Difference between revisions of "Linux/C2/Installing-Software-16.04/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 133: Line 133:
 
|-
 
|-
 
|| 04:16
 
|| 04:16
|| Software Sources విండో తెరపైన కనిపిస్తుంది.
+
|| Software & Updates విండో తెరపైన కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|| 04:20
 
|| 04:20

Latest revision as of 18:49, 30 July 2019

Time Narration
00:01 ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో ఇంస్టాలింగ్ సాఫ్ట్ వేర్ అనే ఈ స్పొకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:10 ఈ టుటోరియల్ లో మనం ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో టర్మినల్,
00:21 Synaptic Package Manager మరియు Ubuntu Software Center ల ద్వారా సాఫ్ట్ వేర్ ని ఎలా ఇంస్టాల్ చేయాలో తెలుసుకుందాం.
00:27 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేన్దుకు నేను ఉబంటు లినక్స్16.04 అపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను.
00:34 ఈ ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళడానికి మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండాలి.
00:39 మీరు సిస్టం అడ్మినిస్టేటర్ అయిఉండాలి లేదంటే సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేసేన్దుకు మీరు అడ్మినిస్టేటర్ రైట్స్ నుకలిగి ఉండాలి.
00:46 Synaptic Package Manager అనేది a p t కొరకు ఒక గ్రాఫికల్ ప్రోగ్రాం.
00:51 ఇది apt-get command line యుటిలిటీ యొక్క GUI.
00:57 ఉబంటు లినక్స్ 16.04 లో Synaptic Package Manager డీఫౌల్ట్ గా ముందే ఇంస్టాల్ చేసి ఉండదు.
01:05 అందువల్ల టర్మినల్ సాయంతో దీన్ని ఎలా ఇంస్టాల్ చేయాలో నేర్చుకుందాం.
01:10 Ctrl, Alt మరియు T కీ లను మీ కీ బోర్డ్ లో ఒకేసారి నొక్కి టర్మినల్ ని తెరవండి.
01:18 ఇప్పుడు టర్మినల్ లో sudo space a p t hyphen get space install space s y n a p అని టైప్ చేసి Tab కీ ని నొక్కండి.
01:34 ఇది s y n a p తో మొదలయ్యే సాఫ్ట్ వేర్ ల జాబితాని చూపిస్తుంది.
01:40 ఇప్పుడు ఆ పదాన్ని synaptic గా పూర్తి చేసి ఎంటర్ నొక్కండి.
01:46 మీకు అడ్మినిస్టేటర్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది.
01:51 మీ అడ్మిని పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి.
01:54 టర్మినల్ లో పాస్వర్డ్ టైప్ చేసేప్పుడు అది మనకు కనబడదు, అందుకు జాగ్రత్తగా టైపు చేయండి.
02:02 ఎంటర్ నొక్కండి.
02:04 ఇప్పుడు టర్మినల్ ఇంస్టాల్ చేయాల్సిన packages ల జాబితాను ప్రదర్శిస్తుంది.
02:09 ఇంకా డౌన్లోడ్ చేయాల్సిన ఫైల్ ల పరిమాణం మరియు ఇంస్టాల్ చేసిన తర్వాత డిస్క్ లో ఖాళీ స్థలం గురించిన సమాచారం ఇస్తుంది.
02:17 దీనిని కన్ఫాం చేయుటకు Y ని నొక్కండి.
02:19 ఎంటర్ నొక్కండి.
02:22 ఇప్పుడు ఇంస్టాలేషన్ ప్రారంభం అవుతుంది. మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్తి ఇది ఇంస్టాల్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది.
02:31 ఇప్పుడు మనం విజయవంతంగా Synaptic Package Manager ని ఇంస్టాల్ చేసాము.
02:36 ఇప్పుడు టర్మినల్ ని మూసివేద్దాం.
02:39 ఇన్స్టాలేషన్ ను ధ్రువీకరించుటకు Dash home కి వెళ్ళి సర్చ్ బార్ లో synaptic అని టైప్ చేయండి.
02:46 మనం సర్చ్ రిజల్ట్ లో Synaptic Package Manager icon ని చూడవచ్చు.
02:51 ఇప్పుడు Synaptic Package Manager ను ఉపయోగించి సాఫ్ట్ వేర్ ని ఎలా ఇంస్టాల్ చేయాలో నేర్చుకుందాం.
02:57 Synaptic Package Manager icon పై క్లిక్ చేయండి.
03:01 ఒక అథేన్టికేశన్ డైలాగ్ బాక్స్ పాస్ వర్డ్ ని అడుగుతూ కనిపిస్తుంది.
03:06 ఇప్పుడు అడ్మిన్ పాస్ వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం.
03:10 మనం మొదటిసారి Synaptic Package Manager ని వాడుతున్నట్లయితే ఒక ఇంట్రడక్సన్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:17 ఇది Synaptic Package Manager ని ఎలా ఉపయోగించాలో తెలిపే సమాచారాన్ని కలిగిఉంటుంది.
03:23 డైలాగ్ బాక్స్ ని మూసివేయడానికి Close బటన్ ని క్లిక్ చేయండి.
03:27 ఇప్పుడు Proxy మరియు Repository ని Synaptic ప్యాకేజ్ మేనేజర్ లో కాన్ఫిగర్ చేద్దాం.
03:33 మనం దీనిని ఒక అప్ప్లికేశన్ ని లేదా package ని ఇంస్టాల్ చేసేముందు చేయాలి.
03:38 Settings కి వెళ్ళి Preferences పై క్లిక్ చేయండి.
03:42 Preferences విండో పైన చాలా ట్యాబ్ లు మనకు తెర పై ప్రదర్శించబడతాయి.
03:48 Proxy settings ని కాన్ఫిగర్ చేయడానికి Network పై క్లిక్ చేయండి.
03:52 ఇక్కడ Proxy Server క్రింద రెండు ఎంపికలు ఉన్నాయి అవి Direct Connection మరియు Manual Proxy.
04:00 నేను Direct Connection ని ఎంపిక చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఆప్శన్ ను ఎంపిక చేసుకోవచ్చు.
04:06 కింద ఉన్న OK బటన్ పై క్లిక్ చేసి విండో ని మూసివేయండి.
04:11 ఇప్పుడు మళ్ళీ Setting కి వెళ్ళి Repositories పై క్లిక్ చేయండి.
04:16 Software & Updates విండో తెరపైన కనిపిస్తుంది.
04:20 ఉబంటు సాఫ్ట్ వేర్ ని డౌన్లోడ్ చేయడానికి చాలా వనరులు ఉన్నాయి.
04:24 డ్రాప్ డౌన్ మెను నుండి Download From పై క్లిక్ చేసి మౌస్ ని అలాగే పట్టిఉంచి repositories ల జాబితా ను చూడండి.
04:31 other అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల జాబితా ను చూపుతుంది.
04:36 విండో ని మూయడానికి దిగువన ఉన్న Cancel బటన్ పై క్లిక్ చేయండి.
04:41 నేను ఇక్కడ చూపినట్లుగా Server for India ని ఉపయోగిస్తున్నాను.
04:45 Software Sources విండో ని మూయుటకు Close బటన్ పై క్లిక్ చేయండి.
04:50 మీరు Synaptic Package Manager ని మొదటిసారి ఉపయోగిస్తున్నట్లయితే, packages ని రీలోడ్ చేయాలి.
04:57 దీనిని చేయడానికి టూల్ బార్ పై ఉన్న Reload బటన్ ని క్లిక్ చేయండి.
05:02 దీనికి కొన్ని సెకండ్లు పట్టవచ్చు.
05:05 ఇక్కడ మనం చూస్తే ఇంటర్నెట్ నుండి packages బదిలీ అయ్యి నవీకరణం అవ్వడం కనిపిస్తుంది.
05:13 ఇప్పుడు నేను వి ఎల్ సి ప్లేయర్ ను ఇంస్టాల్ చేస్తాను.
05:18 టూల్ బార్ పై ఉన్న సర్చ్ ఫీల్డ్ Search field కి వెళదాం.
05:23 సర్చ్ డైలాగ్ బాక్స్ లో vlc ని టైప్ చేసి Search బటన్ నొక్కండి.
05:29 ఇక్కడ మనం జాబితా చేయబడిన అన్ని VLC packages ( వి ఎల్ సి ప్యాకేజి) ను చూడవచ్చు.
05:34 VLC packages (వి ఎల్ సి ప్యాకేజి) ని ఎంపిక చేసుకోవడానికి చెక్ బాక్స్ పై రైట్ క్లిక్ చేసి Mark for installation అనే ఎంపిక ని అక్కడ ఉన్న మెను నుండి ఎంపిక చేసుకొండి.
05:45 అన్ని repository packagesల జాబితాను చూపించే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:51 dependencies packages లను స్వయంచాలకంగా (ఆటొమెటిక్ గా) మార్క్ చేయడానికి Mark బటన్ పై క్లిక్ చేయండి.
05:57 టూల్ బార్ కి వెళ్లి Apply బటన్ ని క్లిక్ చేయండి.
06:01 అన్ని ఇంస్టాల్ చేయాల్సిన packages గల ఒక Summary విండో కనిపిస్తుంది.
06:07 ఇంస్టాల్ చేయడానికి కింద ఉన్న Apply బటన్ ను క్లిక్ చేయండి.
06:12 ఇంస్టాలేశన్ ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది.
06:16 ఇది ఇంస్టాల్ చేయాల్సిన packages ల సంఖ్య మరియు పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది.
06:21 ఇంస్టాలేశన్ ప్రక్రియ పూర్తికాగానే Applying Changes విండొ మూయబడుతుంది.
06:27 Synaptic Package Manager విండొ ని మూసివేయండి.
06:31 ఇప్పుడు VLC player విజయవంతంగా ఇంస్టాల్ అయ్యిందా లేదా అని పరిశీలిద్దాం.
06:37 Dash home కి వెళ్ళండి.
06:39 సర్చ్ బార్ లో vlc అని టైప్ చేయండి.
06:42 ప్రదర్శింపబడిన జాబితాలో మనం VLC icon ని చూడవచ్చు. దానిని తెరవడానికి, దాని పై క్లిక్ చేయండి.
06:49 ఇదేవిధంగా, మనం వేరే applications ని Synaptic Package Manager ని ఉపయోగించి ఇంస్టాల్ చేయవచ్చు.
06:56 తర్వాత మనం ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ నుండి సాఫ్ట్ వేర్ ను ఇంస్టాల్ చేయడం ఎలాగో నేర్చుకుందాం.
07:02 ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ అనేది Ubuntu Linux OS పై ఒక సాఫ్ట్ వేర్ ను నిర్వహించడానికి మనకు అనుమతినిచ్చే ఒక అప్ప్లికేశన్.
07:10 దీనిని మీరు ఒక సాఫ్ట్ వేర్ ను సర్చ్, డౌన్లోడ్, ఇంస్టాల్, అప్ డేట్ లేదా ఆన్ ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగించవచ్చు.
07:17 మీరు దానిని ఉపయోగించకముందే, అది మీకు software ను గురించిన సమాచారాన్ని కూడా ఇస్తుంది
07:23 ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ ను తెరవడానికి లాంచర్ కు వెళ్ళండి.
07:27 ఉబంటు సాఫ్ట్ వేర్ అనే అయికన్ పై క్లిక్ చేయండి.
07:31 ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది.
07:35 పై భాగం లో, మనం 3 ట్యాబ్ లు- All, Installed మరియు Updates ని చూడవచ్చు.
07:42 All ట్యాబ్ పై క్లిక్ చేయండి.
07:44 మనం పై భాగం వద్ద ఒక సర్చ్ బార్ ని చూడవచ్చు.
07:47 ఇది మనకు అందుబాటులో ఉన్న సాఫ్ట్ వేర్ ను అన్వేశించడానికి సహాయపడుతుంది.
07:51 ఇప్పుడు, Inkscape అనే software ని ఇంస్టాల్ చేద్దాం.
07:55 సర్చ్ బార్ లో Inkscape అని టైప్ చేయండి.
07:59 Inkscape కి సంభందించిన ఒక చిన్న సమాచారం కనిపిస్తుంది.
08:03 ఇప్పుడు కుడి వైపు చివరన ఉన్న Install బటన్ పై క్లిక్ చేయండి.
08:07 Authentication డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:10 మీ అడ్మిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత Authenticate బటన్ పై క్లిక్ చేయండి.
08:16 ప్రోగ్రెస్స్ బార్ Inkscape ఇన్ స్టాల్ అవుతుందని సూచిస్తుంది.
08:21 ఇన్స్టాల్ చేయవల్సిన packages ల సంఖ్య మరియు పరిమాణాన్ని బట్టి ఇన్స్టాలేషన్ కి కొంత సమయం పట్టవచ్చు.
08:28 పైభాగం వద్ద ఉన్న Installed ట్యాబ్ లో కూడా పురోగతి సూచించబడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
08:35 ఏదయినా ఇన్స్టాలేషన్ జరిగే సమయం లో మీరు వేరే అప్ప్లికేశన్ లను కూడా అక్కెస్స్ చేయవచ్చు.
08:41 Inkscape అనే పదం పై క్లిక్ చేయండి.
08:44 ఇది Inkscape గురించిన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
08:48 ఒకసారి Inkscape ఇంస్టాల్ అయిన తర్వాత, మనం దాని ప్రకన్న ఉండే Remove మరియు Launch అనే బటన్ లను చూడవచ్చు.
08:55 మీరు సాఫ్ట్వేర్ ని అన్ ఇంస్టాల్ చేయాలంటే Remove బటన్ క్లిక్ చేయాలి.
09:00 అప్ప్లికేశన్ ని లాంచ్ చేయడానికి Launch బటన్ పై క్లిక్ చేయండి. నేను దాని పై క్లిక్ చేస్తాను.
09:06 ఇది Inkscape application ని లాంచ్ చేస్తుంది.
09:10 ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ కి తిరిగి వెళ్ళండి. పైన ఎడమ వైపు చివరన ఉన్న బ్యాక్ యారో బటన్ పై క్లిక్ చేసి, మెయిన్ స్క్రీన్ కి తిరిగి రండి.
09:18 ఇప్పుడు అప్ డేట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
09:21 Software is up to date అని అది మనకు చూపిస్తుంది.
09:25 పైన ఎడుమ వైపు ఉన్న refresh అయికాన్ పై క్లిక్ చేయండి. అది ఏవైనా క్రొత్త నవీకరణల కోసం తనిఖీ చేస్తుంది.
09:31 ఇప్పుడు మనకు ఒక OS updates వచ్చింది.
09:34 వివరాలకు దానిపై క్లిక్ చేయండి. దీనిని మూసివేద్దాం.
09:39 మీరు ఈ అప్ డేట్ ని ఇంస్టాల్ చేయాలనుకుంటే Install బటన్ పై క్లిక్ చేయండి. లేదంటే దాన్ని అలాగే వదిలివేయండి.
09:46 ఇంతటితొ ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం.
09:52 ఈ ట్యుటొరియల్ లో మనం ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం లో సాఫ్ట్ వేర్ ని టర్మినల్,
10:02 Synaptic Package Manager మరియు Ubuntu Software Center ల ద్వారా ఎలా ఇంస్టాల్ చేయాలో నేర్చుకున్నాం.
10:07 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
10:15 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:24 మరింత సమాచారం కోసం మాకు రాయండి.
10:28 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
10:32 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
10:44 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Simhadriudaya