Difference between revisions of "GChemPaint/C3/Features-of-GChem3D/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 |Time |Narration |- |00:01 |అందరికి నమస్కారం.ఫీచర్స్ అఫ్ జికెం3D (Features of GChem3D)ట్యుటో...") |
|||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | |మెనూ బార్, | + | |మెనూ బార్,ఫైల్ టైప్ ఫార్మాట్స్, |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
Line 307: | Line 304: | ||
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | | వివిధ మెనూలు, | + | | వివిధ మెనూలు, ఫైల్ టైప్ ఫార్మాట్స్ , |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|07:26 | |07:26 |
Latest revision as of 11:02, 9 May 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం.ఫీచర్స్ అఫ్ జికెం3D (Features of GChem3D)ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్లో మీరు నేర్చుకునేది- |
00:10 | మెనూ బార్,ఫైల్ టైప్ ఫార్మాట్స్, |
00:13 | వివిధ మోడల్ రకాలు మరియు |
00:15 | బాక్గ్రౌండ్ కలర్(background color)ఎలా మార్చాలి? |
00:18 | ఇక్కడ, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:24 | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 , |
00:29 | Gchem3D(జికెం3D)వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:34 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి GchemPaint(జికెంపెయింట్)తో పరిచయం. |
00:38 | లేకపోతే,మా వెబ్ సైట్లో సంబందిత ట్యుటోరియల్స్ చూడండి. |
00:44 | నేను ఒక కొత్తGchemPaint(జికెంపెయింట్)విండో తెరిచాను. |
00:47 | టెంప్లేట్స్ (Templates)డ్రాప్ డౌన్ నుఉపయోగించి, |
00:49 | నేను డిస్ప్లే ఏరియా పై అడినోసిన్(Adenosine)నిర్మాణం ను లోడ్ చేస్తాను. |
00:53 | ఫైలు సేవ్ చేయడానికి, టూల్ బార్ పై సేవ్(Save)చిహ్నం పై క్లిక్ చేయండి. |
00:58 | సేవ్ అస్(Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
01:02 | జికెం3D(GChem3D) లో ఫైల్ చూడడానికి, ఫైల్ ను .mol, .mdl మరియు .pdb ఫార్మాట్ల లో సేవ్ చెయ్యాలి. |
01:11 | అడినోసిన్.pdb(Adenosine.pdb) గా ఫైల్ పేరు టైపు చెయ్యండి. |
01:15 | ఫైల్ డెస్క్టాప్(Desktop) పై సేవ్ చేయడానికి డెస్క్టాప్(Desktop) పై క్లిక్ చెయ్యండి. |
01:18 | సేవ్(Save)బటన్ పై క్లిక్ చెయ్యండి. |
01:21 | నేను GChemPaint(జికెంపెయింట్)విండో మూసి వేస్తాను. |
01:25 | ఇప్పుడు GChem3D (జికెం3D)అప్లికేషన్ గురించి నేర్చుకుందాం. |
01:29 | సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ వాడి GChem3D(జికెం3D) ను , GChemPaint (జికెంపెయింట్)యొక్క |
01:34 | యుటిలిటీ సాఫ్ట్ వేర్ గా ఇన్స్టాల్ చేయవచ్చు. |
01:38 | సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్(Synaptic Package Manager)వద్దకు వెళ్ళండి. |
01:40 | క్విక్ ఫిల్టర్ బాక్స్ (Quick filter box)లో GChemPaint (జికెంపెయింట్)అని టైపు చేయండి. |
01:44 | GChemPaint (జికెంపెయింట్) పూర్తిగా ఇన్స్టాల్ చేయడానికి, gcu-plugin,libgcu-dbg మరియు gcu-bin ను ఇన్స్టాల్ చేయండి. |
01:55 | నేను ముందు గానే అన్ని ఫైళ్లు ఇన్స్టాల్ చేసి ఉంచాను. |
01:59 | GChem3d (జికెం3d) ఒక 3-డైమెన్షనల్ మాలేకులర్ స్ట్రక్చర్ విజువలైసర్. |
02:04 | ఇది GChemPaint (జికెంపెయింట్) యొక్క ఒక యుటిలిటీ లక్షణం. |
02:07 | GChemPaint (జికెంపెయింట్)లో గీసిన స్ట్రక్చర్స్ ను జికెం3D( GChem3D)లో చూడవచ్చు. |
02:12 | జికెం3D( GChem3D) తెరవడానికి,డాష్ హోమ్(Dash Home) పై క్లిక్ చేయండి. |
02:15 | కనిపించే సెర్చ్-బార్ లో జికెం3d( gchem3d)అని టైపు చెయ్యండి. |
02:20 | మాలిక్యూల్స్ వ్యూవర్ (Molecules viewer) చిహ్నం పై క్లిక్ చెయ్యండి. |
02:24 | జికెం3d వ్యూవర్ ( gchem3d Viewer) విండో, మెనూబార్(Menubar) మరియు డిస్ప్లే ఏరియా (Display area) లు కలిగియున్నది. |
02:30 | మెనూబార్(Menubar), జికెం3d(GChem3D) తో పని చేయడానికి కావలసిన అన్ని ఆదేశాలను కలిగి ఉంటుంది. |
02:36 | డిస్ప్లే ఏరియా(Display area) తెరిచిఉన్న ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూపిస్తుంది. |
02:40 | ఫైలు తెరవడానికి, ఫైలు (File)ఎంచుకోండి. ఓపెన్(Open)పై క్లిక్ చేయండి. |
02:46 | ఓపెన్ (Open) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
02:49 | మీరు తెరవాలనుకున్న ఫైల్ ను ఎంచుకోండి. |
02:52 | నేను, నా డెస్క్టాప్ పై ఉన్న అడినోసిన్.pdb (Adenosine.pdb) ఫైల్ నుఎంచుకుంటాను. |
02:57 | ఇప్పుడు ఓపెన్(Open)బటన్ పై క్లిక్ చేయండి. |
02:59 | డిస్ప్లే ఏరియా(Display area)లో ఫైల్ కనిపిస్తుంది. |
03:02 | ఈ వ్యూను ఇమేజ్ గా సేవ్ చేయడం నేర్చుకుందాం. |
03:05 | ఫైల్(File) పై క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్(Save As Image) వద్దకు వెళ్ళండి. |
03:10 | సేవ్ యాస్ ఇమేజ్(Save As Image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
03:12 | దిగువన వున్న విడ్త్(Width) మరియు హైట్ (Height) పరామీటర్స్ ను గమనించండి. |
03:17 | డిఫాల్ట్ ఇమేజ్ విడ్త్(Width) 300 పిక్సల్స్ మరియు హైట్ (Height) 300 పిక్సల్స్ గా కొలతలు కలిగి ఉన్నది. |
03:24 | మీరు స్క్రోలర్స్ వాడి విలువలు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. |
03:29 | ఇప్పుడు ఫైల్ టైప్(File type)ఎంపిక వద్దకు వెళ్ళండి . |
03:31 | జికెం3D(GChem3D) వివిధ ఫైల్ ఫార్మాట్ల ను సహకరిస్తుంది. |
03:35 | VRML, PDF, PNG మరియు ఇతర ఫైల్ రకాలు డ్రాప్-డౌన్ జాబితా లో అందుబాటులో ఉన్నాయి. |
03:45 | ఏ ఫైలు రకం పేర్కొనక పొతే, GChem3d ఫైలు పేరు నుండి ఫైల్ రకం గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది. |
03:52 | అది విజయవంతం కాకపోతే, డిఫాల్ట్ ఫైల్ రకం VRML వాడబడుతుంది. |
03:58 | నిర్మాణం ను VRML ఫైలు ఫార్మాట్ లో సేవ్ చేద్దాం . |
04:03 | VRML డాక్యుమెంట్(document) ఎంపిక ఎంచుకోండి. |
04:07 | అడినోసిన్ (Adenosine) గా ఫైల్ పేరును టైప్ చేయండి. |
04:11 | డెస్క్టాప్(Desktop) పై ఫైలు సేవ్ చేయడానికి డెస్క్టాప్(Desktop)పై క్లిక్ చేయండి. |
04:14 | సేవ్ (Save)బటన్ పై క్లిక్ చేయండి. |
04:17 | ఇప్పుడు VRML ఫైల్ టైపు (File type) అంటే ఏమిటో నేర్చుకొందాం. |
04:22 | VRML అనేది .wrl ఎక్స్టెన్షన్ తో గల ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్. |
04:28 | 3D polygon లక్షణాలు అయినటువంటి వర్టిసెస్(vertices), ఎడ్జెస్ (edges), మరియు సర్ఫేస్ కలర్ (surface color) లను తెలుపవచ్చు. |
04:35 | VRML ఫైళ్ళు సాదాటెక్స్ట్ తో gzip గా కుదించబడి ఉంటాయి. |
04:40 | 3D మోడలింగ్ ప్రోగ్రామ్స్,ఆబ్జక్ట్స్ ను మరియు వాటి దృశ్యాలను సేవ్ చేస్తాయి . |
04:45 | సేవ్ చేసిన ఫైల్ ను తెరుద్దాం. |
04:48 | Adenosine.wrl ఫైలు మీద రైట్క్లిక్ చేసి, ఓపెన్ విత్ టెక్స్ట్ ఎడిటర్(Open with Text Editor) ఎంపిక ను ఎంచుకోండి. |
04:55 | టెక్స్ట్ ఎడిటర్ నిర్మాణం గురించి అన్ని వివరాలు చూపిస్తుంది. |
05:01 | ఇప్పుడు పేజీ సెటప్(Page Setup)వద్దకు వెళ్దాం. |
05:04 | GChem3d, ప్రింటింగ్ చేసేటపుడు 300dpi resolution ను వాడుతుంది. |
05:09 | పేజీ సెటప్(Page Setup) లక్షణాలు GChemPaint లో వలెనే ఉంటాయి. |
05:14 | నేను ఇప్పటికే GChemPaint ట్యుటోరియల్స్ లో ఈ సిరీస్లో వీటిగురించిచర్చించాను. |
05:19 | నేను విండో మూసి వేస్తాను. |
05:21 | ఇప్పుడు వ్యూ(View) మెను వద్దకు వెళ్దాం. |
05:25 | వ్యూ (View) మెనును ఎంచుకోండి. |
05:27 | GChem3D, నాలుగు మోడల్ టైప్స్ను వాడి ఒక అణువు ను చూపిస్తుంది: |
05:32 | బాల్స్ అండ్ స్టిక్స్ , స్పేస్ ఫిల్లింగ్, |
05:35 | సిలిండర్స్ మరియు వైర్ఫ్రేమ్. |
05:39 | బాల్స్ అండ్ స్టిక్స్(Balls and sticks) అనునది డిఫాల్ట్ మోడల్. |
05:42 | ఈ నమూనా ను ఉపయోగించి బహుళ మరియు సరైన బాండ్ స్థానాలు చూడవచ్చు. |
05:48 | నేను స్పేస్ ఫిల్లింగ్(Space Filling) పై క్లిక్ చేస్తాను మరియు మీరు వ్యత్యాసం గమనించగలరు. |
05:53 | స్పేస్ ఫిల్లింగ్(Space Filling) మోడల్ అణువులను కాంపాక్ట్ రూపంలో చూపిస్తుంది. |
05:58 | సిలిండర్స్ (Cylinders) మోడల్, సిలెండ్రికల్ పైప్స్ (cylindrical pipes) రూపంలో నిర్మాణం ను చూపిస్తుంది. |
06:03 | వైర్ ఫ్రేమ్ (Wireframe) మోడల్, స్కెలెటల్ (skeletal) నిర్మాణం ను చూపిస్తుంది. |
06:08 | బాల్స్ అండ్ స్టిక్స్ (Balls and sticks) వద్దకు తిరిగి వెళ్దాం. |
06:11 | మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ (Background color)కు వెళ్దాం. |
06:14 | డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ (Background color) బ్లాక్. |
06:17 | వ్యూ(View)మెను ఎంచుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ (Background color) వద్దకు వెళ్ళండి. |
06:21 | ఒక సబ్ మెను తెరుచుకుంటుంది. |
06:23 | సబ్ మెను చివరిలో కస్టమ్ కలర్(Custom color) ను ఎంచుకోండి. |
06:26 | బ్యాక్గ్రౌండ్ కలర్(Background color) విండో తెరుచుకుంటుంది. |
06:30 | ఈ విండో లో మనకు కావలసిన రంగు ఎంచుకోవడానికి వివిధ విభాగాలు ఉన్నాయి. |
06:35 | హ్యూ (Hue)ను వాడి ,మనం బాక్గ్రౌండ్ కలర్ ను మార్చవచ్చు. |
06:39 | స్క్రోలర్ (scroller) పై క్లిక్ చేయండి. కలర్ సర్కిల్ (color circle) యొక్క విలువ మరియు కదలిక లో మార్పును గమనించండి. |
06:45 | సాచురేషణ్(Saturation) ఉపయోగించి , రంగు గాఢత మార్చవచ్చు. |
06:51 | వేల్యూ (Value) ఉపయోగించి , RGB కాంబినేషన్(combination) మార్చి, ఒక రంగు యొక్క వివిధ షేడ్స్ పొందవచ్చు . |
06:59 | ఇక్కడ,ప్రివ్యూ బాక్స్(Preview box),పక్కన ఒక ఐడ్రాపర్(eyedropper) చిహ్నం తో కనిపిస్తుంది. |
07:04 | ఐడ్రాపర్(eyedropper)చిహ్నం పై క్లిక్ చేయండి. |
07:07 | ఇష్టపడే రంగు ఎంచుకోవడానికి రంగు రింగ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
07:11 | ఓకే(OK) బటన్ క్లిక్ చేయండి. స్క్రీన్ పై బాక్గ్రౌండ్ కలర్ మారుతుంది . |
07:18 | నేర్చుకున్నది సంగ్రహంగా, |
07:20 | ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నది, |
07:23 | వివిధ మెనూలు, ఫైల్ టైప్ ఫార్మాట్స్ , |
07:26 | మోడల్ టైప్స్ మరియు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం ఎలా. |
07:30 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ |
07:33 | GChemPaint నుండి ఒక శాచరైడ్(Saccharide) ను లోడ్ చేసి మరియు .mdl ఫార్మాట్ లో ఫైల్ సేవ్ చేయండి. |
07:39 | నిర్మాణం ను మాలిక్యూలస్ వ్యూయర్(Molecules viewer)లో తెరవండి. |
07:42 | చిత్రం ను PNG మరియు PDF ఫైల్ టైప్ లో సేవ్ చేయండి. |
07:46 | వివిధ బ్యాక్గ్రౌండ్ కలర్ లను ప్రయత్నించండి. |
07:49 | ఈ క్రింది లింక్ నందు అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
07:53 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:56 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:01 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
08:06 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:10 | మరిన్ని వివరాలకు,దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
08:17 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
08:22 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:29 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
08:35 | ఈ ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించింది స్వామి. ధన్యవాదాలు. |