Difference between revisions of "Health-and-Nutrition/C2/Cradle-Hold-for-Breastfeeding/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 |<center>Time</center> |<center>Narration</center> |- |00:01 | తల్లి పాలివ్వడం కొరకు క్రాడల్ హొల్ద...") |
|||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | తల్లి పాలివ్వడం కొరకు క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) పై ఈ స్పొకెన్ ట్యుటొరియల్ కు స్వాగతం. | + | | తల్లి బిడ్డకు పాలివ్వడం కొరకు క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) పై ఈ స్పొకెన్ ట్యుటొరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
Line 27: | Line 27: | ||
ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు | ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు | ||
మనం మునుపటి ట్యుటొరియల్ లో చర్చించినట్టుగా- | మనం మునుపటి ట్యుటొరియల్ లో చర్చించినట్టుగా- | ||
− | + | ఒక తల్లి ఆమె బిడ్డకు పాలివ్వడం కొరకు పట్టుకోవడంలో వాటిలో ఉత్తమమైన పద్దతి ఏదంటే- | |
|- | |- | ||
|00:39 | |00:39 | ||
Line 165: | Line 165: | ||
|04:08 | |04:08 | ||
| మీరు దానిని గమనించి ఉండవచ్చు – | | మీరు దానిని గమనించి ఉండవచ్చు – | ||
− | మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం | + | మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉంటాయి. |
|- | |- | ||
|04:16 | |04:16 | ||
Line 371: | Line 371: | ||
|- | |- | ||
|09:58 | |09:58 | ||
− | |బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న వెంటనే ఒకవేళ స్తనం అనేది భారంగా లెకపోతే అప్పుడు- | + | |బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న వెంటనే ఒకవేళ ఆ స్తనం అనేది భారంగా లెకపోతే అప్పుడు- |
|- | |- | ||
|10:05 | |10:05 |
Latest revision as of 16:40, 18 September 2019
00:01 | తల్లి బిడ్డకు పాలివ్వడం కొరకు క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) పై ఈ స్పొకెన్ ట్యుటొరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటొరియల్ లో మనం నేర్చుకునేది |
00:09 | తల్లి తనబిడ్డకు పాలివ్వడానికి సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం. |
00:15 | పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు |
00:18 | క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) లో ఎలా పట్టుకోవాలి |
00:22 | మనం ప్రారంభిద్దాం
ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు మనం మునుపటి ట్యుటొరియల్ లో చర్చించినట్టుగా- ఒక తల్లి ఆమె బిడ్డకు పాలివ్వడం కొరకు పట్టుకోవడంలో వాటిలో ఉత్తమమైన పద్దతి ఏదంటే- |
00:39 | తల్లి పాలివ్వడం పూర్తయ్యేవరకు తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సౌకర్యంగా ఉండడం |
00:45 | బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉండగలగడం |
00:50 | మరియు బిడ్డ తగినన్ని పాలను పొందడం |
00:54 | పట్టుకునే విధానాలలో క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) అని పిలువబడే ఒకదాని గురించి తెలుసుకుందాం. |
00:59 | తన బిడ్డకు పాలిచ్చే ముందు, తల్లి తప్పనిసరిగా తన చేతులను సబ్బు మరియు నీళ్ళతో కడుక్కోవాలి. |
01:05 | ఇంకా తన చేతులను తడిలేకుండా బాగా తుడుచుకోవాలి. |
01:10 | తర్వాత ఆమె తప్పనిసరిగా ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. |
01:15 | పాలిచ్చే తల్లులకు దాదాపుగా ఒక రోజుకి750 నుండి 850 మిల్లిలీటర్ల పాలు వస్తాయి. |
01:22 | అందువల్ల, వారు రోజు తాగుతున్న నీళ్లు కంటే ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. |
01:27 | తరువాత, మనం తల్లి ఏ భంగిమలో ఉండాలో చర్చిద్దాం. |
01:31 | తల్లి నేలపై కానీ లేదా మంచం పై కానీ కాళ్ళు మడచుకుని కూర్చొవాలి. |
01:36 | లేదా తన పాదాలు సమంగా నేలను తాకేలా పెట్టి కుర్చీపైన కూర్చోవాలి. |
01:41 | ఒకవవేళ కుర్చీ చాలా ఎత్తుగాఉండి ఆమె పాదాలు నేలను తాకక పోతె అప్ప్పుడు |
01:47 | ఒక చిన్న పీటను లేదా దిండును నేలపై ఉంచి, వాటిపై ఆమె తన పాదాలను సమంగా ఉంచవచ్చు. |
01:53 | వెన్ను నొప్పి రాకుండా నివారించడానికి, ఆమె కూర్చునేటప్పుడు తన వెన్ను నిటారుగా ఉందని నిర్ధారించుకోవాలి. |
02:00 | ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా వదులుగా ఉండాలి. |
02:05 | ఇలా విశ్రాంతిగా ఉన్న ఈ భంగిమను తల్లి పాలిచ్చే సమయం అంతటా కొనసాగించాలి. |
02:12 | ఇప్పుడు తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వాలి అనుకుంటుందో ఆ వైపు వస్త్రాన్ని తొలగించాలి. |
02:18 | ఆమె తన బ్రా లేదా బ్లౌజ్ వలన తన రొమ్ము మీద ఒత్తిడి పడటంలేదని నిర్దారించుకోవాలి. |
02:25 | తల్లి సౌకర్యవంతంగా కూర్చున్నతర్వాత, బిడ్డను తల్లి దగ్గరకు తీసుకొని రావాలి. |
02:29 | తల్లి తాను ఏ వైపు నుండి పాలిస్తుందో ఆ వైపు గల చేతితొ తన బిడ్డను పట్టుకొవాలి. |
02:37 | బిడ్డ యొక్క తల, ఆ చేయి యొక్క మోచేయి లోపలి వంపులో సౌకర్యవంతంగా ఉండేలా చూసుకొవాలి. |
02:44 | అదే చేతితొ, తల్లి తన బిడ్డ యొక్క తల, మెడ మరియు మొండేనికి ఆసరా ఇవ్వాలి. |
02:51 | ఈ చిత్రంలో ఉన్న తల్లి, తన కుడి వైపు స్తనం నుండి తన బిడ్డకు పాలిస్తుంది. |
02:56 | అందువల్ల, బిడ్డ యొక్క తల, మెడ మరియు మొండెంకు మద్దతు ఇవ్వడానికి ఆమె తన కుడి చేయిని ఉపయోగిస్తోంది |
03:04 | బిడ్డ యొక్క తల ఆమె కుడి మోచేయి లోపలి వంపులో విశ్రాంతి తీసుకుంటుంది. |
03:10 | ఒకవేళ బిడ్డను ఎత్తడానికి తల్లి అదనపు మద్దతును కోరుకుంటే, ఆమె బిడ్డ కింద ఒక దిండును ఒళ్ళో ఉంచుకొవచ్చు. |
03:19 | తల్లి ఎప్పుడూ కూడా తన వెన్నును వంచి స్తనాన్ని బిడ్డకు అందేలా చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. |
03:25 | ఇది ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు వెన్నునొప్పికి కారణమవుతుంది. |
03:30 | ఆమె ఎల్లప్పుడూ తన వెన్నును నిటారుగా ఉంచి, బిడ్డ తన రొమ్ము దగ్గరకు చేరేలా బిడ్డను పైకి ఎత్తాలి. |
03:36 | తరువాత, బిడ్డను సరైన భంగిమలో ఎలా ఉంచాలో తెలుసుకుందాం. |
03:42 | శిశువు యొక్క కడుపు తల్లి శరీరం చేత సున్నితంగా నొక్కబడాలి. |
03:47 | వారి శరీరాల మధ్య తక్కువ దూరం ఉంటె అది రొమ్మును చేరుకోవడానికి శిశువు చేసే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది. |
03:54 | మరియు దానివల్ల బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడం సులభం అవుతుంది. |
04:00 | తర్వాత, రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే శిశువు యొక్క మొత్తం శరీరం పట్టుకొని ఉంచబడిన దిశ. |
04:08 | మీరు దానిని గమనించి ఉండవచ్చు –
మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉంటాయి. |
04:16 | కానీ, పాలిచ్చేటప్పుడు, చాలా మంది తల్లులు బిడ్డ తలను తరచుగా పక్కకి తిప్పుతుంటారు. |
04:23 | దీని వల్ల బిడ్డకు పాలు తాగడానికి అసౌకర్యం కలగవచ్చు. |
04:28 | తల్లి పాలిచ్చేటప్పుడు శిశువు తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉండాలి. |
04:35 | ఇది శిశువుకు పాలు మింగడాన్ని సులభం చేస్తుంది. |
04:41 | ఇప్పుడు మనము బిడ్డ శరీరాన్ని ఎలా ఉంచాలి అనేదానిలో మూడవ అంశానికి వచ్చాము. |
04:46 | తల్లి తన బిడ్డ యొక్క తల, మెడ మరియు మొండెంకు ఆసరా ఇవ్వాలి. |
04:51 | లేకపోతే, బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉండటానికి చాలా శ్రమ పడవలసిఉంటుంది. |
04:58 | తరువాత, బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉంచాలో చూద్దాం. |
05:03 | బిడ్డ ముక్కు మరియు చనుమొన ఒకే రేఖ లో ఉండాలి. |
05:07 | ఇంకా తన గడ్డం ముందుకి ఉండి స్తనానికి చాలా దగ్గరగా ఉండాలి. |
05:13 | బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకునేటపుడు అరియోలా యొక్క దిగువ భాగాన్ని ఎక్కువగా తీసుకుంటుందని ఇది నిర్ధారిస్తుంది. |
05:19 | అందువల్ల, ఎక్కువ పాలను బాగా త్రాగడానికి ఇది కింది దవడను ఉపయోగిస్తుంది. |
05:26 | దయచేసి గమనించండి అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం. |
05:32 | ఇప్పుడు, బిడ్ద సరైన స్థితి లొ ఉంచబదడింది. |
05:35 | మనం స్తనాన్ని ఎలా పట్టుకొవాలో నేర్చుకుందాం. |
05:39 | ఖాళీగా ఉన్నచేతి వేళ్లను ఉపయోగించి, తల్లి తన స్తనాన్ని U ఆకారం లొ ఉండెలా పైనుండి పట్టుకొవాలి. |
05:48 | ఇక్కడ ఈ చిత్రం లో తల్లి తన ఎడమ చేతిని తన కుడి స్తనాన్ని పట్టుకొడానికి ఉపయోగిస్తుంది. |
05:55 | బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను సరిగ్గా ఎలా పెట్టాలో అర్థం చేసుకోవడానికి, చనుమొనను తల్లి యొక్క కుడి రొమ్ముపై గడియారానికి కేంద్రంగా ఊహించుకోండి. |
06:04 | ఈ గడియారంలో తల్లి తన ఎడమ బొటనవేలును 3 గంటల సమయం స్థానం వద్ద ఉంచాలి. |
06:10 | ఆమె తన ఎడమ చూపుడు వేలు మరియు మధ్య వేలును గడియారపు 9 గంటల స్థానం వద్ద ఉంచితే. |
06:18 | తల్లి యొక్క వేళ్ళు, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క పెదవుల దిశలో స్తనాన్ని పట్టుకుంటాయి. |
06:25 | ఇలా ఎందుకు?
ఒక సరళమైన ఉదాహరణను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం. |
06:30 | మనం వడా పావ్ లేదా బర్గర్‌ను తినేటప్పుడు మన పెదవులు అడ్డంగా తెరచుకుంటాయి. |
06:35 | ఒక పెద్ద ముక్కను కొరకడానికి మనం వడా పావ్ లేదా బర్గర్‌ను అడ్డంగా పట్టుకుంటాము. |
06:40 | ఇక్కడ, బొటనవేలు మరియు మిగతా వేళ్లు పెదవుల యొక్క దిశలో ఉంచబడతాయి. |
06:46 | ఒకవేళ మనం వడా పావ్ లేదా బర్గర్ ను నిలువుగా పట్టుకుంటే మనం దాని పెద్ద ముక్కను కొరకలేము. |
06:53 | అదేవిధంగా, శిశువు యొక్క పెదవుల దిశను గమనించండి.
పెదవులు ఇక్కడ నిలువుగా ఉంటాయి. |
07:00 | అందువల్ల, వేళ్లు మరియు బొటనవేలు కూడా రొమ్ముపై నిలువుగా ఉంచాలి. |
07:06 | ఇది బిడ్డ దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది. |
07:13 | శిశువు యొక్క పెదవుల దిశలో ఉండటమే కాకుండా, తల్లి బొటనవేలు మరియు మిగతా వేళ్లు ఎల్లప్పుడూ చనుమొన నుండి 3 వేళ్ల దూరంలో ఉండాలి. |
07:23 | మళ్ళీ, వడా పావ్ లేదా బర్గర్ ను తినేటప్పుడు,
ఒకవేళ మనం దానిని చాలా దగ్గరగా పట్టుకుంటే, మన వేళ్లు పెద్ద ముక్కను కొరకనివ్వకుండా మన నోటికి అడ్డుపడతాయి. |
07:34 | ఒకవేళ మనం దాన్ని చాలా దూరంగా పట్టుకుంటే, దాని ఆకారం సరిగ్గా మన నోటిలోకి సరిపోయేలా ఉండదు. |
07:41 | అందువల్ల, పెద్ద ముక్కను కొరకడానికి మనం దానిని సరైన దూరం వద్ద పట్టుకుంటాము. |
07:47 | అదేవిధంగా బిడ్డ కొరకు కూడా సరైన దూరం అంటే చిత్రం లొ చూపిన విధంగా చనుమొన నుండి 3 వేళ్ల దూరం. |
07:55 | ఈ దూరం అనేది బిడ్డ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి తల్లి వేళ్ళు అడ్డు రావు అని నిర్దారిస్తుంది. |
08:05 | చాల తక్కువ పాలను ఇస్తుంది కనుక తల్లి ఒక్క చనుమొనను మాత్రమే నొక్కదు. |
08:11 | ఎక్కువపాలు బయటకు వచ్చేలా చేయడానికి, తల్లి అరియోలా కింద ఉన్న పెద్ద పాల నాళాలపై నొక్కుతుంది. |
08:17 | మరియు బిడ్డ నోటితో లోతుగా పట్టుకోవడానికి సహాయపడేలా తల్లి స్థనం అనేది సరైన ఆకారంలో ఉంటుంది. |
08:23 | తల్లి బొటనవేలు అనేది ప్రస్తుతం బిడ్డ గడ్డం ఉన్న స్తనభాగం వైపు ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. |
08:30 | మరియు ఆమె 2 వేళ్లు ప్రస్తుతం శిశువు యొక్క ముక్కు ఉన్న స్తనభాగం వైపు ఉండాలి. |
08:36 | వడా పావ్ లేదా బర్గర్ యొక్క ఉదాహరణకి మనం తిరిగి వెళ్దాం. |
08:41 | వాడా పావ్ లేదా బర్గర్‌ను సరిగ్గా పట్టుకున్న తరువాత,ఎప్పుడూ కూడా పెద్ద ముక్కను కొరకడానికి మనం దాన్ని నొక్కుతాము. |
08:48 | అదేవిధంగా, తల్లి పై నుండి U ఆకారంలో తన స్తనాన్ని పట్టుకుని తేలికగా నొక్కాలి. |
08:54 | ఇది బిడ్డకు దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది. |
09:01 | కానీ గుర్తుంచుకోండి, తల్లి తన రొమ్మును తిరగేసిన V ఆకారంలో పట్టుకుని నొక్కకూడదు. |
09:07 | V ఆకారం లో నొక్కడం అనేది రొమ్మును గిచ్చుతుంది మరియు చనుమొన నుండి మాత్రమే పాలు తాగడానికి కారణమవుతుంది. |
09:14 | స్తనం పై బొటనవేలు మరియు మిగతావేళ్ళ యొక్క వత్తిడి అనేది సమానంగా ఉందని నిర్ధారించుకోండి. |
09:21 | లేకపోతే, చనుమొన అనేది కుడివైపుకు లేదా ఎడమ వైపుకు మారిపోతుంది. |
09:27 | ఇంకా బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకోలేదు. |
09:32 | గుర్తుంచుకోండి,
బిడ్డ వైపున రొమ్మును పక్కకు నెట్టడం ద్వారా దానిని ఎప్పుడూ బిడ్డ వైపుకు తీసుకురాకూడదు. |
09:39 | ఎల్లప్పుడూ బిడ్డనే రొమ్ము వైపు తీసుకురండి. |
09:43 | ఇప్పుడు, బిడ్డ పాలను త్రాగేందుకు తల్లి రొమ్మును పట్టుకోవడానికి క్రేడిల్ హోల్డ్ లో సిద్ధంగా ఉంది |
09:49 | బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
09:58 | బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న వెంటనే ఒకవేళ ఆ స్తనం అనేది భారంగా లెకపోతే అప్పుడు- |
10:05 | తల్లి తన రొమ్మును తన చేతి నుండి వదిలిపెట్టాలి. |
10:09 | మరియు బిడ్డకు ఆసరా ఇవ్వడానికి ఆ చేతిని బిడ్డ కిందకు తీసుకురండి. |
10:14 | ఈ స్థితిలో, తల్లి తన రెండు చేతులను తన శరీరానికి చాలా దగ్గరగా తీసుకురావాలి. |
10:21 | ఇది బిడ్డకు పాలను పట్టించే సమయంలో తల్లిని సౌకర్యంగా ఉంచుతుంది. |
10:26 | దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
10:29 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |