Inkscape/C2/Align-and-distribute-objects/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Align and distribute objects అను Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి- |
00:09 | వివిధ ఆబ్జెక్ట్ లను సమలేఖనం మరియు పంపిణీ చేయడం. |
00:12 | ఆబ్జెక్ట్ లను అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చడం |
00:16 | ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని సర్దుబాటు చేయడం మరియు ఒక టైల్ పాటర్న్ ను సృష్టించడం. |
00:22 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను- |
00:24 | Ubuntu Linux 12.04 OS |
00:27 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:31 | Dash home కి వెళ్ళి Inkscape అని టైప్ చేయండి. |
00:35 | logo పై క్లిక్ చేయండి. |
00:37 | నేను ఇప్పటికే సేవ్ చేసియున్న Inkscape డాక్యుమెంట్ ను తెరుస్తాను. |
00:44 | ఇక్కడ మనం కేన్వాస్ పైన యాదృచ్చికంగా ఉంచిన 5 విభిన్న ఆకారాలను చూడవచ్చు. |
00:50 | మీ Inkscape కేన్వాస్ పై, దయచేసి ఈ 5 ఆకారాలను గీయండి మరియు ఇక్కడ చూపిన విధంగా వాటిని ఉంచండి. |
00:55 | ఇప్పుడు, ఆబ్జెక్ట్ లను క్రమపరచడం ప్రారంభిద్దాం. |
00:59 | Object మెనూ కి వెళ్ళి Align and Distribute పై క్లిక్ చేయండి. |
01:04 | interface యొక్క కుడివైపున Align and Distribute డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
01:09 | రెండు రకాల స్థానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. |
01:12 | Align అనేది ఆబ్జెక్ట్ ల కేంద్రాలు లేదా అంచులను ఒక దానితో ఒకటి సమలేఖనం చేస్తుంది. |
01:18 | Distribute అనేది ఆబ్జెక్ట్ లను (క్షితిజ సమాంతర) అడ్డు లేదా నిలువు దిశలో వాటి కేంద్రాలు లేదా అంచులపై ఆధారపడి పంపిణి చేస్తుంది. |
01:29 | మనం ఈ ఎంపికలను మరియు వాటి ఉప-ఎంపికలను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను వివిధ పద్దతులలో సమలేఖనం చేయవచ్చు. |
01:36 | ఇక్కడ మరొక ముఖ్యమైన లక్షణం, Relative to ఉంది. |
01:39 | దీన్ని ఉపయోగించి, మనం ఆబ్జెక్ట్ లను ఏదయినా విషయానికి సమన్వయం చేస్తూ క్రమపరచవచ్చు. |
01:44 | ఇక్కడ ఉన్న ఎంపికలను చూడడానికి డ్రాప్-డౌన్ జాబితాపై క్లిక్ చేయండి. |
01:47 | కనుక, మనం Last selected, First selected, Biggest object, Smallest object, Page, Drawing మరియు Selection లను కలిగియున్నాము. |
02:00 | అప్రమేయంగా, ఆబ్జెక్ట్ లు Page కి సంబంధించి సమలేఖనం చేయబడతాయి. |
02:04 | అంటే ఎంచుకోబడిన ఆబ్జెక్ట్ లు మీ Page కొలతలకు అనుగుణంగా Align and Distribute ఆపరేషన్స్ కు స్పందిస్తాయి. |
02:13 | canvas పైన అన్ని ఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి Ctrl + A ని నొక్కండి. |
02:17 | మొదటి 5 చిహ్నాలు నిలువు దిశలో ఆబ్జెక్ట్ లను సమలేఖనం చేస్తాయి. |
02:22 | నేను మొదటి ఐకాన్ పై క్లిక్ చేస్తాను. |
02:25 | టూల్ టిప్ చెప్పినట్లుగా, ఆబ్జెక్ట్ ల యొక్క కుడి అంచులు అనేవి anchorయొక్క ఎడమ అంచుకు సమలేఖనం అవుతాయి. |
02:32 | దయచేసి గుర్తుంచుకోండి, Relative to ఎంపిక ఒక Page అయినట్లే, ఇక్కడ anchor point అనేది కూడా ఒక page అవుతుంది. |
02:38 | రెండు ఆబ్జెక్ట్ లు ఇప్పుడు ఒకదానితో మరొకటి అతిపాతం అయ్యాయని గమనించండి. |
02:43 | గత అమరికలో వస్తువుల సన్నిహితం పై ఆధారపడి ఓవర్లాప్ సంభవించవచ్చు. |
02:48 | మనం దీనిని Distribute ఎంపిక కిందనయున్న Remove overlaps ఎంపికపై క్లిక్ చేసి సరిచేయవచ్చు. |
02:56 | ఇప్పుడు, అతిపాతం తొలగించబడింది. |
02:58 | ఆబ్జెక్ట్ ల మధ్య సమాంతర మరియు నిలువు దిశలలో అంతరాలను సర్దుబాటుచేయడానికి, H మరియు V ఎంపికలను ఉపయోగించండి. |
03:06 | ఇప్పుడు, Align కింద ఉన్న ఎంపికలపై క్లిక్ చేసి, ఆబ్జెక్ట్ లు ఏ విధంగా సమలేఖనం చేయబడతాయో గమనించండి. |
03:14 | అమరికను సరిగ్గా అర్థం చేసుకోవడానికి undo ఎంపిక CTRL + Z ను ఉపయోగించండి. |
03:21 | అమరికను అర్థం చేసుకొనుటకు టూల్ టిప్స్ (చిట్కాలు) చాలా ఉపయోగకరంగా ఉంటాయి. |
03:28 | చివరి ఐకాన్ టెక్స్ట్ ల పైన మాత్రమే పని చేస్తుంది.కనుక మనం దీని గూర్చి వేరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం. |
03:35 | తరువాత, మనం Distribute ఎంపికను ఉపయోగించి ఆబ్జెక్ట్ లలోని ఖాళీలను సర్దుబాటు చేద్దాం. |
03:40 | ఆబ్జెక్ట్ లు నిలువు దిశలో ఉన్నందున, మనం Distribute ఎంపిక కింద చివరి నాలుగు చిహ్నాలను ఉపయోగించాలి. |
03:48 | నేను వాటిని ముందు, మధ్య కు సమలేఖనం చేస్తాను. |
03:51 | ఇప్పుడు, Distribute కింద ఉన్న ఎంపికలపై క్లిక్ చేసి, ఆబ్జెక్ట్ లు ఎలా వాటంతట అవే సమలేఖనం అవుతాయో గమనించండి. |
03:58 | మరొక్క సారి undo ఎంపిక CTRL + Z ను ఉపయోగించి అమరిక గురించి బాగా అర్ధం చేసుకోవచ్చు |
04:07 | అమరికను పూర్తిగా అర్థంచేసుకోవటంలో సహాయం కొరకు టూల్ టిప్స్ ని చూడండి. |
04:13 | Relative to కింద,Treat selection as group అనే ఒక ఎంపిక ఉందని గమనించండి. |
04:19 | ఇది మొత్తం ఆబ్జెక్ట్ లను ఒక పూర్తి సమూహంగా క్రమపరుస్తుంది. |
04:22 | చెక్ -బాక్స్ పై క్లిక్ చేయండి. |
04:24 | ఇప్పుడు, ఒకదాని తరువాత ఒక ఐకాన్ పై క్లిక్ చేసి ఆబ్జెక్ట్ లు ఒక సమూహంగా చేయండి మరియు అవి క్రమపర్చబడ్డాయి, విడివిడిగా కాదు అని గమనించండి. |
04:34 | బాక్స్ ను అన్ చెక్ చేద్దాం. |
04:36 | ఇప్పుడు, ఆబ్జెక్ట్ లు ఒక్కొక్కటిగా క్రమపర్చబడతాయి. |
04:40 | తరువాత, మనం ఆబ్జెక్ట్ లను Last selected కు అనుగుణంగా సమలేఖనం మరియు పంపిణి చేద్దాం. |
04:45 | Relative to ఎంపికను Last selected గా మార్చండి. |
04:49 | దానికోసం, canvas లోపలి అన్ని ఆబ్జెక్ట్ లను తీసుకువచ్చి వాటిని యాదృచ్చికంగా ఉంచండి. |
05:01 | ఆబ్జెక్ట్ లను ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకోండి. వృత్తాన్ని చివరకు ఎంచుకోండి. |
05:06 | ఆబ్జెక్ట్ లను ముందులాగే ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకోండి. |
05:10 | చివరగా ఎంచుకోబడింది వృత్తం గనక, ఆబ్జెక్ట్ లు వృత్తానికి అనుగుణంగా క్రమపర్చబడ్డాయని గమనించండి. |
05:19 | అదేవిధంగా, మీరు Relative to జాబితాలో ఉన్న అన్ని ఎంపికలను ప్రయత్నించవచ్చు మరియు ఆబ్జెక్ట్ ల అమరికను గమనించవచ్చు. |
05:26 | మనం తరువాతి ట్యుటోరియల్స్ లో, Align and Distribute డైలాగ్ బాక్స్ లోని అధునాతన ఎంపికల గూర్చి నేర్చుకుంటాము. |
05:32 | కనుక, మనం ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. |
05:37 | తరువాత, మనం ఆబ్జెక్ట్ లను అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చడం నేచుకుంటాం. |
05:41 | Object మెనూ కి వెళ్ళండి. |
05:43 | Rows and Columns పై క్లిక్ చేయండి. |
05:46 | Rows and Columns డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
05:50 | ఈ ఎంపికను ఉపయోగించి, మనం ఆబ్జెక్ట్ లను కావలసినంత ఖాళీని ఇచ్చి అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చవచ్చు. |
05:57 | canvas పైన ఆబ్జెక్ట్ లను యాదృచ్చికంగా అమర్చండి. |
06:01 | ఇప్పుడు, ఆబ్జెక్ట్ లను 2 అడ్డు వరుసలు మరియు 3 నిలువు వరుసలలో అమర్చుదాం. |
06:05 | అయితే, Row పారామీటర్ ను2 కు మార్చండి. |
06:09 | గమనించండి- Row పారామీటర్ మారినపుడు, Column పారామీటర్ కూడా స్వయంచాలకంగా మారుతుంది. |
06:15 | దిగువ కుడివైపు ఉన్న Arrange బటన్ పై క్లిక్ చేయండి. |
06:19 | Align ఎంపిక, ఆబ్జెక్ట్ లను, కుడివైపు కు, మధ్యలోకి మరియు ఎడమవైపుకు సమలేఖనం చేయడానికి సహాయం చేస్తుంది. |
06:29 | వాటిని ఒకదాని తర్వాత ఒకటిని చెక్ చేయండి మరియు మార్పులను గమనించండి. |
06:37 | Set spacing ఎంపికను ఉపయోగించి మనం అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల కొరకు, ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని సర్దుబాటుచేయవచ్చు. |
06:45 | ఇప్పుడు, అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల కొరకు స్పేస్ పారామీటర్ ను 5 గా మార్చండి. |
06:50 | Arrange బటన్ పై క్లిక్ చేయండి. |
06:53 | ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని గమనించండి. |
06:56 | నేను మీకు Align and Distribute ను ఉపయోగించి ఒక పాటర్న్ ని ఎలా సృష్టించాలో చూపిస్తాను. |
07:01 | నా వద్ద ఒక కొత్త Inkscape ఫైల్లో భిన్నమైన పరిమాణాలు మరియు రంగులతో కూడిన నాలుగు చతురస్రాలు ఉన్నాయి. |
07:06 | అన్ని చతురస్రాలు ఎంచుకొని వాటిని తిప్పండి, అవి చూడటానికి డైమండ్ ఆకారంలో కనిపించాలి. |
07:12 | Align and Distribute డైలాగ్ బాక్స్ ను తెరవండి. |
07:15 | Centre on vertical axis పై క్లిక్ చేయండి. |
07:18 | Centre on horizontal axis పై క్లిక్ చేయండి. |
07:22 | ఒక tile పాటర్న్ ఇప్పుడు కేన్వాస్ పై ఏర్పడుతుంది. |
07:25 | సృజనాత్మకంగా ఈ ఎంపికలను ఉపయోగించడం వల్ల, మనం అనేక ప్రత్యేకమైన (పాటర్న్స్) నమూనాలను రూపొందించవచ్చు. |
07:30 | సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
07:34 | వివిధ ఆబ్జెక్ట్ లను సమలేఖనం మరియు పంపిణీ చేయడం. |
07:37 | ఆబ్జెక్ట్ లను అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చడం |
07:40 | ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని సర్దుబాటు చేయడం మరియు ఒక టైల్ పాటర్న్ ను సృష్టించడం. |
07:45 | ఇక్కడ మీకోసం 2 అసైన్మెంట్లు, |
07:47 | కింద సూచించిన కొలతలు ఉండేలా 5 వృత్తాలను రూపొందించండి. |
07:54 | వాటిని కేన్వాస్ పైన యాదృచ్చికంగా సర్దుబాటుచేసి అన్నిటిని ఎంచుకోండి. |
07:59 | Align and Distribute ను ఉపయోగించి Relative to ఎంపికను Biggest object కు మార్చండి. |
08:04 | Align left edges పై క్లిక్ చేయండి. |
08:06 | Centre on horizontal axis పై క్లిక్ చేయండి. |
08:10 | 100 * 100 పిక్సల్స్ కొలతతో నీలం రంగులో 6 చతురస్రాలు రూపొందించండి. |
08:17 | అన్ని చతురస్రాలు ఎంచుకుని Rows and columns ను తెరవండి. |
08:21 | వాటిని 2 అడ్డు వరుసలు మరియు 3 నిలువు వరుసలలో అమర్చండి. |
08:25 | నిలువు మరియు సమాంతర స్పేస్ పారామీటర్ లను 20 కి సెట్ చేయండి. |
08:29 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
08:35 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
08:43 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
08:51 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
08:54 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
09:03 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:07 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:09 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |