Inkscape/C2/Text-tool-features/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 10:53, 18 June 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Text tool features అను Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం వీటి గూర్చి నేర్చుకుంటాం, |
00:09 | మేన్యువల్ కెర్నింగ్, స్పెల్ చెకింగ్ (స్పెల్లింగ్ చెక్ చేయడం) |
00:12 | సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్. |
00:15 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను- |
00:17 | Ubuntu Linux12.04 OS |
00:20 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:24 | నేను ఈ ట్యుటోరియల్ ను గరిష్ట రిజొల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తాను.ఇది ప్రదర్శించబడే అన్ని టూల్స్ కు స్థానం కల్పిస్తుంది. |
00:33 | Inkscape ను తెరుద్దాం. |
00:35 | ఈ సిరీస్ లో ఇంతకు ముందు, మనం Text tool ను ఉపయోగించి టెక్స్ట్ ను రూపొందించడం మరియు ఫార్మాట్ చేయడం నేర్చుకున్నాం. |
00:40 | ఇప్పుడు,మనం Text tool యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాల గూర్చి నేర్చుకుంటాం. దానిపై క్లిక్ చేయండి. |
00:45 | Manual kerning తో ప్రారంభిద్దాం. |
00:48 | Horizontal kerning,Vertical shift మరియు Character rotation వీటిని manual kerns అని పిలుస్తారు. |
00:54 | Spoken అనే పదాన్ని టైప్ చేయండి. |
00:58 | Sఅక్షరం తరువాత కర్సర్ ను ఉంచండి. |
01:01 | Horizontal kerning, ఎంచుకోబడిన అక్షరం తరువాత ఖాళీని జోడిస్తుంది. |
01:05 | అక్షరాలు S మరియు p మధ్య ఖాళీని పెంచడానికి లేదా తగ్గించడానికి అప్ మరియు డౌన్ బాణాలు క్లిక్ చేయండి. |
01:13 | S మరియు p అక్షరాల మధ్య మాత్రమే, జోడించిన ఖాళీ ఉంటుంది గమనించండి. |
01:19 | Horizontal kerning పారామీటర్ ను నేను 3 గా ఉంచుతాను. |
01:24 | తరువాతి ఐకాన్, అనగా Vertical shift, ఇది అక్షరాలను ఎంచుకున్న అక్షరం తరువాత పైకి లేదా కిందికి మారుస్తుంది. |
01:30 | అప్ మరియు డౌన్ బాణాలు క్లిక్ చేయండి. |
01:34 | కర్సర్ తరువాత ఉన్న అక్షరాలు పైకి కిందికి మార్చబడ్డాయని గమనించండి. |
01:39 | పారామీటర్ ని 15గా ఉంచండి. |
01:42 | తరువాత, Character rotation ను ఉపయోగించి మనం మన అక్షరాలను రొటేట్ చేద్దాం. |
01:47 | ఈ ఐకాన్ కర్సర్ తరువాత వచ్చే అక్షరాన్ని మాత్రమే రొటేట్ చేస్తుంది. |
01:51 | కనుక, కర్సర్ ను e అక్షరానికి ముందు ఉంచండి. |
01:55 | Character rotation యొక్క అప్ మరియు డౌన్ బాణాలపై క్లిక్ చేసి, e అక్షరం రొటేట్ అవడం గమనించండి. |
02:02 | ఒకటి కంటే ఎక్కువ అక్షరాలకు kerns వర్తింపజేయడానికి, ముందుగా అక్షరాలను ఎంచుకుని ఆపై వాటికి విలువలు ఇవ్వండి. |
02:09 | నేను, అక్షరాలు p మరియు o లను ఎంచుకుంటాను మరియు వాటికి Horizontal kerning పారామీటర్ ను 5 గా, |
02:17 | Vertical shift పారామీటర్ ను 10 గా మరియు |
02:21 | Character rotation పారామీటర్ ను 20 గా ఇస్తాను. |
02:24 | మార్పులను గమనించండి. |
02:26 | kerns ను తొలగించటానికి, Text menu కు వెళ్ళండి. |
02:29 | Remove Manual Kerns పై క్లిక్ చేయండి. |
02:32 | Manual Kerns, Regular text లో మాత్రమే ఉపయోగించవచ్చు. |
02:35 | Flowed text లో, ఈ ఎంపికలు డిసేబుల్ అవుతాయి. |
02:39 | దానిని చెక్ చేయడానికి, ఒక text box ను సృష్టించండి. |
02:43 | Manual kerns ఎంపికలు ఇప్పుడు డిసేబుల్ అయ్యాయని గమనించండి. |
02:47 | ఈ చర్యను రద్దు చేయటానికి Ctrl + Z ను నొక్కండి. |
02:51 | తరువాత, మనం Spell check (స్పెల్లింగ్ చెక్ చేయడం) అనే లక్షణం గూర్చి నేర్చుకుంటాం. |
02:54 | Spell check లక్షణాన్ని వివరించడానికి, నేను LibreOffice writer లో ఇప్పటికే సేవ్ చేసియున్న దానినుండి టెక్స్ట్ ను కాపీ చేస్తాను. |
03:01 | మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి. తరువాత దానిని కాపీ చేయడానికి Ctrl + C ని నొక్కండి. |
03:08 | ఇప్పుడు Inkscape కు తిరిగి రండి. |
03:10 | టెక్స్ట్ ను పేస్ట్ చేయడానికి కేన్వాస్ పైన క్లిక్ చేయండి మరియు Ctrl + V ని నొక్కండి. |
03:15 | Text menu కి వెళ్ళి Check Spelling ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:19 | ఒక కొత్త డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:22 | మొత్తం టెక్స్ట్ అది ఎంపిక చేయబడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా తనిఖీ చేయబడుతుంది. |
03:27 | ఎప్పుడైనా ఒక అనుమానాస్పద పదం కనిపిస్తే, అది ఎరుపు రంగులో హైలైట్ చేయబడుతుంది మరియు కర్సర్ టెక్స్ట్ కి ముందు ఉంచబడుతుంది. |
03:33 | Http అనే పదం కొరకు ఒక సూచనల జాబితా కనిపిస్తుంది. |
03:37 | స్పెల్లింగ్ సరైనదే కనుక మనం ఆ పదాన్ని నిఘంటువుకు జోడిస్తాము. |
03:41 | ఆలా చేయటానికి, Add to Dictionary బటన్ పై క్లిక్ చేయండి. |
03:45 | ఇది ఆ పదం స్పెలింగ్ ఎల్లపుడు కరెక్ట్ గా వచ్చేలా చేయటానికి spell checker అంగీకరించేలా చేస్తుంది. |
03:50 | తరువాత, tutorial అనే పదం హైలైట్ అవుతుంది. |
03:53 | స్పెల్లింగ్ తప్పయినపుడు, ఏదయితే సూచనల జాబితా tutorial లో ఉందొ దానినుండి సరైన పదాన్ని ఎంచుకోండి. |
03:59 | ఇప్పుడు Accept బటన్ పై క్లిక్ చేయండి. |
04:02 | ఒకవేళ మీరు Ignore పై క్లిక్ చేస్తే, డాక్యుమెంట్ లో అదేవిధమైన స్పెల్లింగ్ తో ఉన్న అన్నిఇతర పదాలు ఇగ్నోర్ చేయబడతాయి. |
04:08 | ఒకవేళ మీరు Ignore once పై క్లిక్ చేస్తే, ఆ పదం ఒకే ఒక్కసారి ఇగ్నోర్( విస్మరించబడుతుంది) చేయబడుతుంది. అదీ మొదటిసారి మాత్రమే. |
04:14 | ఒకవేళ మీరు స్పెల్లింగ్ ను చెక్ చేసే ప్రక్రియను ఆపివెయ్యాలి అనుకుంటే, Stop పై క్లిక్ చేయండి. |
04:18 | మనం Start బటన్ పై క్లిక్ చేసి ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టవచ్చు. |
04:22 | స్పెల్లింగ్ ను చెక్ చేయడం అనేది ఎగువ కుడివైపు ఉన్న టెక్స్ట తో ప్రారంభమవుతుంది మరియు కేన్వాస్ పై పని చేస్తుంది. |
04:27 | ఇప్పుడు మనం ఈ dialog box ను మూసివేద్దాము మరియు ఈ టెక్స్ట్ ను ఒక పక్కన పెడదాము. |
04:32 | తరువాత,మనం Superscript మరియు Subscript రాయడం నేర్చుకుంటాం. |
04:36 | గణితసూత్రము (a+b)2 = a2+b2+2ab అని టైప్ చేయండి.(a + b మొత్తం వర్గం అనేది a వర్గం, b వర్గం మరియు 2ab ల మొత్తానికి సమానం). |
04:44 | మనము నంబర్ 2 ను వర్గం గా మూడు స్థానాలలో మార్చవలసి ఉంటుంది. |
04:48 | మొదటి 2 ను ఎంచుకోండి.Tool controls bar కి వెళ్ళి Toggle, Superscript ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:56 | ఇదే విధంగా, మిగిలిన 2 లు మార్చండి. |
04:59 | తరువాత, మనం సబ్ స్క్రిప్ట్‌ను ఉపయోగించి ఒక రసాయన సూత్రాన్ని రాద్దాం. |
05:04 | కనుక, H2SO4 అని టైప్ చేయండి. |
05:07 | ఇక్కడ 2 మరియు 4 లను సబ్స్క్రిఫ్ట్ గా రాయాలి. |
05:11 | ముందు 2 ను ఎంచుకోండి. Tool controls bar కి వెళ్ళి Toggle, Subscript ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:17 | ఇదేవిధంగా, 4ను మార్చండి. |
05:19 | సారాంశం చూద్దాం. |
05:21 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- |
05:24 | మేన్యువల్ కెర్నింగ్, స్పెల్ చెకింగ్ (స్పెల్లింగ్ ని చెక్ చేయడం) |
05:26 | సూపర్ స్క్రిప్ట్ మరియు సబ్ స్క్రిప్ట్ |
05:29 | ఇక్కడ మీకోసం 2 అసైన్మెంట్ లు- |
05:31 | How are you అనే టెక్స్ట్ ను రాయండి మరియు దాని ఫాంట్ సైజు ను 75 కు మార్చండి. |
05:36 | w కి తర్వాత కర్సర్ ను ఉంచండి. Horizontal kerning పారామీటర్ ను -20 కి మార్చండి. |
05:42 | are అనే పదాన్ని ఎంచుకోండి. Vertical shift పారామీటర్ ను 40 కి మార్చండి. |
05:47 | you అనే పదాన్ని ఎంచుకోండి.Character rotation పారామీటర్ ను-30 కి మార్చండి. |
05:52 | Sub-script మరియు Super-script ఎంపికలను ఉపయోగించి కిందన ఉన్న ఫార్ములాలను (సూత్రాలను)వ్రాయండి. |
05:57 | Silver sulfate - Ag₂SO₄. |
06:00 | a2−b2=(a−b)(a+b) |
06:06 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
06:09 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
06:15 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
06:22 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
06:24 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
06:30 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
06:34 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:36 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |