Python/C4/Getting-started-with-functions/Telugu
Time | Narration |
0:01 | హలో ఫ్రెండ్స్ 'గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫంక్షన్స్' ట్యుటోరియల్‌కు స్వాగతం. . |
0:05 | ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మీరు ఇవి చేయగలుగుతారు,
1. ఫంక్షన్‌ను నిర్వచించడం. 2. ఫంక్షన్స్‌ను ఆర్గుమెంట్స్తో నిర్వచించడం. 3. డాక్స్ట్రింగ్స్ గురించి నేర్చుకోవడం. 4. ఫంక్షన్ రిటర్న్ వాల్యూ గురించి నేర్చుకోవడం. 5. కోడ్ రీడ్ చేయడం. |
0:16 | ట్యుటోరియల్ మొదలుపెట్టే మునుపు, "కండిషనల్స్" మరియు "లూప్స్" మీద ట్యుటోరియల్ పూర్తి చేయమని మీకు సూచిస్తున్నాము. |
0:22 | కోడ్ వ్రాసేపుడు, మనం ఎల్లప్పుడు కోడ్ యొక్క లైన్ల్స్ సంఖ్య తగ్గించాలని చూస్తాము, ఇక ఫంక్షన్స్ అనేది కోడ్‌ను తిరిగి ఉపయోగకరం చేయడానికి ఒక మార్గం. |
0:32 | కనుక కోడ్ యొక్క అవే లైన్స్‌ను ఎన్ని సార్లు అవసరమయితే అన్ని సార్లు ఉపయోగించవచ్చు. |
0:35 | ఫంక్షన్ అనేది ఒక నిర్దిష్టమైన టాస్క్ నిర్వర్తించే ఒక మరింత పెద్దదయిన ప్రోగ్రాంలో ఒక కోడ్ యొక్క భాగం. ఇంకా అది మిగిలిన కోడ్ మీద సాపేక్షకంగా ఆధారపడి ఉండదు. |
0:43 | మనమిప్పుడు ఫంక్షన్స్‌కు మరింత సుపరిచితమవుదాము. |
0:48 | ఒక గణితశాస్త్రపు ఫంక్షన్ f యొక్క x = x square అనే ఫంక్షన్ పరిగణించండి. |
0:53 | ఇక్కడ x అనేది ఒక వేరియబుల్ ఇక xకు కల్పించే వివిధ వాల్యూస్ తో ఫంక్షన్ యొక్క వాల్యూ మారుతుంది. |
0:58 | x ఒకటి అయినపుడు, f(1) అనేది వాల్యూ 1ని ఇస్తుంది ఇక f(2) మనకు వాల్యూ 4 ఇస్తుంది. |
1:05 | ఇప్పుడు మనము పైథాన్‌లో x యొక్క ఫంక్షన్ f నిర్వచించడం ఎలాగో చూద్దాము. |
1:10 | కమాండ్ లైన్లో ipython అని టైప్ చేసి ఐపైథాన్ ఇంటర్ప్రెటర్ స్టార్ట్ చేయండి. |
1:17 | మనము మన x యొక్క ఫంక్షన్ f నిర్వచిద్దాము |
1:19 | కనుక def f టైప్ చేసి బ్రాకెట్స్ లో x కోలన్ టైప్ చేయండి
return x star x
|
1:29 | స్టార్ అనేది గుణాకారాన్ని సూచిస్తుంది |
1:34 | సరే అది ఫంక్షన్ నిర్వచించింది, కనుక మనము ఏమి చేసామో నేర్చుకునే ముందు అది అనుకున్న వాల్యూస్ ఇస్తుందో లేదో చూద్దాము, ప్రయత్నించండి. |
1:45 | f(1)
f(2)
|
1:52 | అవును, అది తదనుగుణ క్రమములో 1 మరియు 4 ఇచ్చింది. |
1:55 | ఇక ఇప్పుడు మనం మనమేమి చేసామో చూద్దాము. |
1:58 | మనము రెండు లైన్లు వ్రాసాము. మొదటి లైను def f of x అనేది ఫంక్షన్‌కి నేమ్ మరియు పారామీటర్స్ నిర్వచించడానికి ఉపయోగించాము, ఇక రెండవ లైను ఫంక్షన్ ఏమి ఇవ్వాలో అది ఫిక్స్ చేయడానికి ఉపయోగించాము. |
2:12 | def అనేది కీవర్డ్, f అనేది ఫంక్షన్ యొక్క నేమ్ ఇక x అనేది ఫంక్షన్ యొక్క పరామీటర్. |
2:19 | వీడియో ఇక్కడ పాజ్ చేసి, ఈ క్రింది ఎక్సర్సైజ్ ప్రయత్నించి, వీడియోను పునఃప్రారంభించండి. |
2:24 | ఇవ్వబడిన నంబర్ n యొక్క క్యూబ్ కంప్యూట్ చేసే క్యూబ్ అనే పేరుగల పైథాన్ ఫంక్షన్ వ్రాయండి. |
2:31 | పరిష్కారం కోసం మీ టెర్మినల్ వైపు మరలండి. |
2:33 | సమస్యను ఈ విధంగా పరిష్కరించవచ్చు, |
2:36 | టెర్మినల్‌లో def cube అని టైప్ చేసి బ్రాకెట్స్లో n కోలన్ అని టైప్ చేయండి
return n star star 3
|
2:48 | మన ఫంక్షన్ నంబర్ యొక్క క్యూబ్ ఇస్తుందో లేదో చెక్ చేద్దాము. |
2:53 | కనుక cube టైప్ చేసి బ్రాకెట్స్లో 2 టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి. |
3:00 | అది 8 ఇచ్చింది, దాని అర్థం మనము మన ఫంక్షన్‌ను సరైన పధ్ధతిలో నిర్వచించాము. |
3:05 | ఇక ఇప్పుడు మనము ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఫంక్షన్స్ వ్రాయడం ఎలాగో చూద్దాము. |
3:09 | మనము Hello World ప్రింట్ చేసే గ్రీట్ అనే క్రొత్త ఫంక్షన్ నిర్వచిద్దాము. |
3:15 | కనుక def greet() కోలన్ టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి. |
3:26 | తర్వాత ప్రింట్ డబుల్ కోట్స్‌లో Hello World ఎక్స్క్లమేషన్ టైప్ చేయండి |
3:39 | ఇప్పుడు మనము ఫంక్షన్‌ను greet() అని ఎంటర్ హిట్ చేస్తాము. |
3:45 | సరే అది ఆర్గ్యుమెంట్స్ తీసుకోని ఫంక్షన్. |
3:49 | అంతేకాక ఒక ఫంక్షన్ వాల్యూస్ ఇవ్వడం అనేది తప్పనిసరి కాదు అన్న విషయం గుర్తుంచుకోండి. |
3:53 | greet అనే ఫంక్షన్ ఏదయినా ఆర్గ్యుమెంట్ గానీ లేదా వాల్యూ గానీ తీసుకోదు. |
3:57 | మనమిప్పుడు ఒకటికన్నా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్‌తో ఫంక్షన్స్ ఎలా వ్రాయాలో చూద్దాము. |
4:03 | వీడియోను ఇక్కడ పాజ్ చేసి, క్రింది అభ్యాసం ప్రయత్నించి, వీడియోను పునఃప్రారంభించండి. |
4:08 | a మరియు b యొక్క సగటు కంప్యూట్ చేసే avg అనే పేరుగలిగిన పైథాన్ ఫంక్షన్ వ్రాయండి. |
4:16 | పరిష్కారం కోసం మీ టెర్మినల్ వైపు మరలండి. |
4:19 | def avg అని టైప్ చేసి బ్రాకెట్స్లో కామా b కోలన్ టైప్ చేయండి
return within bracket a + b divided by 2
|
4:36 | డివిజన్ కొరకు మనము స్లాష్ ఉపయోగిస్తాము. |
4:42 | మనము మన ఫంక్షన్ టెస్ట్ చేద్దాము. |
4:44 | టెర్మినల్ మీద avg టైప్ చేసి బ్రాకెట్స్లో 20 కామా 30 టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి. |
4:53 | మనకు సరైన సగటు, 25 లభిస్తుంది. |
4:56 | కనుక ఒకవేళ మనము ఒక ఫంక్షన్ మరిన్ని ఆర్గ్యుమెంట్స్ స్వీకరించాలి అనుకుంటే, def లైనులో ఫంక్షన్ యొక్క నేమ్ తర్వాత పారెంథీసిస్ మధ్యలో వాటిని కామాతో వేరు చేసి లిస్ట్ చేస్తాము. |
5:06 | మనం వ్రాసే కోడ్‌ను డాక్యుమెంట్ చేయడం అనేది ఎల్లప్పుడు మంచి అలవాటు, ఇక మనం నిర్వచించే ఫంక్షన్‌కు ఫంక్షన్ ఏమి చేస్తుందనే విషయమై ఆబ్స్ట్రాక్ట్ వ్రాయాలి, దానినే docstring అంటారు. |
5:19 | మనము avg ఫంక్షన్‌ను మార్చి దానికి docstring ఆడ్ చేద్దాము. |
5:24 | ఈ క్రిందివి చేయండి. |
5:25 | కనుక ఇప్పుడు టెర్మినల్‌లో def avg టైప్ చేసి బ్రాకెట్స్లో a కామా b కోలన్ టైప్ చేయండి. |
5:38 | తర్వాత ట్రిపుల్ డబుల్ కోట్లో మీరు avg టైప్ చేయవచ్చు అది రెండు నంబర్లను (ab) ఇన్‌పుట్‌గా తీసుకుని a మరియు b యొక్క సగటును ఇస్తుంది. |
5:50 | తర్వాత return return టైప్ చేసి బ్రాకెట్స్లో a+b డివైడెడ్ బై 2 టైప్ చేయండి |
6:02 | సింటాక్స్ ఎర్రర్ ఉన్నట్లు గుర్తించండి. |
6:09 | ఇక్కడ మనము చూసిన ఎర్రర్ రిటర్న్ (a+b)/2 లో ఉండే ఇండెంటేషన్ ఎర్రర్ వల్ల కలిగినది. |
6:15 | కనుక ఆ కమాండ్‌ను కేవలం ఇన్పుట్ చేయండి చాలు. |
6:25 | కనుక def avg అని టైప్ చేసి బ్రాకెట్స్లో a కామా b కోలన్ టైప్ చేయండి
""" avg రెండు నంబర్లను ఇంపుట్ (ab)గా తీసుకుని, a మరియు b యొక్క సగటు ఇస్తుంది """ return within bracket a+b divided by 2 |
6:45 | డాక్స్ట్రింగ్స్ ఫంక్షన్ డెఫినిషన్ తర్వాత తదుపరి లైనులో వచ్చేలా చూసుకుని ట్రిపుల్ కోటెడ్ స్ట్రింగ్‌గా అమర్చండి. |
6:55 | ఇక ఇక్కడ కోడ్ ఫంక్షనాలిటీకి సంబంధించినంత వరకు, మనము ఏమీ చేయలేదు. |
7:00 | మనము ఫంక్షన్ ఏమి చేస్తుందనే విషయమై కేవలం ఒక ఆబ్స్ట్రాక్ట్ ఆడ్ చేసాము. |
7:03 | ఇప్పుడు దీనిని ఐపైథాన్ ఇంటర్ప్రెటర్లో ప్రయత్నించండి. |
7:07 | avg మరియు క్వెస్చన్ మార్క్ టైప్ చేయండి. |
7:12 | మనము ఇచ్చిన విధంగా అది డాక్స్ట్రింగ్ డిస్ప్లే చేస్తుంది. |
7:16 | కనుక డాక్స్ట్రింగ్ అనేది మనము వ్రాసే ఫంక్షన్‌ను డాక్యుమెంట్ చేయడానికి మంచి మార్గం. |
7:21 | ఇప్పుడు కామా f క్వెస్చన్ మార్క్ టైప్ చేసి ఎంటర్ హిట్ చేయండి. |
7:29 | దానికి దానితో సంబంధము కలిగిన డాక్స్ట్రింగ్ ఉన్నది. |
7:37 | సారీ దానికి దానితో సంబంధము కలిగిన డాక్స్ట్రింగ్ లేదు. |
7:40 | అంతే కాక మనము ఫంక్షన్ నేమ్ నుండి ఏమీ గ్రహించలేము, కనుక మనము కోడ్‌ను రీడ్ చేసి ఫంక్షన్‌ను అర్థం చేసుకోక తప్పదు. |
7:48 | వీడియో ఇక్కడ పాజ్ చేసి, క్రింది అభ్యాసం ప్రయత్నించి వీడియో పునఃప్రారంభించండి. |
7:54 | ఫంక్షన్ fకు డాక్స్ట్రింగ్ ఆడ్ చేయండి. |
7:59 | ఫంక్షన్ fకు డాక్స్ట్రింగ్ మరల ఆడ్ చేయడానికి మనము ఫంక్షన్‌ను తిరిగి నిర్వచించాల్సిన అవసరం ఉంది, అది మనం ఎలా చేస్తామంటే, |
8:06 | def f బ్రాకెట్స్లో x కోలన్ |
8:13 | """నంబర్ xను ఆర్గ్యుమెంట్గా స్వీకరించి, నంబర్ x యొక్క స్క్వేర్ రిటర్న్ చేస్తుంది.""" |
8:24 | return x star x |
8:32 | మనము మరొక అభ్యాసము పరిష్కరిద్దాము. |
8:34 | వీడియోను ఇక్కడ పాజ్ చేసి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియో పునఃప్రారంభించండి. |
8:41 | రేడియస్ r ఇచ్చిన సందర్భములో సర్కిల్ (Circle) యొక్క వైశాల్యము మరియు చుట్టుకొలత ఇచ్చే సర్కిల్ అనే పేరుగల పైథాన్ ఫంక్షన్ వ్రాయండి |
8:52 | పరిష్కారం కోసం టెర్మినల్ వైపు మరలండి. |
8:57 | ఇప్పటిదాకా చేస్తున్న విధంగా కాక ఈ సమస్య ఒకటికి బదులు రెండు వాల్యూస్ రిటర్న్ చేయాల్సిన ఆవశ్యకత కల్పిస్తుంది. |
9:03 | మనము సమస్యను ఈ విధంగా పరిష్కరించగలము, |
9:05 | కనుక మనం ఇప్పుడు టెర్మినల్‌లో టైప్ చేయగలము
def circle within bracket r colon
|
10:04 | ఒక పైథాన్ ఫంక్షన్ ఎన్ని వాల్యూస్ అయినా రిటర్న్ చేయగలదు. |
10:07 | దానిని ప్రతిబంధకం ఏమీ లేదు. |
10:09 | మనం ఫంక్షన్ సర్కిల్‌ను ఈ విధంగా అందాము, |
10:12 | టెర్మినల్ మీద టైప్ చేయండి a కామా p = సర్కిల్ బ్రాకెట్స్లో 6 |
10:39 | ప్రింట్ a ప్రింట్ p |
10:46 | ఇక్కడ పాజ్ చేసి ఫంక్షన్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. |
10:54 | def what within bracket n colon |
10:58 | if n less than 0 colon n = -n while n greater than 0 colon |
11:08 | if n modulo 2 == 1 colon |
11:12 | return False |
11:14 | n slash = 10 |
11:19 | ఇక తర్వాతి లైను రిటర్న్ True |
11:23 | పాజ్ చేయబడిన స్థితి నుండి కొనసాగండి అది ఒక వేళ n modulo 2, 1తో సమానం కాకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది అలా కాని సందర్భంలో అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. |
11:36 | నంబర్ n యొక్క అన్ని అంకెలు సరిసంఖ్యలయితే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. |
11:45 | ఇప్పుడు మరి ఒక కోడ్ రీడింగ్ అభ్యాసము, |
11:51 | కనుక అది def even underscore digits బ్రాకెట్స్లో n కోలన్ ఇచ్చింది
"""నంబర్ n యొక్క అన్ని అంకెలు సరిసంఖ్యలయితే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది""" |
12:13 | తర్వాతి లైను if n less than 0 colon n = -n while n greater than 0 colon |
12:24 | తర్వాతి లైను if n modulo 2 == 1 colon
return False n slash= 10 return True |
12:40 | ఇక్కడ పాజ్ చేసి ఫంక్షన్ ఏమి చేస్తుందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. |
12:48 | def what within bracket n colon |
12:52 | i = 1 while i star i les than n colon |
12:59 | i += 1 |
13:02 | return i star i == n comma i |
13:07 | పాజ్ చేయబడిన స్థితి నుండి కొనసాగండి ఫంక్షన్ రెండు వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. |
13:11 | ఒకటి అది వైల్ స్టేట్మెంట్ యొక్క పరిణామం అంటే ట్రూ లేదా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రెండు అది ప్రస్తుతం హోల్డ్ చేస్తోన్న వాల్యూ ప్రింట్ చేస్తుంది. |
13:23 | ఇక్కడ, ఒక వేళ n పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, ఫంక్షన్ ట్రూ మరియు స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ మరియు తర్వాతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది |
13:37 | కనుక మనం దాని వైపు చూస్తాము |
13:40 | def is underscore perfect underscore square within bracket n colon
""" ఒక వేళ n పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, ఫంక్షన్ ట్రూ మరియు స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే అది ఫాల్స్ మరియు తర్వాతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ రిటర్న్ చేస్తుంది """ i = 1 while i star i less than n colon i += 1 return i star i == n comma i |
14:14 | ఇది ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను తీసుకువస్తుంది. |
14:17 | ఈ ట్యుటోరియల్‌లో మనము, నేర్చుకున్నది, 1. కీవర్డ్ def ఉపయోగించి పైథాన్‌లో ఫంక్షన్స్ నిర్వచించడం. |
14:22 | 2. ఫంక్షన్ నేమ్ నిర్దేశించి ఫంక్షన్‌ను కాల్ చేయడం |
14:25 | 3. ఒక ఫంక్షన్‌ను ట్రిపుల్ కోటెడ్ స్ట్రింగ్‌గా పెట్టి దానికి డాక్స్ట్రింగ్ ఏర్పాటు చేయడం |
14:33 | 4. ఫంక్షన్‌కు పారామీటర్స్ పాస్ చేయడం. |
14:37 | 5. ఫంక్షన్ నుండి వాల్యూస్ రిటర్న్ చేయడం. |
14:39 | మీరు పరిష్కరించడానికి ఇక్కడ కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి |
14:42 | 1. ఫంక్షన్ ఏమి చేస్తుంది? |
14:46 | def what(x) |
14:48 | return x star x |
14:50 | Returns the square of x |
14:52 | Returns x |
14:54 | ఫంక్షన్‌కు డాక్స్ట్రింగ్ లేదు |
14:57 | Error |
14:59 | ● 1ఒక పైథాన్ ఫంక్షన్‌కు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయవచ్చు?
● ఒకటి కూడా చేయలేము ● ఒకటి ● రెండు ● ఎన్నయినా ● |
15:07 | 1. రెక్టాంగిల్ యొక్క వైశాల్యం కాల్క్యులేట్ చేసే ఫంక్షన్ వ్రాయండి. |
15:12 | ఇక సమాధానాలు, |
15:14 | 1. ఫంక్షన్ నిర్వచించడములో తప్పుడు సింటాక్స్ ఉపయోగించడం వలన ఫంక్షన్ ఎర్రర్‌గా పరిణమిస్తుంది. |
15:27 | ఫంక్షన్ లైన్ ఎల్లప్పుడు కోలన్తో అంతమవుతుంది |
15:32 | ఒక పైథాన్ ఫంక్షన్‌కు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయవచ్చును. |
15:37 | మనకు తెలుసు, రెక్టాంగిల్ యొక్క వైశాల్యం దాని పొడవు మరియు వెడల్పుల యొక్క గుణాకారం. |
15:41 | కనుక, మనము మన ఫంక్షన్‌ను ఈ విధంగా నిర్వచిస్తాము, |
15:42 | def area within bracket l comma b colon |
15:47 | return l star b |
15:51 | మీరు ఈ ట్యుటోరియల్ ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా భావించారనీ అనుకుంటున్నాము. |
15:55 | ధన్యవాదములు! |