Java/C2/Getting-started-Eclipse/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 13:09, 25 July 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునే అంశాలు: |
00:08 | ఎక్లిప్స్ లో ప్రాజెక్టు ను సృష్టించి దానికి, ఒక క్లాస్ ను జత చేయుట. |
00:12 | జావా ప్రోగ్రాం ను వ్రాయటం మరియు |
00:14 | ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ను అమలుపరచుట. |
00:18 | ఈ టుటోరియల్ కోసం మనము ఉబంటు linux11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాము |
00:25 | ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీ సిస్టమ్ పై |
00:28 | ఎక్లిప్స్ స్టాపించి ఉండాలి. |
00:30 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్ సైట్ ను సంప్రదించగలరు . |
00:39 | ఎక్లిప్స్ ఒక క్రోడీకృత నిర్మాణ పర్యావరణం (Integrated Development Environment). |
00:42 | ఈ సాధనాన్ని జావా ప్రోగ్రాంలను వ్రాయటానికి, సవరణలకు మరియు అమలుపరుచేందుకు ఉపయోగిస్తాం. |
00:50 | ఇప్పుడు మనం ఎక్లిప్స్ ను తెరుద్దాం. |
00:55 | Alt F2 నొక్కి, డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:08 | మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది . |
01:11 | ఎక్లిప్స్ మరియు మీ ప్రాజెక్ట్ సంబందించిన ఫైల్స్ అన్నీ వర్క్ స్పేస్ లో నిల్వచేయబడుతాయి. |
01:19 | వర్క్ స్స్పేస్ కు ముందే నిర్దేశించిన స్థానం ఉంది. |
01:24 | బ్రౌస్ ఎంపిక ఉపయోగించుకొని వేరొక డైరెక్టరీను ఎంచుకోవచ్చు. |
01:27 | ప్రస్తుతానికి, default డైరెక్టరీను ఎంచుకొని ముదుకు వెళ్దాం. |
01:30 | Ok నొక్కి ముందుకు సాగండి. |
01:39 | ఇది Welcome to Eclipse పేజ్ |
01:46 | పైన కుడి మూలలో ఉన్న వర్క్ బెంచ్ పై క్లిక్ చేయండి. |
01:52 | ఇది మన ఎక్లిప్స్ ఐడిఈ. ఇప్పుడు ఇందులో ఒక ప్రాజెక్ట్ సృష్టిద్దాం. |
01:57 | ఫైల్ మెను లో న్యూ లో ప్రాజెక్ట్ ఎంచుకోండి. |
02:05 | ప్రాజెక్ట్ జాబితాలో జావా ప్రాజెక్ట్ ను ఎంచుకోండి. |
02:10 | మనం చాలా టుటోరియల్ లలో జావా ప్రాజెక్ట్ ను ఉపయోగిస్తాం. Next పై క్లిక్ చేయండి. |
02:19 | ప్రాజెక్ట్ పేరు లో EclipseDemo అని టైప్ చేయండి. |
02:30 | Use default location అనే ఎంపికను గమనించండి. |
02:34 | ఈ ఎంపికను ఎంచుకొంటే, ఎక్లిప్స్ డెమో ప్రాజెక్ట్ సమబందించిన files(డేటా), default వర్క్-స్పేస్ లో నిల్వచేయబడతాయి. |
02:41 | దీన్ని ఎంచుకోపోతే, బ్రౌస్ పై క్లిక్ చేసి వేరే చోటుని ఎంచుకోవచ్చు. |
02:47 | ప్రస్తుతానికి మేము మనం పూర్వనిర్ధారిత స్థానాన్ని ఎంచుకుందాం. |
02:52 | విజార్డ్ లో కింద కుడి మూల లో ఉన్న Finish పై క్లిక్ చేయండి |
03:00 | Open Associated Perspective డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
03:04 | పెర్స్ పెక్టివ్ ,ఎక్లిప్స్ లో ఐటంలు ఎలా అమర్చబడ్డాయో సూచిస్తుంది. |
03:09 | Ee dialog box జావా నిర్మాణం పూరకంగా ఉండే పెర్స్ పెక్టివ్ ని సూచిస్తుంది. |
03:20 | Remember my decision (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో ) ఎంపికను ఎంచుకొని యెస్ పై క్లిక్ చేయండి. |
03:27 | ఇది ప్రాజెక్ట్ తోబాటు ఉన్న ఎక్లిప్స్IDE, ఇప్పుడు ప్రాజెక్ట్ కు ఒక క్లాస్ జోడిద్దాం. |
03:37 | ప్రాజెక్ట్ పై రైట్ క్లిక్ చేసి, న్యూ లో క్లాస్ ఎంచుకోండి. |
03:46 | క్లాస్ పేరు DemoClass (డెమో క్లాస్ ) అని ఇవ్వండి. |
03:55 | మాడిఫైయర్స్ లో పబ్లిక్ మరియు డీఫాల్ట్ అనే రెండు ఎంపికలు ఉన్నాయని గమనించండి. |
03:59 | ఇప్పుడు, ఇప్పటికీ పబ్లిక్ ఎంపికనే ఎంచుకుందాం. |
04:01 | మిగతా ఎంపికల గురించి తరువాత ట్యుటోరియల్స్ లో వివరిస్తాను. |
04:06 | మరియు మెథడ్ స్టబ్స్ జాబితాలో, public static void main అనే ఎంపికను ఎంచుకొండి. |
04:14 | మిగతా ఎంపికలగురించి తరువాత ట్యుటోరియల్స్ లో వివరిస్తాను. |
04:19 | విజార్డ్ కు కింద కుడి మూలలో ఫినిష్ పై క్లిక్ చేయండి. |
04:30 | ఇది మన క్లాస్ ఫైల్. |
04:35 | ఇక్కడ చాలా విభాగాలున్నాయని గమనిచండి. వీటిని పోర్ట్-లెట్స్ అంటారు. |
04:41 | ఇది ప్యాకేజ్ఎక్స్-ప్లోరర్, పోర్ట్-లెట్, ఫైల్ బ్రౌసర్ లా పనిచేస్తుంది. |
04:46 | ఎడిటర్ పోర్ట్-లెట్ లో కోడ్ ను టైప్ చేయగలం. |
04:50 | ఔట్ లైన్ పోర్ట్-లెట్ ప్రాజెక్ట్ తారతమ్యాన్ని సూచిస్తుంది. |
04:56 | ప్రతి పోర్ట్-లెట్ యొక్క పరిమాణాన్ని మార్చగలం. |
05:10 | మినిమైస్ బటన్ ఉపయోగించి వీటిని మినిమైస్ చేయగలం. |
05:26 | రెస్టోర్ బటన్ ను ఉపయోగించి పోర్ట్-లెట్ రిస్టోర్ చేయగలం. |
05:37 | ఇప్పుడు ఎడిటర్ తప్ప మిగతా అన్నీ పోర్ట్ లెట్స్ ని మినిమైజ్ చేద్దాం. |
05:49 | ఇక్కడ ఎక్లిప్స్ ,మనకోసం నిర్మించిన కొంచెం కోడ్ కనిపిస్తుంది. |
05:54 | క్లాస్ నిర్మిచే సమయంలో మన ఎంపికలకు తగ్గట్టు ఈ కోడ్ నిర్మించబడుతుంది. |
06:00 | ఇప్పుడు, ఇక్కడ print స్టేట్మెంట్ ను జతచేద్దాం. |
06:08 | System.out.println టైప్ చేసి పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse (హలో ఎక్లిప్స్ )అని టైప్ చేయండి. |
06:26 | వాక్యం చివరన సెమికోలన్ ను పెట్టండి. |
06:31 | ఫైల్ మేను లో సేవ్ ఎంచుకొని ఫైల్ ను సేవ్ చేయండి. |
06:37 | బదులుగా, crtl +s నొక్కి కూడా సేవ్ చేయగలరు. |
06:42 | కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి రన్-as ఎంపికలో జావా అప్ప్లికేషన్ ఎంచుకోండి. |
06:56 | ఔట్ పుట్ కంసోల్ లో ప్రోగ్రాం సందేశాలను ముద్రిస్తుంది. |
07:04 | మన కోడ్ లో ఎటువంటి లోపాలున్నా, ప్రాబ్లమ్స్ పోర్ట్ లెట్ లో సూచిస్తుంది. |
07:10 | ఇలా ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ని వ్రాసి,అమలుపరుచుతాం. |
07:18 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
07:20 | ఈ ట్యుటోరియల్ లో ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ ను సృష్టించడం ప్రాజెక్ట్ కి క్లాస్ ను జత చేయడం, జావా సోర్స్ కోడ్ ను వ్రాయడం మరియు అమలుపరచడం అనే విషయాలు తెలుసుకున్నాం. |
07:33 | అసైన్మెంట్ గా, డిస్ప్లే పేరుతో ఒక ప్రాజెక్ట్ నిర్మించండి. |
07:38 | తరువాత Display కు, welcome అనే క్లాస్ ను జతచేయండి. |
07:44 | స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో ను చూడగలరు. |
07:50 | ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం ఇస్తుంది. |
07:53 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:58 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
07:59 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ lanuనిర్వహిస్తుంది. |
08:02 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
08:05 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:12 | స్పోకెన్ టుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
08:17 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:23 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. |
08:27 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు swami. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |