Difference between revisions of "Git/C2/Basic-commands-of-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{|border=1   
 
{|border=1   
 
|Time     
 
|Time     
|NARRATION    
+
|Narration    
  
 
|-  
 
|-  

Latest revision as of 12:06, 23 January 2018

Time Narration
00:01 Basic commands of Git పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్లో మనము Git repository మరియు Git యొక్క కొన్ని ప్రాథమిక కమాండ్ ల గురించి నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ కోసం నేను, ఉబుంటు లైనక్స్, 14.04 Git 2.3.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:23 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:27 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminalఫై పని చేసే లైనక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:34 లేకపోతే, సంబంధిత లైనక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:40 ఇప్పుడు, Git repository అంటే ఏమిటో చూద్దాము.
00:44 Git రిపోజిటరీ అనేది, మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం సమాచారాన్ని నిల్వ చేయగల ఒక ఫోల్డర్.
00:50 అది ఒక స్థానిక మెషిన్ లేదా రిమోట్ మెషిన్ పై పొందుపరిచి ఉంచవచ్చు.
00:55 సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే,
01:00 సాధారణ ఫోల్డర్ ఫైళ్ళు మరియు డైరెక్టరీలను మాత్రమే కలిగి ఉంటుంది.
01:04 కానీ Git repository, ఫైళ్ళు మరియు డైరెక్టరీల తో పాటు వాటి పూర్తి చరిత్ర ను కూడా కలిగి ఉంటుంది.
01:11 ఇప్పుడు Git repository మన లోకల్ మెషిన్ లో ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
01:17 టెర్మినల్ ను తెరవడానికి Ctrl+Alt+T కీలను కలిపి నొక్కండి.
01:22 నా మెషిన్లో, నా Home డైరెక్టరీలో Git repository కొరకు ఒక directory ను క్రియేట్ చేస్తాను.
01:28 మీరు మీ మెషిన్లో, మీకు కావలసిన చోట డైరెక్టరీని క్రియేట్ చేయవచ్చు.
01:33 డిఫాల్ట్ గా, మనము Home డైరెక్టరీలో ఉన్నాము.
01:37 mkdir space mywebpage అని టైప్ చేసి, Enter చేసి నొక్కండి.
01:44 ఇప్పుడు మన Home డైరెక్టరీలో mywebpage అనే డైరెక్టరీని క్రియేట్ చేసాము.
01:49 ఈ Directory కు వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:00 mywebpage డైరెక్టరీని, Git repository గా తయారు చేయుటకు git space init అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:08 మీరు Initialized empty Git repository అనే సందేశాన్ని చూడవచ్చు.
02:13 Git విజయవంతంగా ఇనిష్యలైజ్ అయ్యిందని సూచిస్తుంది.
02:17 మరియు ఇది, మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్.
02:24 initialize అయిన తర్వాత, dot git అనే ఒక దాగి ఉన్న ఫోల్డర్ mywebpage ఫోల్డర్ లోపల సృష్టించబడుతుంది.
02:32 ఈదాగి ఉన్న ఫోల్డర్ ను చూడడానికి, ls space hyphen a అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:39 ఇది dot git ఫోల్డర్ ను చూపిస్తుంది. ఈ dot git ఫోల్డర్ డిలీట్ చేస్తే మొత్తం repository డిలీట్ అవుతుంది.
02:47 కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
02:51 ఇప్పుడు, Git కు, మన ఐడెంటిటీ ను సెట్ చేయాలి.
02:55 ఇమెయిల్ చిరునామాను సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot email space priya [dot] spoken@gmail.com అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ను ఉపయోగించాను.
03:18 మీరు మీ స్వంత ఇమెయిల్ చిరునామాను ఉపయోగించవచ్చు.
03:21 usernameని సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:36 నేను Priya ను ఒక యూజర్ నేమ్ గా ఉపయోగించాను. దయచేసి Priyaకు బదులుగా మీరు మీ పేరును ఉపయోగించండి.
03:43 మనము సెట్ చేసే పేరు మరియు ఇమెయిల్ చిరునామా GIT పై పని చేసే వ్యక్తి యొక్క గుర్తింపు.
03:51 ఇప్పుడు, నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ ఎడిటర్ను కాన్ఫిగర్ చేస్తాను.
03:57 git space config space hyphen hyphen global space core dot editor space gedit అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:09 ఇప్పుడు gedit, Git కు కాన్ఫిగర్ అయింది.
04:14 ఇక్కడ, global flag అనేది ఐచ్చికం.
04:17 మనము global flag గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.
04:22 బహుళ రిపోజిటరీలను ఒకే మెషిన్ లో క్రియేట్ చేయవచ్చు.
04:26 ఒకవేళ, మీరు hyphen hyphen global flag ఉపయోగించినట్లైతే, మీ మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది.
04:34 మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ అప్రమేయంగా వర్తిస్తుంది.
04:42 ఒకవేళ, మీకు ఏదో ఒక ప్రత్యేక రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలసివస్తే hyphen hyphen global flag ను ఉపయోగించకండి.
04:49 టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి.
04:51 ఇప్పుడు, మనం ముందుగా సెట్ చేసిన identity యొక్క configuration వివరాలను పరిశీలిద్దాం.
04:57 git space config space hyphen hyphen list అని టైప్ చేసి Enter నొక్కండి.
05:04 ఇప్పుడు మీరు editor name, email address మరియు username లను చూడగలరు.
05:10 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళ ను ఉపయోగిస్తాను.
05:14 మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు. ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు.
05:22 Terminal కు తిరిగి వెళ్ళండి. promptను క్లియర్ చేద్దాం.
05:26 ఇప్పుడు gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి.
05:34 ఒకవేళ, మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి.
05:41 ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి & (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి.
05:47 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లోనికి paste చేస్తాను.
05:54 అలాగే, మీ ఫైల్లో కొంత కంటెంట్ను జోడించండి.
05:58 ఇప్పుడు, నేను నా ఫైల్ ను save చేస్తాను.
06:00 నా దగ్గర కొంత కోడ్ ను కలిగి ఉన్న html ఫైల్ ఉన్నది.
06:05 గమనిక: నేను ఎక్కడైతే mypage.htmlను ఉపయోగిస్తానో, అక్కడ మీ ఫైల్ పేరు ను ఉపయోగించండి.
06:13 తదుపరి, మనము mypage.html ఫైల్ ను అనుసరించమని Git ను అడుగుతాము.
06:18 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
06:27 ఇప్పుడు, మనము Git యొక్క ప్రస్తుత స్థితిని చూద్దాము. కాబట్టి git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
06:36 మీరు new file mypage.html ను చూడవచ్చు.

మీరు mypage.html ఫైల్ కు చేసే మార్పులను Git అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం.

06:48 దీనినే tracking అని అంటాము.
06:51 మన file mypage.html కు తిరిగి వెళ్ళి,
06:55 ఫైల్ కు మరికొంత కోడ్ ను జత చేద్దాము.
06:58 ముందు చేసినట్లుగా, నేను నా Writer ఫైల్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
07:06 ఫైల్ ను Save చేసి క్లోజ్ చేయండి.
07:10 ఇప్పుడు Terminal కు తిరిగి వెళ్ళండి.

ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి Enter నొక్కండి.

07:21 ఇది Changes not staged for commit: మరియు modified: mypage.html అని చూపిస్తుంది.
07:28 మనం చేసిన మార్పులు staging area కు జత కాలేదని అర్దం.
07:34 Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం.
07:39 Staging area అనేది commit అవ్వవలసిన మార్పుల సమాచారాన్ని నిల్వ చేసే ఒక ఫైల్.
07:46 commit చేసే ముందుగా, ఫైల్ యొక్క కంటెంట్ల ను staging areaకు జత చేయాలి.
07:51 మనము తరువాత tutorials లో commit గురించి మరింతగా చర్చిద్దాం.
07:56 పాత Git వర్షన్స్లలో staging area కు బదులుగా index అనే పదాన్ని ఉపయోగించేవారు.
08:01 ఇప్పుడు, ఫైల్ యొక్క కొత్త మార్పులను staging area కు ఎలా జోడించాలో చూద్దాం.
08:07 Terminalకు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్ చేద్దాం.
08:11 git space add space mypage dot html అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:19 Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:26 ఇప్పుడు మీరు Changes to be committed అనే సందేశాన్ని చూడవచ్చు
08:30 అంటే ఫైల్, staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం.
08:37 మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం.
08:40 మనము పనిలో ఒక ప్రత్యేక దశకు చేరుకున్నప్పుడు, ఆ పనిని repository లో save చేయవచ్చు. దీనినే commit అంటారు.
08:49 ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో సేవ్ చేయబడుతుంది.
08:57 ఇప్పుడు commit ఎలా చేయాలో చూద్దాం. టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి మరియు git space commit అని టైప్ చేసి Enter నొక్కండి.
09:07 Commit మెసేజ్ పొందడానికి, gedit టెక్స్ట్ ఎడిటర్ స్వయంగా తెరుచుకుంటుంది.
09:13 మొదటి లైన్ లో నేను Initial commit ను commit messageగా టైప్ చేస్తాను.
09:18 మీరు కోరుకున్న ఏదైనా సమాచార సందేశాన్ని టైప్ చేయవచ్చు.
09:22 ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే వదిలివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు.
09:30 దయచేసి hash లైన్ కు ముందు లేదా తర్వాత commit message ను రాయండి.
09:35 భవిష్యత్తులో ఈ commit message తో ఇప్పటి వరకు మనము ఏం చేసామో గుర్తించగలం.
09:41 నన్ను ఎడిటర్ ని save చేసి, క్లోజ్ చేయనివ్వండి.
09:44 మనము commit message, ఎన్ని ఫైళ్ళను మార్చాము, ఎన్ని మార్పులు చేశాము మరియు ఫైల్ యొక్క పేరు లాంటి కొన్ని వివరాలను చూస్తాము.
09:56 ఇప్పుడు, git log కమాండ్ ని ఉపయోగించి commit వివరాలు చూద్దాము.
10:00 git space log అని టైప్ చేసి Enter నొక్కండి.
10:06 మన రిపోజిటరీతో మనకు ఒకే ఒక్క commit ఉన్నది.
10:09 ఇది commit hash లేదా SHA-1 hash అనబడే ఏకైక ఐడిని చూపుతుంది.
10:16 SHA-1 hash గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.
10:20 SHA-1 hash అనేది 40 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాల యొక్క ఏకైక ఐడి.
10:25 Git దాని మొత్తం సమాచారాన్ని hash విలువ ద్వారా డేటాబేస్లో నిల్వ చేస్తుంది.
10:31 Git commits అనేవి SHA-1 hash ద్వారా గుర్తించబడతాయి.
10:35 మీరు భవిష్యత్ ట్యుటోరియల్స్ లో SHA-1 hash యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
10:41 మనం టెర్మినల్ కు వెళ్దాం.
10:43 ఇది author, name, email address, date, time మరియు మనము ఇంతకు ముందు ఇచ్చిన commit message వంటి commitకు సంభందించిన వివరాలు చూపుతుంది.
10:56 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
11:00 ట్యుటోరియల్ సారాంశం.

ఈ ట్యుటోరియల్ లో మనము Git repository గురించి మరియు git init, status, commit మరియు log అనబడే కొన్ని ప్రాథమిక Git commands గురించి నేర్చుకున్నాము.

11:14 ఒక అసైన్మెంట్ గా, మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి.
11:20 ఒక టెక్స్ట్ ఫైల్ సృష్టించి, దానిలో కొంత కంటెంట్ ను జత చేర్చండి.
11:25 Git repository యొక్క staging area కు ఫైల్ ను జోడించండి.
11:29 మీ repositoryకి ఫైల్ ను Commit చేయండి.
11:32 git log కమాండ్ ను ఉపయోగించి commit వివరాలు చూడండి.
11:35 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:43 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.

11:55 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
12:02 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రిందిలింక్ లో అందుబాటులో ఉంది.
12:08 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india