Difference between revisions of "Git/C3/Hosting-Git-Repositories/Telugu"
From Script | Spoken-Tutorial
Line 84: | Line 84: | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | meruమీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి మరియు www.github.com కు | + | | meruమీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి మరియు www.github.com కు వెళ్ళండి. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
| 02:07 | | 02:07 | ||
− | | priyaspoken@gmail.com ను | + | | priyaspoken@gmail.com ను e-mail ID గాను టైప్ చేస్తున్నాను. |
|- | |- | ||
Line 154: | Line 154: | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | నా వద్ద GitHub నుండివచ్చిన | + | | నా వద్ద GitHub నుండివచ్చిన ఒక e-mail ఉంది. |
|- | |- | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | మీ Inbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీ Spam | + | | మీ Inbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీ Spam లేదా Junk ఫోల్డర్లను చెక్ చెయ్యండి. |
|- | |- | ||
Line 261: | Line 261: | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | ఇప్పుడు, మనం ఈ repository లో పని మొదలుపెడదాము | + | | ఇప్పుడు, మనం ఈ repository లో పని మొదలుపెడదాము. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | మన రిపోజిటరీకు ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం . | + | | మన రిపోజిటరీకు ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
Line 309: | Line 309: | ||
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని | + | | ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని ఇవ్వవచ్చు. |
|- | |- | ||
Line 361: | Line 361: | ||
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | |దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై | + | |దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 437: | Line 437: | ||
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | | ఇక్కడ, మీరు commit చేసిన చోట branch name new-chapterను | + | | ఇక్కడ, మీరు commit చేసిన చోట branch name new-chapterను చూడవచ్చు . |
|- | |- |
Revision as of 13:05, 25 January 2018
Time | Narration |
00:01 | Hosting Git Repositories పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము Git repository hosting services గురించి నేర్చుకుంటాము. |
00:11 | అలాగే GitHub account ను క్రియేట్ చేయడం. |
00:14 | GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను Ubuntu Linux 14.04 మరియు Firefox web browserను ఉపయోగిస్తున్నాను. |
00:29 | మీరు మీకు నచ్చిన ఏ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:32 | మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం. |
00:37 | మీకు Git కమాండ్స్ గురించి అవగాహన కూడా ఉండాలి. |
00:42 | లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా link ను సందర్శించండి. |
00:47 | ముందుగా మనం Git repository hosting services గురించి నేర్చుకుందాం. |
00:52 | ఇక్కడ Bitbucket, CloudForge మరియు GitHub వంటి అనేక వెబ్ ఆధారిత హోస్టింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. |
01:00 | ఇక్కడ మీరు మీ Git repositories ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు. |
01:05 | అవి మీ repository పంచుకునే కేంద్రీకృత ప్రదేశాన్ని అందిస్తాయి, అందువల్ల అనేక మంది వ్యక్తులు సులభంగా ప్రాజెక్ట్లో సహకరించుకోవచ్చు. |
01:14 | అవి ఇతర ప్రాజెక్ట్ లను ఉచితంగా డౌన్లోడ్ చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి మీకు అనుమతిస్తాయి. |
01:19 | తరువాత, మనం GitHub ను ఎందుకు ఉపయోగించాలో చూద్దాం. |
01:23 | GitHub Open Source Software హౌసింగ్ కొరకు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్. |
01:28 | GitHub లో, మీరు మీ బృందంతో ప్రభావవంతంగా మార్పులను వీక్షించవచ్చు, చర్చించవచ్చు మరియు సమీక్షించవచ్చు. |
01:35 | GitHub లో ఉపయోగించిన విధానం ఇతర ఉచిత Git hosting వెబ్ సైట్ల మాదిరిగానే ఉంటుంది. |
01:42 | మీరు తర్వాత వాటిని సొంతంగా అన్వేషించవచ్చు. |
01:45 | తరువాత మనం GitHub లో account ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. |
01:49 | meruమీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి మరియు www.github.com కు వెళ్ళండి. |
01:56 | ఇక్కడ, హోమ్ పేజీ లో , మీరు రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలు ఇవ్వాలి. |
02:01 | నేను priya-spoken ను యూసర్ నేమ్ గాను మరియు |
02:07 | priyaspoken@gmail.com ను e-mail ID గాను టైప్ చేస్తున్నాను. |
02:11 | దయచేసి మీరు మీకు నచ్చిన యూజర్ పేరు మరియు చెల్లుబాటు అయిన ఇమెయిల్ ఐడిని టైప్ చేయండి. |
02:16 | ఇప్పుడు నేను, నా పాస్ వర్డ్ ను టైప్ చేస్తున్నాను. |
02:19 | మీరు మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు. |
02:23 | ఇప్పుడు, కుడివైపు క్రిందన ఉన్న Sign up for GitHub బటన్ పై క్లిక్ చేయండి. |
02:28 | తరువాత, Step 2 లో, మన ప్రణాళికను ఎంచుకోవాలి. |
02:32 | నేను ఉచిత సేవను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి Free ప్రణాళికను ఎంచుకుంటాను. |
02:37 | ఇప్పుడు Finish sign up బటన్ పై క్లిక్ చేయండి. |
02:40 | తరువాత మనం GitHub లో repository ని క్రియేట్ చేద్దాం. |
02:44 | మీరు కుడి వైపు బాక్స్ లో New repository అనే బటన్ ను చూడవచ్చు; దానిపై క్లిక్ చేయండి. |
02:51 | ఇది Please verify your email address అనే సందేశాన్ని చూపిస్తుంది. |
02:55 | GitHub మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కి ఒక వెరిఫికేషన్ మెయిల్ ను పంపిస్తుంది. |
02:59 | కాబట్టి , మనం మెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి GitHub ద్వారా పంపిన మెయిల్ పై క్లిక్ చెయ్యాలి . |
03:06 | నేను ఇప్పటికే GitHub తో రిజిస్టర్ అయిన నా ఇమెయిల్ ఐడిలో సైన్ ఇన్ చేశాను. |
03:11 | నన్ను దీనిని ఓపెన్ చేయనివ్వండి. |
03:13 | నా వద్ద GitHub నుండివచ్చిన ఒక e-mail ఉంది. |
03:16 | నేను దానిపై క్లిక్ చేస్తాను. |
03:18 | దానియందు గల సబ్జక్ట్ Please verify your email address అని చెప్తుంది. |
03:23 | మీ Inbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీ Spam లేదా Junk ఫోల్డర్లను చెక్ చెయ్యండి. |
03:29 | ఇప్పుడు Verify email address బటన్ పై క్లిక్ చేయండి. |
03:32 | మనం GitHub Homepage కి మళ్ళించబడుచున్నాము. |
03:36 | ఇది మనం GitHub లో account ని విజయవంతంగా సృష్టించామని సూచిస్తుంది. |
03:42 | మనం GitHub లోఒక repository ను క్రియేట్ చేయటానికి ప్రయత్నిద్దాం. |
03:45 | ఇప్పుడు మీరు కుడి వైపు బాక్స్ లో New repository బటన్ పై నొక్కండి. |
03:50 | ఇప్పుడు మనము repository సృష్టించగలమని చూడవచ్చు. |
03:54 | Repository Name గా stories ను టైప్ చేద్దాం. |
03:58 | మీరు repository గురించి ఎటువంటి వివరణ అయినా ఇవ్వాలనుకుంటే, మనము ఇక్కడ ఇవ్వవచ్చు. |
04:04 | తరువాత, నేను పబ్లిక్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటాను. ఇది ఉచితం. |
04:09 | ఒకవేళ మనము Private ఆప్షన్ ను ఎంచుకుంటే, మన repository ప్రైవేట్ గా ఉంచడానికి మనం కొంత రుసుము చెల్లించాలి. |
04:16 | దీనర్థం ఇతర వినియోగదారులు మన repostory కనుగొన లేరు మరియు డౌన్లోడ్ చేసుకోలేరు. |
04:21 | మళ్ళీ నన్ను Public పై క్లిక్ చేయనివ్వండి . |
04:24 | Initialize this repository with a README అనే చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
04:28 | ఇది readme ఫైల్ ను సృష్టిస్తుంది. |
04:31 | ఈ ఫైలులో, మీరు ఉపయోగించవలసిన కోడ్ లేదా ఇన్స్టాలేషన్ సూచనల గురించిన సమాచారాన్ని వ్రాయవచ్చు. |
04:37 | ఇది సహచరులందరికి ఉపయోగకరంగా ఉంటుంది. |
04:42 | అయితే, మనము ఇప్పటికే ఉన్న repository ను దిగుమతి చేస్తే, ఈ బాక్స్ Check చేయబడదు. |
04:48 | ఇప్పుడు Create repository బటన్ పై క్లిక్ చేయండి. |
04:52 | మీరు, మీ యూజర్ నేమ్ తో పాటు విజయవంతంగా సృష్టిచబడిన మీ repository పేరును చూడవచ్చు. |
04:58 | repository సృష్టించబడిన తరువాత, మీరు ఎడమ వైపున దిగువన readme ఫైల్ లేబుల్ ను చూడవచ్చు. |
05:05 | ఈ ఫైల్లో కొంత సమాచారాన్నిమనం తరువాత వ్రాద్దాము. |
05:09 | డిఫాల్ట్ గా మనం ఒక commit(i.e) అనగా Initial commit ను, ఒక branch (i.e) అనగా master ను, మరియు ఒక contributor ను చూడవచ్చు. |
05:18 | మీరు ప్రతి లింక్ పై క్లిక్ చేసి, మీ సౌలభ్యతకనుగుణంగా వాటిని అన్వేషించవచ్చు. |
05:23 | ఇప్పుడు, మనం ఈ repository లో పని మొదలుపెడదాము. |
05:27 | మన రిపోజిటరీకు ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం. |
05:31 | మధ్య పానెల్ లో ఉన్న New file బటన్ పై క్లిక్ చేయండి. |
05:34 | ఒక ఫైల్ను సృష్టించడానికి క్రొత్త form ఓపెన్ అవుతుంది. |
05:38 | ఇక్కడ, నేను ఫైల్ పేరు ను kids-story.html గా ఇస్తాను. |
05:44 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లోనికి paste చేస్తాను. |
05:51 | అదేవిధంగా, మీరు మీ ఫైల్ లో కొంత కంటెంట్ ను జోడించండి. |
05:55 | ఇప్పుడు ఈ కొత్త ఫైల్ ను commit చేద్దాం. |
05:58 | commit message ఇవ్వడానికి పేజీని క్రిందికి స్క్రోల్ చేయండి. |
06:01 | ఇక్కడ commit message లో, మీరు Create kids-story.html అనే డిఫాల్ట్ సందేశాన్ని చూడవచ్చు. |
06:09 | మీరు డిఫాల్ట్ సందేశాన్ని ఉంచవచ్చు లేదా కొత్త సందేశాన్ని టైప్ చేయవచ్చు. |
06:13 | నేను డిఫాల్ట్ సందేశాన్ని ఉంచుతున్నాను. |
06:16 | ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని ఇవ్వవచ్చు. |
06:22 | కాబట్టి ఇక్కడ నేను Added first file of the repository అని టైప్ చేస్తాను. |
06:27 | డిఫాల్ట్ గా మనం master branch కు commit చేస్తాం |
06:31 | ఇప్పుడు Commit new file బటన్ పై క్లిక్ చేయండి. |
06:34 | మన కొత్త ఫైల్ kids-story.html రిపోజిటరీకు జోడించబడింది. |
06:39 | ఇప్పుడు commit number రెండు కు పెరిగింది అని గమనించండి |
06:43 | దానిపై క్లిక్ చేద్దాం . |
06:45 | ఇక్కడ, మీరు commit message ప్రక్కన ఉన్న మూడు చుక్కలను చూడవచ్చు. |
06:49 | నేను వాటిపై క్లిక్ చేస్తాను. |
06:51 | ఇది commit యొక్క వివరణను చూపిస్తుంది. |
06:54 | మనము commit లో చేసినదానిని తెలుసుకోవడానికి, ఆ ప్రత్యేకమైన commit message పై క్లిక్ చేయండి. |
07:00 | ఇప్పడు మీరు commit యొక్క వివరాలు చూడవచ్చు. |
07:03 | తిరిగి commit list కు వెళ్దాము. |
07:06 | దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై క్లిక్ చేయండి. |
07:11 | కుడి వైపున, మీరు commit యొక్క hash value ని చూస్తారు |
07:15 | repositoryకు తిరిగి రావడానికి, పైన ఎడమవైపు మూలన ఉన్న Code టాబ్ పై క్లిక్ చేయండి. |
07:21 | ఇప్పుడు GitHubలో కొత్త branch ను ఎలా క్రియేట్ చేయాలో వివరిస్తాను. |
07:26 | ఎడమ వైపున, మీరు Branch లేబుల్ తో ఒక జాబితాను చూడవచ్చు. |
07:31 | కొత్త branch ను క్రియేట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి. |
07:34 | మీరు ఒక పాప్-అప్ విండో తెరుచుకోవడాన్ని చూడవచ్చు. |
07:38 | పాప్-అప్ విండో లో, మీరు Find or create a branch fieldను చూడవచ్చు. |
07:43 | నేను కొత్త branch కు పేరుగా new-chapter అని టైప్ చేసి, Enter నొక్కాను. |
07:49 | మీరు, new-chapter branch సృష్టించబడిందని చూడవచ్చు మరియు అది మన ప్రస్తుత branch. |
07:55 | తరువాత, branching process ను బాగా అర్థం చేసుకోవడానికి మనము new-chapter branch లో commit చేస్తాము. |
08:02 | ప్రదర్శన కోసం kids-story.html ఫైలులో కొన్ని మార్పులను చేద్దాము. |
08:09 | రిపోజిటరీలో kids-story.html ఫైల్ ను ఓపెన్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి. |
08:14 | ఎడిటర్ పానెల్ యొక్క కుడి ఎగువ మూలలో, మీరు edit icon చూడవచ్చు. |
08:19 | ఈ ఫైల్ ను edit చేయటానికి దానిపై క్లిక్ చేయండి. |
08:22 | ఇక్కడ నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసిన కొన్ని లైన్ లను జత చేస్తున్నాను. |
08:27 | మీరు కూడా అలాగే చేయవచ్చు. |
08:30 | ఇప్పుడు, మనం ఈ మార్పును commit చేస్తాము. |
08:33 | నేను default commit message ను అలాగే ఉంచుతున్నాను. |
08:37 | ఇక్కడ, మీరు commit చేసిన చోట branch name new-chapterను చూడవచ్చు . |
08:43 | commit చేయడానికి Commit changes బటన్ పై క్లిక్ చేయండి. |
08:46 | మన ప్రస్తుత repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి. |
08:50 | తరువాత మనం master మరియు new-chapter branches యొక్క commits ను చెక్ చేద్దాం. |
08:56 | commits లింక్ పై క్లిక్ చేయండి. |
08:59 | ఇక్కడ, Branch డ్రాప్ డౌన్ లో, మనం చూడాలనుకుంటున్న branch పేరుని ఎంచుకోవచ్చు. |
09:04 | నేను లిస్ట్ లో master branch ను ఎంచుకుంటున్నాను. |
09:08 | ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత master branch యొక్క commits లిస్ట్ అవుతాయి. |
09:13 | new-chapter branch యొక్క commits ను చూడడానికి మనం Branch డ్రాప్ డౌన్ లో new-chapter ఎంచుకొనాలి. |
09:19 | ఇప్పుడు మీరు new-chapter branch యొక్క commits ను చూడవచ్చు. |
09:24 | repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి. |
09:28 | తరువాత GitHub లో tag ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం . |
09:32 | commit stage ను ముఖ్యమైనదిగా గుర్తించడానికి tagging ను ఉపయోగిస్తామని మనకు తెలుసు. |
09:38 | ఉదాహరణకు,నేను kids-story.html ఫైల్ ను జోడించిన తరువాత master branch లో tag ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. |
09:46 | tag ను క్రియేట్ చేయడానికి మొదటగా releases లింక్ పై క్లిక్ చేయండి. |
09:50 | Create a new release బటన్ పై క్లిక్ చేయండి. |
09:54 | ఒక కొత్త form ఓపెన్ అవుతుంది. |
09:56 | Tag Version బాక్స్ లో "V1.0" అని టైప్ చేయండి. |
10:01 | Release title బాక్స్ లో "Version one" అని టైప్ చేయండి. |
10:05 | Write బాక్స్ లో మనం, మన tag గురించి వివరణ ఇద్దాం. |
10:10 | నేను “This is the version one” అని టైప్ చేస్తాను. |
10:13 | ఇప్పుడు Publish release బటన్ పై క్లిక్ చేయండి. |
10:18 | ఇక్కడ, ఎడమ వైపు, మీరు చివరి commit యొక్క hash value ను చూడగలరు. |
10:24 | డిఫాల్ట్ గా, tag, latest commit లో సృష్టించబడుతుందని మనకు ఇప్పటికే తెలుసు. |
10:30 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
10:33 | ట్యుటోరియల్ సారాంశం. |
10:35 | ఈ ట్యుటోరియల్ లో మనము |
10:38 | online Git hosting services యొక్క ప్రాముఖ్యత, |
10:42 | GitHub account ను క్రియేట్ చేయడం, |
10:44 | GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాము. |
10:50 | ఒక అసైన్మెంట్ గా, |
10:52 | GitHub లో repository ను క్రియేట్ చెయ్యండి. |
10:54 | repository కి కొన్ని ఫైళ్ళను ని జోడించండి. |
10:57 | ఫైళ్ళను సవరించడం మరియు కొన్ని commits చేయడం మరియు repository లో branches మరియు tagsను క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. |
11:05 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను గురించి తెలుపుతుంది. |
11:10 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:12 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:20 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:23 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:29 | ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
11:34 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి ధన్యవాదములు. |