Java/C2/Logical-Operations/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | జావా లోని లాజికల్ ఆపరేటర్స్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మీరు లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటారు. |
00:11 | లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి వివిధ ఎక్స్ ప్రెషన్స్ ను ఎలా పరీక్షించాలో మరియు పరేంథేసిస్ ఉపయోగించి ప్రేసీడెన్స్ ని ఎలా ఓవర్ రైడ్, చేయాలో చూద్దాం. |
00:20 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0
JDK1.6 మరియు Eclipse3.7 ఉపయోగిస్తున్నాం. |
00:30 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు రిలేషనల్ ఆపరేటర్స్ పై అవగాహన ఉండాలి. |
00:35 | లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి. |
00:42 | లాజికల్ ఆపరేటర్స్ వివిధ రకాల కండిషన్స్ ను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. |
00:48 | ఇది జావాలో మనకు లభ్యమయ్యే లాజికల్ ఆపరేటర్ల జాబితా. |
00:54 | and, or, not. మనం వీటిలో ప్రతి ఒక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. Eclipse కు మారండి . |
01:04 | ఇక్కడ మనము ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం |
01:10 | ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్స్ అనే క్లాస్ ని సృష్టించి, మెయిన్ మెథడ్ జతచేశాం. |
01:15 | కొన్ని వేరియబుల్స్ ని సృష్టిద్దాం. |
01:20 | బూలియన్ బి ; |
01:23 | మనం కండిషన్ యొక్క ఫలితాన్ని 'b' నిల్వ చేద్దాం. |
01:29 | int age is equal to 11; |
01:35 | int weight is equal to 42; |
01:42 | మన దగ్గర ఒక వ్యక్తి వయసు మరియు బరువుల వివరాలున్నాయి. |
01:46 | మనం ఆ వ్యక్తి వయసు 18 యేళ్ళ కంటే తక్కువ మరియు కనీస బరువు 40 కేజీ లు ఉందో లేదో చూద్దాం. |
01:52 | దాన్ని ఎలా చేయాలో చూద్దాం. |
01:57 | b is equal to age less than 18 ampersand ampersand weight greater than equal to 40; |
02:19 | ఈ స్టేట్మెంట్ లో రెండు ఎక్స్ ప్రెషన్స్ మరియు రెండు అంపెర్సాండ్ సింబల్స్ ఆ రెండిటి మధ్యలో ఉన్నాయి. |
02:24 | ఇది వయసు 18 యేళ్ళ లోపు మరియు బరువు 40 కంటే ఎక్కువ లేక సమానంగా ఉందా లేదా అని పరిశీలిస్తుంది. |
02:31 | ఈ ఆపరేషన్ ని అండ్ అని ఆపరేషన్ అంటారు. |
02:35 | ఇప్పుడు 'b' విలువను ముద్రిద్దాం. |
02:40 | System dot out dot println(b); |
02:48 | సేవ్ చేసి రన్ చేయండి. |
02:56 | ఔట్పుట్ సత్యం అని రావడం మనం చూడవచ్చు, ఎందుకంటే రెండు కండిషన్స్ సంతృప్తి చెందాయి. |
03:02 | ఇప్పుడు బరువుని మార్చి ఒక కండిషన్ని అసంతృప్తి పొందేలా కోడ్ ని రన్ చేద్దాం. |
03:08 | 42 ని 32 కి మారుద్దాం. |
03:14 | సేవ్ చేసి రన్ చేయండి |
03:21 | ఔట్పుట్ అసత్యం అని చూడవచ్చు. |
03:24 | ఎందుకంటే వయసు 18 లోపు ఉండాలి అనే కండిషన్ సంతృప్తి పొందింది |
03:29 | కానీ బరువు 40 కంటే ఎక్కువ లేక సమానం అనే కండిషన్ అసంతృప్తి పొందింది. |
03:34 | అండ్ ఆపరేషన్ లో ఫలితం ట్రూ అవ్వడానికి రెండు కండిషన్స్ సత్యం కావాలి. |
03:39 | అందువల్లే మనకు ఫాల్స్ అనే ఔట్పుట్ వచ్చింది. |
03:43 | ఈ విధంగా రెండు అంపెర్సాండ్ గుర్తులను వాడడం ద్వారా మనం అండ్ ఆపరేషన్ ని చేయవచ్చు. |
03:53 | మనకు వయసు, బరువు రెండిటి లో ఏదో ఒక కండిషన్ మాత్రమే సంతృప్తి చెందితే చాలు అనుకోండి. |
03:59 | ఇంకోలా చెప్పాలంటే, మొదటి లేదా రెండో కండిషన్లలో ఏదో ఒకటి సంతృప్తి చెందితే చాలు అనుకుంటే, |
04:05 | దాన్ని మనం ఆర్ ఆపరేషన్ ద్వారా చేయవచ్చు. |
04:09 | ముందుగా, మునుపటి కండిషన్ ను తీసేద్దాం. |
04:15 | టైప్ చేయండి, |
04:17 | age లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 రెండు పైప్ గుర్తులు weight లెస్ దాన్ఆర్ ఈక్వల్ టు 30. |
04:35 | ఇక్కడ రెండు కండిషన్స్ మధ్య రెండు పైప్ గుర్తులు ఉన్నాయి. |
04:40 | ఈ వాక్యం ఏదైనా ఒక కండిషన్ వర్తిస్తుందో లేదో అని పరిశీలిస్తుంది. |
04:46 | ఔట్పుట్ కోసం కోడ్ ని సేవ్ చేసి రన్ చేద్దాం. |
04:54 | ఔట్పుట్ సత్యం రావడం మనం చూస్తాం. |
04:57 | ఎందుకంటే ఆర్ ఆపరేషన్ లో ఒక కండిషన్ సత్యం అయితే చాలు. అండ్ ఆపరేషన్ లాగ రెండూ సత్యం అవ్వాల్సిన అవసరం లేదు. |
05:03 | దీనికి ఒక కండిషన్ సత్యం అయితే చాలు. |
05:06 | వెయిట్ కండిషన్ సరిపోక పోయిన గాని ఏజ్ కండిషన్ సరిపోయింది కాబ్బటి, |
05:13 | మనకు ఔట్పుట్ సత్యం అని వస్తుంది. |
05:18 | ఇప్పుడు వయసు విలువ మార్చి రెండు కండిషన్స్ అసత్యం అయ్యేలా మారుద్దాం. |
05:25 | 11 ని 17 గా మారుద్దాం. |
05:30 | సేవ్ చేసి రన్ చేయండి. |
05:36 | ఇప్పుడు ఔట్పుట్ ఫాల్స్ అయింది, ఎందుకంటే రెండు కండిషన్ లూ అసంతృప్తి చెందాయి. |
05:41 | ఈ విధంగా, మనం రెండు పైప్ గుర్తులను ఉపయోగించి ఆర్ ఆపరేషన్ తనిఖీ చేస్తాం. |
05:50 | ఇప్పుడు, మనము వయసు 15 కంటే ఎక్కువ ఉండి బరువు 30 కంటే ఎక్కువ ఉండేలా కండిషన్ తనిఖీ చేయాలనుకోండి. |
05:57 | మరోలా చెప్పాలంటే మనం ఇంతకూ ముందు తనిఖీ చేసిన కండిషన్ లకు పూర్తి వ్యతిరేకంగా తనిఖీ చేయాలి. |
06:03 | ఆ సంధర్భంలో మనం నాట్ ఆపరేషన్ ఉపయోగిస్తాం. |
06:07 | ముందుగా కండిషన్ ని పారేంథేసిస్ లో వేయండి. |
06:17 | ఇంకా, ఒక ఆశ్యర్యార్థక చింహాన్ని శరతుకి ముందు జత చేయండి. |
06:25 | ఆశ్యర్యార్థక చిహ్నం ఉపయోగించి ఆ షరతుకు ముందు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందో లేదో పరిశీలించండి. |
06:32 | ఎందుకంటే ముందు వచ్చిన ఔట్పుట్ అసత్యం కావున ఇప్పుడు సత్యం రావాలి. పరిశీలిద్దాం. |
06:38 | సేవ్ చేసి రన్ చేయండి. |
06:44 | ఔట్పుట్ ముందు వచ్చిన దానికి పూర్తిగా వ్యతిరేకం అని చూడవచ్చు. |
06:48 | ఈ విధంగా, ఆశ్యర్యార్థక చిహ్నం ఉపయోగించి మనం నాట్ ఆపరేషన్ తనిఖీ చేస్తాం. మనకు వయసు 15 కంటే తక్కువ ఉన్న వ్యక్తులు కావాలనుకోండి, |
06:58 | లేదా 18 యేళ్ళకంటే తక్కువ వయసు మరియు 40 కిలో ల కంటే తక్కువ బరువు గల వ్యక్తులు కావాలనుకోండి, |
07:04 | ఈ కండిషన్ని ఎలా తనిఖీ చేయాలో చూద్దాం. |
07:07 | ముందున్న కండిషన్ ను తీసివేసి టైప్ చేయండి. |
07:12 | age less than 15 |
07:15 | OR age less than 18 |
07:24 | AND weight less than 40; |
07:33 | మనం చూసినట్లయితే కండిషన్ కొంచెం గందరగోళంగా ఉంది. |
07:36 | ఇంకా ఏంటంటే, మనకి ఆర్ ఆపరేషన్ ముందా లేక అండ్ ఆపరేషన్ ముందు చేయాలో తెలియదు. |
07:42 | ఇది ఆపరేటర్ ప్రాముఖ్యత పై ఆధారపడి ఉంటుంది. |
07:46 | అలాంటి సంధర్భాలలో మనం పరేంథేసిస్ ని ప్రాముఖ్యతను మార్చడానికి మరియు కండిషన్ ను సరిదిద్దాడానికి ఉపయోగిస్తాం. |
07:53 | పరేంథేసిస్ ని రన్ చేద్దాం. |
08:06 | కోడ్ ని సేవ్ చేసి రన్ చేయండి. |
08:13 | ఇపుడు, మొదటి షరతు వయసు 15 యేళ్ళ కంటే తక్కువ అనేది అసంతృప్తిచెందినా, |
08:20 | రెండవది |
08:22 | యేజ్ లెస్ దాన్ 18 మరియు వెయిట్ లెస్ దాన్ 40 సంతృప్తి చెందింది. |
08:27 | అందుకే ఔట్పుట్ సత్యం అయింది. |
08:30 | సంధిగ్ధత లేకుండా ఉండడానికి మరియు ఎక్స్ ప్రెషన్స్ స్పష్టంగా ఉండడానికి మనం విధిగా, పారేంథేసిస్ ను ఉపయోగించాలి. |
08:36 | ఈ విధంగా మనం వివిధ కండిషన్ లను పరిశీలించడానికి లాజికల్ ఆపరేటర్స్ ను ఉపయోగిస్తాము. |
08:44 | దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము. |
08:47 | మనం నేర్చుకున్న అంశాలు ; లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ ను ఉపయోగించి వివిధ ఎక్స్ ప్రెషన్స్ పరిశీలించడం. |
08:54 | వాటిని ఎలా సరిదిద్దాలి, పారేంథేసిస్ ఉపయోగించి ప్రాముఖ్యత మార్చడం. |
09:00 | ఈ టుటోరియల్ సంబంధించిన, ఒక అసైన్మెంట్ |
09:02 | రెండు ఎక్స్ ప్రెషన్స్ విలువలు సమానంగా ఉంటే ఎలా చేయాలి? |
09:10 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
09:18 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు |
09:23 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
09:30 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి |
09:36 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
09:40 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
09:46 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో |
09:52 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు మాధురి గణపతి. నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు. |