Difference between revisions of "Health-and-Nutrition/C2/Cross-cradle-hold/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 | ''' Time ''' | '''Narration''' |- |00:01 | తల్లి పాలివ్వడం కొరకు క్రాస్ క్రెడిల్ హో...")
 
Line 83: Line 83:
 
|-  
 
|-  
 
|02:03
 
|02:03
| ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా సడలించబడతాయి.
+
| ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా సడలించబడాలి.
  
 
|-  
 
|-  

Revision as of 17:41, 19 September 2019

Time Narration
00:01 తల్లి పాలివ్వడం కొరకు క్రాస్ క్రెడిల్ హోల్డ్ (అడ్డంగా ఊయల లా పట్టుకోవడం) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటొరియల్ లో మనం నేర్చుకునేది - పాలివ్వడానికి తల్లి మరియు తన బిడ్డ కొరకు సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం.
00:16 పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు
00:20 క్రాస్ క్రేడిల్ పద్దతిలో పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం.
00:24 మనం ప్రారంభిద్దాం.
00:26 ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు
00:32 వాటిలో పాలివ్వడానికి బిడ్డను పట్టుకోవడంలో తల్లి మరియు ఆమె బిడ్డ కొరకు ఉత్తమమైన పద్దతి ఏదంటే- తల్లి పాలివ్వడం పూర్తయ్యేవరకు తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సౌకర్యంగా ఉండడం,
00:43 బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉండగలగడం
00:48 మరియు బిడ్డ తగినన్ని పాలను పొందడం
00:51 పట్టుకునే విధానాలలో క్రాస్ క్రెడిల్ హోల్డ్ (అడ్డంగా ఊయల లా పట్టుకోవడం) అని పిలువబడే ఒకదాని గురించి తెలుసుకుందాం.
00:56 బిడ్డ శరీరంపై పూర్తి నియంత్రణ,

స్తనానికి ఆసరా మరియు బిడ్డ స్థనాన్ని లోతుగా పట్టుకోవడానికి క్రాస్ క్రెడిల్ హోల్డ్ (అడ్డంగా ఊయల లా పట్టుకోవడం) అనేది ఉత్తమమైన పట్టుకునే విధానం.

01:06 తన బిడ్డకు పాలిచ్చే ముందు, తల్లి తప్పనిసరిగా తన చేతులను కడుక్కుని తడిలేకుండా బాగా తుడుచుకోవాలి.
01:12 తర్వాత ఆమె తప్పనిసరిగా ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
01:16 పాలిచ్చే తల్లులకు దాదాపుగా ఒక రోజుకి750 నుండి 850 మిల్లిలీటర్ల పాలు వస్తాయి.
01:24 అందువల్ల, వారు రోజు తాగుతున్న నీళ్లను పెంచి తాగాల్సిన అవసరం ఉంది.
01:29 తరువాత, మనం తల్లి ఏ భంగిమలో ఉండాలో చర్చిద్దాం.
01:33 తల్లి నేలపై కానీ లేదా మంచం పై కానీ కాళ్ళు మడచుకుని కూర్చొవాలి.
01:38 లేదా తన పాదాలు సమంగా నేలను తాకేలా పెట్టి కుర్చీపైన కూర్చోవాలి.
01:43 ఒకవవేళ కుర్చీ చాలా ఎత్తుగాఉండి ఆమె పాదాలు నేలను తాకక పోతె అప్ప్పుడు ఒక చిన్న పీటను లేదా దిండును నేలపై ఉంచి, వాటిపై ఆమె తన పాదాలను సమంగా ఉంచవచ్చు.
01:54 వెన్ను నొప్పి రాకుండా నివారించడానికి, ఆమె కూర్చునేటప్పుడు తన వెన్ను నిటారుగా ఉందని నిర్ధారించుకోవాలి.
02:03 ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా సడలించబడాలి.
02:08 ఇలా విశ్రాంతిగా ఉన్న ఈ భంగిమను తల్లి పాలిచ్చే సమయం అంతటా కొనసాగించాలి.
02:13 ఇప్పుడు తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వాలి అనుకుంటుందో ఆ వైపు వస్త్రాన్ని తొలగించాలి.
02:19 ఆమె తన బ్రా లేదా బ్లౌజ్ వలన తన రొమ్ము మీద ఒత్తిడి పడటంలేదని నిర్దారించుకోవాలి.
02:26 తల్లి సౌకర్యవంతంగా కూర్చున్నతర్వాత, బిడ్డను తల్లి దగ్గరకు తీసుకొని రావాలి.
02:31 తల్లి తాను ఏ వైపు నుండి పాలిస్తుందో దానికి ఎదురుగా ఉన్న చేతితో తన బిడ్డ యొక్క తలను పట్టుకొవాలి.
02:39 బిడ్డ యొక్క కాళ్ళను తల్లి యొక్క అదే చేతిలోని చంక కింద దోపి ఉండాలి.
02:45 ఈ చిత్రం లోని తల్లి తన కుడి వైపు స్తనం నుండి పాలిస్తుంది.అందువల్ల బిడ్డ యొక్క కాళ్ళు ఆమె ఎడమ చేతి కింద చంకలో దోపి ఉండాలి.
02:57 ఆమె తన బిడ్డ తల యొక్క దిగువ భాగాన్ని పట్టుకోవడానికి తన ఎడమ చేతి యొక్క బొటనవేలు మరియు మిగతావేళ్ళను ఉపయోగిస్తోంది.
03:05 ఒకవేళ బిడ్డను ఎత్తడానికి తల్లి అదనపు మద్దతును కోరుకుంటే, ఆమె బిడ్డ కింద ఒక దిండును ఒళ్ళో ఉంచుకొవచ్చు.
03:15 తల్లి ఎప్పుడూ కూడా తన వెన్నును వంచి స్తనాన్ని బిడ్డకు అందేలా చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి.
03:21 ఇది ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు వెన్నునొప్పికి కారణమవుతుంది.
03:26 ఆమె ఎల్లప్పుడూ తన వెన్నును నిటారుగా ఉంచి, బిడ్డ తన రొమ్ము దగ్గరకు చేరేలా బిడ్డను పైకి ఎత్తాలి.
03:33 తర్వాత, తల్లి యొక్క బొటన వేలు మరియు మిగతావేళ్ళ ఉంచాల్సిన సరైన స్థితి ఏమిటొ చూద్దాం.
03:39 తల్లి బొటన వేలు బిడ్డ యొక్క ఒక చెవి వెనుక మరియు మిగతావేళ్లు మరో చెవి వెనుక ఉండాలి.
03:46 ఆమె బిడ్డ చెవి వెనుక ఉన్న తన బొటన వేలు మరియు మిగతావేళ్లను బిడ్డ మెడ దగ్గరకు జరపకూడదు.
03:52 ఆమె మణికట్టు శిశువు యొక్క భుజ ఫలకాలు మధ్య ఆనించి ఉండాలి.
03:56 ఆమె తన చేత్తో బిడ్డ యొక్క తల వెనుక భాగంలో ఒత్తిడి కలిగించకూడదు.
04:04 ఇది పాలను త్రాగే సమయంలో బిడ్డను సౌకర్యంగా ఉంచుతుంది.
04:08 తరువాత, మనం బిడ్డ శరీరాన్ని ఎలా సరిగ్గా ఉంచాలో నేర్చుకుందాం.
04:15 శిశువు యొక్క కడుపు తల్లి శరీరానికి వ్యతిరేకంగా సున్నితంగా నొక్కాలి.
04:20 వారి శరీరాల మధ్య తక్కువ దూరం ఉంటె అది రొమ్మును చేరుకోవడానికి శిశువు చేసే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది.
04:26 మరియు దానివల్ల బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడం సులభం అవుతుంది.
04:32 బిడ్డ శరీరాన్ని సరిగ్గా ఉంచడంలో రెండవ అంశం బిడ్డ శరీర అమరిక.
04:37 మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒక సరళ రేఖలో ఉంటాయి.
04:43 కానీ, పాలిచ్చేటప్పుడు, చాలా మంది తల్లులు బిడ్డ యొక్క తలను తరచుగా పక్కలకి తిప్పుతుంటారు.
04:50 దీని వల్ల బిడ్డకు పాలు తాగడానికి అసౌకర్యం కలగవచ్చు.
04:55 తల్లి పాలిచ్చేటప్పుడు శిశువు యొక్క తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఓక సరళరేఖలో ఉండాలి.
05:01 ఇది శిశువుకు పాలు మింగడాన్ని సులభం చేస్తుంది.
05:05 ఇప్పుడు మనము బిడ్డ శరీరాన్ని ఎలా ఉంచాలి అనేదానిలో మూడవ అంశానికి వచ్చాము.
05:10 తల్లి తన బిడ్డ యొక్క పూర్తి శరీరానికి ఆసరా ఇవ్వాలి.
05:14 లేకపోతే, బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉండటానికి చాలా శ్రమ పడవలసిఉంటుంది.
05:22 తరువాత, బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉంచాలో చూద్దాం.
05:28 బిడ్డ ముక్కు మరియు చనుమొన ఒకే రేఖ లో ఉండాలి
05:33 ఇంకా తన గడ్డం ముందుకి ఉండి స్తనానికి చాలా దగ్గరగా ఉండాలి.
05:38 బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకునేటపుడు అరియోలా యొక్క దిగువ భాగాన్ని ఎక్కువగా తీసుకుంటుందని ఇది నిర్ధారిస్తుంది.
05:45 అందువల్ల, ఎక్కువ పాలను బాగా త్రాగడానికి బిడ్డ కింది దవడను ఉపయోగిస్తుంది.
05:51 దయచేసి గమనించండి అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం.
05:57 ఇప్పుడు, బిడ్ద సరైన స్థితి లొ ఉంచబదడింది.మనం స్తనాన్ని ఎలా పట్టుకొవాలో నేర్చుకుందాం.
06:04 తన మరో చేతి వేళ్ళను ఉపయోగించి, తల్లి తన రొమ్ము కింద U ఆకారంలో పట్టుకుని కప్పాలి.
06:12 ఇక్కడ ఈ చిత్రం లో తల్లి తన కుడి చేతిని తన కుడి స్తనాన్ని పట్టుకొడానికి ఉపయోగిస్తుంది.
06:19 బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను సరిగ్గా ఎలా పెట్టాలో అర్థం చేసుకోవడానికి, చనుమొనను తల్లి యొక్క కుడి రొమ్ముపై గడియారానికి కేంద్రంగా ఊహించుకోండి.
06:31 ఈ గడియారంలో తల్లి తన కుడి బొటనవేలును 9 గంటల సమయం స్థానం వద్ద ఉంచాలి.
06:38 ఆమె తన కుడి చూపుడు వేలు మరియు మధ్య వేలును గడియారపు 3 గంటల స్థానం వద్ద ఉంచితే.
06:46 తల్లి యొక్క వేళ్ళు, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క పెదవులకు సమాంతరంగా ఉంటాయి. ఇలా ఎందుకు?
06:51 ఒక సరళమైన ఉదాహరణను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
06:56 మనం వడా పావ్ లేదా బర్గర్‌ను తినేటప్పుడు మన పెదవులు అడ్డంగా తెరచుకుంటాయి.
07:02 ఒక పెద్ద ముక్కను కొరకడానికి మనం వడా పావ్ లేదా బర్గర్‌ను అడ్డంగా పట్టుకుంటాము.
07:08 ఇక్కడ, బొటనవేలు మరియు మిగతా వేళ్లు పెదవులకు సమాంతరంగా ఉంచబడతాయి.
07:12 ఒకవేళ మనం వడా పావ్ లేదా బర్గర్‌ ను నిలువుగా పట్టుకుంటే మనం దాని పెద్ద ముక్కను కొరకలేము.
07:19 అదేవిధంగా, శిశువు యొక్క పెదవుల దిశను గమనించండి.
07:25 పెదవులు ఇక్కడ నిలువుగా ఉంటాయి. అందువల్ల, మిగతా వేళ్లు మరియు బొటనవేలు కూడా రొమ్ముపై నిలువుగా ఉంచాలి.
07:34 ఇది బిడ్డ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది.
07:39 శిశువు యొక్క పెదవులకు సమాంతరంగా ఉండటమే కాకుండా, తల్లి బొటనవేలు మరియు మిగతా వేళ్లు ఎల్లప్పుడూ చనుమొన నుండి 3 వేళ్ల దూరం వద్ద ఉండాలి.
07:50 మళ్ళీ, వడా పావ్ లేదా బర్గర్ ను తినేటప్పుడు, ఒకవేళ మనం దానిని చాలా దగ్గరగా పట్టుకుంటే, మన వేళ్లు పెద్ద ముక్కను కొరకనివ్వకుండా మన నోటికి అడ్డుపడతాయి.
08:00 ఒకవేళ మనం దాన్ని చాలా దూరంగా పట్టుకుంటే, దాని ఆకారం సరిగ్గా మన నోటిలోకి సరిపోయేలా ఉండదు.
08:07 అందువల్ల, పెద్ద ముక్కను కొరకడానికి మనం దానిని సరైన దూరం వద్ద పట్టుకుంటాము.
08:12 అదేవిధంగా బిడ్డ కొరకు కూడా సరైన దూరం అంటే చిత్రం లొ చూపిన విధంగా చనుమొన నుండి 3 వేళ్ల దూరం.
08:20 ఈ దూరం అనేది బిడ్డ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి తల్లి వేళ్ళు అడ్డు రావు అని నిర్దారిస్తుంది.
08:29 చాల తక్కువ పాలను ఇస్తుంది కనుక తల్లి ఒక్క చనుమొనను మాత్రమే నొక్కదు.
08:35 ఎక్కువపాలు బయటకు వచ్చేలా చేయడానికి, తల్లి అరియోలా కింద ఉన్న పెద్ద పాల నాళాలపై నొక్కుతుంది.
08:42 మరియు బిడ్డ నోటితో లోతుగా పట్టుకోవడానికి సహాయపడేలా తల్లి స్థనం అనేది సరైన ఆకారంలో ఉంటుంది.
08:49 తల్లి బొటనవేలు అనేది ప్రస్తుతం బిడ్డ ముక్కు ఉన్న స్తనభాగం పైన చనుమొన నుండి 3వేళ్ళ దూరంలో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి.
08:59 మరియు ఆమె 2 వేళ్లు ప్రస్తుతం బిడ్డ గడ్డం ఉన్న స్తనభాగం పైన చనుమొన నుండి 3వేళ్ళ దూరంలో ఉండాలి.
09:09 వడా పావ్ లేదా బర్గర్ యొక్క ఉదాహరణకి మనం తిరిగి వెళ్దాం.
09:13 వడా పావ్ లేదా బర్గర్‌ను సరిగ్గా పట్టుకున్న తరువాత,ఎప్పుడూ కూడా పెద్ద ముక్కను కొరకడానికి మనం దాన్ని నొక్కుతాము..
09:21 అదేవిధంగా, తల్లి తన రొమ్మును దిగువ నుండి U ఆకారంలో పట్టుకుని తేలికగా నొక్కాలి.
09:28 ఇది బిడ్డకు స్తనం యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది.
09:34 కానీ గుర్తుంచుకోండి, తల్లి తన రొమ్మును V ఆకారంలో పట్టుకుని నొక్కకూడదు.
09:39 V ఆకారం లో నొక్కడం అనేది రొమ్మును గిచ్చుతుంది మరియు చనుమొన నుండి మాత్రమే పాలు తాగడానికి కారణమవుతుంది.
09:45 స్తనం పై బొటనవేలు మరియు మిగతావేళ్ళ యొక్క వత్తిడి అనేది సమానంగా ఉందని కూడా నిర్ధారించుకోండి.
09:52 లేకపోతే, చనుమొన అనేది కుడివైపుకు లేదా ఎడమ వైపుకు మారిపోయి బిడ్డ స్థనాన్నిలోతుగా పట్టుకోలేకపోయేలా చేస్తుంది.
10:00 బిడ్డ వైపు రొమ్మును పక్కలకు నెట్టడం ద్వారా దానిని ఎప్పుడూ బిడ్డ వద్దకు తీసుకురాకూడదు.
10:08 ఎల్లప్పుడూ బిడ్డనే రొమ్ము వైపు తీసుకురండి.
10:12 ఇప్పుడు, బిడ్డ పాలను త్రాగేందుకు తల్లి రొమ్మును పట్టుకోవడానికి క్రాస్ క్రేడిల్ హోల్డ్ లో సిద్ధంగా ఉంది.
10:18 బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
10:24 ఒకసారి బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న తర్వాత ఒకవేళ స్తనం అనేది భారంగా లెకపోతే అప్పుడు-తల్లి తన రొమ్మును తన చేతి నుండి వదిలిపెట్టాలి. మరియు బిడ్డకు ఆసరా ఇవ్వడానికి ఆ చేతిని బిడ్డ కిందకు తీసుకు రావాలి.
10:40 ఈ స్థితిలో, తల్లి తన రెండు చేతులను తన శరీరానికి చాలా దగ్గరగా తీసుకురావాలి.
10:46 ఇది బిడ్డకు పాలను పట్టించే సమయంలో తల్లిని సౌకర్యంగా ఉంచుతుంది.
10:50 దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
10:54 ఈ ట్యుటొరియల్ లో మనం పాలివ్వడానికి తల్లి మరియు తన బిడ్డ కొరకు సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం.
11:03 పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు క్రాస్ క్రేడిల్ పద్దతిలో పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం గురించి నేర్చుకున్నాం.
11:09 ఈ టుటొరియల్ స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, ఐ ఐ టి బాంబె వారి సమర్పణ.
11:15 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది.
11:23 ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
11:28 ఈ టుటొరియల్ కు వీల్స్ గ్లొబల్ ఫౌండెషన్ కొంత భాగం నిధులను సమకూర్చింది.
11:34 ఈ టుటోరియల్ మా ఔర్ శిశు పొషన్ ప్రాజెక్ట్ లొ ఒక భాగం.
11:39 ఈ డొమైన్ సమీక్షకులు డా. రూపల్దలాల్, ఎం డి పీడియాట్రిక్స్.
11:45 ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను

పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Debosmita, Simhadriudaya