Inkscape/C2/Create-and-edit-shapes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | Inkscape ను ఉపయోగించి Create and edit shapes (ఆకారాలను రూపొందించటం మరియు సవరించడం) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో,మనకి మనం Inkscape తో సుపరిచితులము అవుదాము. |
00:10 | మనం ఇంక్ స్కేప్ ఇంటర్ఫేస్ గురించి మరియు ప్రాధమిక ఆకారాలను ఎలా రూపొందించాలి, |
00:16 | handles ఉపయోగించి రంగు నింపడం మరియు ఆకారాలను మార్పు చేయడం అనేది నేర్చుకుంటాం. |
00:20 | ఈ ట్యుటోరియల్ కొరకు, నేను ఉపయోగిస్తున్నాను, Ubuntu Linux 12.04 OS. |
00:25 | Inkscape వర్షన్ 0.48.4 |
00:29 | డాష్ హోమ్ కి వెళ్ళి Inkscape అని టైప్ చేయండి. |
00:34 | మీరు logo పై డబుల్ క్లిక్ చేసి Inkscape ను తెరువవచ్చు. |
00:38 | ఇంటర్ఫేస్ పైన మీరు, మెనూ బార్ మరియు టూల్ కంట్రోల్స్ బార్ లను కనుగొంటారు. |
00:44 | తదుపరి మీరు పైభాగం వద్ద మరియు ప్రక్కల rulers ను చూస్తారు. |
00:48 | ఇంటర్ఫేస్ యొక్క కుడి పక్క భాగం పైన, కమాండ్ బార్ మరియు స్నాప్ కంట్రోల్ బార్ లను కనుగొంటారు. |
00:54 | టూల్ బాక్స్ ఇంటర్ఫేస్ యొక్క ఎడమ వైపు ఉంటుంది. |
00:58 | మధ్యలో ఉండేది canvas. మీరు మీ గ్రాఫిక్స్ ని ఇక్కడే గీస్తారు. |
01:03 | ఇంటర్ఫేస్ యొక్క కింది భాగం వద్ద, మనం కలర్ పాలెట్ మరియు స్టేటస్ బార్ లను చూస్తాము. |
01:09 | ఇప్పుడు, Inkscape లో కొన్ని ప్రాధమిక ఆకారాలను రూపొందించటం మరియు edit చేయడం నేర్చుకుందాం. |
01:14 | అన్నిటికంటే ముందు, మనం Select and Transform tool గురించి నేర్చుకుందాం. సాధారణంగా ఇది Selector tool గా పిలవబడుతుంది. |
01:22 | ఇది చాల ముఖ్యమైన టూల్. Tool box యొక్క ఎడమచేతి వైపు మీరు దీనిని కనుగొంటారు. |
01:28 | ఈ టూల్ తో, మీరు వస్తువులను ఎంచుకోవచ్చు, వాటిని మార్పుచేయవచ్చు మరియు కేన్వాస్ పైన చుట్టూ కదిలించవచ్చు. |
01:34 | ఒక కొత్త Inkscape డాక్యుమెంట్ ను తెరవటానికి, File పై క్లిక్ చేసి తరువాత New ను ఎంచుకొని, Default పై క్లిక్ చేయండి. |
01:41 | ఇప్పటికే ఉన్న Inkscape డాక్యుమెంట్ ను తెరవటానికి, File ఫై క్లిక్ చేసి, తరువాత Open ను ఎంచుకోండి. |
01:47 | మనం ఇంతకు ముందు రూపొందించిన drawing_1.svg ఫైల్ ను తెరుద్దాం. |
01:53 | నేను దానిని Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. దిగువన కుడి వైపు ఉన్న Open బటన్ పై క్లిక్ చేయండి. |
02:01 | మనం ముందు ఒక దీర్ఘ చతురస్రాన్ని రూపొందించాము. |
02:04 | ఇప్పుడు, దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేయండి. |
02:06 | అప్రమేయంగా, దీర్ఘ చతురస్రం యొక్క రంగు పచ్చగా ఉంటుంది. |
02:09 | రంగును ఎరుపుగా మార్చటానికి, కిందన ఉన్న కలర్ పాలెట్ ను మనం ఉపయోగిద్దాము. |
02:14 | కనుక, నేను కర్సర్ ను కిందకి కదిలించి, ఎరుపు రంగు పై క్లిక్ చేస్తాను. |
02:18 | దీర్ఘ చతురస్రం రంగులో వచ్చే మార్పును గమనించండి. |
02:22 | ఇప్పుడు మనం దీర్ఘ చతురస్రాన్ని కదిలిద్దాం. అలా చేయటానికి, మీరు దీర్ఘ చతురస్రం పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
02:27 | ఇప్పుడు, మౌస్ బటన్ ను వదిలిపెట్టకుండా, దానిని canvas పైన మీకు ఎక్కడికి కావాలిస్తే అక్కడికి లాగండి. |
02:33 | ఇప్పుడు మౌస్-బటన్ ను వదిలి పెట్టండి. |
02:37 | బాగా కనపడటం కోసం zoom in చేద్దాం. ఆలా చేయటానికి, Ctrl కీ ని నొక్కి పెట్టి mouse పైన స్క్రోల్ బటన్ ను ఉపయోగించండి. |
02:46 | దీర్ఘ చతురస్రం చుట్టూ ఉన్న బాణాలను గమనించండి. వీటిని handles అని పిలుస్తాము. వాటిని మనం స్కేలింగ్ మరియు రొటేటింగ్ కొరకు ఉపయోగించవచ్చు. |
02:57 | కర్సర్ ను ఏదైనా ఒక హ్యాండిల్ పై ఉంచితే handle యొక్క రంగు మారుతుంది. |
03:02 | ఇది ఆ నిర్దిష్ట handle ఎంచుకోబడింది మరియు రిసైజింగ్ కొరకు సిద్ధంగా ఉన్నది అని సూచిస్తుంది. |
03:08 | దీర్ఘ చతురస్రాన్ని scale లేదా రీసైజ్ చేయటానికి, ఏదయినా మూలలోని handles పై క్లిక్ చేసి లాగండి. |
03:17 | మీరు aspect ratio అదే ఉంచాలి అనుకుంటే, రిసైజింగ్ చేసేటపుడు Ctrl key ని నొక్కి పట్టుకోండి. |
03:24 | దీర్ఘ చతురస్రం యొక్క పొడవు లేదా వెడల్పు మార్చటానికి,దీర్ఘ చతురస్రం యొక్క భుజాలపై handles లో ఏదయినా ఒకటి ఉపయోగించండి. |
03:32 | ఎడమవైపుకు లేదా కుడివైపుకు handle ను క్లిక్ చేసి లాగండి. |
03:39 | దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు లో వచ్చే మార్పును గమనించండి. |
03:43 | ఇప్పుడు, దీర్ఘ చతురస్రం యొక్క పొడవును మార్పు చేద్దాం. |
03:46 | కనుక, handle పైభాగం లో లేదా కింది భాగంలో క్లిక్ చేద్దాం ఇంకా లాగుదాం. |
03:51 | దీర్ఘ చతురస్రం యొక్క పొడవులో వచ్చే మార్పును గమనించండి. |
03:54 | Tool controls bar పైన Width మరియు Height పారామీటర్స్ ను మార్పు చేసి మనం కూడా దీర్ఘ చతురస్రం వెడల్పు మరియు పొడవులను మానవీయంగా మార్చవచ్చు. |
04:03 | నేను Width ను 400 మరియు Height ను 200 కు మార్పు చేస్తున్నాను. |
04:07 | దీర్ఘ చతురస్రం పరిమాణం లో వచ్చిన మార్పును గమనించండి. |
04:10 | ఇదే విధంగా, X మరియు Y యాక్సస్ పొజిషన్స్ ను మార్పుచేసి కూడా మీరు ఆబ్జెక్ట్ ను కదిలించవచ్చు. |
04:19 | ఇప్పుడు, దీర్ఘ చతురస్రాన్ని ఎలా రొటేట్ చేయాలో నేర్చుకుందాం. |
04:24 | ఇలా చేయటానికి, దీర్ఘ చతురస్రం పై మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. |
04:27 | ఇప్పుడు, మూలలో ఉన్న handles ఆకారం, రొటేషన్ కొరకు సిద్ధంగా ఉన్నది అని సూచించేలా మారిందని గమనించండి. |
04:34 | నేను కుడి వైపు మూలలో ని పై handle పై క్లిక్ చేసి, దీర్ఘ చతురస్రాన్ని రొటేట్ చేస్తున్నాను. |
04:44 | ఏదయినా ఒక పక్క handles ను క్లిక్ మరియు డ్రాగ్ చేసి, మీరు దీర్ఘ చతురస్రాన్ని skew కూడా చేయవచ్చు. |
04:50 | నేను దీర్ఘ చతురస్రాన్ని skew చేయటానికి ఎడమ మధ్య handle ను క్లిక్ చేసి దానిని పైకి మరియు కిందకి లాగుతున్నాను. |
04:56 | నేను డ్రాగ్ చెస్తున్నప్పుడు మార్పులను గమనించండి. |
04:59 | మనం తరువాతి ట్యుటోరియల్ లో ఈ handles ను ఉపగించటం పై మరికొన్ని వివరాలను నేర్చుకుంటాం. |
05:04 | ఈ ఆకారము యొక్క ఎంపిక ని రద్దు చేద్దాం. |
05:06 | ఇలా చేయటానికి, కేన్వాస్ ఏరియా లో లేదా కేన్వాస్ బౌండరీ బయట ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:11 | నేను mouse ను టూల్ బాక్స్ వద్దకు మరియు అదే rectangle టూల్ మీద కదిలిస్తాను. |
05:17 | మనం ఈ టూల్ ని ఉపయోగించి దీర్ఘ చతురస్రాలు మరియు చతురస్రాలు గీయవచ్చు అని టూల్ చిట్కా(టూల్ టిప్) చెప్తుంది. |
05:22 | కనుక, నేను ముందుగా ఈ టూల్ పై క్లిక్ చేస్తాను. |
05:25 | ఒక చతురస్రాన్ని గీయటానికి, సులువుగా Ctrl కీ ని పట్టుకోండి మరియు కేన్వాస్ పైన లాగండి. |
05:30 | నేను దీని కలర్ ను పింక్ కు మార్చుతున్నాను. |
05:32 | మీకోసం ఒక అసైన్మెంట్. |
05:34 | Tool box నుండి Create circles and ellipses టూల్ ను ఎంచుకోండి. |
05:38 | Ctrl కీ ని ఉపయోగించి, కేన్వాస్ పై ఒక వృత్తాన్ని గీయండి. |
05:42 | దానిని బ్లూ గా కలర్ కు మార్చండి. |
05:44 | ఇది నా వృత్తం. |
05:46 | ఇప్పుడు ఈ వృత్తాన్ని ఎలా మార్పు చేయవచ్ఛో నేర్చుకుందాం. |
05:49 | వృత్తం యొక్క ఆకారాన్ని ఒక arc లేదా ఒక segment కు మార్చటానికి, మీరు Start మరియు End పారామీటర్స్ ను మార్చవచ్చు. |
05:56 | ఇక్కడ Tool controls bar పై మూడు ఎంపికలు ఉన్నాయి. ఇవి ఆకారాల మధ్య మారటానికి సహాయం చేస్తాయి. |
06:03 | Start పారామీటర్ ను 100 మరియు End పారామీటర్ ను -50 కు మార్చుతున్నాను. |
06:09 | వృత్తం యొక్క ఆకారం ఒక సెగ్మెంట్ ఆకారాంలోకి మారింది అని చూడవచ్చు. |
06:14 | ఇప్పుడు నేను Arc చిహ్నం పై క్లిక్ చేస్తాను మరియు ఆకారం లో మార్పును మనం చూడవచ్చు |
06:19 | Circle, icon పై క్లిక్ చేసి, మళ్ళి వృతాకారాన్ని పొందవచ్చు. |
06:25 | ఇప్పుడు, మన canvas పై ఉన్న వృత్త ఆకారాన్ని దగ్గరగా చూద్దాం. |
06:30 | ఆకారం పై arc handles అని పిలవబడే 2 resize handles మరియు 2 circular handles ఉన్నాయి గమనించండి. |
06:37 | 2 resize handles ను వృత్తాన్ని ఒక దీర్ఘవృత్త ఆకారం లోకి మార్చటానికి ఉపయోగిస్తాము. |
06:44 | పై నుండి కిందకి లేదా ఎడమ నుండి కుడి దిశలలో ఉన్న ఈ handles ను కేవలం లాగండి. |
06:53 | ఆకారం లో వచ్చిన మార్పులను గమనించండి. |
06:56 | 2 arc handles ఒకదానితో ఒకటి ఓవెర్లాప్ అవుతాయి. arc handle పై క్లిక్ చేసి, దానికి అపసవ్యదిశలో కదిలించండి. |
07:04 | ఇప్పుడు మనం రెండు arc handles ను చూడవచ్చు. |
07:08 | ఈ arc handles ను ఉపయోగించి వృత్త ఆకారాన్ని ఆర్క్ లేదా సెగ్మెంట్ ఆకారం లోకి మార్పు చేయవచ్చు. |
07:14 | వాటిని కేవలం సవ్య లేదా అపసవ్య దిశలలో కదిలించాలి మరియు ఆకారం లో వచ్చే మార్పుని గమనించాలి. |
07:24 | ఇప్పుడు, మనం Tool box లోని rectangle tool పై క్లిక్ చేద్దాం. తరువాత చతురస్రం పై క్లిక్ చేద్దాం. |
07:30 | ఆకారం యొక్క కుడి ఎగువ మూలపై ఉన్న 2 resize handles మరియు 2 arc handles ను గమనించండి. |
07:40 | ముందు వలె, 2 arc handles ఒక దానితో ఒకటి ఓవెర్లాప్ అవుతాయి. |
07:43 | ఏదయినా ఒక arc handle పై క్లిక్ చేయండి మరియు దానిని సవ్యదిశలో కదిలించండి. |
07:48 | ఇప్పుడు మనం రెండు arc handles ను చూడవచ్చు. |
07:51 | మనం ఈ handles ను ఉపయోగించి చేతురస్రానికి గుండ్రని అంచులను ఇవ్వవచ్చు. |
07:56 | వాటిని సవ్య లేదా అపసవ్య దిశలలో కదిలించాలి మరియు ఆకారం లో వచ్చే మార్పుని గమనించాలి. |
08:02 | ఇప్పుడు, Tool box నుండి Stars and polygons tool పై క్లిక్ చేసి ఒక బహుభుజి ని రూపొందిద్దాం. |
08:08 | ఇది circle టూల్ కు సరిగ్గా కిందన ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. |
08:13 | ఇదే విధంగా మనం ఒక బహుభుజిని గీద్దాం ఇంకా దాని రంగును ఆకుపచ్చగా మార్చుదాం. |
08:20 | అప్రమేయంగా,5-పక్కలతో ఒక బహుభుజి వస్తుంది. అంటే ఒక పంచభుజి గీయబడింది. |
08:24 | Tool controls bar వద్ద చుడండి. ఇక్కడ, బహుభుజి యొక్క మూలల సంఖ్య 5 అని ఇది చెప్తుంది. |
08:32 | సంఖ్యను 4 కి తగ్గించటం చేత ఒక చతురస్రాన్ని మరియు 3కి తగ్గించటం చేత ఒక త్రిభుజాన్ని మీరు రూపొందించవచ్చు. |
08:39 | దానిని పెంచటం చేత, మనం ఒక పంచభుజి, షడ్భుజి మరియు ఆపైన వాటిని రూపొందించవచ్చు. |
08:44 | బహుభుజి పై ఒక resize handle ఉంది గమనించండి. |
08:47 | మనం దానిని బహుభుజి ని రీసైజ్ లేదా రొటేట్ చేయటానికి ఉపయోగించవచ్చు. |
08:52 | Tool controls barలోని polygon చిహ్నానికి తరువాత ఉన్నstar చిహ్నం పై క్లిక్ చేసి ఆకారాన్ని ఒక నక్షత్రం ఆకారం లోకి మార్చండి. |
09:00 | నక్షత్రం ఆకారం పై 2 handles –ఒకటి కొనవద్ద మరియు ఇంకొకటి ఉమ్మడి వద్ద ఉన్నాయి గమనించండి. |
09:06 | నక్షత్రాన్ని రీసైజ్ లేదా రొటేట్ చేయడానికి హేండిల్ ని క్లిక్ చేసి నక్షత్రం కొనవద్దకు లాగండి. |
09:12 | మనం వేరొక handleఉపయోగించి నక్షత్రం ఆకారాన్నిresize మరియు skew చేయవచ్చు. |
09:17 | దానిపై క్లిక్ చేసి సవ్య లేదా అపసవ్య దిశలలో కదిలించండి మరియు ఆకారం మరియు పరిమాణం లలో మార్పును గమనించండి. |
09:25 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
09:30 | ఈ ట్యుటోరియల్ లో మనం, Inkscape ఇంటర్ఫేస్ గూర్చి నేర్చుకున్నాం. |
09:34 | మనం ఇవి కూడా నేచుకున్నాం - ప్రాధమిక ఆకారాలు దీర్ఘ చతురస్రం, చతురస్రం, వృత్తం, దీర్ఘ వృత్తం, బహుభుజి మరియు నక్షత్రం వంటివి రూపొందించడం |
09:42 | ఆకారాలలోకి రంగును నింపడం మరియు handles ఉపయోగించి ఆకారాలను మార్పు చేయటం. |
09:46 | మీకోసం ఇక్కడొక అసైన్మెంట్. |
09:49 | ఒక దీర్ఘ చతురస్రాన్ని రూపొందించి నీలం రంగుతో నింపండి. |
09:52 | ఎరుపు రంగుతో ఒక వృత్తాకారం. |
09:54 | పచ్చ రంగులో 7 ప్రక్కలతో ఒక నక్షత్రం. |
09:58 | మీరు పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
10:03 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
10:09 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:13 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
10:22 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org |
10:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:32 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
10:38 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
10:47 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
10:50 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |