Difference between revisions of "Synfig/C2/Bouncing-ball-animation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || Time || Narration |- | 00:01 |Synfig ను ఉపయోగించి Bouncing Ball animation పై స్పోకెన్ ట్యుటోరియ...")
 
 
Line 59: Line 59:
 
|-
 
|-
 
|01:10
 
|01:10
| ఎగువన ఉన్న బాక్స్ నలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది అవుట్ ‌లైన్ రంగు అని టూల్-టిప్ చెప్తుంది.
+
| ఎగువన ఉన్న బాక్స్ నలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది Outline color అని టూల్-టిప్ చెప్తుంది.
  
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
| దిగువన ఉన్న బాక్స్ తెలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది రంగును నింపడానికి అని టూల్-టిప్ చెప్తుంది.
+
| దిగువన ఉన్న బాక్స్ తెలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది Fill color అని టూల్-టిప్ చెప్తుంది.
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
Line 90: Line 90:
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
| ఇక్కడ, మనం వే పాయింట్స్ మరియు యానిమేషన్ యొక్క కీ ఫ్రేమ్ సూచనలను చూడగలుగుతాము.
+
| ఇక్కడే, మనం వే పాయింట్స్ మరియు యానిమేషన్ యొక్క కీ ఫ్రేమ్ సూచనలను చూడగలుగుతాము.
  
 
|-
 
|-
Line 151: Line 151:
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|Synfig అప్రమేయంగా దీనికి ఒక పేరును ఇస్తుంది. ఇక్కడ ఇది Rectangle060Region అని చెబుతుంది.
+
|Synfig అప్రమేయంగా దీనికి ఒక పేరును ఇస్తుంది. ఇక్కడ ఇది Rectangle060Region అని చెబుతుంది.
 
|-
 
|-
 
|03:18
 
|03:18
Line 345: Line 345:
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా Synfig ఫైల్‌కు డిఫాల్ట్ పేరును ఇస్తుంది.
+
| ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా Synfig ఫైల్‌కు డిఫాల్ట్ పేరును ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 372: Line 372:
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
| Gif ఎక్స్టెన్షన్ తో, మీ ప్రాధాన్యత ప్రకారం ఫైల్ కు తగిన పేరును ఇవ్వండి.
+
| .Gif ఎక్స్టెన్షన్ తో, మీ ప్రాధాన్యత ప్రకారం ఫైల్ కు తగిన పేరును ఇవ్వండి.
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
Line 427: Line 427:
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
| ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig యొక్క ఇంటర్‌ఫేస్ గురించి తెలుసుకున్నాము.
+
| ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig యొక్క ఇంటర్‌ఫేస్ గురించి నేర్చుకున్నాము.
  
 
|-
 
|-
Line 488: Line 488:
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ nmeict ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.  
 
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|-
 
|-

Latest revision as of 22:56, 12 November 2020

Time Narration
00:01 Synfig ను ఉపయోగించి Bouncing Ball animation పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig యొక్క ఇంటర్‌ఫేస్ గురించి నేర్చుకుంటాము.
00:12 మనం వీటిని కూడా నేర్చుకుంటాము: ప్రాథమిక ఆకృతులను గీయడం మరియు రంగును నింపడం,
00:16 కీ ఫ్రేమ్‌లను మరియు వే పాయింట్‌లను జోడించడం,
00:19 స్క్వాష్ ఎఫెక్ట్ ను ఉపయోగించి ఒక బాల్ ని యానిమేట్ చేయడం,
00:22 అవుట్పుట్ ను gif ఫార్మాట్ లో తిరిగిఇవ్వడం.
00:26 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, Synfig వర్షన్ 1.0.2

00:37 డాష్ హోమ్ కు వెళ్లి, Synfig అని టైప్ చేయండి.
00:40 లోగో పై క్లిక్ చేయడం ద్వారా మీరు Synfig ను తెరవవచ్చు.
00:44 ఇది Synfig యొక్క ఇంటర్ఫేస్.
00:46 మెనూ బార్ ఎగువ భాగం వద్ద ఉంది.
00:50 స్టాండర్డ్ టూల్ బార్ అనేది మెనూ బార్ క్రిందన ఉంది. ఇక్కడ, మనం షార్ట్కట్ మరియు హ్యాండిల్స్ ఎంపికల యొక్క కొన్నింటిని చూస్తాము.
00:58 దీని తరువాత క్షితిజ సమాంతర మరియు నిలువు రూలర్స్ ఉంటాయి.
01:02 టూల్ బాక్స్ అనేది ఇంటర్ఫేస్ యొక్క ఎడమ భాగం పైన ఉంది.
01:06 టూల్ బాక్స్ క్రిందనే, రెండు బాక్స్ లు ఉన్నాయని గమనించండి.
01:10 ఎగువన ఉన్న బాక్స్ నలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది Outline color అని టూల్-టిప్ చెప్తుంది.
01:16 దిగువన ఉన్న బాక్స్ తెలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది Fill color అని టూల్-టిప్ చెప్తుంది.
01:21 మధ్య భాగంలో, కాన్వాస్ ఉంది. ఇక్కడే మనం మన యానిమేషన్ ను చేస్తాము.
01:27 కాన్వాస్ క్రిందన, యానిమేషన్ ప్యానెల్ ఉంది.
01:30 ఇక్కడ, యానిమేషన్‌కు సంబంధించిన బటన్ లను మనం చూడవచ్చు.
01:35 ఇంటర్ఫేస్ యొక్క దిగువ ఎడమ భాగం వద్ద పారామీటర్స్ ప్యానల్ ఉంది.
01:39 మనం కాన్వాస్‌ పైన ఒక ఆబ్జెక్ట్ ను సృష్టించిన తర్వాత పారామీటర్స్ అనేవి కనిపిస్తాయి.
01:43 దీనికి ప్రక్కనే, కీఫ్రేమ్స్ ప్యానెల్ ఉంది. ఇక్కడే మనం కీఫ్రేమ్స్ ను జోడిస్తాము.
01:49 ఈ ప్యానెల్ యొక్క కుడి వైపున, మనం టైమ్ ట్రాక్ ప్యానెల్ ను కనుగొనవచ్చు.
01:54 ఇక్కడే, మనం వే పాయింట్స్ మరియు యానిమేషన్ యొక్క కీ ఫ్రేమ్ సూచనలను చూడగలుగుతాము.
02:01 కాన్వాస్‌ పైన మనం ఒక ఆబ్జెక్ట్ ను సృష్టించిన తర్వాత వే పాయింట్స్ అనేవి కనిపిస్తాయి.
02:05 ఇంటర్ఫేస్ యొక్క కుడి దిగువ భాగం వద్ద, లేయర్స్ ప్యానెల్ ఉంది.
02:10 లేయర్స్ ప్యానెల్ కు పైన, మనం టూల్ ఆప్షన్స్ ప్యానెల్ ను చూడవచ్చు.
02:14 మరియు ఈ ప్యానెల్ కు పైన, మీరు కాన్వాస్ బ్రౌజర్,
02:19 పాలెట్ ఎడిటర్,
02:21 నావిగేటర్ మరియు ఇన్ఫో ప్యానల్స్ లను కనుగొనవచ్చు.
02:24 మనం వీటితో వెళ్తున్నప్పుడు, ఇవన్నీ వాడటం మనం అలవాటు చేసుకోవచ్చు.
02:28 ఇప్పుడు, మనం మన మొదటి యానిమేషన్ తో ప్రారంభిద్దాం.
02:31 మొదట, మనం ఒక బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిస్తాము.
02:34 Tool box కు వెళ్ళండి. Rectangle toolపై క్లిక్ చేయండి.
02:37 Tool options panel లో మార్పును గమనించండి.
02:41 Layer Type కింద, మనం చాలా ఐకాన్ లను చూడవచ్చు.
02:44 Create a region layer ఐకాన్ ను ఎంచుకోండి. ఈ డెమో కోసం, మనం ఇతర సెట్టింగులను అలాగే ఉంచుతాము.
02:51 ప్రదర్శించినట్లుగా ఇప్పుడు కాన్వాస్ యొక్క 3/4 వ వంతు భాగాన్నికవర్ చేసేలాగ ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
02:57 డిఫాల్ట్ ఫిల్ కలర్ అనేది తెలుపు రంగు ఉందని దయచేసి గమనించండి, ఒకవేళ మనం canvas కు వెలుపల గీసినట్లయితే, ఆబ్జెక్ట్ ను గుర్తించడం కష్టమని ఇది సూచిస్తుంది.
03:07 Layers Panel లో ఒక layer సృష్టించబడిందని గమనించండి.
03:11 Synfig అప్రమేయంగా దీనికి ఒక పేరును ఇస్తుంది. ఇక్కడ ఇది Rectangle060Region అని చెబుతుంది.
03:18 layers కు అర్ధవంతమైన పేర్లను ఇవ్వడం అనేది ఎల్లప్పుడూ మంచి పద్ధతి.
03:21 layers యొక్కపెద్ద లిస్ట్ నుండి ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను గుర్తించడానికి ఇది మనకు సహాయపడుతుంది.
03:28 మనం సంక్లిష్టమైన animations ను సృష్టించినప్పుడు మీరు దీని గురించి మరింత గొప్పగా తెలుసుకుంటారు.
03:32 Synfig ఇంటర్‌ఫేస్‌కు తిరిగి రండి.
03:35 నేను ఈ డిఫాల్ట్ layer పేరును Sky గా మారుస్తాను.
03:39 కనుక, పేరుపై క్లిక్ చేసి, Sky అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:43 ఇపుడు ఈ layer యొక్కపేరు sky.
03:46 దయచేసి కర్సర్ చాలా సున్నితమైనదని గమనించండి. అందువల్ల, మునుపటి చర్య యొక్క నకిలీ ఏర్పడకుండా నిరోధించడానికి యాదృచ్ఛికంగా క్లిక్ చేయడం చేయకండి.
03:55 దీర్ఘచతురస్రం యొక్క పారామీటర్స్ అనేవి Parameters panel లో సృష్టించబడతాయి.
04:00 Color parameter ను కనుగొని, Value కాలమ్ పై డబుల్ క్లిక్ చేయండి. వెంటనే, ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:08 RGB scrollers ను లాగడం ద్వారా రంగును నీలం రంగులోకి మార్చండి.
04:13 ఇప్పుడు, ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
04:15 తరువాత, Transform tool పై క్లిక్ చేయండి.
04:19 తరువాత Sky layer ఎంపికను తీసివేయడానికి canvas కి బయట క్లిక్ చేయండి.
04:24 ఇప్పుడు మళ్ళీ Rectangle tool ని ఎంచుకోండి.
04:26 canvas యొక్క దిగువ భాగంలో మరొక దీర్ఘచతురస్రాన్ని సృష్టించండి.
04:31 ఇంతకు ముందు చూపిన విధంగా, లేయర్ పేరును Ground కు మరియు రంగును ఆకుపచ్చ కు మార్చండి.
04:40 Transform tool ని ఎంచుకొని లేయర్ ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చేయండి.
04:46 తరువాత, మనం ఒక బాల్ ని గీద్దాం.Toolbox లో, Circle tool పై క్లిక్ చేయండి.
04:52 Layer Type కింద, Create a region layer ను ఎంచుకోవాలి.
04:57 canvas యొక్క ఎగువ భాగంపై క్లిక్ చేసి, ఒక వృత్తాన్నిగీయండి.
05:01 Layers panel లో, ముందు చూపిన విధంగా లేయర్‌ కు, Ball గా పేరును మార్చండి.
05:07 రంగును ఎరుపుకు మార్చండి.
05:11 ఇప్పుడు మనం బాల్ ని యానిమేట్ చేయడం ప్రారంభిద్దాం. Transform tool ని ఎంచుకోండి.
05:16 Animation panel ‌లో, Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:22 స్క్రీన్ పైన కనిపించే ఎరుపు దీర్ఘచతురస్రపు బోర్డర్ అనేది, మనం యానిమేషన్ మోడ్‌లో ఉన్నట్లు సూచిస్తుంది.
05:29 current frame బాక్స్‌లో 9 ని ఎంటర్ చేయండి. Enter నొక్కండి.
05:34 తరువాత, Keyframes panel పై క్లిక్ చేయండి.
05:36 ఇక్కడ, ఒక క్రొత్త keyframe ‌ను జోడించడానికి పచ్చరంగులో ఉన్న ప్లస్ గుర్తు ఐకాన్‌పై క్లిక్ చేయండి.
05:41 canvas పై ఉన్న బాల్ ని ఎంచుకోండి.
05:44 బాల్ మధ్యలో ఉన్న ఒక ఆకుపచ్చ బిందువును గమనించండి.
05:47 బాల్ ని canvas యొక్క దిగువ భాగానికి తరలించడానికి ఈ ఆకుపచ్చ బిందువును లాగండి.
05:52 ప్రదర్శించినట్లుగా, బాల్ ని కింది నుండి కొద్దిగా పైకి తరలించండి.
05:55 లాగేటప్పుడు అది సరళ మార్గంలో వెళ్ళడానికి shift key ని ఉపయోగించండి.
05:59 Time track panel పైన waypoints అనేవి సృష్టించబడ్డాయని గమనించండి.
06:04 మనం 11 వ ఫ్రేమ్‌కు వెళ్దాం. మరొకసారి, ముందు చూపిన విధంగా ఒక క్రొత్త keyframe ను జోడించండి.
06:12 బాల్ భూమిని తాకుతున్నట్లుగా ఉండేలాగా బాల్ ని కొద్దిగా క్రిందికి తరలించండి.
06:16 బాల్ చుట్టూ నారింజ మరియు పసుపు రంగు చుక్కలను గమనించండి. వీటిని handles అంటారు.
06:22 స్క్వాష్డ్ ఎఫెక్ట్ ను ఇవ్వడానికి handles లోని నారింజ రంగు చుక్కలను ఉపయోగించి, ప్రదర్శించిన విధంగా బాల్ ని Resize చెయ్యండి.
06:31 Time cursor ను 13 వ ఫ్రేమ్‌కు తరలించండి.
06:36 Keyframes panel పైన 9 వ ఫ్రేమ్‌ను ఎంచుకోండి.
06:39 దిగువ భాగం వద్ద ఉన్న Duplicate ఐకాన్ పై క్లిక్ చేయండి.
06:43 Time cursor ను 24 వ ఫ్రేమ్‌కు తరలించండి.
06:46 Keyframes panel పైన సున్నా ఫ్రేమ్‌ను ఎంచుకోండి.
06:50 మళ్ళీ, దిగువ భాగం వద్ద ఉన్న Duplicate ఐకాన్ పై క్లిక్ చేయండి.
06:53 సున్నా ఫ్రేమ్‌కు వెళ్లండి. బాల్ ఎంపికను తీసివేయడానికి canvas కు బయట క్లిక్ చేయండి.
06:59 మనం సృష్టించిన animation ను చూడటానికి Play బటన్ పై క్లిక్ చేయండి.
07:04 ఇప్పుడు Pause బటన్ పై క్లిక్ చేయండి.
07:07 చివరగా, మనం ఫైల్ ను save చేద్దాం.
07:09 File కు వెళ్లి, Save పై క్లిక్ చేయండి. నేను Desktop ‌లో సేవ్ చేస్తాను.
07:14 ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా Synfig ఫైల్‌కు డిఫాల్ట్ పేరును ఇస్తుంది.
07:18 నేను ఈ పేరును Bouncing-ball గా మారుస్తాను.
07:22 అందుబాటులో ఉన్న Synfig ఫైల్ extension లు అనేవి dot sifz, dot sif, dot sfg అని గమనించండి.
07:31 నేను dot sifz ఫార్మాట్ ను ఎంచుకుంటాను.
07:34 Save పై క్లిక్ చేయండి.ఇప్పుడు మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం.
07:39 File కు వెళ్లి, Render పై క్లిక్ చెయ్యండి.
07:42 Render settings డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
07:45 .Gif ఎక్స్టెన్షన్ తో, మీ ప్రాధాన్యత ప్రకారం ఫైల్ కు తగిన పేరును ఇవ్వండి.
07:50 save చేసే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి Choose బటన్ పై క్లిక్ చేయండి.
07:54 నేను Desktop ను ఎంచుకుని, ఆపై OK పై క్లిక్ చేస్తాను.
07:57 Target డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Magick++ ఎంచుకోండి.
08:03 Quality ను గరిష్ఠానికి పెంచండి, అంటే, ప్లస్ గుర్తుపై 9 ని క్లిక్ చేయడం ద్వారా. ఈ విలువ ఎప్పుడూ 3 కంటే తక్కువ ఉండకూడదు.
08:11 Image సెట్టింగులను అలాగే ఉంచేయండి.
08:14 Time టాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ, frame rate అనేది 24 fps గా ఉండాలి.
08:20 ఇది జర్క్స్ లేకుండా ఒక మృదువైన animation ను ఇస్తుంది.
08:24 మన animation 24 వ సెకనుతో ముగుస్తుంది కాబట్టి, End Time ను 24 కి మార్చండి. Enter నొక్కండి.
08:31 చివరగా, దిగువ భాగం వద్ద ఉన్న Render బటన్ పై క్లిక్ చేయండి. ఇది అవుట్‌పుట్‌ను తిరిగి అందించడానికి కొన్నిసెకన్లు పట్టవచ్చు.
08:38 ఇప్పుడు, నన్నుDesktop కి వెళ్లనివ్వండి, అక్కడే నేను నా.gif ఫైల్ ని సేవ్ చేసాను.
08:44 మనం Firefox ను గానీ లేదా ఏదైనా web browser ను ఉపయోగించి animation ను ప్లే చేయవచ్చు.
08:48 ఈ animation ‌నుప్లే చేయడానికి మీకు internet connection అవసరం లేదని దయచేసి గమనించండి.
08:54 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
08:57 సారాంశం చూద్దాం.
08:59 ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig యొక్క ఇంటర్‌ఫేస్ గురించి నేర్చుకున్నాము.
09:03 మనం ఇవి కూడా నేర్చుకున్నాము: ప్రాథమిక ఆకృతులను గీయడం మరియు రంగును నింపడం,
09:07 కీ ఫ్రేమ్‌లను మరియు వే పాయింట్‌లను జోడించడం,
09:10 స్క్వాష్ ఎఫెక్ట్ తో ఒక బాల్ ని యానిమేషన్ చేయడం,
09:13 అవుట్పుట్ ను gif ఫార్మాట్ లో తిరిగిఇవ్వడం.
09:16 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ ఉంది. స్లాంటింగ్ పాత్ లో ఒక ball animation ను సృష్టించండి.
09:23 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
09:27 ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
09:33 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
09:38 ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి.
09:44 ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా? దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి.
09:49 మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.
09:52 మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు.
09:58 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్.
10:02 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.
10:08 తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
10:13 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ nmeict ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

10:23 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya