GChemPaint/C2/Basic-operations/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:27, 23 May 2017 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో బేసిక్ ఆపరేషన్స్ (Basic Operations in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
00:11 ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
00:14 టెక్స్ట్ ను జోడించడం మరియు సవరించడం.
00:17 ఆబ్జక్ట్స్ ను మూవ్ (కదపటం), ఫ్లిప్ (కుదపటం) మరియు రొటేట్ చేయడం.
00:21 ఆబ్జక్ట్స్ ను సమూహము (group) మరియు సమలేఖనం చేయడం.
00:25 ఆబ్జక్ట్స్ ను కట్, కాపీ, పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
00:30 ఇక్కడ నేను,
00:32 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:36 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:42 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:48 GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్.
00:52 తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:58 ఒక కొత్త GchemPaint(జికెంపెయింట్) అప్లికేషన్ తెరవడానికి,
01:01 డాష్ హోం(Dash home) పై క్లిక్ చేయండి.
01:04 కనిపించే సెర్చ్ బార్ లో GChemPaint(జికెంపెయింట్) అని టైపు చేయండి.
01:08 GChemPaint(జికెంపెయింట్) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
01:12 ఇప్పటికే ఉన్న ఫైలును తెరవడం ద్వారా ట్యుటోరియల్ని ప్రారంభిచుదాం.
01:16 ఫైల్(File) మెను పై క్లిక్ చేయండి.
01:20 ఓపెన్ ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి.
01:24 ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగిన ఒక విండో తెరుచుకుంటుంది.
01:29 ఇక్కడ నుండి, ప్రొపేన్ అనే ఫైలు ను ఎంచుకోండి.
01:32 ఫైలు తెరవడానికి, ఓపెన్ పై క్లిక్ చేయండి.
01:36 ప్రొపేన్ నిర్మాణం క్రింద కొంత టెక్స్ట్ చేర్చుదాం.
01:42 టూల్ బాక్స్ నుండి యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify a text) టూల్ ను ఎంచుకోండి.
01:47 టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది.
01:50 ప్రాపర్టీ పేజీలో - ఫ్యామిలీ(Family), స్టైల్, సైజు, అండర్లైన్, మరియు కొన్ని ఇతర రంగాలు (fields) వున్నవి.
02:02 ఫ్యామిలీ (Family) ఫాంట్ పేర్ల జాబితాను కలిగి ఉన్నది.
02:06 జాబితా ను క్రిందికి జరుపుదాం.
02:11 ఫ్యామిలీ(Family) నుండి ఏరియల్ బ్లాక్ (Arial Black) ఎంచుకుంటాను.
02:15 ప్రొపేన్ నిర్మాణం క్రింద ఉన్న డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి.
02:20 ఆకుపచ్చ బాక్స్ లో రెప్పపాటు చేసే కర్సర్ ను చూడగలరు.
02:25 ఇప్పుడు ప్రొపేన్ గా కాంపౌండ్ పేరు టైప్ చేద్దాం.
02:32 ఇప్పుడు స్టయిల్ ను బోల్డ్ ఇటాలిక్ కు మార్చుదాం.
02:35 ప్రొపేన్ టెక్స్ట్ ఎంచుకోని బోల్డ్ ఇటాలిక్ క్లిక్ చేయండి .
02:42 అక్షర పరిమాణాన్ని 16 కు పెంచుతాను
02:46 16 వరకు స్క్రోల్ చేసి,
02:48 దానిపై క్లిక్ చేయండి.
02:50 టెక్స్ట్ లో మార్పులు గమనించండి.
02:53 తరువాత, అండర్లైన్ ఫీచర్ ను ఉపయోగిద్దాం.
02:57 ఇందులో ఎంపికల తో ఒక డ్రాప్ డౌన్ జాబితా ఉంది.
03:00 నన్(None), సింగిల్(Single),
03:02 డబుల్ (Double), మరియు లో(Low),
03:05 సింగిల్ ను ఎంచుకోండి.
03:09 టెక్స్ట్ యొక్క రంగు మార్చుదాం.
03:12 టెక్స్ట్ యొక్క డిఫాల్ట్ రంగు బ్లాక్.
03:16 కలర్ ఫీల్డ్ యొక్క డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి.
03:20 మీరు ఇక్కడ వివిధ రంగులు చూడగలరు.
03:24 నేను పర్ఫుల్ రంగు ను ఎంచుకొంటున్నాను.
03:28 టెక్స్ట్ యొక్క స్థానం కూడా మార్చవచ్చు.
03:32 పొజిషన్ ఫీల్డ్ -100 నుండి 100 శ్రేణిని కలిగి ఉంది .
03:37 టెక్స్ట్ ఎలా మారుతుందో చూద్దాం.
03:40 టెక్స్ట్ ని ఎంచుకోండి.
03:44 మౌస్ తో పైకి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.
03:48 టెక్స్ట్ పైకి కదులుతుంది.
03:50 అదే విధంగా క్రిందికి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.టెక్స్ట్ క్రిందికి కదులుతుంది.
03:59 టెక్స్ట్ ను సాధారణ స్థానంకు తీసుకొని వద్దాం.
04:02 పొజిషన్ రంగంలో 0(సున్నా) టైప్ చేయండి,
04:05 డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి.
04:09 మీకు ఒక అసైన్మెంట్.
04:12 మొదటి ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ ను తెరవండి .
04:15 ఎన్-హెక్సేన్ మరియు ఎన్-ఆక్టేన్ గా నిర్మాణాలకు లేబుల్ ఇవ్వండి.
04:19 టెక్స్ట్ యొక్క ఫాంట్ పేరు మరియు ఫాంట్ పరిమాణం మార్చి, టెక్స్ట్ ను అండర్లైన్ చేసి రంగు మార్చండి.
04:26 మీకు ఇచ్చిన అసైన్మెంట్ (assignment) పూర్తి చేస్తే ఇలా ఉంటుంది.
04:31 ఇప్పుడు ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోవడం మరియు తరలించడం తెలుసుకొందాం .
04:35 టూల్ బాక్స్ నుండి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
04:42 పెంటేన్ పై క్లిక్ చేయండి.
04:44 మౌస్ బటన్ ని వదలకుండా , దానిని వేరొక స్థానానికి లాగండి .
04:49 ఇప్పుడు, మౌస్ ను వదలండి.
04:52 తదుపరి ఒక అబ్జక్ట్ ను రొటేట్ చేద్దాం.
04:55 ఆబ్జక్ట్ (object) ను త్రిప్పుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి.
05:01 ప్రాపర్టీస్ పేజీ లో ఉన్న టూల్స్ ఏమనగా,
05:05 ఫ్లిప్ ది సెలక్షన్ హారిజాన్ టల్లి (Flip the selection horizontally),
05:08 ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically),
05:10 రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) .
05:13 ఈ టూల్స్ వాడడానికి,
05:14 పెంటేన్ పై క్లిక్ చేయండి.
05:17 రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection)ఎంపిక ను ఎంచుకోండి.
05:22 డిస్ప్లే ఏరియా కు వెళ్ళి ఆబ్జక్ట్ (object)పై మౌస్ క్లిక్ చేసి చి ,
05:28 సవ్య మరియు అపసవ్య దిశలో మౌస్ ను కదపండి.
05:34 ఆబ్జక్ట్ యొక్క భ్రమణాన్ని గమనించండి.
05:39 ఇప్పుడు, ఆబ్జక్ట్ ను ఫ్లిప్ చేయడం నేర్చుకొందాం.
05:42 పెంటేన్ నిర్మాణం అడ్డంగా కుదుపుదాం.
05:47 నిర్మాణాన్ని అడ్డంగా కుదుపుటకు ఫ్లిప్ ది సెలక్షన్ హోరిజాన్ టల్లి (Flip the selection horizontally ) ఎంపిక ను క్లిక్ చేయండి.
05:55 ఇక్కడ ట్యుటోరియల్ లో విరామం తీ సుకొని ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), ఎంపిక ను మీరు స్వయంగా ప్రయత్నించండి.
06:03 ఆబ్జక్ట్స్ ను సమూహం మరియు సమలేఖనం చేద్దాం .
06:06 సమూహపర్చడానికి అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
06:09 ఇందు కోసం, ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి సెలెక్ట్ ఆల్ (Select All) పై క్లిక్ చేయండి.
06:15 లేదా Ctrl మరియు A కీలను ఒకేసారి నొక్కండి.
06:20 ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే,
06:24 కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
06:26 గ్రూప్ అండ్/ఆర్ అలైన్ ఆబ్జక్ట్స్ (Group and/or align objects) ఎంపిక ను ఎంచుకోండి.
06:31 ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
06:33 గ్రూప్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
06:36 ఒకవేళ అలైన్ అండ్ స్పేస్ ఈవెన్లీ ఎంపికలు, ఎంపిక చేయబడి ఉంటే వాటి ఎంపిక గుర్తును తీసివేయండి.
06:42 ఓకే( OK) బటన్ పై క్లిక్ చేయండి.
06:45 ఆబ్జక్ట్ లు (objects) సమూహపరచ బడి వుండడం చూడండి.
06:51 ఇప్పుడు ఆబ్జక్ట్స్ (objects) ను అలైన్ చేద్దాం.
06:54 అన్ని ఆబ్జక్ట్స్ (objects) ను ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి
06:58 ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై మౌస్ ను ఉంచి రైట్ బటన్ క్లిక్ చేస్తే
07:01 కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది.
07:04 గ్రూప్ ప్రాపర్టీస్ (Group properties )ఎంపికను ఎంచుకోండి.
07:09 అలైన్ (align) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
07:12 అలైన్ ఎంపికలో డ్రాప్-డౌన్ జాబితా ఉంది.
07:17 ఆబ్జక్ట్స్(objects)ను అలైన్ చేయడానికి అందులో కొన్ని ఎంపికలు ఉన్నాయి.
07:22 నేను లెఫ్ట్ ఎంచుకుంటాను.
07:25 OK బటన్ పై క్లిక్ చేయండి.
07:29 మార్పులు గమనించండి.
07:32 ఇక్కడ ట్యుటోరియల్ ఆపి ఆబ్జక్ట్ లను అలైన్ యొక్క ఇతర ఎంపికల తో అలైన్ చేయండి.
07:41 ఇప్పుడు కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు వాడడం నేర్చుకుందాం.
07:47 ఎడిట్ మెను వద్దకు వెళ్ళండి.
07:49 ఇందులో కట్, పీ, పేస్ట్ మరియు క్లియర్ వంటి ప్రాథమిక ఎడిట్ ఎంపికలు ఉన్నాయి.
07:57 ఈ ఎంపికల కోసం సాధారణ షార్ట్ -కట్ కీలు అయిన -
08:00 Ctrl + X కట్ చేయడానికి ,
08:02 Ctrl + C కాపీ చేయడానికి,
08:05 Ctrl + V పేస్ట్ చేయడానికి, లాంటివి GChemPaint లో కూడా పనిచేస్తాయి.
08:10 సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ ఎంచుకొని ఒకటి లేదా ఎక్కువ ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
08:16 ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేయండి.
08:18 కట్ చేయడానికి Ctrl + X నొక్కండి.
08:22 డిస్ప్లే ఏరియా మీద వేరే స్థానం లో ఆబ్జక్ట్ ను పేస్ట్ చేయడానికి Ctrl + V నొక్కండి.
08:29 ఆబ్జక్ట్ ను కట్ చేసినప్పుడు,దాని అసలు స్థానం నుండి తొలగించ బడడం గమనించండి.
08:35 తరువాత, డిస్ప్లే ఏరియా లో వేరే ప్రదేశం వద్ద ఆబ్జక్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి.
08:42 ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేసి, Ctrl + C కాపీ చేయడానికి మరియు Ctrl + V పేస్ట్ చేయడానికి క్లిక్ చేయండి.
08:50 ఆబ్జక్ట్ (object) ను కాపీ చేసినప్పుడు, దాని అసలు స్థానం నుండి తొలగించబడలేదని గమనించండి.
08:58 డిస్ప్లే ఏరియా క్లియర్ చెయ్యడానికి, అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి.
09:02 అన్ని ఆబ్జక్ట్స్ ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి .
09:06 ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి,
09:08 క్లియర్ క్లిక్ చేయండి.
09:11 అసలు నిర్మాణాలు తిరిగి పొందడానికి,ఎడిట్(Edit)మెను వద్దకు వెళ్ళి,
09:16 అన్-డు (Undo)పై క్లిక్ చేయండి.
09:19 లేదా Ctrl + Z నొక్కండి.
09:23 కీబోర్డు పై డిలీట్ కీని వాడి ఒక ఆబ్జక్ట్ (object)ను తొలగించడానికి,ఆ ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోండి.
09:29 కీబోర్డు పై డిలీట్ కీ నొక్కండి.
09:33 ఇప్పుడు నిర్మాణంలో కొంత భాగం తొలగించడానికి ఎరేసర్ టూల్ వాడడం తెలుసుకుందాం.
09:39 టూల్ బాక్స్ నుండి ఎరేసర్ టూల్ ఎంచుకోండి.
09:43 నిర్మాణాలలో ఏదో ఒక దాని దగ్గర మౌస్ ఉంచండి.
09:48 నిర్మాణంలో ఒక భాగం ఎరుపు రంగు లోనికి మారుతుంది.
09:53 నిర్మాణంలోని ఎరుపు రంగు భాగం పై క్లిక్ చేసి దానిని తొలగించండి.
09:59 అసలు నిర్మాణాలు పొందడానికి మార్పులు అన్ డు(Undo)చేద్దాం.
10:08 ఫైలు సేవ్ చేద్దాం.
10:11 టూల్బార్ పై సేవ్ ది కరెంటు ఫైల్(Save the current file)బటన్ క్లిక్ చేద్దాం.
10:16 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
10:22 సంగ్రహం గా,
10:24 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకు న్నది-
10:27 ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం.
10:29 డిస్ప్లే ఏరియా లో /కు టెక్స్ట్ జోడించడం మరియు సవరించడం.
10:33 ఆబ్జక్ట్ ని సెలెక్ట్, మూవ్, ఫ్లిప్ మరియు రొటేట్ చేయడం.
10:36 ఆబ్జక్ట్స్ నుగ్రూప్ మరియు సమలేఖనం చేయడం.
10:39 ఆబ్జక్ట్స్ ను కట్,కాపీ, పేస్ట్ మరియు డిలీట్ చేయడం.
10:44 ఒక అసైన్మెంట్,ఎరేసర్(Eraser) టూల్ వాడి -
10:48 ఎన్-ఆక్టేన్ నిర్మాణం ను ఎన్-పెంటేన్ కు,
10:52 ఎన్-హెక్సేన్ నిర్మాణం ను ఇథేన్ కు మార్చండి
10:56 పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
11:00 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి.
11:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
11:08 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
11:15 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:18 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
11:21 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
11:28 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
11:32 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
11:46 ఈ రచనకు సహాయ పడిన వారు స్వామి మరియు మాధురి. ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india