06:12 ఇప్పుడు మైనస్ ను స్లాష్ కి మారుద్దామ్.
06:19 ఒకవేళ కూడిక భాగాహారానికి ముందు చేసినట్లయితే ఇప్పుడు ఔట్పుట్ 6.
06:25 లేదా ఒకవేళ భాగాహారం కూడికకు ముందు చేసినట్లయితే అది 10.
06:30 రన్ చేసి ఔట్పుట్ ఏమిటో చూద్దాం.
06:38 మనం చూసినట్లయితే, ఔట్పుట్ 10 మరియు భాగాహారం కూడికకు ముందు చేయబడింది. ఎందుకంటే భాగాహారం ఆపరేటర్ కూడిక కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది.
06:50 అలాంటి సంధర్బం లో మనం ఒకవేళ ఆ ప్రాముఖ్యతని మార్చడానికి మనం పరాంతసిస్ ని వాడాలి.
07:04 పరాంతసిస్ ని వాడి, మనం జావాకు భాగాహారానికి ముందు కూడిక చేయాలని సూచించాలి.
07:10 ఇప్పుడు ఫైల్ ని రన్ చేద్దాం.
07:15 కూడిక భాగహారానికి ముందు జరిగి, ఫలితం 6 రావడాన్ని మనం చూడవచ్చు.
07:22 ఆపరేషన్స్ క్రమం సరిగా లేనప్పుడు మనం విధిగా పారేంథేసిస్ వాడాలని ఒక సూత్రంలా గుర్తుంచుకోవాలి.
07:36 ఇంతటితో ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాం.
07:40 మనం నేర్చుకున్న అంశాలు;
07:41 జావా లో సామాన్య గణిత ప్రక్రియలని చేయడం,
07:44 ఆపరేటర్ ప్రాముఖ్యత మరియు
07:45 దాన్ని ఎలా మార్చి రాయాలి నేర్చుకున్నాం.
07:49 ఒక అసైన్మెంట్, modulo ఆపరేటర్ మరియు దాని ఉపయోగం గురించి తెల్సుకోండి.
07:57 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
08:02 ఇది ఈ ప్రాజెక్టు సారాంశం.
08:05 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:10 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్:
08:12 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
08:14 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్లు ఇస్తుంది.
08:18 మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:24 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
08:29 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:35 దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో.
08:39 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు నేను ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig