Linux/C2/Working-with-Regular-Files/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:51, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:00 | లినక్స్ లోని రెగ్యులర్ ఫైల్స్ తో పని చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. |
00:07 | ఫైల్స్ మరియు డైరెక్టరీ లు రెండూ కలిసి లినక్స్ ఫైల్ సిస్టం ను ఏర్పరుస్తాయి. |
00:13 | గత ట్యుటోరియల్ లో డైరెక్టరీలతో ఎలా పని చేయాలో నేర్చుకున్నాము. మీరు ఈ వెబ్ సైట్ లో ఆ ట్యుటోరియల్ ను చూడవచ్చు. |
00:25 | ఈ ట్యుటోరియల్ లో రెగ్యులర్ ఫైల్స్ తో ఎలా పని చేయాలో చూద్దాము. |
00:31 | ఒక cat కమాండ్ ను వాడి ఒక ఫైల్ ను ఎలా సృష్టించాలో గత ట్యుటోరియల్ లో చూసాము. వివరముల కొరకు దయచేసి ఈ వెబ్ సైట్ ను చూడండి. |
00:46 | ఒక ఫైల్ ను ఒక చోటు నుంచి మరొక చోటుకి ఎలా కాపీ చేయడానికి మనకు cp కమాండ్ ఉన్నది. |
00:55 | ఈ కమాండ్ ఎలా వాడవచ్చో చూద్దాము. |
01:00 | ఒక ఫైల్ ను కాపీ చేయడము కొరకు మనము
cp స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [OPTION]... స్పేస్ సోర్స్ ఫైల్ యొక్క పేరు స్పేస్ డెస్టినేషన్ పైల్ పేరు టైప్ చేస్తాము. |
01:15 | ఒకేసారి చాలా ఫైల్స్ ను కాపీ చేయడము కొరకు .
cp స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [OPTION]... స్పేస్ మనము కాపీ చేయాలి అని అనుకుంటున్న సోర్స్ ఫైల్స్ పేర్లు స్పేస్ డెస్టినేషన్ డైరెక్టరీ పేరు టైప్ చేస్తాము. |
01:34 | ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాము. ముందుగా మనము ఒక టెర్మినల్ ను తెరుద్దం . |
01:42 | మన వద్ద ఇప్పటికే /home/anirban/arc/ లో test1 అనే పేరు ఉన్న ఫైల్ ఉన్నది. |
01:49 | test1 లో ఏమి ఉన్నదో చూడడానికి $ cat test1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం |
02:00 | test1 లో ఉన్న కంటెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు దానిని test2 అనే మరొక ఫైల్ లోకి కాపీ చేయాలి అని అనుకుంటే $ cp test1 test2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి |
02:22 | ఇప్పుడు ఫైల్ కాపీ చేయబడింది |
02:25 | test2 ఫైలు కనుక లేకపోతే మనము ముందుగా దానిని సృష్టించాలి ఆ తరువాత test1 లోని అంశమును దాని లోకి కాపీ చేస్తాము. |
02:35 | అది ఇప్పటికే ఉన్నటైతే అది సైలెంట్ గా ఓవర్ రైట్ చేయబడుతుంది. కాపీ చేయబడిన ఫైల్ టైప్ ను చూచుటకు $ cat test2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
02:52 | మీరు వేరు వేరు డైరెక్టరీల మధ్య ఇరు వైపులా ఫైల్స్ ను కాపీ చేయవచ్చు. ఉదాహరణకు
$ cp /home/anirban/arc/demo1 /home/anirban/demo2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
03:31 | ఇది సోర్స్ డైరెక్టరీ home/anirban/arc/ నుంచి demo1 ఫైల్ ను /home/anirban అనే డెస్టినేషన్ డైరెక్టరీ లో demo2 అనే ఫైల్ కు కాపీ చేస్తుంది. |
03:51 | demo2 అక్కడ ఉన్నదా లేదా అని చూచుటకు ls space /home/anirban అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
04:13 | మీరు ఇక్కడ demo2 పైకి స్క్రోల్ అవ్వడమును చూడవచ్చు. |
04:19 | ముందుకు వెళ్లటానికి ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేయండి. |
04:25 | డెస్టినేషన్ డైరెక్టరీలో ఉన్న పేరుతోనే ఫైల్ ఉండాలి అని మీరు అనుకుంటే , ఫైల్ పేరును ను ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు |
04:35 | $ cp /home/anirban/arc/demo1 /home/anirban/ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
05:03 | ఇది demo1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ ను /home/anirban/arc/ directory నుండి /home/anirban అనే directory లో మరలా demo1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ నుకాపీ చేస్తుంది. |
05:20 | మునుపు చూసినట్లుగా demo1 ను చూడడము కొరకు ls/home/anirban అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
05:33 | ఇక్కడ మనము పైకి స్క్రోల్ చేస్తే demo1 ఫైల్ అక్కడ కనిపిస్తుంది. |
05:40 | ముందుకు వెళ్ళటానికి ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేయండి. |
05:48 | మరొక సందర్భంలో మనము చాలా ఫైల్స్ ను కాపీ చేసుకోవాలి అని అనుకుంటే డెస్టినేషన్ ఫైల్ నేమ్ ఇవ్వవలసిన అవసరము లేదు |
05:56 | మన హోమ్ డైరెక్టరీలో test1 test2 test3 అనే పేర్లతో మూడు ఫైల్స్ ఉన్నాయి అని మనము అనుకుందాం. |
06:04 | ఇప్పుడు మనము $ cp test1 test2 test3 /home/anirban/testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
06:27 | ఇది మొత్తము test1,test2 మరియు test3 ఫైల్స్ ను వాటి పేర్లను మార్చకుండా /home/anirban/testdir అనే డైరెక్టరీకు కాపీ చేస్తుంది. |
06:41 | ఈ ఫైల్ కాపీ చేయబడింది అని చూడగలరు. మనము ls /home/anirban/testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
07:03 | ఈ డైరెక్టరీలో test1,test2 మరియు test3 ఫైల్స్ ను మీరు చూడవచ్చు. |
07:10 | cp తో పాటుగా చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనము చాలా ముఖ్యమైన వాటిని మాత్రమే చూస్తాము. |
07:18 | ముందుగా స్లైడ్స్ ను తిరిగి వెళ్దాం |
07:23 | అన్ని ఆప్షన్ లలో -R అనేది చాలా ముఖ్యమైనది. ఇది మొత్తము డైరెక్టరీ స్ట్రక్చర్ కూడా రికర్సివ్ కాపీయింగ్ అయ్యేలా చేస్తుంది. |
07:33 | ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. |
07:38 | ఇప్పుడు test అని పిలవబడే ఒక డైరెక్టరీకు testdir డైరెక్టరీలో ఉన్న మొత్తము వివరాల ను కాపీ చేసే ప్రయత్నము చేద్దాము. |
07:48 | దాని కొరకు మనము cp testdir/ test అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి |
08:02 | మీరు అవుట్ పుట్ మెసేజ్ ను చూడగలరు. |
08:06 | అదే కంటెంట్ కలిగి ఉన్న ఒక డైరెక్టరీను cp కమాండ్ ను వాడి మనము సాధారణముగా కాపీ చేయలేము |
08:14 | కానీ -R ఎంపిక ను వాడి మనము ఆ పని చేయవచ్చు. |
08:19 | ఇప్పుడు మనము cp -R testdir/ test అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
08:36 | ఫైల్స్ ఇప్పుడు కాపీ చేయబడ్డాయి, బెస్ట్ డైరెక్టరీ నిజముగా కాపీ చేయబడిందా లేదా అని చూడడము కొరకు ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
08:47 | test డైరెక్టరీ ను మీరు చూడగలరు. ఇప్పుడు స్క్రీన్ ను క్లియర్ చేయండి. |
08:57 | test లోపల ఉన్న కంటెంట్ ను చూడడము కొరకు ls test అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
09:08 | మీరు test డైరెక్టరీలో ఉన్న కంటెంట్ ను చూడగలరు. |
09:13 | ఇప్పుడు మనము తిరిగి స్లైడ్ లకు వెళదాము. |
09:16 | అప్పటికే ఉన్న ఒక ఫైల్ లోకి మరొక ఫైల్ కాపీ చేయబడితే పాత ఫైల్ ఓవర్ రైట్ చేయబడుతుంది అని మనము చూసాము. |
09:25 | మనము పొరపాటున ఒక ముఖ్యమైన ఫైల్ ను ఓవర్ రైట్ చేసినట్లు అయితే ఏమి చేయాలి? |
09:30 | అలాంటిది ఏమీ జరగకుండా నివారించడము కొరకు మనకు -b ఎంపిక ఉన్నది. |
09:36 | ఇది అప్పటికే ఉన్న ప్రతి ఒక్క డెస్టినేషన్ ఫైల్ యొక్క బాక్ అప్ ను తీసుకుని ఉంచుతుంది. |
09:41 | మనము -i(interactive) ఆప్షన్ ను కూడా వాడవచ్చు, ఇది ఏ డెస్టినేషన్ ఫైల్ ను అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా ప్రతిసారి మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. |
09:54 | ఇప్పుడు mv కమాండ్ ఎలా పని చేస్తుందో చూద్దాము. |
09:59 | దీనిని ఫైల్స్ ను మూవ్ చేయడము కొరకు వాడతారు. ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది? |
10:04 | దీనికి రెండు ముఖ్యమైన ఉపయోగములు ఉన్నాయి. |
10:07 | ఇది ఒక ఫైల్ లేదా డైరెక్టరీ ను రీనేమ్ చేయటానికి ఉపయోగపడుతుంది. |
10:11 | ఇది ఒక ఫైల్స్ యొక్క సమూహమును మరొక డైరెక్టరీకు మూవ్ చేయగలదు కూడా. |
10:17 | మనము ఇప్పటికే చూసిన cp కు mv చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు mv ను ఎలా వాడగలమో చూద్దాము. |
10:29 | మనము టెర్మినల్ ను ఓపెన్ చేసి $ mv test1 test2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం |
10:43 | అప్పటికే హోమ్ డైరెక్టరీలో test1 అనే పేరుతో ఉన్న ఫైల్ ను test2 అనే ఫైల్ గా ఇది రీనేమ్ చేస్తుంది. |
10:52 | test2 కనుక అప్పటికే ఉన్నట్లు అయితే దానిని సైలెంట్ గా ఓవర్ రైట్ చేస్తుంది. |
11:00 | ఫైల్ ఓవర్ రైట్ అవ్వడమునకు ముందుగా వార్నింగ్ కావాలి అని మనము అనుకున్నట్లయితే , |
11:05 | mv కమాండ్ తో పాటుగా మనము -i ఎంపిక ను కూడా వాడవచ్చు. |
11:10 | anirban అనే పేరుతో మరొక ఫైల్ ఉన్నది అని అనుకుందాము. ఈ ఫైల్ ను కూడా మనము test2 అని రెన్యూ చేయాలని అనుకుందాం |
11:20 | మనము mv -i anirban test2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాము. |
11:32 | test2 ను ఓవర్ రైట్ చెయ్యాలా వద్దా అని అడుగుతూ ఒక వార్నింగ్ ఇవ్వబడడమును మీరు చూడవచ్చు. |
11:41 | మనము y అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే, ఫైల్ ఓవర్ రైట్ చేయబడుతుంది. |
11:49 | cp లాగానే మనము mv ను బహుళ ఫైల్స్ కొరకు వాడవచ్చు, కానీ అలా వాడినప్పుడు డెస్టినేషన్ తప్పనిసరిగా ఒక డైరెక్టరీ అయి ఉండాలి. |
11:58 | ముందుకు వెళ్ళుటకు పూర్వము స్క్రీన్ ను క్లియర్ చేద్దాము. |
12:03 | మన home డైరెక్టరీలో abc.txt, pop.txt మరియు push.txt అనే మూడు ఫైల్స్ ఉన్నాయి అని అనుకోండి. |
12:14 | అవి ఉన్నాయో లేవో చూడడము కొరకు ls టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
12:21 | అవి pop.txt,push.txt మరియు abc.txt ఫైల్స్. ఇప్పుడు స్క్రీన్ ను క్లియర్ చేద్దాము. |
12:36 | ఇప్పుడు ఈ మూడు ఫైల్స్ ను మనము testdir అని పిలవబడే ఒక డైరెక్టరీలోకి తరలిద్దాం |
12:46 | దాని కొరకు మనము mv abc.txt pop.txt push.txt అని టైప్ చేసి testdir అని డెస్టినేషన్ ఫోల్డర్ పేరును ఇచ్చి ఎంటర్ నొక్కాలి . |
13:14 | వాటిని చూడడము కొరకు ls testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
13:20 | మీరు abc, pop మరియు push.txt ఫైల్స్ ను చూడవచ్చు. |
13:27 | ఇప్పుడు mv తో పాటుగా ఉన్న ఇతర ఎంపికలను చూద్దాము. ఇప్పుడు ముందుగా స్లైడ్స్ ను మరలా చూద్దాము. |
13:37 | -b లేదా –backup ఎంపిక mv కమాండ్ లో ఉన్నది. అది డెస్టినేషన్ లో ఉన్న ప్రతి ఫైల్ నుబాక్ అప్ తీసుకున్న తరువాత మాత్రమే ఓవర్ రైట్ చేస్తుంది. |
13:48 | మనము ఇప్పటికే చూసిన -i ఎంపిక ఏ డెస్టినేషన్ ఫైల్ ను అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా వార్నింగ్ ఇస్తుంది. |
13:58 | ఇప్పుడు మనము rm కమాండ్ ను చూడబోతున్నాము. ఫైల్స్ ను తొలగించుటకు ఈ కామాండ్ ను వాడతాము. |
14:06 | టెర్మినల్ కు తిరిగి వెళ్ళి ls testdir అని టైప్ చేయండి. |
14:15 | faq.txt అనే పేరుతో ఒక ఫైల్ ను చూడగలరు. దానిని మనము తొలగించాలనుకుంటే, |
14:23 | దీని కొరకు $ rm testdir/faq.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
14:37 | ఈ కమాండ్ faq.txt అనే ఫైల్ ను /testdir డైరెక్టరీ నుంచి తీసివేస్తుంది. |
14:46 | ఫైల్ నిజంగా తీసివేయబడిందా లేదా అని చూచుటకు ls testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
15:00 | ఇప్పుడు మనకు faq.txt అనే ఫైల్ కనిపించదు. |
15:05 | rm కమాండ్ ను మనము చాలా ఫైల్స్ కొరకు కూడా వాడవచ్చు. |
15:10 | Testdir డైరెక్టరీలో abc2 మరియు abc1 అనే రెండు ఫైల్స్ ఉన్నాయి. |
15:17 | ఈ abc2 మరియు abc1 అనే ఫైల్స్ ను తీసివేయాలనుకుంటున్నాము అనుకోండి. |
15:23 | దాని కొరకు rm testdir/abc1 testdir/abc2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి |
15:45 | ఇలా చేయడము ద్వారా testdir డైరెక్టరీ నుంచి abc1 మరియు abc2 లు తొలగించబడుతుంది |
15:53 | అవి తొలగించబడ్డాయా లేదా అని చూచుటకు ls testdir అని మరలా టైప్ చేయండి. ఇక మీకు abc1 మరియు abc2 ఫైల్స్ కనిపించవు. |
16:07 | ముందుకి వెళ్ళటానికి స్క్రీన్ ను క్లియర్ చేద్దాము. |
16:14 | స్లైడ్స్ కు మళ్ళి వెళ్దాం . |
16:18 | సంగ్రహింగా చెప్పలంటే ? |
16:20 | ఒక ఫైల్ ను తొలగించుటకు rm మరియు ఫైల్ నేమ్ లను టైప్ చేస్తాము. |
16:27 | చాలా ఫైల్స్ ను తొలగించుటకు మనము rm మరియు మనము తొలగించాలి అని అనుకున్న ఫైల్స్ పేర్లను వ్రాస్తాము. |
16:34 | ఇప్పుడు rm కమాండ్ లో ఉన్న కొన్ని ఎంపికలను చూద్దాము. |
16:40 | ఏ ఫైల్ అయినా రైట్ ప్రొటెక్టెడ్ అయితే rm ఆ ఫైల్ ను తొలగించ లేదు . అలాంటి సందర్భములో -f ఎంపికను వాడతాము. దీని ద్వారా ఒక ఫైల్ ను ఫోర్స్ డిలీట్ చేయవచ్చు. |
16:57 | ఇంకా సాధారణముగా వాడబడే మరొక ఎంపికను -r. ఈ ఎంపిక లు ఎక్కడ ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాము. |
17:07 | ఇప్పుడు మరలా టెర్మినల్ కు వెళదాము. |
17:12 | rm కమాండ్ ను సాధారణముగా డైరెక్టరీలను తొలగించుటకు వాడరు. దాని కొరకు మనకు rmdir కమాండ్ ఉన్నది. |
17:21 | కానీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే rmdir కమాండ్ డైరెక్టరీను తొలగిస్తుంది |
17:27 | పెద్ద సంఖ్యలో ఫైల్స్ మరియు సబ్ డైరెక్టరీలు కలిగి ఉన్న డైరెక్టరీను తొలగించాలనుకుంటే ఏమి చెయ్యాలి ? |
17:35 | దీని కొరకు rm కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం. |
17:38 | ఇప్పుడు rm మరియు తొలగించలుకుంటున్న డైరెక్టరీ పేరు testdir ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
17:47 | testdir ను తొలగించుటకు rm డైరెక్టరీను వాడలేము అని అవుట్ పుట్ మెసేజ్ లో కనిపిస్తుంది. |
17:55 | కానీ -r మరియు -f ఎంపికలను కలిపితే మనము ఈ పనిని చేయగలము. |
18:03 | rm -rf testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . |
18:16 | ఇప్పుడు testdir డైరెక్టరీ విజయవంతముగా తొలగించబడింది |
18:22 | ఇప్పుడు మరలా స్లైడ్ లకు వెళ్లి తరువాతి కమాండ్ ను చూద్దాము. |
18:27 | cmp కమాండ్. |
18:29 | కొన్నిసార్లు రెండు ఫైళ్లు ఒకే పేరుతో ఉన్నాయి లేదో తనిఖీ చెయ్యాలి. అవి ఒకే పారు తో ఉంటె, వాటిలో ఒకదానిని తొలగించాలి. |
18:37 | అలాగే మనం ఒక ఫైల్ చివరి వెర్షన్ నుండి మార్చబడిందో లేదో చూడాలనుకో వచ్చు |
18:44 | వీటి కొరకు మరియు అనేక ఇతర ప్రయోజనాల కొరకు మనము cmp కమాండ్ ను వాడవచ్చు. |
18:49 | అది రెండు ఫైల్స్ ను బైట్ బై బైట్ పోల్చుతుంది |
18:54 | file1 మరియు file2 లను పోల్చి చూచుటకు cmp file1 file2 అని టైప్ చేయాలి. |
19:03 | రెండు ఫైల్స్ లో ఒకే వివరాలు ఉన్నట్లయితే ఎలాంటి మెసేజ్ కనిపించదు. |
19:11 | కేవలము ప్రాంప్ట్ మాత్రమే ప్రింట్ చేయబడుతుంది. |
19:14 | వాటి వివరా లలో తేడా ఉన్నట్లయితే మొదటి మిస్ మాచ్ యొక్క లోకేషన్ టెర్మినల్ వద్ద ప్రింట్ చేయబడుతుంది. |
19:25 | ఇప్పుడు cmp ఎలా పని చేస్తుందో చూద్దాము. మన home డైరెక్టరీలో మన వద్ద sample1మరియు sample2 అనే పేరు కల రెండు ఫైల్స్ ఉన్నాయి . |
19:35 | వాటిలో ఏమి ఉన్నదో ఇప్పుడు చూద్దాము? |
19:38 | cat sampe1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి . అందులో “This is a Linux file to test the cmp command” అనే టెక్స్ట్ ఉన్నది. |
19:50 | sample2 ఫైల్ లో ఏమి ఉందో చూచుటకు మనము sample2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
20:00 | అందులో “This is a Unix file to test the cmp command.” అనే టెక్స్ట్ ఉన్నది. |
20:06 | ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ పైన cmp కమాండ్ ను అప్లై చేస్తాము. |
20:11 | cmp sample1 sample2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం |
20:23 | మీరు గమనిస్తే sample1 మరియు sample2 రెండు ఫైళ్ల మధ్య మొదటి వ్యత్యాసం ఎత్తి చూపబడింది |
20:32 | తరువాతి కమాండ్ కు వెళ్ళే ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేద్దాము. |
20:38 | మనము చూడబోయే తరువాతి కమాండ్ wc కమాండ్. |
20:43 | ఈ కమాండ్ను ఒక ఫైల్ లో అక్షరాలు, పదాలు మరియు పంక్తుల సంఖ్య ను లెక్కించడానికి ఉపయోగిస్తారు |
20:50 | మన హోమ్ డైరెక్టరీలో sample3 అనే పేరు గల ఒక ఫైలు ఉంది |
20:56 | ఇప్పుడు అందులో ఉన్న వివరాలను చూచుటకు మనము cat sample3 అని టైప్ చేసి ఎంటర్ నోక్కుదాం |
21:05 | ఇది sample3 లో ఉన్న కంటెంట్. |
21:10 | ఇప్పుడు ఈ ఫైల్ మీద wc కమాండ్ ను ఎలా వాడతామో చూద్దాము. |
21:14 | దాని కొరకు wc sample3 అని టైప్ చేసి ఎంటర్ నోక్కుదాం. |
21:25 | ఈ ఫైల్ లో 6 లైన్ లు, 67 పదములు మరియు 385 కారెక్టర్స్ ఉన్నాయి అని ఈ కమాండ్ తెలుపుతుంది. |
21:38 | ఇవి మనకు ఫైల్స్ తో పని చేయుటకు సహాయపడే వాటిలో కొన్ని కమాండ్ లు. |
21:43 | ఇంకా చాలా కమాండ్ లు ఉన్నాయి. పైగా మనము ఇప్పటి వరకు చూసిన కమాండ్ లలో కూడా చాలా ఎంపికలు ఉన్నాయి. |
21:51 | మీరు man కమాండ్ ఉపయోగించి వాటిని గురించి మరింత నేర్చుకోవాలని ప్రోత్సహిస్తను |
22:00 | దీనితో నేను ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాను. |
22:04 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
22:17 | దీని గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ అందుబాటులో ఉన్నది. |
22:34 | నేను శ్రీహర్ష సెలవు తీసుకుంటాను. మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. |