GChemPaint/C3/Features-of-GChem3D/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:02, 9 May 2017 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం.ఫీచర్స్ అఫ్ జికెం3D (Features of GChem3D)ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మీరు నేర్చుకునేది-
00:10 మెనూ బార్,ఫైల్ టైప్ ఫార్మాట్స్,
00:13 వివిధ మోడల్ రకాలు మరియు
00:15 బాక్గ్రౌండ్ కలర్(background color)ఎలా మార్చాలి?
00:18 ఇక్కడ, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:24 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 ,
00:29 Gchem3D(జికెం3D)వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:34 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి GchemPaint(జికెంపెయింట్)తో పరిచయం.
00:38 లేకపోతే,మా వెబ్ సైట్లో సంబందిత ట్యుటోరియల్స్ చూడండి.
00:44 నేను ఒక కొత్తGchemPaint(జికెంపెయింట్)విండో తెరిచాను.
00:47 టెంప్లేట్స్ (Templates)డ్రాప్ డౌన్ నుఉపయోగించి,
00:49 నేను డిస్ప్లే ఏరియా పై అడినోసిన్(Adenosine)నిర్మాణం ను లోడ్ చేస్తాను.
00:53 ఫైలు సేవ్ చేయడానికి, టూల్ బార్ పై సేవ్(Save)చిహ్నం పై క్లిక్ చేయండి.
00:58 సేవ్ అస్(Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:02 జికెం3D(GChem3D) లో ఫైల్ చూడడానికి, ఫైల్ ను .mol, .mdl మరియు .pdb ఫార్మాట్ల లో సేవ్ చెయ్యాలి.
01:11 అడినోసిన్.pdb(Adenosine.pdb) గా ఫైల్ పేరు టైపు చెయ్యండి.
01:15 ఫైల్ డెస్క్టాప్(Desktop) పై సేవ్ చేయడానికి డెస్క్టాప్(Desktop) పై క్లిక్ చెయ్యండి.
01:18 సేవ్(Save)బటన్ పై క్లిక్ చెయ్యండి.
01:21 నేను GChemPaint(జికెంపెయింట్)విండో మూసి వేస్తాను.
01:25 ఇప్పుడు GChem3D (జికెం3D)అప్లికేషన్ గురించి నేర్చుకుందాం.
01:29 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ వాడి GChem3D(జికెం3D) ను , GChemPaint (జికెంపెయింట్)యొక్క
01:34 యుటిలిటీ సాఫ్ట్ వేర్ గా ఇన్స్టాల్ చేయవచ్చు.
01:38 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్(Synaptic Package Manager)వద్దకు వెళ్ళండి.
01:40 క్విక్ ఫిల్టర్ బాక్స్ (Quick filter box)లో GChemPaint (జికెంపెయింట్)అని టైపు చేయండి.
01:44 GChemPaint (జికెంపెయింట్) పూర్తిగా ఇన్స్టాల్ చేయడానికి, gcu-plugin,libgcu-dbg మరియు gcu-bin ను ఇన్స్టాల్ చేయండి.
01:55 నేను ముందు గానే అన్ని ఫైళ్లు ఇన్స్టాల్ చేసి ఉంచాను.
01:59 GChem3d (జికెం3d) ఒక 3-డైమెన్షనల్ మాలేకులర్ స్ట్రక్చర్ విజువలైసర్.
02:04 ఇది GChemPaint (జికెంపెయింట్) యొక్క ఒక యుటిలిటీ లక్షణం.
02:07 GChemPaint (జికెంపెయింట్)లో గీసిన స్ట్రక్చర్స్ ను జికెం3D( GChem3D)లో చూడవచ్చు.
02:12 జికెం3D( GChem3D) తెరవడానికి,డాష్ హోమ్(Dash Home) పై క్లిక్ చేయండి.
02:15 కనిపించే సెర్చ్-బార్ లో జికెం3d( gchem3d)అని టైపు చెయ్యండి.
02:20 మాలిక్యూల్స్ వ్యూవర్ (Molecules viewer) చిహ్నం పై క్లిక్ చెయ్యండి.
02:24 జికెం3d వ్యూవర్ ( gchem3d Viewer) విండో, మెనూబార్(Menubar) మరియు డిస్ప్లే ఏరియా (Display area) లు కలిగియున్నది.
02:30 మెనూబార్(Menubar), జికెం3d(GChem3D) తో పని చేయడానికి కావలసిన అన్ని ఆదేశాలను కలిగి ఉంటుంది.
02:36 డిస్ప్లే ఏరియా(Display area) తెరిచిఉన్న ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూపిస్తుంది.
02:40 ఫైలు తెరవడానికి, ఫైలు (File)ఎంచుకోండి. ఓపెన్(Open)పై క్లిక్ చేయండి.
02:46 ఓపెన్ (Open) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
02:49 మీరు తెరవాలనుకున్న ఫైల్ ను ఎంచుకోండి.
02:52 నేను, నా డెస్క్టాప్ పై ఉన్న అడినోసిన్.pdb (Adenosine.pdb) ఫైల్ నుఎంచుకుంటాను.
02:57 ఇప్పుడు ఓపెన్(Open)బటన్ పై క్లిక్ చేయండి.
02:59 డిస్ప్లే ఏరియా(Display area)లో ఫైల్ కనిపిస్తుంది.
03:02 ఈ వ్యూను ఇమేజ్ గా సేవ్ చేయడం నేర్చుకుందాం.
03:05 ఫైల్(File) పై క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్(Save As Image) వద్దకు వెళ్ళండి.
03:10 సేవ్ యాస్ ఇమేజ్(Save As Image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
03:12 దిగువన వున్న విడ్త్(Width) మరియు హైట్ (Height) పరామీటర్స్ ను గమనించండి.
03:17 డిఫాల్ట్ ఇమేజ్ విడ్త్(Width) 300 పిక్సల్స్ మరియు హైట్ (Height) 300 పిక్సల్స్ గా కొలతలు కలిగి ఉన్నది.
03:24 మీరు స్క్రోలర్స్ వాడి విలువలు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
03:29 ఇప్పుడు ఫైల్ టైప్(File type)ఎంపిక వద్దకు వెళ్ళండి .
03:31 జికెం3D(GChem3D) వివిధ ఫైల్ ఫార్మాట్ల ను సహకరిస్తుంది.
03:35 VRML, PDF, PNG మరియు ఇతర ఫైల్ రకాలు డ్రాప్-డౌన్ జాబితా లో అందుబాటులో ఉన్నాయి.
03:45 ఏ ఫైలు రకం పేర్కొనక పొతే, GChem3d ఫైలు పేరు నుండి ఫైల్ రకం గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది.
03:52 అది విజయవంతం కాకపోతే, డిఫాల్ట్ ఫైల్ రకం VRML వాడబడుతుంది.
03:58 నిర్మాణం ను VRML ఫైలు ఫార్మాట్ లో సేవ్ చేద్దాం .
04:03 VRML డాక్యుమెంట్(document) ఎంపిక ఎంచుకోండి.
04:07 అడినోసిన్ (Adenosine) గా ఫైల్ పేరును టైప్ చేయండి.
04:11 డెస్క్టాప్(Desktop) పై ఫైలు సేవ్ చేయడానికి డెస్క్టాప్(Desktop)పై క్లిక్ చేయండి.
04:14 సేవ్ (Save)బటన్ పై క్లిక్ చేయండి.
04:17 ఇప్పుడు VRML ఫైల్ టైపు (File type) అంటే ఏమిటో నేర్చుకొందాం.
04:22 VRML అనేది .wrl ఎక్స్టెన్షన్ తో గల ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్.
04:28 3D polygon లక్షణాలు అయినటువంటి వర్టిసెస్(vertices), ఎడ్జెస్ (edges), మరియు సర్ఫేస్ కలర్ (surface color) లను తెలుపవచ్చు.
04:35 VRML ఫైళ్ళు సాదాటెక్స్ట్ తో gzip గా కుదించబడి ఉంటాయి.
04:40 3D మోడలింగ్ ప్రోగ్రామ్స్,ఆబ్జక్ట్స్ ను మరియు వాటి దృశ్యాలను సేవ్ చేస్తాయి .
04:45 సేవ్ చేసిన ఫైల్ ను తెరుద్దాం.
04:48 Adenosine.wrl ఫైలు మీద రైట్క్లిక్ చేసి, ఓపెన్ విత్ టెక్స్ట్ ఎడిటర్(Open with Text Editor) ఎంపిక ను ఎంచుకోండి.
04:55 టెక్స్ట్ ఎడిటర్ నిర్మాణం గురించి అన్ని వివరాలు చూపిస్తుంది.
05:01 ఇప్పుడు పేజీ సెటప్(Page Setup)వద్దకు వెళ్దాం.
05:04 GChem3d, ప్రింటింగ్ చేసేటపుడు 300dpi resolution ను వాడుతుంది.
05:09 పేజీ సెటప్(Page Setup) లక్షణాలు GChemPaint లో వలెనే ఉంటాయి.
05:14 నేను ఇప్పటికే GChemPaint ట్యుటోరియల్స్ లో ఈ సిరీస్లో వీటిగురించిచర్చించాను.
05:19 నేను విండో మూసి వేస్తాను.
05:21 ఇప్పుడు వ్యూ(View) మెను వద్దకు వెళ్దాం.
05:25 వ్యూ (View) మెనును ఎంచుకోండి.
05:27 GChem3D, నాలుగు మోడల్ టైప్స్ను వాడి ఒక అణువు ను చూపిస్తుంది:
05:32 బాల్స్ అండ్ స్టిక్స్ , స్పేస్ ఫిల్లింగ్,
05:35 సిలిండర్స్ మరియు వైర్ఫ్రేమ్.
05:39 బాల్స్ అండ్ స్టిక్స్(Balls and sticks) అనునది డిఫాల్ట్ మోడల్.
05:42 ఈ నమూనా ను ఉపయోగించి బహుళ మరియు సరైన బాండ్ స్థానాలు చూడవచ్చు.
05:48 నేను స్పేస్ ఫిల్లింగ్(Space Filling) పై క్లిక్ చేస్తాను మరియు మీరు వ్యత్యాసం గమనించగలరు.
05:53 స్పేస్ ఫిల్లింగ్(Space Filling) మోడల్ అణువులను కాంపాక్ట్ రూపంలో చూపిస్తుంది.
05:58 సిలిండర్స్ (Cylinders) మోడల్, సిలెండ్రికల్ పైప్స్ (cylindrical pipes) రూపంలో నిర్మాణం ను చూపిస్తుంది.
06:03 వైర్ ఫ్రేమ్ (Wireframe) మోడల్, స్కెలెటల్ (skeletal) నిర్మాణం ను చూపిస్తుంది.
06:08 బాల్స్ అండ్ స్టిక్స్ (Balls and sticks) వద్దకు తిరిగి వెళ్దాం.
06:11 మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ (Background color)కు వెళ్దాం.
06:14 డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ (Background color) బ్లాక్.
06:17 వ్యూ(View)మెను ఎంచుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ (Background color) వద్దకు వెళ్ళండి.
06:21 ఒక సబ్ మెను తెరుచుకుంటుంది.
06:23 సబ్ మెను చివరిలో కస్టమ్ కలర్(Custom color) ను ఎంచుకోండి.
06:26 బ్యాక్గ్రౌండ్ కలర్(Background color) విండో తెరుచుకుంటుంది.
06:30 ఈ విండో లో మనకు కావలసిన రంగు ఎంచుకోవడానికి వివిధ విభాగాలు ఉన్నాయి.
06:35 హ్యూ (Hue)ను వాడి ,మనం బాక్గ్రౌండ్ కలర్ ను మార్చవచ్చు.
06:39 స్క్రోలర్ (scroller) పై క్లిక్ చేయండి. కలర్ సర్కిల్ (color circle) యొక్క విలువ మరియు కదలిక లో మార్పును గమనించండి.
06:45 సాచురేషణ్(Saturation) ఉపయోగించి , రంగు గాఢత మార్చవచ్చు.
06:51 వేల్యూ (Value) ఉపయోగించి , RGB కాంబినేషన్(combination) మార్చి, ఒక రంగు యొక్క వివిధ షేడ్స్ పొందవచ్చు .
06:59 ఇక్కడ,ప్రివ్యూ బాక్స్(Preview box),పక్కన ఒక ఐడ్రాపర్(eyedropper) చిహ్నం తో కనిపిస్తుంది.
07:04 ఐడ్రాపర్(eyedropper)చిహ్నం పై క్లిక్ చేయండి.
07:07 ఇష్టపడే రంగు ఎంచుకోవడానికి రంగు రింగ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
07:11 ఓకే(OK) బటన్ క్లిక్ చేయండి. స్క్రీన్ పై బాక్గ్రౌండ్ కలర్ మారుతుంది .
07:18 నేర్చుకున్నది సంగ్రహంగా,
07:20 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నది,
07:23 వివిధ మెనూలు, ఫైల్ టైప్ ఫార్మాట్స్ ,
07:26 మోడల్ టైప్స్ మరియు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం ఎలా.
07:30 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్
07:33 GChemPaint నుండి ఒక శాచరైడ్(Saccharide) ను లోడ్ చేసి మరియు .mdl ఫార్మాట్ లో ఫైల్ సేవ్ చేయండి.
07:39 నిర్మాణం ను మాలిక్యూలస్ వ్యూయర్(Molecules viewer)లో తెరవండి.
07:42 చిత్రం ను PNG మరియు PDF ఫైల్ టైప్ లో సేవ్ చేయండి.
07:46 వివిధ బ్యాక్గ్రౌండ్ కలర్ లను ప్రయత్నించండి.
07:49 ఈ క్రింది లింక్ నందు అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
07:53 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:56 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:01 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:06 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:10 మరిన్ని వివరాలకు,దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
08:17 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
08:22 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:29 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:35 ఈ ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించింది స్వామి. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Pratik kamble, Yogananda.india