Difference between revisions of "Inkscape/C2/Fill-color-and-stroke/Telugu"
From Script | Spoken-Tutorial
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, | + | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడంఆబ్జెక్ట్స్ కు ఒక అవుట్ లైన్ ఇవ్వడంgradients యొక్క వివిధ రకాలు, ఇంకా Stroke paint మరియు style. |
− | ఆబ్జెక్ట్స్ లో రంగును | + | |
− | + | ||
− | + | ||
− | Stroke paint మరియు style. | + | |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | |ఈ ట్యుటోరియల్ కొరకు, | + | |ఈ ట్యుటోరియల్ కొరకు, నేనుUbuntu Linux 12.04 OSInkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
Line 393: | Line 387: | ||
|- | |- | ||
|14:31 | |14:31 | ||
− | |Fill and Stroke ఎంపికలు ఉపయోగించి ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం | + | |Fill and Stroke ఎంపికలు ఉపయోగించి ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం, ఆకారాలకు స్ట్రోక్స్ లేదా అవుట్ లైన్స్ ను ఇవ్వటం, గ్రేడియెంట్స్ యొక్క వివిధ రకాలు, స్ట్రోక్ పెయింట్ మరియు స్ట్రోక్ స్టైల్స్. |
− | ఆకారాలకు స్ట్రోక్స్ లేదా అవుట్ లైన్స్ ను ఇవ్వటం | + | |
− | గ్రేడియెంట్స్ యొక్క వివిధ రకాలు | + | |
− | స్ట్రోక్ పెయింట్ మరియు స్ట్రోక్ స్టైల్స్. | + | |
|- | |- | ||
| 14:44 | | 14:44 |
Latest revision as of 21:59, 27 July 2017
Time | Narration |
00:00 | Inkscape ను ఉపయోగించి Fill color and stroke పై Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడంఆబ్జెక్ట్స్ కు ఒక అవుట్ లైన్ ఇవ్వడంgradients యొక్క వివిధ రకాలు, ఇంకా Stroke paint మరియు style. |
00:20 | ఈ ట్యుటోరియల్ కొరకు, నేనుUbuntu Linux 12.04 OSInkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:29 | Inkscape ని తెరుద్దాం. దానికోసం, Dash home కు వెళ్ళి, Inkscape అని టైప్ చేద్దాం. |
00:35 | మీరు logo పై క్లిక్ చేసి Inkscape ను తెరువవచ్చు. |
00:40 | మనం ఇదివరకే రుపొంచించిన Assignment.svg ఫైల్ ను తెరుద్దాం. నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. |
00:50 | మనం మునుపటి అసైన్మెంట్ లో ఈ మూడు ఆకారాలను రూపొందించాము. |
00:54 | interface యొక్క కింది భాగం వద్ద ఉన్న color palette ను ఉపయోగించి రంగును మార్చటం నేర్చుకున్నాము అని గుర్తుచేసుకోండి. |
01:01 | ఇప్పుడు మనం Fill and Stroke ఉపయోగించి వివిధ రకాలుగా రంగును ఎలా నింపడం అనేది నేర్చుకుంటాం. |
01:08 | Object మెనూ కి వెళ్ళి, డ్రాప్ -డౌన్ జాబితా నుండి Fill and Stroke ఎంపిక పై క్లిక్ చేయండి. |
01:13 | ఇంటర్ఫేస్ యొక్క కుడి వైపు Fill and Stroke డైలాగ్ బాక్స్ తెరుచుకుంది అని గమనించండి. |
01:20 | ఇక్కడ డైలాగ్ బాక్స్ లో మూడు టాబ్స్, Fill, Stroke paint మరియు Stroke style ఉన్నాయి. |
01:27 | ఇప్పుడు, మనం canvas ఏరియా లో ఉన్న దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేద్దాం. Fill and stroke డైలాగ్ బాక్స్ లోని ఎంపికలు మరియు చిహ్నాలకు అనుమతి ఉందని గమనించండి. |
01:38 | ముందుగా, మనం Fill ట్యాబ్ గూర్చి నేర్చుకుందాం. |
01:41 | ఇక్కడ Fill ట్యాబ్ కింద ఆరు icon లు ఉన్నాయి గమనించండి. ఈ చిహ్నాలు ఏమి చేస్తాయో నేర్చుకుందాం. |
01:48 | మొదటి చిహ్నం No paint గా పిలవబడుతుంది. ఇది ఆబ్జెక్ట్ ఎలాంటి రంగుతో నింపబడదు అని సూచిస్తుంది. |
01:56 | icon పై క్లిక్ చేసి, దీర్ఘ చతురస్రం లో వచ్చిన మార్పును గమనించండి. దీర్ఘ చతురస్రం యొక్క రంగు తొలగించబడింది. |
02:03 | తరువాతి చిహ్నం Flat color ఇది ఒక ఆబ్జెక్ట్ కి దట్టమైన రంగు నింపడానికి సహాయం చేస్తుంది. |
02:11 | Flat color చిహ్నం పై క్లిక్ చేయండి.ఇంకా దీర్ఘ చతురస్రం ఆకారం యొక్క రంగులో వచ్చిన మార్పును గమనించండి. |
02:17 | Flat color కింద 5 సబ్-టాబ్స్ ఉన్నాయి గమనించండి. |
02:21 | అప్రమేయంగా, RGB ట్యాబ్ ఎంచుకోబడుతుంది. |
02:25 | RGB ట్యాబ్ కింద, 4 sliders ఉన్నాయి. |
02:29 | మొదటి మూడు స్లయిడర్స్ Red, Green మరియు Blue కలర్స్ యొక్క తీవ్రత ను సూచిస్తాయి. |
02:36 | ఈ స్లయిడర్స్ ను ఎడమ లేదా కుడి దిశలలోకి కదిలించడం చేత రంగును మార్చవచ్చు. నేను అలా చేయడం వల్ల దీర్ఘ చతురస్రం యొక్క రంగులో వచ్చిన మార్పును గమనించండి. |
02:46 | నాలుగవ స్లయిడర్ Alpha స్లయిడర్. దీనితో, మనం రంగు యొక్క opacity స్థాయిని అపారదర్శకం నుండి పారదర్శకానికి పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. |
02:57 | నేను ఈ నాలుగు స్లయిడర్స్ ను కదిలిస్తుంటే, ఈ బాక్సస్ లో కనిపిస్తున్న రంగు యొక్క RGBA విలువలు స్వయంచాలకంగా మారుతున్నాయి గమనించండి. |
03:06 | నేను స్లయిడర్స్ ను ఇంకోసారి కదిలిస్తాను అందువల్ల మీరు ఈ మార్పుని గమనించవచ్చు. |
03:12 | స్లయిడర్స్ కుడివైపు ఉన్న బాక్సస్ లో ప్రతీ రంగు యొక్క విలువలను మార్చడం చేత మనం రంగును మానవీయంగా మార్చవచ్చు. |
03:20 | నేను ఎరుపు ను 100 కి, పచ్చను 50 కి, మరియు నీలం ను 150 కి మార్చుతున్నాను. ఇప్పుడు దీర్ఘ చతురస్రం ఊదారంగు లోకి మారింది పరిశీలించండి. |
03:32 | నేను Alpha స్థాయిని 255 గానే ఉంచాను. నేను ఆపారదర్శకత స్థాయిని తగ్గించాలనుకోవటం లేదు. |
03:40 | తదుపరి ట్యాబ్ HSL, మరియు దాని అర్ధం వరుసగా, Hue, Saturation మరియు Lightness. |
03:49 | మనం Hue స్లయిడర్ ని మూల వర్ణం పొందటానికి ఉపయోగించవచ్చు. నేను ఆకుపచ్చ రంగు యొక్క మూల వర్ణం పొందడానికి, ఎడమ దిశ వైపుగా స్లయిడర్ ని కదిలిస్తున్నాను. |
03:59 | మనం Saturation స్లయిడర్ ను ఉపయోగించి మూల వర్ణం యొక్క saturation ని సర్దుబాటు చేయవచ్చు. |
04:04 | slider ను ఎడమ లేదా కుడి దిశలలో కదిలించి saturation స్థాయిలో వచ్చిన మార్పును గమనించండి. |
04:12 | Lightness స్లయిడర్ మూల వర్ణం యొక్క lightness ను సర్దుబాటు చేస్తుంది. |
04:16 | ఈ ఎంపికతో, మూల వర్ణం యొక్క షేడ్నిస్వచ్ఛమైన తెలుపు నుండి పూర్తి నలుపుకు లేదా ఆ రెండింటి మధ్యలో ఏదయినా ఒక షేడ్ లోకి మార్చవచ్చు. |
04:26 | ముందులగే, Alpha స్లయిడర్ opacity స్థాయిని ఆపారదర్శకత నుండి పూర్తి పారదర్శకతకు పెంచడానికి లేదా తగ్గించటానికి ఉపయోగపడుతుంది. |
04:35 | తరువాతి ట్యాబ్ CMYK, ఇది Cyan, Magenta, Yellow మరియు Black లను వరుసగా సూచిస్తుంది. |
04:44 | ఈ స్లయిడర్స్ ను కదిలించటం వలన, మనం మూల వర్ణం యొక్క తీవ్రత లేదా లోతును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. |
04:52 | ఈ రంగులను కలిపే ఎంపిక, నమూనా ప్రాజెక్టులను వాణిజ్య పరంగా ముద్రిచబడినపుడు ఉపయోగకరంగా ఉంటాయి. |
05:00 | తరువాతది Wheel ట్యాబ్. ఇది HSL కలర్ మిక్సర్ కు ఒక ప్రత్యామ్నాయ ప్రాతినిధ్యం. |
05:07 | ప్రామాణిక రంగు చక్రం పై ఆధారపడే కలర్ రింగ్ పై క్లిక్ చేసి మనం బేస్ హ్యూ ను ఎంచుకోవచ్చు. |
05:14 | కనుక, నేను పసుపు రంగు యొక్క ఒక బేస్ ను ఎంచుకోవడానికి పసుపు షేడ్ పై క్లిక్ చేస్తున్నాను. |
05:19 | రంగు వృత్తం పరిధిలో, ఒక త్రిభుజం ఉంది దాని లోపల ఒక చిన్న వృత్తం ఉంది. వృత్తం మీద క్లిక్ చేసి త్రిభుజం లోపల డ్రాగ్ చేయండి. మరియు దీర్ఘ చతురస్రం రంగులో వచ్చే మార్పును గమనించండి. |
05:31 | ఎవరికైతే రంగులను నిర్వహించే పర్యావరణంలో పనిచేయటానికి నిజమైన ఆసక్తి ఉంటుందో వాళ్ళ కోసమే CMS ట్యాబ్ అవసరంఅవుతుంది. |
05:38 | ఇప్పటికి, మనం ఈ ట్యాబ్ ను విడిచిపెడదాం. |
05:43 | తరువాత, ఒక Linear gradient ను ఎలా రూపొందించాలో నేర్చుకుందాం. |
05:47 | canvas కు వెళ్ళి, వృతం పై క్లిక్ చేయండి. |
05:50 | ఇప్పుడు, Fill and Stroke డైలాగ్ బాక్స్ కు తిరిగి వచ్చి, Linear gradient చిహ్నం పై క్లిక్ చేద్దాం. |
05:57 | వృత్తంలో ప్రవణత పూరకాన్ని (gradient fill) గమనించండి. |
06:00 | ప్రవణతకు (గ్రేడియంట్) యాదృచ్ఛిక సంఖ్యల శ్రేణి తో అంతమయ్యే ఒక పేరు ఇవ్వబడుతుంది. |
06:05 | నా ఇంటర్ఫేస్ లో,ఆ సంఖ్య linearGradient3794. మీ దానిలో, అది వేరే ఉండవచ్చు. |
06:14 | linear gradient నంబర్ బటన్ కింద ఉన్న Edit బటన్ పై క్లిక్ చేసి మనం ప్రవణతను (గ్రేడియంట్) మార్చవచ్చు. |
06:21 | ఇది Gradient editor డైలాగ్ బాక్స్ ను తెరుస్తుంది. |
06:26 | ఈ బాక్స్ లో stop పేరుతో ఉన్న టాప్ బటన్ కొన్ని యాదృచ్చిక సంఖ్యలను అనుసరిస్తుంది మరియు ఒక డ్రాప్ -డౌన్ జాబితాను కలిగి ఉంటుంది. |
06:34 | ఒకవేళ మీరు ఈ డ్రాప్ డౌన్ లోని బాణాలను క్లిక్ చేస్తే, రెండు stop ఎంపికలు చూస్తారు. |
06:39 | మొదటిది స్వచ్ఛమైన మూల వర్ణాన్ని సూచిస్తుంది. రెండవది half checker board ఇది దాని పారదర్శకతను సూచిస్తుంది. |
06:48 | రెండవ ఎంపికని ఎంచుకోండి, అది, పారదర్శకత stop ఎంపిక. |
06:53 | Stop Color కిందకు వెళ్ళండి. sliders ను కదిలిస్తూ మీకు నచ్చిన ఏదయినా ఒక రంగుకు RGB విలువలను మార్చండి. |
07:00 | gradient పూర్తిగా కనిపించేలా చేయటానికి Alpha విలువ 255 వద్ద ఉంచండి. Gradient editor డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
07:09 | ఇప్పుడు, మనం gradient angle ను మార్చవచ్చు. ఆలా చేయటానికి, ఇంటర్ఫేస్ యొక్క ఎడమవైపున,టూల్ బాక్స్ నుండి Node టూల్ పై క్లిక్ చేయండి. ఇది Selector tool కు సరిగ్గా క్రింద ఉంటుంది. |
07:21 | ఇది వృత్తం పై ఒక వరుసను ప్రదర్శిస్తుంది. ఈ వరుస ప్రవణతను(gradient) సూచిస్తుంది. |
07:29 | ఇవి ప్రస్తుతం వృత్తం యొక్క square handle మరియు arc handles తో (overlap) అతి పాతమై ఉన్నాయి. |
07:33 | మనం gradient line handles ని కొద్దిగా కదిలిద్దాము, అందువల్ల మనం handles ను స్పష్టంగా చూడవచ్చు. |
07:40 | ఎక్కడ gradient మొదలవుతుందో మరియు ముగుస్తుందో ఆ స్థానానికి మార్చడానికి circular handle లేదా square handle ను క్లిక్ చేసి లాగండి. |
07:50 | circular handle ప్రదర్శించినట్టుగా కదిలించడం వల్ల ప్రవణత (గ్రేడియంట్) యొక్క దిశను కూడా మనం రొటేట్ చేయవచ్చు. |
07:58 | ఇప్పుడు, మనం Radial gradientను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. చిహ్నంపై క్లిక్ చేయండి మరియు వృత్తంలో gradient మార్పును గమనించండి. |
08:06 | Radial gradient ఒక వృత్తాకారంలో ఏర్పడుతుంది. |
08:10 | ఒక square handle మరియు రెండు circular handles ను గమనించండి. |
08:15 | gradient యొక్క ప్రారంభ బిందువును తరలించడానికి మధ్య square handle పై క్లిక్ చేయండి. నేను దానిని ఎడమవైపు కిందికి కదిలిస్తున్నాను. |
08:22 | gradient లో మార్పులు చేయటానికి circular handles లో ఏదయినా ఒకదానిపై క్లిక్ చేసి లాగండి. |
08:28 | gradient ఆకారం యొక్క పొడవు మరియు వెడల్పులలో మార్పును గమనించండి. |
08:37 | మనం Gradient tool ను Tool box లో కూడా చూడవచ్చు. |
08:42 | దానిపై క్లిక్ చేద్దాం ఇంకా మన వృత్తానికి తిరిగి వద్దాం. |
08:45 | ఇప్పుడు మన కర్సర్ capital I తో ఒక plus చిహ్నంలోకి మారింది గమనించండి. |
08:51 | ఇప్పుడు, వృత్తం లోపలి భాగంలో ఎక్కడైనా క్లిక్ చేసి లాగండి. Gradient లో మార్పును గమనించండి. |
09:00 | ఇప్పుడు, వృత్తం వెలుపల ఎక్కడైనా క్లిక్ చేసి లాగండి. |
09:04 | gradient లో మార్పును గమనించండి. |
09:06 | తరువాత, ఆకారాలపై వివిధ నమూనాలను ఎలా అతివ్యాప్తి చేయాలో నేర్చుకుందాం. |
09:11 | Tool box కు వెళ్ళి tool పై క్లిక్ చేయండి తరువాత నక్షత్రం ఆకారంపై క్లిక్ చేయండి. |
09:17 | Fill and stroke డైలాగ్ బాక్స్ లో, Pattern చిహ్నం పై క్లిక్ చేయండి. నక్షత్రం యొక్కరంగును ఒక స్ట్రయిప్ ప్యాటర్న్ లోకి మారింది అని గమనించండి. |
09:26 | ఇక్కడ Pattern fill కింద ఒక డ్రాప్ - డౌన్ జాబితా ఉంది. అందుబాటులో ఉన్న నమూనాలను చూడటానికి బాణాలపై క్లిక్ చేయండి. |
09:32 | Checkerboard పై క్లిక్ చేసి, నక్షత్రం ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి. ఇక్కడ అందుబాటులో ఉన్న నమూనాల నుండి ఏదయినా ఎంచుకుని ఉపయోగించవచ్చు. |
09:44 | మనం Swatch గురించి మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం. |
09:48 | చివరి చిహ్నాన్ని Unset paint అంటారు. ఇది ఎంచుకోబడిన ఆబ్జెక్ట్ యొక్క రంగును నలుపుకు అన్సెట్ చేయటానికి ఉపయోగపడుతుంది. |
09.54 | icon పై క్లిక్ చేసి, నక్షత్రంలో వచ్చిన రంగు మార్పును గమనించండి. ఇది నలుపుకు మార్చబడింది. |
10:01 | ఇప్పుడు, మనం ఒక ఆబ్జెక్ట్ కు స్ట్రోక్ లేదా ఒక అవుట్ లైన్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. ఇది చేయటానికి, మనం Stroke paint ట్యాబ్ ను ఉపయోగించాలి. |
10:09 | ఇప్పుడు, Stroke paint ట్యాబ్ పై క్లిక్ చేసి ఆపై దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేయండి. |
10:14 | Stroke paint ట్యాబ్ కింద ఉన్న చిహ్నాలు Fill ట్యాబు మాదిరిగానే ఉంటాయి. |
10:19 | ఇవీ అదే పద్దతిలోనే పని చేస్తాయి. |
10:22 | మొదటి చిహ్నం, అనగా No paint తో మనం ఆకారం యొక్క అవుట్ లైన్ ని తొలగిస్తాము. |
10:26 | తరువాత, Flat color చిహ్నం పై క్లిక్ చేద్దాం. దీర్ఘ చతురస్ర ఆకారం చుట్టూతా ఒక నలుపు రంగు అవుట్ లైన్ ను చూస్తాము. |
10:33 | మనం Stroke style ట్యాబ్ ను ఉపయోగించి అవుట్ లైన్ యొక్క మందాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. |
10:44 | వెడల్పు పారామీటర్ ను 10 గా ఉంచుదాం. మన అవసరాన్ని బట్టి, యూనిట్స్ ను percentage, point మొదలైన వాటికి మార్పు కూడా చేయవచ్చు. |
10:54 | నేను ఈ యూనిట్ ని Pixels గా ఉంచుతాను. |
10:56 | Stroke paint ట్యాబ్ కు తిరిగి వెళ్దాం. RGB ట్యాబ్ కింద ఉన్న sliders ను కదిలించడం చేత మనం స్ట్రోక్ యొక్క రంగును మార్చవచ్చు. |
11:04 | నేను ఆలా చేస్తున్నపుడు, అవుట్ లైన్ లో రంగు మార్పును గమనించండి. |
11:09 | ఇతర Flat color ఎంపికలు, HSL, CMYK, Wheel మరియు CMS వంటివాటిని మీరు మీ సొంతంగా అన్వేషించండి. |
11:17 | ఇప్పుడు, Linear gradient పై క్లిక్ చేస్తాను. ఇది దీర్ఘ చతురస్రం ఆకారానికి ఒక గ్రేడియంట్ అవుట్ లైన్ ను ఇస్తుంది. |
11:24 | మనం ఇదివరకు ఉపయోగించిన గ్రేడియెంట్స్ ఇక్కడ డ్రాప్ - డౌన్ జాబితాలో కనిపిస్తాయి. మనం వాటిల్లో ఏవైనా ఉపయోగించవచ్చు. |
11:32 | నా దీర్ఘ చతురస్రానికి ఎరుపు మరియు నీలం gradient అవుట్ లైన్ ను ఇస్తాను. |
11:38 | ఇదే విధంగా, మిగిలిన స్ట్రోక్ చిహ్నాలను ఉపయోగించవచ్చు మరియు మన ఆబ్జెక్ట్స్ కు కొన్ని ఆసక్తికరమైన నమూనాలను మరియు gradient అవుట్ లైన్స్ ను ఇవ్వవచ్చు. |
11:46 | తరువాత మనం Stroke style గూర్చి నేర్చుకుంటాం. దానిపై క్లిక్ చేయండి. |
11:50 | మనం ఇప్పటికే stroke యొక్క వెడల్పును ఎలా సవరించాలో నేర్చుకున్నాం. |
11:54 | ఇప్పుడు, Miter join, Round join మరియు Bevel join అను పేర్లుగల మూడు Join చిహ్నాలను చూద్దాం. అప్రమేయంగా, స్ట్రోక్ Miter join లో ఉంది. |
12:08 | బాగా కనిపించటానికి నేను దీర్ఘ చతురస్రం యొక్క ఒక మూలను పెద్దది చేస్తాను. |
12:12 | ఇప్పుడు, stroke కు ఒక గుండ్రని మూలను ఇవ్వటానికి Round join పై క్లిక్ చేద్దాం. Stroke యొక్క అంచులలో మార్పులను గమనించండి |
12:21 | తరువాత, మనం ఒక Bevel కార్నర్ ను రూపొందించటానికి Bevel join ఎంపికపై క్లిక్ చేద్దాం. |
12:26 | వివిధ డాష్ పాట్రన్స్ Dashes డ్రాప్ -డౌన్ మెనూలో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి, stroke కు వివిధ డాష్ పాట్రన్స్ ఇవ్వవచ్చు మరియు వెడల్పు మార్చవచ్చు. |
12:38 | తదుపరి Cap ఎంపిక. ఇది ప్రాధమికంగా వరస strokes పై పనిచేస్తుంది. |
12:44 | Tool boxకి వెళ్ళి Freehand tool పై క్లిక్ చేయండి. Freehand tool సహాయంతో ఒక వరస ను గీద్దాం. |
12:50 | ఇప్పుడు, లైన్ చివరలో జూమ్ చేద్దాం. |
12:54 | అప్రమేయంగా, Butt cap ఎంచుకోబడుతుంది మరియు అది చివరకు ఒక ఫ్లాట్ అంచును ఇస్తుంది. |
12:59 | ఇప్పుడు, నేను ఒక గుండ్రని అంచు ఇవ్వటానికి Round cap పై క్లిక్ చేస్తాను. |
13:04 | తదుపరి Square cap, ఇది లైన్ యొక్క చివర్లకు ఒక చదరమైన మరియు పొడిగించిన అంచును ఇస్తుంది. |
13:13 | Dashes tab కు సరిగ్గా కిందన మూడు Markers ఉన్నాయి. అవి path యొక్క మధ్యభాగంపై marker లను ఉంచుతాయి. |
13:20 | అందుబాటులో ఉన్న జాబితాలను చూడటానికి ప్రతీ Marker యొక్క డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేయండి. |
13:25 | నేను Start Markers కింద Torso ను ఎంచుకుంటాను. |
13:29 | మనం Curvein ని Mid markers గా ఎంచుకుందాం. |
13:33 | End Markers కొరకు మనం Legs ను ఎంచుకుందాం. |
13:39 | ఒక కార్టూన్ ఆకారం canvas పై ఏర్పడిందని గమనించండి. |
13:44 | చివరగా, Fill and stroke డైలాగ్ బాక్స్ కు దిగువన Blur మరియు Opacity అనబడే రెండు స్లయిడర్స్, ఉన్నాయని గమనించండి. |
13:53 | ముందుగా దీర్ఘ చతురస్రాన్ని మళ్ళీ ఎంచుకుందాం. |
13:56 | Blur స్లయిడర్ ఒక ఆబ్జెక్ట్ కు ఒక అస్పష్టమైన ప్రభావాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. నేను స్లయిడర్ పై క్లిక్ చేస్తాను ఇంకా దానిని కుడివైపు కదిలిస్తాను. |
14:04 | నేను స్లయిడర్ ను కుడివైపుకు కదిలించినా కొద్దీ, దీర్ఘ చతురస్రం అస్పష్టంగా మారింది గమనించండి. |
14:15 | Opacity స్లయిడర్ ఒక ఆకారానికి పారదర్శకత ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. స్లయిడర్ ను కుడివైపుకు కదిలించి, ఆకారంలో వచ్చిన మార్పులను గమనించండి. |
14:27 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో,మనం నేర్చుకున్నవి, |
14:31 | Fill and Stroke ఎంపికలు ఉపయోగించి ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం, ఆకారాలకు స్ట్రోక్స్ లేదా అవుట్ లైన్స్ ను ఇవ్వటం, గ్రేడియెంట్స్ యొక్క వివిధ రకాలు, స్ట్రోక్ పెయింట్ మరియు స్ట్రోక్ స్టైల్స్. |
14:44 | మీకోసం ఇక్కడొక అసైన్మెంట్- |
14:47 | ఎరుపు మరియు పసుపు రంగుల యొక్క ఒక Linear gradient, 5 పిక్సల్స్ వెడల్పుతో ఒక నీలం రంగు స్ట్రోక్ తో నిండిన ఒక పంచభుజిని రూపొందించండి. |
14:57 | Wavy పాటర్న్ తో నిండిన ఒక దీర్ఘవృత్తాకారం రూపొందించి దాని opacity ని 70%కు మార్చండి. |
15:04 | 10 విడ్త్ తో ఒక లైన్ గీసి, దానికి Start Markers గా Arrow1Lstart మరియు End Markers, Tail గా ఇవ్వండి. |
15:15 | మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
15:18 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
15:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
15:37 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి- contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
15:55 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది- http://spoken-tutorial.org/NMEICT-Intro. |
16:05 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |