Git/C2/Stashing-and-Cleaning/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:14, 8 September 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Git లో ని Stashing and cleaning పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనము stashing గురించి నేర్చుకుందాము. |
00:11 | మనము stash ని సృష్టించడం, stash ని వర్తింప చేయడం మరియు stash ని క్లీన్ చేయడం నేర్చుకుంటాము |
00:19 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 14.04 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తాము |
00:32 | మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
00:36 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Git commands మరియు Git లోని branching గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:43 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:48 | ఇప్పుడు stashing గురించి నేర్చుకుందాము |
00:51 | branch యొక్క తాత్కాలిక మార్పులను save చేయడానికి stashing ని ఉపయోగిస్తారు. |
00:57 | Branches మారినప్పుడు,ప్రస్తుత పనులకు commit అవ్వకుండా pause చేయటానికి సహాయపడుతుంది. |
01:04 | తాత్కాలిక మార్పుల యొక్క Stash ను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. |
01:08 | ఈ tutorial series లో ఇంతకు ముందే మనం stash పదం గురించి తెలుసుకొని ఉన్నాము. |
01:16 | ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం |
01:20 | ముందుగా terminal ను ఓపెన్ చేద్దాం |
01:25 | మనం ముందే సృష్టించిన Git repository mywebpage ను ఓపెన్ చేద్దాం |
01:30 | Cd space mywebpage అని టైప్ చేసి Enter నొక్కండి |
01:35 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. మీరు మీకు నచ్చిన ఫైల్ టైప్ ను ఉపయోగించవచ్చు. |
01:44 | ఇక్కడ నుంచి, Terminal లో ప్రతి command టైప్ చేసిన తర్వాత Enter ని నొక్కాలి అని గుర్తించుకొనండి. |
01:52 | ముందుగా, మనము git space branch టైప్ చేయడం ద్వారా branch list తనిఖీ చేస్తాము. |
01:58 | నేను ఇప్పటికే chapter-three అనే పేరు గల branch ను సృష్టించాను. |
02:03 | నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో commit చేశాను |
02:08 | దయచేసి మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల commit చెయ్యండి. |
02:15 | మనము Git space checkout space chapter-three టైప్ చేయడం ద్వారా branch chapter-three లో కి వెళ్తాము |
02:23 | ఇప్పుడు Git log ని తనిఖీ చేద్దాము. |
02:26 | ఇది ప్రదర్శన కోసం chapter-three శాఖలో నేను చేసిన commit . |
02:31 | ls టైప్ చేయడం ద్వారా ఫోల్డర్ కంటెంట్‌ను తనిఖీ చేద్దాం |
02:35 | మీరు Windows ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంటే, ls కమాండ్ స్థానంలో dir కమాండ్ ను ఉపయోగించండి. |
02:43 | ఇక్కడ మనకు మూడు html ఫైల్స్ ఉన్నాయి |
02:47 | ఇప్పుడు, mypage.html అనే ఫైలుపై కొన్ని మార్పులు చేస్తాము. |
02:53 | మనము gedit space mypage.html space ampersand టైప్ చేయడం ద్వారా mypage.html ఫైల్ ను ఓపెన్ చేద్దాము. |
03:03 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొన్ని లైన్ లను copy చేసి ఈ ఫైల్ లో కి paste చేస్తాను. |
03:11 | తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి. |
03:14 | Git status, ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి. |
03:19 | మన మార్పులు ఇంకా ప్రదర్శించబడలేదని మనం అర్థం చేసుకోవచ్చు. |
03:24 | మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ branches మారవలసి ఉంటుంది. |
03:30 | ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన master branch కు తిరిగి వెళ్ళాలి అనుకొన్నాం . |
03:37 | git space checkout space master అని టైప్ చేయండి. |
03:41 | ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర branches కు వెళ్ళలేమని చూపిస్తుంది. |
03:48 | నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను commit చేయలేను. |
03:55 | hyphen hyphen force flag ఉపయోగించి ఈ బ్రాంచ్ నుండి బలవంతంగా బయటకు వస్తే, మార్పులు విస్మరించబడతాయి. |
04:04 | కానీ, నేను తాత్కాలికంగా మార్పులను save చేయాలనుకుంటే? ఇది Stashing ఉపయోగించి చేయబడుతుంది. |
04:11 | git space stash space save space డబుల్ కోట్ లలో Stashed mypage.html అని టైప్ చేసి మనము తాత్కాలికంగా మార్పులను సేవ్ చేసుకోవచ్చు. |
04:24 | ఇక్కడ, Stashed mypage.html అనునది నేను ఇచ్చిన stashపేరు. మీ ప్రాధాన్యత ప్రకారం మీరు దీనికి పేరు పెట్టవచ్చు. |
04:34 | టెర్మినల్ లో, stashపేరు మరియు branch పేరు, stashసృష్టించబడిన చోటు ప్రదర్శించబడతాయి. |
04:42 | git space status టైప్ చేయడం ద్వారా మనము Git status ను తనిఖీ చేస్తాము. మీరు Nothing to commit అనే సందేశాన్ని చూస్తారు |
04:51 | కాబట్టి, ఇప్పుడు branches మారవచ్చు. |
04:55 | ఇప్పుడు, git space checkout space master టైప్ చేయడం ద్వారా master branch లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. |
05:03 | Stashing తరువాత, మనము ఇతర శాఖలకు మారవచ్చు అని గమనించండి |
05:07 | తరువాత, stashing కు మరొక మార్గం చూద్దాము. |
05:11 | దాని కోసం, మళ్ళీ నేను git space checkout space chapter-three టైప్ చేసి chapter-three శాఖ లో కి వెళ్తాను |
05:20 | నేను ఇప్పుడు Gedit space history.html space ampersand టైప్ చేసి history.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను. |
05:31 | నేను ఇక్కడ నా Writer డాక్యూమెంట్ నుండి కొన్ని పంక్తులను చేర్చుతాను . |
05:35 | తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయాలి |
05:38 | Git space status టైప్ చేయడం ద్వారా Git status ని తనిఖీ చేయవచ్చు |
05:44 | ఉదాహరణకు, stash లో , నేను ఈ మార్పులను మరొక విధంగా సేవ్ చేయాలనుకుంటే git space stash అని టైప్ చేయాలి |
05:54 | ఇక్కడ stash పేరు ఇవ్వలేదు అని గమనించండి |
05:58 | మనము stash పేరు ఇవ్వకపోతే, stash తాజా commit పేరుతో సేవ్ చేయబడుతుంది. |
06:04 | తరువాత, stash పేరు మరియు తాజా commit ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాము. |
06:10 | మొదటగా Git log తనిఖీ చేదాం. |
06:14 | stash జాబితాను తనిఖీ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి . |
06:20 | మీరు తాజా commit మరియు తాజా stash ఒకే పేరుతో చూడవచ్చు |
06:25 | తాజా statsh మొదటి జాబితాలో ఉంది దీని బట్టి stashes కాలక్రమానుసారంగా ఉంటాయని తెలుసుకోవచ్చు |
06:35 | ఈ stash id స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది. |
06:40 | నేను ప్రదర్శించడం కోసం మరో stash సృష్టిస్తాను. |
06:45 | దాని కోసం నేను gedit space story.html space ampersand అని టైప్ చేసి story.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను. |
06:55 | నేను story.html కు కొన్ని పంక్తులను జోడిస్తాను. |
07:00 | తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయండి |
07:03 | ఇప్పుడు stash లో చేసిన మార్పులను సేవ్ చేస్తాను |
07:07 | git space stash space save space డబల్ కోట్స్ లో stashed story.html అని టైప్ చేయండి |
07:17 | git space stash space list అని టైప్ చేసి stash list ను తనిఖీ చేయవచ్చు |
07:24 | chapter-three branch లో మనకుఇప్పుడు మూడు stashes ఉండటాన్ని చూడవచ్చు. |
07:30 | కొన్ని సందర్భాల్లో, మనము stashes లో ఏ మార్పులను సేవ్ చేసామో గుర్తుంచుకోలేము. |
07:36 | దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం |
07:40 | ఉదాహరణకు చెప్పాలంటే నేను stash@{0} యొక్క వివరాలను చూడాలనుకుంటున్నాను |
07:45 | కాబట్టి git space diff space stash at the rate (@) symbol కర్లీ బ్రేసెస్ లోపల zero అని టైప్ చేయండి |
07:54 | మనం stash@{0} లో సేవ్ చేసిన story.html యొక్క మార్పులను చూడవచ్చు. |
08:01 | తరువాత, మనము stashed files పై పనిచేయడం కొనసాగిద్దాం |
08:06 | దీనికోసం, మనము మొదటిగా stashes వర్తింప చేయాలి. |
08:10 | stash list ను చెక్ చేయడానికి : git space stash space list అని టైప్ చేయండి |
08:17 | ఉదాహరణకు, ఇప్పుడు మనము stash @ {1} ను వర్తింప చేద్దాం. |
08:21 | అలా చేయడానికి, git space stash space apply space stash @ కర్లీ బ్రేసెస్ లోపల 1అని టైప్ చేయండి |
08:33 | ఒకవేళ మీరు stash id పేర్కొనకపోతే,latest stash అనగా stash@{0} వర్తింపజేయబడుతుంది. |
08:40 | మన stash విజయవంతంగా వర్తించబడిందని మీరు చూడవచ్చు. |
08:44 | మనం stash list ని git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం. |
08:51 | మనం జాబితాలో ఇప్పటికీ stash @ {1} ను చూడవచ్చు మరియు ఇది భవిష్యత్తులో అయోమయానికి దారి తీయవచ్చు. |
08:58 | కాబట్టి stash వర్తించిన తరువాత అది పద్ధతి గా తొలగించటం మంచిది. |
09:03 | stash@{1} ని తొలగించడానికి git space stash space drop space stash@ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి. |
09:16 | stash list ని చెక్ చేయడానికి : git space stash space list అని టైప్ చేయండి. |
09:22 | ఇప్పుడు మనం stash@{1} తొలగించబడడాన్ని చూడవచ్చు, మరియు stash@{2} stash@{1} గా మారుతుంది. |
09:30 | ఇప్పుడు మనం వేరే మార్గం లో stash ని వర్తింప చేసి చూద్దాం. git space stash space pop అని టైప్ చేయండి. |
09:39 | మన stash@{0} వర్తింపబడటాన్ని మనం చూడవచ్చు. |
09:43 | కాబట్టి,మనము stash pop కమాండ్ని ఉపయోగించిన , ఇటీవలే వాడుతున్న stash (i.e) అనగా stash@{0} వర్తింపబడుతుంది. |
09:52 | మళ్ళీ మనం stash list ని git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం. |
09:59 | ఇప్పుడు మనం stash@{0} తొలగించబడడాన్ని చూడవచ్చు మరియు stash@{1} stash@{0} గా మారుతుంది. |
10:07 | కాబట్టి అనే stash pop కమాండ్ stash@{0} కు వర్తింప చేస్తుంది మరియు దానిని తొలగిస్తుంది. |
10:15 | తరువాత మనం అన్నిstashes ను ఒకేసారి ఎలా తొలగించాలో తెలుసుకుందాం |
10:20 | మన రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించడానికి git space stash space clear అని టైప్ చేయండి. |
10:28 | మళ్ళీ మన stash list ని git space stash space list అని టైప్ చేసి చెక్ చేద్దాం. |
10:36 | ఇప్పుడు మన stash లిస్ట్ ని ఖాళీగా ఉండటాన్ని మనం చూడవచ్చు. |
10:40 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము |
10:44 | ట్యుటోరియల్ సారాంశం. |
10:46 | ఈ ట్యుటోరియల్ లో మనం Stashing గురించి నేర్చుకున్నాము. |
10:51 | ఇంకా మనం stash ని క్రియేట్ చేయడం, stash వర్తింప చేయడం మరియు stash ను క్లీన్ చేయడం గురించి కూడా నేర్చుకున్నాము. |
10:58 | ఒక అసైన్మెంట్ గా మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి . |
11:03 | git stash show కమాండ్ ని అన్వేషించండి. |
11:07 | git stash show మరియు git stash show stash@{1} కమాండ్స్ ల మధ్య తేడాను అర్ధం చేసుకోండి. |
11:14 | కొత్త stash ను వర్తింపచేయండి. ( git stash pop ఉపయోగించుకోండి.) |
11:21 | మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint – git stash clear )అని టైప్ చేయండి. |
11:28 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:36 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:48 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:55 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:01 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. ధన్యవాదాలు. |