Difference between revisions of "Health-and-Nutrition/C2/Cross-cradle-hold/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 | ''' Time ''' | '''Narration''' |- |00:01 | తల్లి పాలివ్వడం కొరకు క్రాస్ క్రెడిల్ హో...") |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | | ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా | + | | ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా సడలించబడాలి. |
|- | |- | ||
Line 400: | Line 400: | ||
|10:50 | |10:50 | ||
| దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. | | దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |10:53 |
− | |ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను | + | | ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను |
పాల్గొన్నందుకు ధన్యవాదములు. | పాల్గొన్నందుకు ధన్యవాదములు. | ||
|} | |} |
Latest revision as of 14:08, 6 August 2020
Time | Narration |
00:01 | తల్లి పాలివ్వడం కొరకు క్రాస్ క్రెడిల్ హోల్డ్ (అడ్డంగా ఊయల లా పట్టుకోవడం) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటొరియల్ లో మనం నేర్చుకునేది - పాలివ్వడానికి తల్లి మరియు తన బిడ్డ కొరకు సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం. |
00:16 | పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు |
00:20 | క్రాస్ క్రేడిల్ పద్దతిలో పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం. |
00:24 | మనం ప్రారంభిద్దాం. |
00:26 | ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు |
00:32 | వాటిలో పాలివ్వడానికి బిడ్డను పట్టుకోవడంలో తల్లి మరియు ఆమె బిడ్డ కొరకు ఉత్తమమైన పద్దతి ఏదంటే- తల్లి పాలివ్వడం పూర్తయ్యేవరకు తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సౌకర్యంగా ఉండడం, |
00:43 | బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉండగలగడం |
00:48 | మరియు బిడ్డ తగినన్ని పాలను పొందడం |
00:51 | పట్టుకునే విధానాలలో క్రాస్ క్రెడిల్ హోల్డ్ (అడ్డంగా ఊయల లా పట్టుకోవడం) అని పిలువబడే ఒకదాని గురించి తెలుసుకుందాం. |
00:56 | బిడ్డ శరీరంపై పూర్తి నియంత్రణ,
స్తనానికి ఆసరా మరియు బిడ్డ స్థనాన్ని లోతుగా పట్టుకోవడానికి క్రాస్ క్రెడిల్ హోల్డ్ (అడ్డంగా ఊయల లా పట్టుకోవడం) అనేది ఉత్తమమైన పట్టుకునే విధానం. |
01:06 | తన బిడ్డకు పాలిచ్చే ముందు, తల్లి తప్పనిసరిగా తన చేతులను కడుక్కుని తడిలేకుండా బాగా తుడుచుకోవాలి. |
01:12 | తర్వాత ఆమె తప్పనిసరిగా ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. |
01:16 | పాలిచ్చే తల్లులకు దాదాపుగా ఒక రోజుకి750 నుండి 850 మిల్లిలీటర్ల పాలు వస్తాయి. |
01:24 | అందువల్ల, వారు రోజు తాగుతున్న నీళ్లను పెంచి తాగాల్సిన అవసరం ఉంది. |
01:29 | తరువాత, మనం తల్లి ఏ భంగిమలో ఉండాలో చర్చిద్దాం. |
01:33 | తల్లి నేలపై కానీ లేదా మంచం పై కానీ కాళ్ళు మడచుకుని కూర్చొవాలి. |
01:38 | లేదా తన పాదాలు సమంగా నేలను తాకేలా పెట్టి కుర్చీపైన కూర్చోవాలి. |
01:43 | ఒకవవేళ కుర్చీ చాలా ఎత్తుగాఉండి ఆమె పాదాలు నేలను తాకక పోతె అప్ప్పుడు ఒక చిన్న పీటను లేదా దిండును నేలపై ఉంచి, వాటిపై ఆమె తన పాదాలను సమంగా ఉంచవచ్చు. |
01:54 | వెన్ను నొప్పి రాకుండా నివారించడానికి, ఆమె కూర్చునేటప్పుడు తన వెన్ను నిటారుగా ఉందని నిర్ధారించుకోవాలి. |
02:03 | ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా సడలించబడాలి. |
02:08 | ఇలా విశ్రాంతిగా ఉన్న ఈ భంగిమను తల్లి పాలిచ్చే సమయం అంతటా కొనసాగించాలి. |
02:13 | ఇప్పుడు తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వాలి అనుకుంటుందో ఆ వైపు వస్త్రాన్ని తొలగించాలి. |
02:19 | ఆమె తన బ్రా లేదా బ్లౌజ్ వలన తన రొమ్ము మీద ఒత్తిడి పడటంలేదని నిర్దారించుకోవాలి. |
02:26 | తల్లి సౌకర్యవంతంగా కూర్చున్నతర్వాత, బిడ్డను తల్లి దగ్గరకు తీసుకొని రావాలి. |
02:31 | తల్లి తాను ఏ వైపు నుండి పాలిస్తుందో దానికి ఎదురుగా ఉన్న చేతితో తన బిడ్డ యొక్క తలను పట్టుకొవాలి. |
02:39 | బిడ్డ యొక్క కాళ్ళను తల్లి యొక్క అదే చేతిలోని చంక కింద దోపి ఉండాలి. |
02:45 | ఈ చిత్రం లోని తల్లి తన కుడి వైపు స్తనం నుండి పాలిస్తుంది.అందువల్ల బిడ్డ యొక్క కాళ్ళు ఆమె ఎడమ చేతి కింద చంకలో దోపి ఉండాలి. |
02:57 | ఆమె తన బిడ్డ తల యొక్క దిగువ భాగాన్ని పట్టుకోవడానికి తన ఎడమ చేతి యొక్క బొటనవేలు మరియు మిగతావేళ్ళను ఉపయోగిస్తోంది. |
03:05 | ఒకవేళ బిడ్డను ఎత్తడానికి తల్లి అదనపు మద్దతును కోరుకుంటే, ఆమె బిడ్డ కింద ఒక దిండును ఒళ్ళో ఉంచుకొవచ్చు. |
03:15 | తల్లి ఎప్పుడూ కూడా తన వెన్నును వంచి స్తనాన్ని బిడ్డకు అందేలా చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. |
03:21 | ఇది ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు వెన్నునొప్పికి కారణమవుతుంది. |
03:26 | ఆమె ఎల్లప్పుడూ తన వెన్నును నిటారుగా ఉంచి, బిడ్డ తన రొమ్ము దగ్గరకు చేరేలా బిడ్డను పైకి ఎత్తాలి. |
03:33 | తర్వాత, తల్లి యొక్క బొటన వేలు మరియు మిగతావేళ్ళ ఉంచాల్సిన సరైన స్థితి ఏమిటొ చూద్దాం. |
03:39 | తల్లి బొటన వేలు బిడ్డ యొక్క ఒక చెవి వెనుక మరియు మిగతావేళ్లు మరో చెవి వెనుక ఉండాలి. |
03:46 | ఆమె బిడ్డ చెవి వెనుక ఉన్న తన బొటన వేలు మరియు మిగతావేళ్లను బిడ్డ మెడ దగ్గరకు జరపకూడదు. |
03:52 | ఆమె మణికట్టు శిశువు యొక్క భుజ ఫలకాలు మధ్య ఆనించి ఉండాలి. |
03:56 | ఆమె తన చేత్తో బిడ్డ యొక్క తల వెనుక భాగంలో ఒత్తిడి కలిగించకూడదు. |
04:04 | ఇది పాలను త్రాగే సమయంలో బిడ్డను సౌకర్యంగా ఉంచుతుంది. |
04:08 | తరువాత, మనం బిడ్డ శరీరాన్ని ఎలా సరిగ్గా ఉంచాలో నేర్చుకుందాం. |
04:15 | శిశువు యొక్క కడుపు తల్లి శరీరానికి వ్యతిరేకంగా సున్నితంగా నొక్కాలి. |
04:20 | వారి శరీరాల మధ్య తక్కువ దూరం ఉంటె అది రొమ్మును చేరుకోవడానికి శిశువు చేసే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది. |
04:26 | మరియు దానివల్ల బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడం సులభం అవుతుంది. |
04:32 | బిడ్డ శరీరాన్ని సరిగ్గా ఉంచడంలో రెండవ అంశం బిడ్డ శరీర అమరిక. |
04:37 | మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒక సరళ రేఖలో ఉంటాయి. |
04:43 | కానీ, పాలిచ్చేటప్పుడు, చాలా మంది తల్లులు బిడ్డ యొక్క తలను తరచుగా పక్కలకి తిప్పుతుంటారు. |
04:50 | దీని వల్ల బిడ్డకు పాలు తాగడానికి అసౌకర్యం కలగవచ్చు. |
04:55 | తల్లి పాలిచ్చేటప్పుడు శిశువు యొక్క తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఓక సరళరేఖలో ఉండాలి. |
05:01 | ఇది శిశువుకు పాలు మింగడాన్ని సులభం చేస్తుంది. |
05:05 | ఇప్పుడు మనము బిడ్డ శరీరాన్ని ఎలా ఉంచాలి అనేదానిలో మూడవ అంశానికి వచ్చాము. |
05:10 | తల్లి తన బిడ్డ యొక్క పూర్తి శరీరానికి ఆసరా ఇవ్వాలి. |
05:14 | లేకపోతే, బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉండటానికి చాలా శ్రమ పడవలసిఉంటుంది. |
05:22 | తరువాత, బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉంచాలో చూద్దాం. |
05:28 | బిడ్డ ముక్కు మరియు చనుమొన ఒకే రేఖ లో ఉండాలి |
05:33 | ఇంకా తన గడ్డం ముందుకి ఉండి స్తనానికి చాలా దగ్గరగా ఉండాలి. |
05:38 | బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకునేటపుడు అరియోలా యొక్క దిగువ భాగాన్ని ఎక్కువగా తీసుకుంటుందని ఇది నిర్ధారిస్తుంది. |
05:45 | అందువల్ల, ఎక్కువ పాలను బాగా త్రాగడానికి బిడ్డ కింది దవడను ఉపయోగిస్తుంది. |
05:51 | దయచేసి గమనించండి అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం. |
05:57 | ఇప్పుడు, బిడ్ద సరైన స్థితి లొ ఉంచబదడింది.మనం స్తనాన్ని ఎలా పట్టుకొవాలో నేర్చుకుందాం. |
06:04 | తన మరో చేతి వేళ్ళను ఉపయోగించి, తల్లి తన రొమ్ము కింద U ఆకారంలో పట్టుకుని కప్పాలి. |
06:12 | ఇక్కడ ఈ చిత్రం లో తల్లి తన కుడి చేతిని తన కుడి స్తనాన్ని పట్టుకొడానికి ఉపయోగిస్తుంది. |
06:19 | బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను సరిగ్గా ఎలా పెట్టాలో అర్థం చేసుకోవడానికి, చనుమొనను తల్లి యొక్క కుడి రొమ్ముపై గడియారానికి కేంద్రంగా ఊహించుకోండి. |
06:31 | ఈ గడియారంలో తల్లి తన కుడి బొటనవేలును 9 గంటల సమయం స్థానం వద్ద ఉంచాలి. |
06:38 | ఆమె తన కుడి చూపుడు వేలు మరియు మధ్య వేలును గడియారపు 3 గంటల స్థానం వద్ద ఉంచితే. |
06:46 | తల్లి యొక్క వేళ్ళు, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క పెదవులకు సమాంతరంగా ఉంటాయి. ఇలా ఎందుకు? |
06:51 | ఒక సరళమైన ఉదాహరణను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం. |
06:56 | మనం వడా పావ్ లేదా బర్గర్‌ను తినేటప్పుడు మన పెదవులు అడ్డంగా తెరచుకుంటాయి. |
07:02 | ఒక పెద్ద ముక్కను కొరకడానికి మనం వడా పావ్ లేదా బర్గర్‌ను అడ్డంగా పట్టుకుంటాము. |
07:08 | ఇక్కడ, బొటనవేలు మరియు మిగతా వేళ్లు పెదవులకు సమాంతరంగా ఉంచబడతాయి. |
07:12 | ఒకవేళ మనం వడా పావ్ లేదా బర్గర్ ను నిలువుగా పట్టుకుంటే మనం దాని పెద్ద ముక్కను కొరకలేము. |
07:19 | అదేవిధంగా, శిశువు యొక్క పెదవుల దిశను గమనించండి. |
07:25 | పెదవులు ఇక్కడ నిలువుగా ఉంటాయి. అందువల్ల, మిగతా వేళ్లు మరియు బొటనవేలు కూడా రొమ్ముపై నిలువుగా ఉంచాలి. |
07:34 | ఇది బిడ్డ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది. |
07:39 | శిశువు యొక్క పెదవులకు సమాంతరంగా ఉండటమే కాకుండా, తల్లి బొటనవేలు మరియు మిగతా వేళ్లు ఎల్లప్పుడూ చనుమొన నుండి 3 వేళ్ల దూరం వద్ద ఉండాలి. |
07:50 | మళ్ళీ, వడా పావ్ లేదా బర్గర్ ను తినేటప్పుడు, ఒకవేళ మనం దానిని చాలా దగ్గరగా పట్టుకుంటే, మన వేళ్లు పెద్ద ముక్కను కొరకనివ్వకుండా మన నోటికి అడ్డుపడతాయి. |
08:00 | ఒకవేళ మనం దాన్ని చాలా దూరంగా పట్టుకుంటే, దాని ఆకారం సరిగ్గా మన నోటిలోకి సరిపోయేలా ఉండదు. |
08:07 | అందువల్ల, పెద్ద ముక్కను కొరకడానికి మనం దానిని సరైన దూరం వద్ద పట్టుకుంటాము. |
08:12 | అదేవిధంగా బిడ్డ కొరకు కూడా సరైన దూరం అంటే చిత్రం లొ చూపిన విధంగా చనుమొన నుండి 3 వేళ్ల దూరం. |
08:20 | ఈ దూరం అనేది బిడ్డ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి తల్లి వేళ్ళు అడ్డు రావు అని నిర్దారిస్తుంది. |
08:29 | చాల తక్కువ పాలను ఇస్తుంది కనుక తల్లి ఒక్క చనుమొనను మాత్రమే నొక్కదు. |
08:35 | ఎక్కువపాలు బయటకు వచ్చేలా చేయడానికి, తల్లి అరియోలా కింద ఉన్న పెద్ద పాల నాళాలపై నొక్కుతుంది. |
08:42 | మరియు బిడ్డ నోటితో లోతుగా పట్టుకోవడానికి సహాయపడేలా తల్లి స్థనం అనేది సరైన ఆకారంలో ఉంటుంది. |
08:49 | తల్లి బొటనవేలు అనేది ప్రస్తుతం బిడ్డ ముక్కు ఉన్న స్తనభాగం పైన చనుమొన నుండి 3వేళ్ళ దూరంలో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. |
08:59 | మరియు ఆమె 2 వేళ్లు ప్రస్తుతం బిడ్డ గడ్డం ఉన్న స్తనభాగం పైన చనుమొన నుండి 3వేళ్ళ దూరంలో ఉండాలి. |
09:09 | వడా పావ్ లేదా బర్గర్ యొక్క ఉదాహరణకి మనం తిరిగి వెళ్దాం. |
09:13 | వడా పావ్ లేదా బర్గర్‌ను సరిగ్గా పట్టుకున్న తరువాత,ఎప్పుడూ కూడా పెద్ద ముక్కను కొరకడానికి మనం దాన్ని నొక్కుతాము.. |
09:21 | అదేవిధంగా, తల్లి తన రొమ్మును దిగువ నుండి U ఆకారంలో పట్టుకుని తేలికగా నొక్కాలి. |
09:28 | ఇది బిడ్డకు స్తనం యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది. |
09:34 | కానీ గుర్తుంచుకోండి, తల్లి తన రొమ్మును V ఆకారంలో పట్టుకుని నొక్కకూడదు. |
09:39 | V ఆకారం లో నొక్కడం అనేది రొమ్మును గిచ్చుతుంది మరియు చనుమొన నుండి మాత్రమే పాలు తాగడానికి కారణమవుతుంది. |
09:45 | స్తనం పై బొటనవేలు మరియు మిగతావేళ్ళ యొక్క వత్తిడి అనేది సమానంగా ఉందని కూడా నిర్ధారించుకోండి. |
09:52 | లేకపోతే, చనుమొన అనేది కుడివైపుకు లేదా ఎడమ వైపుకు మారిపోయి బిడ్డ స్థనాన్నిలోతుగా పట్టుకోలేకపోయేలా చేస్తుంది. |
10:00 | బిడ్డ వైపు రొమ్మును పక్కలకు నెట్టడం ద్వారా దానిని ఎప్పుడూ బిడ్డ వద్దకు తీసుకురాకూడదు. |
10:08 | ఎల్లప్పుడూ బిడ్డనే రొమ్ము వైపు తీసుకురండి. |
10:12 | ఇప్పుడు, బిడ్డ పాలను త్రాగేందుకు తల్లి రొమ్మును పట్టుకోవడానికి క్రాస్ క్రేడిల్ హోల్డ్ లో సిద్ధంగా ఉంది. |
10:18 | బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
10:24 | ఒకసారి బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న తర్వాత ఒకవేళ స్తనం అనేది భారంగా లెకపోతే అప్పుడు-తల్లి తన రొమ్మును తన చేతి నుండి వదిలిపెట్టాలి. మరియు బిడ్డకు ఆసరా ఇవ్వడానికి ఆ చేతిని బిడ్డ కిందకు తీసుకు రావాలి. |
10:40 | ఈ స్థితిలో, తల్లి తన రెండు చేతులను తన శరీరానికి చాలా దగ్గరగా తీసుకురావాలి. |
10:46 | ఇది బిడ్డకు పాలను పట్టించే సమయంలో తల్లిని సౌకర్యంగా ఉంచుతుంది. |
10:50 | దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
10:53 | ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
పాల్గొన్నందుకు ధన్యవాదములు. |