Difference between revisions of "Linux/C2/Simple-filters/Telugu"
From Script | Spoken-Tutorial
Line 320: | Line 320: | ||
|- | |- | ||
|11:59 | |11:59 | ||
− | || ఈ | + | || ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 11:03, 8 April 2015
Time | Narration |
00:00 | నమస్కారము, లినక్స్ లోని "Simple Filters" గురించి స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఇక్కడ మనం head, Tail, sort, cut మరియు paste గురించి నేర్చుకుంటాం. |
00:17 | ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ అభిసంధాన పరికరాలు. |
00:22 | టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్ గా మారవలసి వస్తుంది. |
00:29 | sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. |
00:38 | మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ ని మార్చలేదని భావిస్తున్నాను . |
00:46 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:51 | ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. |
01:02 | సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 లైన్లను చూడటానికి, Head కమాండ్‌ను దానిని అనుసరిస్తూ ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము. |
01:10 | మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూపడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. |
01:17 | Applications > Accessories > Text Editorకి వెళ్లండి. |
01:24 | సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను. |
01:30 | నేను దీనిని copy మరియు paste చేస్తాను. |
01:38 | File పై కి వెళ్ళి సేవ్ ని నొక్కండి |
01:41 | numbers dot txtగా ఫైల్ కు పేరు పెట్టి, saveని నొక్కండి |
01:48 | ఫైల్‌ను మూసేయండి. |
01:53 | Applications > Accessories > Terminalకి వెళ్లండి. |
02:01 | ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. |
02:05 | ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:09 | మనం ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం. |
02:15 | మనం cat కమాండ్ ఉపయోగించి మనం సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు. |
02:21 | Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబు ను నొక్కి ఎంటర్ నొక్కండి. |
02:29 | head కమాండ్‌తో కూడా ఇదే విధంగా చేద్దాం. |
02:33 | Head numbers dot txt ఎంటర్ |
02:39 | ఇప్పుడు మొదటి పది లైన్లు కనిపిస్తాయి. |
02:43 | మనం మొదటి 5 లైన్లు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్‌కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి |
02:52 | అప్ యారో hyphen n5 నొక్కి, ఎంటర్ నొక్కండి. |
02:58 | ఇప్పుడు మొదటి 5 లైన్లు మాత్రమే కనిపిస్తాయి. |
03:02 | మనం ఈ ప్రదర్శనలో తిరిగి వెళదాం. |
03:08 | F5. |
03:14 | "tail" కమాండ్ అనేది "head" కమాండ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. |
03:22 | టెర్మినల్ కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. |
03:27 | "tail numbers dot txt" |
03:31 | మనం కేవలం చివరి 5 లైన్లను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య "hyphen n5" ఎంపిక ను ఉపయోగించాలి |
03:40 | "hyphen n5" ఎంటర్ |
03:45 | "slides" కు వెళ్ళండి. |
03:50 | ఒక లాగ్ ఫైల్ సిస్టం లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. |
03:55 | "Auth dot log file" ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. |
04:01 | tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి "hyphen f" ఉపయోగించడం. |
04:09 | ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్ కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది లైన్లను చూపుతుంది. |
04:18 | టెర్మినల్ కు వెళ్లండి |
04:21 | tail hyphen f forward slash var slash log slash auth dot log, |
04:31 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతా |
04:39 | మరొక టెర్మినల్ ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal. |
04:46 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను . |
04:52 | దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి లైనును "tail" ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు. |
05:00 | మీకు మీరుగా "su" కు ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి. |
05:05 | ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. |
05:08 | tail పనిచేస్తున్న టెర్మినల్ పై కొత్త లాగ్ కలుపబడిందని మీరు చూస్తారు. |
05:15 | ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ చూపుతాయి. |
05:23 | సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి "date" టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:32 | ఈ టెర్మినల్ ను మూసివేయడానికి "Exit" అని టైప్ చేయండి. |
05:36 | పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి. |
05:51 | మునుపటి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం. |
05:57 | ఇవి లినక్స్ లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్ లు |
06:01 | ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. |
06:12 | పేరు సూచిస్తున్నట్లుగా "Sort" కమాండ్, ఒక ఫైల్ ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:23 | sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:31 | ఇక్కడ ఒక వింతను గమనించండి, sort కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి. |
06:43 | దీనిని నివారించడానికి "hyphen n" ఎంపిక ను కలపండి, "hyphen n" మరియు ఎంటర్ నొక్కండి. |
06:53 | ఇప్పుడు "sort" వాటిని క్రమబద్ధం చేయడానికి పూర్తి సంఖ్యను చూస్తుంది. |
06:58 | number dot txt ని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఎంపిక ను చేర్చండి. |
07:09 | మనకు ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక hyphen u ని కలపండి. |
07:17 | టెర్మినల్ కు వెళ్లండి. |
07:20 | అప్ యారో. |
07:22 | "U", ఎంటర్ చేయండి |
07:26 | ఇంతకు ముందు రెండు '2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక '2' మాత్రమే కనిపిస్తుంది. |
07:38 | ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ ను ఏ విధంగా sort చేయగలమో చూద్దాం. |
07:44 | ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా ‘కి ఇన్’ చేద్దాం. |
07:48 | Applications > Accessories > Text Editor కు వెళ్లండి. |
07:57 | నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్ లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
08:11 | File>> marks dot txt గా సేవ్ చేయండి, Save పై నొక్కండి. |
08:21 | ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు. |
08:28 | ఈ ఫైల్ ను మూసివేయండి. |
08:33 | marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం. |
08:40 | టెర్మినల్ కు వెళ్లండి. |
08:42 | sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space. |
08:53 | ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది. |
09:02 | సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది. |
09:14 | ఎంటర్ నొక్కండి. |
09:20 | Cat marks dot txt |
09:24 | ఇది అసలు ఫైల్, మనం కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకు రావడం మీరు చూస్తారు. |
09:43 | ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగ పడుతుంది. |
09:51 | marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. |
09:55 | ALT+ Tab తో టెర్మినల్ ను వెళ్ళండి. |
09:58 | cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space. |
10:08 | ఇక్కడ cut కమాండ్ లో 'd' అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
10:20 | రెండవ కాలమ్ కొరకు “hyphen f2” టైపు చేసి, ఎంటర్ నొక్కండి. |
10:31 | Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత లైన్లు విలీనం చేస్తుంది. |
10:36 | ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt file రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. |
10:41 | టెర్మినల్ కు వెళ్లండి. |
10:43 | Paste numbers dot txt marks dot txt టైపు చేసి , ఎంటర్ నొక్కండి |
10:50 | ఇప్పుడు marks dot txt యొక్క మొదటి లైన్ numbers dot txt యొక్క మొదటి లైన్ కు కలుపబడుతుంది. |
10:57 | ఈ ఔట్పుట్ ను concatefile dot txt. అనే మరొక ఫైల్‌కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు . |
11:06 | టెర్మినల్ కు వెళ్లండి. |
11:08 | అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
11:18 | Cat concatfile dot txt |
11:22 | మనం slide కు వెళదాం. |
11:25 | వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్‌ను , paste చేయాలనుకుంటే, hyphen s ఎంపికను ఉపయోగించవచ్చు |
11:34 | Paste hyphen s |
11:39 | numbers dot txt టైపు చేయండి |
11:43 | "slide" కు వెళ్లండి. |
11:45 | స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం, |
11:49 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:55 | మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్‌ను చూడవచ్చు. |
11:59 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |