LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:16, 3 March 2017 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Linking గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేది: |
00:10 | క్యాల్క్లో ఇతర షీట్స్‌ను ఎలా రెఫెర్ చేయాలి. |
00:13 | క్యాల్క్లో హైపర్ లింక్‌లను ఎలా వాడాలి. |
00:17 | మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. |
00:29 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్, |
00:33 | వేరొక్క షీట్‌లోని సెల్‌ను ప్రస్తుత షీట్‌లోని సెల్‌కు రిఫరెన్స్ చేయడానికి మరియు |
00:37 | ఒకవేళ రెండు స్ప్రెడ్ షీట్లను సేవ్ చేస్తే, వేరొక్క షీట్‌లోని సెల్‌ను రిఫరెన్స్ చేయడానికి అనుమతిస్తుంది. |
00:44 | Personal-Finance-Tracker.ods తెరుద్దాం. |
00:49 | మన ఫైల్లోని షీట్1లో, Personal Finance Tracker యొక్క స్ప్రెడ్‌షీట్ వుంది. |
00:55 | “Spent” మరియు “Received”కాలమ్స్‌కు నేను కొంత మొత్తాలను జోడించాను. |
01:04 | ఇప్పుడు, “Cost” మరియు“Spent” దిగువన వున్న కంపోనేంట్స్ యొక్క మొత్తంను కనుక్కుందాం. |
01:11 | C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, “is equal to SUM” మరియు బ్రేసెస్లో C3 కోలన్ C7 సూత్రమును ప్రవేశ పెట్టండి. |
01:24 | ఎంటర్ నొక్కండి. |
01:27 | C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి,అదే సూత్రమును వాడి మొత్తాన్ని కనుక్కుందాం. |
01:36 | ఇప్పుడు మనం వేరే షీట్లో సెల్ రేఫెరెంసింగ్తో “Cost” మరియు “Spent” కింద మొత్తం యొక్క బాలన్స్‌ను చూపిద్దాం. |
01:45 | “Sheet 2” ట్యాబు పై క్లిక్ చేద్దాం. |
01:48 | ఇది ఒక కొత్త షీట్‌ను తెరుస్తుంది. |
01:51 | ఇప్పుడు A1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “COMPONENT” అని టైపు చేద్దాం. |
02:00 | B1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “BALANCE” అని టైపు చేద్దాం. |
02:07 | ఇప్పుడు, “COMPONENT” హెడ్డింగ్ దిగువన పేర్లను ప్రవేశ పెడదాం. |
02:12 | A3చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “COST” అని టైపు చేసి, ఎంటర్ నొక్కుదామ్. |
02:19 | “COST” దిగువన, A4చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్లో మరొక కంపోనేంట్ “SPENT” ప్రవేశ పెడదాం. |
02:27 | ఖాళీ సెల్ B3 పై క్లిక్ చేద్దాం. |
02:31 | B3 మరియు B4 సెల్లో “COST” మరియు “SPENT” హెడ్డింగ్‌ల కింద, మనం |
02:38 | “Sheet 1”లో లెక్కించిన టోటల్ బాలన్స్ వుంది. |
02:41 | ఇది రెఫెరెన్సింగ్ ద్వారా చేయబడింది. |
02:44 | B3 సెల్లో సెల్ రెఫెరెన్సింగ్ చేయడానికి, “Input line” పక్కన ఉన్న “equal to” (“ఈక్వల్ టు ”) గుర్తు పై క్లిక్ చేయండి. |
02:53 | ఇప్పుడు, “Sheet 1” ట్యాబు పై క్లిక్ చేయండి. |
02:59 | ఈ షీట్లో, “Cost”కాలమ్ కింద వున్నవాటి మొత్తాన్ని కలిగివున్న C9 సెల్ పై క్లిక్ చేద్దాం. |
03:07 | “Input line(ఇన్పుట్ లైన్)”లో స్టేట్ మెంట్, “షీట్ 1 డాట్ C9” కనిపించడం గమనించండి. |
03:15 | ఇప్పుడు, “Input line(ఇన్పుట్ లైన్)” పక్కన వున్న చెక్ మార్క్ పై క్లిక్ చేయండి. |
03:20 | “Sheet 1” ట్యాబులోని “Cost” కింద వున్న డేటా మొత్తం, “Sheet 2” ట్యాబులో రిఫరెన్స్ చేయబడిన B3 సెల్లో స్వయంచాలకంగా రావడం గమనించండి. |
03:34 | ఇదే విధముగా, రెఫెరెన్సింగ్ ద్వారా ఇతర కంపోనేంట్ల మొత్తంలను లేదా గ్రాండ్ టోటల్స్‌ను కుడా కనుక్కోవచ్చు. |
03:41 | ఎక్కువ మాత్రలో వున్న డేటాను చాలా షీట్స్‌లోని డేటాను సంక్షిప్తము చేయడానికి రెఫెరెన్సింగ్ చాలా వుపయోగబడుతుంది. |
03:49 | ఇప్పుడు, క్యాల్క్ షీట్లలో హైపర్ లింక్‌లను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
03:55 | మీరు హైపెర్లిన్క్స్ తో
స్ప్రెడ్షీట్లోని ఇతర స్థానాలకు ఇతర ఫైల్స్‌కు లేదా వెబ్ సైట్స్‌కు వెళ్ళవచ్చు. |
04:06 | Personal-Finance-Tracker.ods లో, పర్సనల్ ఫైనాన్సు ట్రాకర్ “Sheet 1”లో వుంది మిగితా వివరాలు “Sheet 2”లో ఉన్నాయి. |
04:17 | ఒక వేళ మనం షీట్ 1 నుండి షీట్ 2కు వెళ్ళాలంటే, |
04:22 | “Sheet 1” ట్యాబు పై క్లిక్ చేయండి. |
04:25 | B14గా రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేసి, షీట్ 2కు వెళ్దాం. |
04:33 | ”Sheet 2” పేరు ఇన్పుట్ లైన్లో రావడం గమనించండి. |
04:38 | ఇప్పుడు, ఇన్పుట్ లైన్‌లోని టెక్స్ట్ ”Sheet 2”ను ఎంపిక చేసుకుందాం. |
04:44 | టెక్స్ట్‌ను ఎంపిక చేసుకున్నాక టూల్‌బార్‌లోని “Hyperlink(హైపర్ లింక్)” ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:51 | Hyperlink డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
04:55 | ఎడమ వైపు ఉన్న, “Document” ఎంపికని ఎంచుకుందాం. |
04:59 | డైలాగ్ బాక్స్‌లోని Target in document ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:04 | ఒక కొత్త Target in document డైలాగ్ బాక్స్ వస్తుంది. |
05:08 | ఇప్పుడు, “Sheet” ఎంపిక పక్కన వున్న”+( ప్లస్)” గుర్తు పై క్లిక్ చేయండి. |
05:13 | కనిపించే డైలాగ్ బాక్స్‌లో, “Sheet 2” ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:18 | ఇప్పుడు, “Apply” బటన్ పై క్లిక్ చేసి “Close” బటన్ పై క్లిక్ చేయండి. |
05:24 | హైపర్ లింక్ డైలాగ్ బాక్స్‌లో, “Apply” పై క్లిక్ చేసి “Close” పై క్లిక్ చేయండి. |
05:32 | షీట్ 1 ట్యాబ్, షీట్ 2 టెక్స్ట్ తో సెల్లో హైలైట్ చెయ్యబడి ఎదురుగా కనిపిస్తుంది.. |
05:40 | ఇప్పుడు, “Sheet 2” టెక్స్ట్ పై క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ప్రవేశ పెట్టిన Cost యొక్క balance కలిగివున్న షీట్ వద్దకు తీసుకెళ్తుంది. |
05:51 | మనం హైపర్ లింక్‌ను సృష్టించాము! |
05:55 | హైపర్ లింక్‌ను తీసివేయడానికి, మొదట హైపర్ లింక్ చేయబడిన టెక్స్ట్ “Sheet 2”ను ఎంపిక చేసుకోండి. |
06:01 | ఇప్పుడు రైట్ క్లిక్ చేసి , కాంటెక్స్ట్ మెనూ నుండి “Default Formatting” ఎంపిక పై క్లిక్ చేయండి. |
06:09 | టెక్స్ట్ ఇక పై హైపర్ లింక్ చెయ్యబదిలేదు. |
06:12 | ఇది డాక్యుమెంట్‌లోని మామూలు టెక్స్ట్ లాంటిదే. |
06:16 | మార్పులను అన్డూ చేద్దాం. |
06:20 | ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
06:25 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
క్యాల్క్ లో ఇతర షీట్స్‌ను రిఫరెన్స్ చేయడం. |
06:31 | క్యాల్క్ లో హైపర్ లింక్‌ను వాడడం. |
06:36 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:40 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
06:43 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
06:47 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
06:52 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారి చేస్తుంది. |
06:56 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
07:03 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
07:07 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది |
07:15 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్‌లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
07:25 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు. |