Difference between revisions of "Java/C2/First-Java-Program/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:02 | “First java program" ప్రారంభం పై ఈ స్పోకన్ ట్యుటోరియల్...") |
|||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | |ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి | + | |ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి, |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో | + | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో JDK 1.6 ఇంస్టాల్ చేసి ఉండాలి. |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | నేను ( | + | | నేను (gedit) జిఎడిట్ ని టెక్స్ట్ ఎడిటర్ గా వాడుతున్నాను. |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | | ఈ టెక్స్ట్ ఎడిటర్ లో ముందుగా హలో వర్ల్డ్ ( | + | | ఈ టెక్స్ట్ ఎడిటర్ లో ముందుగా హలో వర్ల్డ్ (HelloWorld) అనే క్లాస్ ని సృష్టిద్దాం. |
|- | |- | ||
| 01:04 | | 01:04 |
Latest revision as of 18:13, 12 June 2017
Time | Narration |
00:02 | “First java program" ప్రారంభం పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి, |
00:11 | ఒక సులభమైన జావా ప్రోగ్రాం క్రియేట్ చేయడం. |
00:14 | ప్రోగ్రాం ని కంపైల్ చేయడం. |
00:16 | ప్రోగ్రాంని రన్ చేయడం. |
00:17 | జావాలో అనుసరించే నేమింగ్ కన్వె న్షన్స్ |
00:21 | ఇక్కడ మనము ఉబంటు 11.10 మరియు JDK 1.6 ఉపయోగిస్తున్నాము. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో JDK 1.6 ఇంస్టాల్ చేసి ఉండాలి. |
00:39 | లేక పొతే, సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించగలరు. |
00:49 | సరే, ఇప్పుడు మన మొదటి జావా ప్రోగ్రాంని రాద్దాం. |
00:51 | అందుకు, మీకు టర్మినల్ మరియు టెక్స్ట్ ఎడిటర్ కావాలి. |
00:54 | నేను (gedit) జిఎడిట్ ని టెక్స్ట్ ఎడిటర్ గా వాడుతున్నాను. |
01:00 | ఈ టెక్స్ట్ ఎడిటర్ లో ముందుగా హలో వర్ల్డ్ (HelloWorld) అనే క్లాస్ ని సృష్టిద్దాం. |
01:04 | అందుకు class HelloWorld టైప్ చేయండి, హలో వర్ల్డ్ అనేది క్లాస్ పేరు. |
01:15 | తరువాత, కర్లి బ్రాకెట్ లను తెరచి ఎంటర్ నొక్కి కర్లి బ్రాకెట్ లను మూసివేయండి. |
01:24 | రెండు కర్లి బ్రాకెట్ ల మద్య ఉన్న కోడ్ హలో వర్ల్డ్ అనే క్లాస్ కి సంబంధించినది. |
01:34 | ఇప్పుడు సేవ్ చేసేందుకు సేవ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:36 | తరచుగా సేవ్ చేసే అలవాటు మంచిది. |
01:41 | సేవ్ యాజ్(Save As) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
01:46 | సేవ్ చేయాల్సిన చోటుని బ్రౌస్ చేయండి. |
01:48 | ఇప్పుడు నేను, హోమ్ డైరెక్టరీ లో ఒక ఫోల్డర్ సృష్టిస్తాను. |
01:57 | ఫోల్డర్ కి Demo అనే పేరు ఇచ్చి ఎంటర్ నొక్కండి. |
02:02 | ఈ ఫోల్డర్ లో మన ఫైల్ ని సేవ్ చేద్దాం. |
02:08 | నేమ్ టెక్స్ట్ బాక్స్ లో క్లాస్ యొక్క పేరుని టైప్ చేయండి. |
02:13 | జావా లో క్లాస్ పేరు మరియు ఫైల్ పేరు ఒకేలా ఉండాలి. |
02:20 | మనము సృష్టించిన క్లాస్ పేరు హలో వర్ల్డ్ అని గుర్తుంచుకోండి. |
02:25 | అందుకే, మన ఫైల్ ని hello వర్ల్డ్ డాట్ జావా అని సేవ్ చేద్దాం. |
02:33 | “డాట్ జావా” (.java) అనేది జావా ఫైళ్ళ కు ఇచ్చే ఎక్స్ టెన్షన్. |
02:39 | తరువాత సేవ్ పై క్లిక్ చేసి ఫైల్ ని సేవ్ చేయండి. |
02:47 | క్లాస్ లో మనం మెయిన్ మెథడ్ రాద్దాం. |
02:53 | ఇలా టైప్ చేయండి: |
02:54 | public static void main ప్యారెన్థసీస్, అందులో String arg స్క్వేర్ బ్రాకెట్స్. |
03:10 | “మెయిన్” ఫంక్షన్ ప్రోగ్రాం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. |
03:15 | పబ్లిక్, స్టాటిక్. వాయిడ్ మరియు స్ట్రింగ్ల గూర్చి మరొక ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. |
03:23 | మరొక సారి కర్లి బ్రాకెట్ ను తెరవండి. |
03:27 | ఎంటర్ నొక్కి కర్లి బ్రాకెట్ లను మూసి వేయండి. |
03:32 | ఈ కర్లి బ్రాకెట్ ల మద్య ఉన్న కోడ్ మెయిన్ మెథడ్ కు సంబంధించినది. |
03:41 | ఇప్పుడు టర్మినల్ పై ఒక వరసను చూపడానికి కోడ్ ని రాద్దాం. |
03:46 | మెయిన్ మెథడ్ లో System డాట్out డాట్println ప్యారాన్థసిస్ మరియు సెమీ కోలన్ లు టైప్ చేయండి. |
03:59 | ఈ వాక్యాన్ని ఒక వరసను ముద్రించేందుకు ఉపయోగిస్తాము. |
04:05 | సెమీ కోలన్ వాక్యం యొక్క ముగింపుని సూచిస్తుంది. |
04:10 | ఇప్పుడు జావా కు ఏమి ముద్రించాలో చెబుదాం. |
04:13 | అందుకు, ప్యారన్థసీస్ లోపల డబుల్ కోట్స్ లో My first Java program ! టైప్ చేయండి. |
04:30 | ఫైల్ ని సేవ్ ఐకాన్ పై క్లిక్ చేసి సేవ్ చేయండి. |
04:36 | టర్మినల్ ని తెరుద్దాం. |
04:38 | మీరు హలొ వర్ల్ద్.జావా( HelloWorld.java) ఫైల్ సేవ్ చేసిన డైరెక్టరీ లో ఉన్నారని నిర్ధారించుకోండి. |
04:46 | నేను హోమ్ డైరెక్టరీ లో ఉన్నాను అని గమనించండి. |
04:50 | అందువలన, cd స్పేస్ Demo టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:56 | ls ఎంటర్ నొక్కండి. |
04:59 | 'HelloWorld.java' ఫైల్ డెమో ఫోల్డర్ లో ఉందని కనిపిస్తుంది. |
05:06 | ఈ ఫైల్ ని కంపైల్ చేద్దాం. అందుకే javac స్పేస్ HelloWorld డాట్ java టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:21 | ఇలా మనము సృష్టించిన ఫైల్ ని కంపైల్ చేయవచ్చు, |
05:25 | ఫైల్ కంపైల్ అయింది, ఎందుకంటే ఏ లోపాలు అంటే ఏ ఎర్రర్స్ లేవుకనుక ఫైల్ కంపైల్ అయ్యింది. |
05:30 | ఇప్పుడు HelloWorld.class ఫైల్ సృష్టించ బడినదని గమనించండి. |
05:36 | ఈ ఫైల్ని ఎక్కడైనా రన్ చేయగలం. |
05:38 | అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పై అయినా అని అర్థం. |
05:41 | మనకు జావా కంపైలర్ కూడా అవసరం లేదు. |
05:45 | అందుకే జావాని “write once, run anywhere.” అని అంటారు. |
05:51 | కంపైల్ అయిన తరువాత, కమాండ్ ఉపయోగించుకొని రన్ చేద్దాం. |
05:56 | java( ఈసారి c లేదు) స్పేస్ HelloWorld(డాట్ జావా ఎక్సెటెంన్షన్ కూడా లేదు) తరువాత ఎంటర్ నొక్కండి. |
06:08 | My first java program! అనే ఔట్ పుట్ కనిపిస్తుంది. |
06:14 | ఇలా మన మొదటి జావా ప్రోగ్రాం పూర్తిచేసాం. ఎడిటర్ కు వెళ్దాం. |
06:22 | ఇప్పుడు వాక్యం చివరిలో ఉన్న సెమీ కోలన్ తొలగిద్దాం. |
06:27 | సేవ్ పై క్లిక్ చెయండి. |
06:29 | టర్మినల్ కు వద్దాము. |
06:33 | javac HelloWorld డాట్ java కామాండ్ రన్ చెయండి. |
06:41 | కంపైలర్ ఎర్రర్ సూచిస్తుంది. |
06:44 | ఐదవ వరసలో సెమీకోలన్ లేదని సూచిస్తుంది. |
06:52 | అప్ యారో ఎర్రర్ వాక్యాన్ని చూపిస్తుంది. |
06:57 | ఎడిటర్ని తెరుద్దాం. |
07:01 | జావా లో వాక్యాలను సెమీకోలన్ తో ముగిస్తాం. |
07:06 | అందుకే ఐదవ వాక్యానికి సెమీ కోలన్ జోడిద్దాం. |
07:13 | సేవ్ ఐకాన్ పై క్లిక్ చేసి ఫైల్ సేవ్ చేద్దాం. కంపైల్ చేసే ముందు సేవ్ చేయడం అవసరం. |
07:22 | టర్మినల్ కు వద్దాం. |
07:25 | javac HelloWorld డాట్ java ఉపయోగించి ఫైల్ కంపైల్ చేద్దాం. |
07:32 | ఫైల్ లోపాలు లేకుండా కంపైల్ అయింది. |
07:36 | ఇప్పుడు java' HelloWorld కమాండ్ ఉపయోగించి ప్రోగ్రాం ని అమలుపరిచిన తరువాత |
07:45 | we see the output My first Java program!
My first Java program! ఈ ఔట్ పుట్ కనిపిస్తుంది. |
07:49 | ఇలా జావా లో ఎర్రర్ లని హ్యాండిల్ చేయవచ్చు. |
07:54 | ముందు ముందు ఎర్రర్ ల గురించి మరింత తెలుసుకుంటాం. |
08:02 | ఇప్పుడు జావా లో పేర్లను ఉపయోగించే నిబంధనలను చూద్దాం. |
08:06 | క్లాస్ పేరు కామేల్ కేస్ లో ఉండాలి . |
08:10 | అంటే కొత్త పదం యొక్క మొదటి అక్షరం అప్పర్ కేస్ లో ఉండాలి. |
08:14 | ఉదా: class HelloWorld, class ChessGame. |
08:19 | ఇక్కడ 'Hello' లో H మరియు 'World' లో W అప్పర్ కేస్ లో ఉన్నవి. |
08:25 | అలాగే, 'ChessGame' లో C మరియు G అప్పర్ కేస్ లో ఉన్నాయి. |
08:31 | మెథడ్ పేరు మిక్సెడ్ కేస్ లో ఉండాలి. |
08:35 | అంటే మొదటి పదం లోయర్ కేస్ లో ఉండాలి. |
08:39 | మరియు మిగతా అనుసరించే పదాల మొదటి అక్షరం అప్పర్ కేస్ లో ఉండాలి. |
08:44 | మెథడ్ పేరు ఒక క్రియ అయ్యి ఉండాలి. |
08:48 | ఉదా: showString(), main(), goToHelp(). ఇక్కడ show లో ఉన్న ‘s’ లోవర్ కేస్ మరియు స్ట్రింగ్ లో ఉన్న ‘S’ అప్పర్ కేస్ లో ఉంది. |
09:02 | ఐతే వేరియబల్ పేర్లు అంకెలతో ప్రారంభం అవ్వకూడదు. |
09:06 | మనం కీ వర్డ్ లను క్లాస్, మెథడ్ లేదా వేరియబల్ ల పేరులాగ వాడరాదు. |
09:13 | ఉదా: కీ వర్డ్ లు public, private, void, static లాంటి పదాలను ఉపయోగించలేము. |
09:22 | ఈ ట్యుటోరియల్ లో మనం ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని వ్రాసి, కంపైల్ మరియు రన్ చేయడం నేర్చుకున్నాం. |
09:30 | జావా లో పేర్లను వాడే నిబంధలను చూసాం. నేమింగ్ కన్వెన్షన్స్ చూశాం. |
09:35 | స్వపరీక్షగా "Java file name and class name should be same". ఈ వాక్యాన్ని ముద్రించేందుకు ఒక జావా ప్రోగ్రాం ని రాయండి. |
09:47 | స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు, |
09:50 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. [1] |
09:58 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. |
10:02 | మీకు మంచి బాండ్ విడ్త్ లేకుంటే, డౌన్ లోడ్ చేసి చూడచ్చు. |
10:08 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
10:10 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
10:13 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
10:17 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
10:25 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
10:30 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
10:38 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. [2]. |
10:49 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
10:51 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
10:53 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు సుషుమ్న రావు తాడినాడ. జై హింద్. |