Inkscape/C2/Create-and-edit-shapes/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:00, 4 April 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 Inkscape ను ఉపయోగించి Create and edit shapes (ఆకారాలను రూపొందించటం మరియు సవరించడం) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో,మనకి మనం Inkscape తో సుపరిచితులము అవుదాము.
00:10 మనం ఇంక్ స్కేప్ ఇంటర్ఫేస్ గురించి మరియు ప్రాధమిక ఆకారాలను ఎలా రూపొందించాలి,
00:16 handles ఉపయోగించి రంగు నింపడం మరియు ఆకారాలను మార్పు చేయడం అనేది నేర్చుకుంటాం.
00:20 ఈ ట్యుటోరియల్ కొరకు, నేను ఉపయోగిస్తున్నాను, Ubuntu Linux 12.04 OS
00:25 Inkscape వర్షన్ 0.48.4
00:29 డాష్ హోమ్ కి వెళ్ళి Inkscapeఅని టైప్ చేయండి.
00:34 మీరు logo పై డబుల్ క్లిక్ చేసి Inkscape ను తెరువవచ్చు.
00:38 ఇంటర్ఫేస్ పైన మీరు, మెనూ బార్ మరియు టూల్ కంట్రోల్స్ బార్ లను కనుగొంటారు.
00:44 తదుపరి మీరు పైభాగం వద్ద మరియు ప్రక్కల rulers ను చూస్తారు.
00:48 ఇంటర్ఫేస్ యొక్క కుడి పక్క భాగం పైన, కమాండ్ బార్ మరియు స్నాప్ కంట్రోల్ బార్ లను కనుగొంటారు.
00:54 టూల్ బాక్స్ ఇంటర్ఫేస్ యొక్క ఎడమ వైపు ఉంటుంది.
00:58 మధ్యలో ఉండేది canvas. మీరు మీ గ్రాఫిక్స్ ని ఇక్కడే గీస్తారు.
01:03 ఇంటర్ఫేస్ యొక్క కింది భాగం వద్ద, మనం కలర్ పాలెట్ మరియు స్టేటస్ బార్ లను చూస్తాము.
01:09 ఇప్పుడు, Inkscape లో కొన్ని ప్రాధమిక ఆకారాలను రూపొందించటం మరియు edit చేయడం నేర్చుకుందాం.
01:14 అన్నిటికంటే ముందు, మనం Select and Transform tool గురించి నేర్చుకుందాం. సాధారణంగా ఇది Selector tool గా పిలవబడుతుంది.
01:22 ఇది చాల ముఖ్యమైన టూల్. Tool box యొక్క ఎడమచేతి వైపు మీరు దీనిని కనుగొంటారు.
01:28 ఈ టూల్ తో, మీరు వస్తువులను ఎంచుకోవచ్చు, వాటిని మార్పుచేయవచ్చు మరియు కేన్వాస్ పైన చుట్టూ కదిలించవచ్చు.
01:34 ఒక కొత్త Inkscape డాక్యుమెంట్ ను తెరవటానికి, File పై క్లిక్ చేసి తరువాత New ను ఎంచుకొని, Default పై క్లిక్ చేయండి.
01:41 ఇప్పటికే ఉన్న Inkscape డాక్యుమెంట్ ను తెరవటానికి, File ఫై క్లిక్ చేసి, తరువాత Open ను ఎంచుకోండి.
01:47 మనం ఇంతకు ముందు రూపొందించిన drawing_1.svg ఫైల్ ను తెరుద్దాం.
01:53 నేను దానిని Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. దిగువన కుడి వైపు ఉన్న Open బటన్ పై క్లిక్ చేయండి.
02:01 మనం ముందు ఒక దీర్ఘ చతురస్రాన్ని రూపొందించాము.
02:04 ఇప్పుడు,దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేయండి.
02:06 అప్రమేయంగా, దీర్ఘ చతురస్రం యొక్క రంగు పచ్చగా ఉంటుంది.
02:09 రంగును ఎరుపుగా మార్చటానికి, కిందన ఉన్న కలర్ పాలెట్ ను మనం ఉపయోగిద్దాము
02:14 కనుక, నేను కర్సర్ ను కిందకి కదిలించి, ఎరుపు రంగు పై క్లిక్ చేస్తాను.
02:18 దీర్ఘ చతురస్రం రంగులో వచ్చే మార్పును గమనించండి.
02:22 ఇప్పుడు మనం దీర్ఘ చతురస్రాన్ని కదిలిద్దాం. అలా చేయటానికి, మీరు దీర్ఘ చతురస్రం పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
02:27 ఇప్పుడు, మౌస్ బటన్ ను వదిలిపెట్టకుండా, దానిని canvas పైన మీకు ఎక్కడికి కావాలిస్తే అక్కడికి లాగండి.
02:33 ఇప్పుడు మౌస్-బటన్ ను వదిలి పెట్టండి.
02:37 బాగా కనపడటం కోసం zoom in చేద్దాం. ఆలా చేయటానికి, Ctrl కీ ని నొక్కి పెట్టి mouse పైన స్క్రోల్ బటన్ ను ఉపయోగించండి.
02:46 దీర్ఘ చతురస్రం చుట్టూ ఉన్న బాణాలను గమనించండి. వీటిని handles అని పిలుస్తాము. వాటిని మనం స్కేలింగ్ మరియు రొటేటింగ్ కొరకు ఉపయోగించవచ్చు.
02:57 కర్సర్ ను ఏదైనా ఒక హ్యాండిల్ పై ఉంచితే handle యొక్క రంగు మారుతుంది.
03:02 ఇది ఆ నిర్దిష్ట handle ఎంచుకోబడింది మరియు రిసైజింగ్ కొరకు సిద్ధంగా ఉన్నది అని సూచిస్తుంది.
03:08 దీర్ఘ చతురస్రాన్ని scale లేదా రీసైజ్ చేయటానికి, ఏదయినా మూలలోని handles పై క్లిక్ చేసి లాగండి.
03:17 మీరు aspect ratio అదే ఉంచాలి అనుకుంటే, రిసైజింగ్ చేసేటపుడు Ctrl key ని నొక్కి పట్టుకోండి.
03:24 దీర్ఘ చతురస్రం యొక్క పొడవు లేదా వెడల్పు మార్చటానికి,దీర్ఘ చతురస్రం యొక్క భుజాలపై handles లో ఏదయినా ఒకటి ఉపయోగించండి.
03:32 ఎడమవైపుకు లేదా కుడివైపుకు handle ను క్లిక్ చేసి లాగండి.
03:39 దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు లో వచ్చే మార్పును గమనించండి.
03:43 ఇప్పుడు, దీర్ఘ చతురస్రం యొక్క పొడవును మార్పు చేద్దాం.
03:46 కనుక, handle పైభాగం లో లేదా కింది భాగంలో క్లిక్ చేద్దాం ఇంకా లాగుదాం.
03:51 దీర్ఘ చతురస్రం యొక్క పొడవులో వచ్చే మార్పును గమనించండి.
03:54 Tool controls bar పైన Width మరియు Height పారామీటర్స్ ను మార్పు చేసి మనం కూడా దీర్ఘ చతురస్రం వెడల్పు మరియు పొడవులను మానవీయంగా మార్చవచ్చు.
04:03 నేను Width ను 400 మరియు Height ను 200 కు మార్పు చేస్తున్నాను.
04:07 దీర్ఘ చతురస్రం పరిమాణం లో వచ్చిన మార్పును గమనించండి.
04:10 ఇదే విధంగా, X మరియు Y యాక్సస్ పొజిషన్స్ ను మార్పుచేసి కూడా మీరు ఆబ్జెక్ట్ ను కదిలించవచ్చు.
04:19 ఇప్పుడు, దీర్ఘ చతురస్రాన్ని ఎలా రొటేట్ చేయాలో నేర్చుకుందాం.
04:24 ఇలా చేయటానికి, దీర్ఘ చతురస్రం పై మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి.
04:27 ఇప్పుడు, మూలలో ఉన్న handles ఆకారం, రొటేషన్ కొరకు సిద్ధంగా ఉన్నది అని సూచించేలా మారిందని గమనించండి.
04:34 నేను కుడి వైపు మూలలో ని పై handle పై క్లిక్ చేసి, దీర్ఘ చతురస్రాన్ని రొటేట్ చేస్తున్నాను.
04:44 ఏదయినా ఒక పక్క handles ను క్లిక్ మరియు డ్రాగ్ చేసి, మీరు దీర్ఘ చతురస్రాన్ని skew కూడా చేయవచ్చు.
04:50 నేను దీర్ఘ చతురస్రాన్ని skew చేయటానికి ఎడమ మధ్య handle ను క్లిక్ చేసి దానిని పైకి మరియు కిందకి లాగుతున్నాను.
04:56 నేను డ్రాగ్ చెస్తున్నప్పుడు మార్పులను గమనించండి.
04:59 మనం తరువాతి ట్యుటోరియల్ లో ఈ handles ను ఉపగించటం పై మరికొన్ని వివరాలను నేర్చుకుంటాం.
05:04 ఈ ఆకారము యొక్క ఎంపిక ని రద్దు చేద్దాం.
05:06 ఇలా చేయటానికి, కేన్వాస్ ఏరియా లో లేదా కేన్వాస్ బౌండరీ బయట ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:11 నేను mouse ను టూల్ బాక్స్ వద్దకు మరియు అదే rectangle టూల్ మీద కదిలిస్తాను.
05:17 మనం ఈ టూల్ ని ఉపయోగించి దీర్ఘ చతురస్రాలు మరియు చతురస్రాలు గీయవచ్చు అని టూల్ చిట్కా(టూల్ టిప్) చెప్తుంది.
05:22 కనుక, నేను ముందుగా ఈ టూల్ పై క్లిక్ చేస్తాను.
05:25 ఒక చతురస్రాన్ని గీయటానికి, సులువుగా Ctrl కీ ని పట్టుకోండి మరియు కేన్వాస్ పైన లాగండి.
05:30 నేను దీని కలర్ ను పింక్ కు మార్చుతున్నాను.
05:32 మీకోసం ఒక అసైన్మెంట్.
05:34 Tool box నుండి Create circles and ellipses టూల్ ను ఎంచుకోండి.
05:38 Ctrl కీ ని ఉపయోగించి, కేన్వాస్ పై ఒక వృత్తాన్ని గీయండి.
05:42 దానిని బ్లూ గా కలర్ కు మార్చండి.
05:44 ఇది నా వృత్తం.
05:46 ఇప్పుడు ఈ వృత్తాన్ని ఎలా మార్పు చేయవచ్ఛో నేర్చుకుందాం.
05:49 వృత్తం యొక్క ఆకారాన్ని ఒక arc లేదా ఒక segment కు మార్చటానికి, మీరు Start మరియు End పారామీటర్స్ ను మార్చవచ్చు.
05:56 ఇక్కడ Tool controls bar పై మూడు ఎంపికలు ఉన్నాయి. ఇవి ఆకారాల మధ్య మారటానికి సహాయం చేస్తాయి.
06:03 Start పారామీటర్ ను 100 మరియు End పారామీటర్ ను -50 కు మార్చుతున్నాను.
06:09 వృత్తం యొక్క ఆకారం ఒక సెగ్మెంట్ ఆకారాంలోకి మారింది అని చూడవచ్చు.
06:14 ఇప్పుడు నేను Arc చిహ్నం పై క్లిక్ చేస్తాను మరియు ఆకారం లో మార్పును మనం చూడవచ్చు
06:19 Circle, icon పై క్లిక్ చేసి, మళ్ళి వృతాకారాన్ని పొందవచ్చు.
06:25 ఇప్పుడు, మన canvas పై ఉన్న వృత్త ఆకారాన్ని దగ్గరగా చూద్దాం.
06:30 ఆకారం పై arc handles అని పిలవబడే 2 resize handles మరియు 2 circular handles ఉన్నాయి గమనించండి.
06:37 2 resize handles ను వృత్తాన్ని ఒక దీర్ఘవృత్త ఆకారం లోకి మార్చటానికి ఉపయోగిస్తాము.
06:44 పై నుండి కిందకి లేదా ఎడమ నుండి కుడి దిశలలో ఉన్న ఈ handles ను కేవలం లాగండి.
06:53 ఆకారం లో వచ్చిన మార్పులను గమనించండి.
06:56 2 arc handles ఒకదానితో ఒకటి ఓవెర్లాప్ అవుతాయి. arc handle పై క్లిక్ చేసి, దానికి అపసవ్యదిశలో కదిలించండి.
07:04 ఇప్పుడు మనం రెండు arc handles ను చూడవచ్చు.
07:08 ఈ arc handles ను ఉపయోగించి వృత్త ఆకారాన్ని ఆర్క్ లేదా సెగ్మెంట్ ఆకారం లోకి మార్పు చేయవచ్చు.
07:14 వాటిని కేవలం సవ్య లేదా అపసవ్య దిశలలో కదిలించాలి మరియు ఆకారం లో వచ్చే మార్పుని గమనించాలి.
07:24 ఇప్పుడు, మనం Tool box లోని rectangle tool పై క్లిక్ చేద్దాం. తరువాత చతురస్రం పై క్లిక్ చేద్దాం.
07:30 ఆకారం యొక్క కుడి ఎగువ మూలపై ఉన్న 2 resize handles మరియు 2 arc handles ను గమనించండి.
07:40 ముందు వలె, 2 arc handles ఒక దానితో ఒకటి ఓవెర్లాప్ అవుతాయి.
07:43 ఏదయినా ఒక arc handle పై క్లిక్ చేయండి మరియు దానిని సవ్యదిశలో కదిలించండి.
07:48 ఇప్పుడు మనం రెండు arc handles ను చూడవచ్చు.
07:51 మనం ఈ handles ను ఉపయోగించి చేతురస్రానికి గుండ్రని అంచులను ఇవ్వవచ్చు.
07:56 వాటిని సవ్య లేదా అపసవ్య దిశలలో కదిలించాలి మరియు ఆకారం లో వచ్చే మార్పుని గమనించాలి.
08:02 ఇప్పుడు, Tool box నుండి Stars and polygons tool పై క్లిక్ చేసి ఒక బహుభుజి ని రూపొందిద్దాం.
08:08 ఇది circle టూల్ కు సరిగ్గా కిందన ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
08:13 ఇదే విధంగా మనం ఒక బహుభుజిని గీద్దాం ఇంకా దాని రంగును ఆకుపచ్చగా మార్చుదాం.
08:20 అప్రమేయంగా,5-పక్కలతో ఒక బహుభుజి వస్తుంది. అంటే ఒక పంచభుజి గీయబడింది.
08:24 Tool controls bar వద్ద చుడండి. ఇక్కడ, బహుభుజి యొక్క మూలల సంఖ్య 5 అని ఇది చెప్తుంది.
08:32 సంఖ్యను 4 కి తగ్గించటం చేత ఒక చతురస్రాన్ని మరియు 3కి తగ్గించటం చేత ఒక త్రిభుజాన్ని మీరు రూపొందించవచ్చు.
08:39 దానిని పెంచటం చేత, మనం ఒక పంచభుజి, షడ్భుజి మరియు ఆపైన వాటిని రూపొందించవచ్చు.
08:44 బహుభుజి పై ఒక resize handle ఉంది గమనించండి.
08:47 మనం దానిని బహుభుజి ని రీసైజ్ లేదా రొటేట్ చేయటానికి ఉపయోగించవచ్చు.
08:52 Tool controls barలోని polygon చిహ్నానికి తరువాత ఉన్నstar చిహ్నం పై క్లిక్ చేసి ఆకారాన్ని ఒక నక్షత్రం ఆకారం లోకి మార్చండి.
09:00 నక్షత్రం ఆకారం పై 2 handles –ఒకటి కొనవద్ద మరియు ఇంకొకటి ఉమ్మడి వద్ద ఉన్నాయి గమనించండి.
09:06 నక్షత్రాన్ని రీసైజ్ లేదా రొటేట్ చేయడానికి హేండిల్ ని క్లిక్ చేసి నక్షత్రం కొనవద్దకు లాగండి.
09:12 మనం వేరొక handleఉపయోగించి నక్షత్రం ఆకారాన్నిresize మరియు skew చేయవచ్చు.
09:17 దానిపై క్లిక్ చేసి సవ్య లేదా అపసవ్య దిశలలో కదిలించండి మరియు ఆకారం మరియు పరిమాణం లలో మార్పును గమనించండి.
09:25 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
09:30 ఈ ట్యుటోరియల్ లో మనం, Inkscape ఇంటర్ఫేస్ గూర్చి నేర్చుకున్నాం.
09:34 మనం ఇవి కూడా నేచుకున్నాం - ప్రాధమిక ఆకారాలు దీర్ఘ చతురస్రం, చతురస్రం, వృత్తం, దీర్ఘ వృత్తం, బహుభుజి మరియు నక్షత్రం వంటివి రూపొందించడం
09:42 ఆకారాలలోకి రంగును నింపడం మరియు handles ఉపయోగించి ఆకారాలను మార్పు చేయటం.
09:46 మీకోసం ఇక్కడొక అసైన్మెంట్.
09:49 ఒక దీర్ఘ చతురస్రాన్ని రూపొందించి నీలం రంగుతో నింపండి.
09:52 ఎరుపు రంగుతో ఒక వృత్తాకారం.
09:54 పచ్చ రంగులో 7 ప్రక్కలతో ఒక నక్షత్రం.
09:58 మీరు పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
10:03 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:09 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org
10:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:32 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
10:38 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
10:47 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
10:50 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya