C-and-Cpp/C2/Scope-Of-Variables/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:12, 24 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00:11 వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి?
00:13 గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి?
00:16 లోకల్ వేరియబల్ అంటే ఏమిటి?
00:19 కొన్ని ఉదాహరణలు.
00:22 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను.
00:27 ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి:
00:30 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4:6:1
00:41 స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం.
00:47 ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్ను యక్సిస్ చేయవచ్చు.
00:54 దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి:
00:59 గ్లోబల్ వేరియబుల్ మరియు
01:02 లోకల్ వేరియబుల్.
01:05 ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.
01:07 నేను ప్రోగ్రాం ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
01:10 దాన్ని తెరుస్తాను.
01:14 మన ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి.
01:19 ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను.
01:23 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:26 ఇక్కడ a మరియు b అనే రెండు గ్లోబల్ వేరియబుల్ను(Global Variables) ప్రకటించాము.
01:32 మరియు వాటిని 5 మరియు 2 విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం.
01:39 గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది.
01:44 వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు.
01:51 వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది.
01:53 ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము.
01:59 ఇక్కడ sum లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము.
02:07 లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్కు మాత్రం చేందుతుంది.
02:13 వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు.
02:16 వీటికి లోకల్ స్కోప్ (local scope) ఉంటుంది.
02:19 a మరియు b ల మొత్తం వేరియబల్ sum లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం.
02:29 ఇది మన మెయిన్ ఫంక్షన్ .
02:33 యాడ్ ( add )ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది.
02:38 ఇది మన రిటర్న్ వాక్యం.
02:40 ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి.
02:43 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
02:45 Ctrl, Alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:55 కంపైల్ చేయుటకు, gcc space scope.c space hyphen o space sco (gcc scope.c -o sco) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:05 ఎక్సిక్యూట్ చేయుటకు, ./sco (డాట్ స్లాష్ ఎస్ సి ఓ), టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:10 ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది.
03:13 Sum of a and b is 7 .
03:16 ఇదే ప్రోగ్రాంను C++ లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం .
03:20 మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా Shift, Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి.
03:31 ఫైల్కు .cpp ఎక్స్టెంషన్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయండి.
03:41 హెడ్డర్ ఫైల్ను iostream కు మారుద్దాం.
03:47 ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి సేవ్ పైన క్లిక్ చేయండి.
03:58 గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన C++ లో C లాగే ఉంటుంది.
04:03 అందుకే ఏమార్పు అవసరం లేదు.
04:07 ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి.
04:13 ఫార్మాట్ స్పెసిఫయ్యర్ ( format specifier ) మరియు \n ను తొలగించండి.
04:17 ఇప్పుడు కమాను తొలగించండి.
04:19 రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
04:22 క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
04:26 మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి.
04:35 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
04:39 టర్మినల్కు తిరిగి రండి.
04:42 కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి.
04:52 ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) sco న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం.
05:04 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
05:07 ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1 టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
05:14 మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7 .
05:19 ఇది C కోడ్ కు సమానమే అని గమనించండి.
05:27 ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
05:31 మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ a ని మరల ప్రకటించాననుకోండి ,
05:41 int a మరియు సెమికోలన్ టైప్ చేయండి.
05:45 సేవ్ పైన క్లిక్ చేయండి. a వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము.
05:55 ఎమౌతుందో చూద్దాం.
05:57 టర్మినల్ కు తిరిగి వద్దాం.
06:01 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,
06:05 Redefinition of int a , int a previously defined here . ఇలా ఎర్రర్లు కనబడుతాయి. మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
06:18 a ఒక గ్లోబల్ వేరియబల్.
06:20 దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది.
06:22 ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా ప్రకటించాము గనక.
06:27 వేరియబల్ a (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే ప్రకటించవచ్చు.
06:34 తప్పులను సరిదిద్దుదాం.
06:36 దీన్ని తొలగించండి.
06:39 సేవ్ పై క్లిక్ చేయండి.
06:41 మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్కు తిరిగి రండి.
06:45 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం.
06:49 చూసారా పనిచేస్తుంది.
06:52 ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం.
06:56 తరగతి సారాంశం.
06:58 ఈ తరగతి లో మనం నేర్చుకున్నది,
07:00 స్కోప్ అప్ వేరియబల్.
07:02 గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు
07:07 లోకల్ వారియబల్ ఉదా int sum;
07:12 ఒక అసైన్మెంట్గా,
07:14 రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్ను రాయడం.
07:19 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
07:22 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం.
07:25 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు.
07:30 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
07:32 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్లను(workshops) నిర్వహించును.
07:35 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
07:40 మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
07:47 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:52 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
08:00 ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది
08:04 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india