Difference between revisions of "Linux-Old/C2/Ubuntu-Desktop-10.10/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |ఉబంటు డెస్క్‌‌టాప్‌పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు మ…')
 
m (Nancyvarkey moved page Linux/C2/Ubuntu-Desktop/Telugu to Linux-Old/C2/Ubuntu-Desktop-10.10/Telugu without leaving a redirect)
 
(One intermediate revision by one other user not shown)
(No difference)

Latest revision as of 17:15, 1 March 2020

Time Narration
0:00 ఉబంటు డెస్క్‌‌టాప్‌పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం.
0:04 ఈ ట్యుటోరియల్‌ను ఉపయోగించి, మనము జెనోమ్ పర్యావరణంపై ఉబంటు డెస్క్‌టాప్‌తో పరిచయం పొందగలము.
0:12 దీని కొరకు, నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
0:19 ఇప్పుడు మీరు చూస్తున్నది, ఉబంటు డెస్క్‌టాప్‌.
0:24 మీరు మెయిన్ మెనూని పైభాగంలో ఎడమవైపు మూల చూడగలరు.
0:31 దీనిని తెరవడానికి, మీరు Alt+F1 నొక్కవచ్చు లేదా అప్లికేషన్స్‌కు వెళ్లి దానిపై క్లిక్ చేయండి.
0:40 ఈ అప్లికేషన్ మెనూ ఇన్‌స్టాల్ చేయబడిన అన్ని అప్లికేషన్లను వర్గీకరించబడిన క్రమంలో కలిగి ఉంటుంది.
0:48 ఈ అప్లికేషన్ మెనూలో, మనం కొన్ని ముఖ్యమైన అప్లికేషన్ల గురించి తెలుసుకుందాము.
0:55 దీనికోసం మనం Applications->Accessories->Calculatorకు వెళదాము.
1:04 కాలిక్యులేటర్ అంకగణిత, శాస్త్రీయ లేదా ఆర్ధిక గణనలకు సహాయపడుతుంది.
1:12 దీనిని మనం తెరుద్దాం, కాలిక్యులేటర్‌పై క్లిక్ చేయండి.
1:18 మనం సులభమైన గణనను ప్రయత్నిద్దాం.
1:22 5*(ఇంటూ)8 టైప్ చేసి = గుర్తును నొక్కండి.
1:32 = గుర్తుకు బదులుగా, మీరు ఎంటర్ కీని కూడా నొక్కవచ్చు.
1:39 ఇప్పుడు క్లోజ్ బటన్ నొక్కి ఈకాలిక్యులేటర్ నుండి బయటకు రండి.
1:46 ఇప్పుడు మనం మరొక అప్లికేషన్ చూద్దాం.
1:50 దాని కోసం తిరిగి అప్లికేషన్స్‌కు వెళ్లి తరువాత యాక్సెసరీస్‌కు వెళ్లండి.
1:59 యాక్సెసరీస్‌లో, మనం టెక్స్ట్ ఎడిటర్‌ను తెరుద్దాం. దానిపై క్లిక్ చేయండి.
2:09 ఇప్పుడు మీరు తెరపై చూస్తున్నది జీ ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్.
2:16 నేను ఇప్పుడు కొంత టెక్స్ట్ టైప్ చేసి దానిని భద్రపరుస్తాను. "H-e-l-l-o W-o-r-l-d" అని టైప్ చేసాను.
2:28 దానిని భద్రపరచడానికి, నేను Clt+s నొక్కవచ్చు లేదా ఫైల్‌కు వెళ్లి సేవ్‌పై నొక్కవచ్చు. నేను ఫైల్‌కు వెళ్లి దానిని భద్రపరుస్తాను.
2:45 ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. అది ఫైల్ పేరు మరియు దానిని భద్రపరచవలసిన ప్రదేశాన్ని అడుగుతుంది.
2:56 దీని పేరు కోసం నేను "hello.txt" అని టైప్ చేస్తాను మరియు ప్రదేశం కొరకు డెస్క్‌టాప్‌ను ఎంచుకొని సేవ్ బటన్ నొక్కుతాను.
3:15 ఇప్పుడు మనం ఈ జీ ఎడిట్‌ను మూసేసి డెస్క్‌టాప్‌ మీద మన ఫైల్ భద్రపరచబడిందో లేదో చూద్దాం. దీన్ని మూసేయండి.
3:24 ఇప్పుడు మీరు డెస్క్‌టాప్‌ మీద hello.txt. ఫైల్ చూడవచ్చు.
3:30 అంటే మన టెక్స్ట్ ఫైల్ విజయవంతంగా భద్రపరచబడింది.
3:35 రెండు సార్లు ఫైల్‌పై క్లిక్ చేయడం ద్వారా నేను దానిని తెరుస్తాను.
3:40 వావ్!! మనం రాసిన టెక్స్ట్‌తో మన టెక్స్ట్‌ ఫైల్ తెరుచుకుంది.
3:44 జీ ఎడిట్ టెక్స్ట్‌ ఎడిటర్‌పై ఇంటర్‌నెట్‌లో ఎంతో సమాచారం ఉంది.
3:50 http://spoken-tutorial.orgలో ఈవిషయంపై స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉంటాయి.
4:00 మనం ఈ టెక్స్ట్ ఎడిటర్‌ను మూసివేసి, అక్సస్సరీస్ నుండి టెర్మినల్ అనబడే యింకొక అప్లికేషన్‌కు వెళ్దాం.
4:12 అందుకు మనం Applications->Accessoriesకు ఆ తరువాత టెర్మినల్‌కు వెనుకకు వెళదాం.
4:19 టెర్మినల్‌ను కమాండ్ లైన్ అని పిలుస్తారు ఎందుకంటే మీరు కంప్యూటర్‌ను ఇక్కడ నుండి నియంత్రించగలరు.
4:25 నిజానికి ఇది GUI కంటే ఎంతో శక్తివంతమైనది.
4:30 ఇప్పుడు మనం టెర్మినల్ గురించి తెలుసుకోవడానికి ఒక సరళమైన కమాండ్‌ను టైప్ చేద్దాం.
4:36 దీనికి మనం 'ls' అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం.
4:41 అది ప్రస్తుతం డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైల్స్ మరియు ఫోల్డర్స్‌ను చూపడాన్ని మీరు చూడవచ్చు.
4:48 ఇక్కడ అది హోమ్ ఫోల్డర్‌లోని ఫైల్స్ మరియు ఫోల్డర్స్‌ను ప్రదర్శిస్తోంది.
4:55 మనం ఈ ట్యుటోరియల్‌లో తరువాత హోమ్ ఫోల్డర్ అంటే ఏమిటో చూస్తాం.
5:01 టెర్మినల్‌తో మనం మరింత సమయాన్ని వెచ్చించం. http://spoken-tutorial.org.లో లైనక్స్ స్పోకెన్ ట్యుటోరియల్స్‌లో టెర్మినల్ కమాండ్స్ చక్కగా వివరించబడ్డాయి.
5:17 టెర్మినల్‌ను మూసేయండి
5:20 ఇప్పుడు మనం తరువాతి అప్లికేషన్ అంటే ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు వెళ్దాం. దానిని తెరుద్దాం.
5:27 దానికోసం applications-> Internet-> Firefox web Browserకు వెళ్లండి. దానిపై క్లిక్ చెయండి.
5:36 Firefox ద్వారా వరల్డ్ వైడ్ వెబ్‌లో ప్రవేశిద్దాం. ఇప్పుడు మీరు Firefox తెరచి ఉండటం చూడచ్చు.
5:43 ఇక్కడ మనం జీమెయిల్ సైట్‌కు వెళ్దాం. దానికోసం అడ్రస్ బార్‌కు వెళ్లండి లేదా F6 నొక్కండి. నేను ఇప్పుడు F6 నొక్కుతున్నాను.
5:53 ఆ! ఇప్పుడు నేను address barలో ఉన్నాను, యింక యిప్పుడు అడ్రస్ బార్ క్లియర్ చేయడానికి నేను బాక్ స్పేస్ నొక్కుతాను.
6:00 "www.gmail.com" అని టైప్ చేస్తాను
6:04 నేను టైప్ చేయగానే, Firefox కొన్ని సైట్లను సూచిస్తుంది.
6:09 మీరు వీటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు లేదా పూర్తి అడ్రస్ టైప్ చేసి ఎంటర్ నొక్కవచ్చు.
6:15 ఫైర్‌ఫాక్స్ నేరుగా వెబ్‌‌సైట్‌తో కలపవచ్చు లేదా ఒక లాగిన్ మరియు పాస్‌వర్డ్‌లను అడగవచ్చు.
6:22 ఇప్పుడు మనం యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌లను టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం.
6:36 ఇప్పుడు మీరు తెరపై జీమెయిల్ వెబ్ పేజ్ తెరచి ఉండటం చూడగలరు. ఇక దీనిని మూసేసి తరువాత దానికి వెళ్దాం.
6:45 ఇప్పుడు మనం ఆఫీస్ మెనూ అనగా applications->Officeకి వెళ్దాం.
6:53 ఈ ఆఫీస్ మెనూలో మనకి ఓపెన్‌ఆఫీస్ వర్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్‌షీట్ మరియు ప్రజంటేషన్ ఉంటాయి.
7:03 ఈ విషయాలపై ఇంటర్‌నెట్‌లో ఎంతో సమాచారం ఉంది.
7:07 మా వెబ్‌సైట్ భవిష్యత్తులో ఈ విషయాలపై స్పోకెన్ ట్యుటోరియల్స్ కలిగి ఉంటుంది.
7:12 ఇప్పుడు మనం సౌండ్ & వీడియో మెనూ పరిశీలిద్దాం. దానికోసం Applications-> Sound & Videoకి వెళ్లండి.
7:21 దీన్లో మనకి ఒక ముఖ్యమైన అప్లికేషన్ ఉంది, అది మూవీ ప్లేయర్. అది వీడియోలు మరియు పాటల కొరకు ఉపయెగపడుతుంది. సాధారణంగా, ఇది ఓపెన్ ఫార్మాట్ వీడియో ఫైల్స్‌ను మాత్రమే ప్రదర్శిస్తుంది.
7:35 నేను నా పెన్- డ్రైవ్ నుండి ఒక ఫైల్‌ను ఉదాహరణగా చూపుతాను. ఇప్పుడు నేను usb స్లాట్‌లో పెన్-డ్రైవ్ ఉంచుతున్నాను. పెన్-డ్రైవ్ తెరుచుకుంది.
7:48 అది తెరుచుకోకపోతే, మీరు దానిని డెస్క్‌టాప్ నుండి పొందవచ్చు.
7:53 మనం క్రింద ఎడమవైపు మూల ఉన్న ఐకాన్ క్లిక్ చేద్దాం. మనం దానిని క్లిక్ చేస్తే, అది కేవలం డెస్క్‌టాప్‌ను మాత్రమే చూపుతుంది. మరలా దానిని క్లిక్ చేస్తే డెస్క్‌టాప్‌ను అప్పటికే తెరచి ఉన్న ఫైల్స్‌తో సహా చూపుతుంది.
8:08 విండోస్ కీ మరియు Dలను ఒకేసారి నొక్కడం ద్వారా కూడా మీరు డెస్క్‌టాప్‌కు వెళ్లవచ్చు. ఉబంటు యొక్క గత వెర్షన్స్‌లో డెస్క్‌టాప్‌కు వెళ్లడానికి ఉపయోగించింది Clt+Alt+Dగా ఉందని గమనించండి. యూజర్ ఒక రూపం నుండి మరొక రూపానికి ఆవిధమైన తేడాలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం విండోస్ కీ మరియు Dనొక్కుదాం.
8:37 ఇక్కడ మీ పెన్-డ్రైవ్ డెస్క్‌టాప్‌పై ఉండటాన్ని మీరు చూడగలరు.
8:42 దానిపై రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా మనం దానిని తెరుద్దాం.
8:46 నేను మూవీ ఫైల్‌ను చూపమని సెలక్ట్ చేసాను, అది Ubuntu Humanity.ogv.
8:57 ఇది నా ఫైల్, దానిని తెరవడానికి నేను రెండుసార్లు క్లిక్ చేస్తాను.
9:09 అది సాధారణంగానే మూవీ ప్లేయర్‌లో తెరుచుకుంటుంది. దీనిని మనం మూసేద్దాం.
9:13 ఇప్పుడు మనం డెస్క్‌టాప్‌పై మరిన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం.
9:18 దానికోసం మనం ఈ సారి ప్లేసెస్ మెనూకి వెళదాం. దీనిలో, మనకి హోమ్ ఫోల్డర్ ఉంది.
9:27 మనం దీనిని తెరుద్దాం. హోమ్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.
9:29 ఉబంటులో ప్రతి యూజర్ ఒక ప్రత్యేక హోమ్ ఫోల్డర్ కలిగి ఉంటాడు.
9:34 మనం హోమ్ ఫోల్డర్‌ని "our house"గా చెప్పవచ్చు, ఇక్కడ మనం మన ఫైల్స్ మరియు ఫోల్డర్స్ భద్రపరచుకోవచ్చు.
9:42 మన అనుమతి లేనిదే ఇతరులు వాటిని చూడలేరు. ఫైల్ అనుమతులపై మరింత సమాచారం http://spoken-tutorial.orgలో లైనక్స్ ట్యుటోరియల్స్‌లో లభ్యమవుతుంది.
9:56 మన హోమ్ ఫోల్డర్‌లో, డెస్క్‌టాప్, డాక్యుమెంట్లు, డౌన్‌లోడ్లు, వీడియోలు మొదలైన ఇతర ఫోల్డర్లను మనం చూడగలము.
10:08 లైనక్స్‌లో, ప్రతి విషయమూ ఒక ఫైలే. డెస్క్‌టాప్ ఫోల్డర్‌పై రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా మనం దానిని తెరుద్దాం.
10:16 మనం టెక్స్ట్ ఎడిటర్‌‌తో భద్రపరచిన "hello.txt" ఫైల్ ఇక్కడే ఉంది.
10:25 అంటే ఈ ఫోల్డర్ మరియు డెస్క్‌టాప్ ఒకటే. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ను మూసేస్తున్నాను.
10:31 ఒకే థీమ్ ఆఫ్ డెస్క్‌టాప్ చూసి మీరు విసుగు చెందలేదా? దానిని మార్చేద్దాం.
10:37 దానికోసం System->Preferences->Appearanceవెళ్లండి. దానిపై క్లిక్ చేయండి.
10:44 ఇక్కడ థీమ్స్ టాబ్ క్రింద, ముందే ఇన్‌స్టాల్ చేయబడిన అనేక థీమ్స్ ఉన్నాయి. మనం "Clearlooks" ఎంపికచేద్దాం.
10:52 మీరు దానిపై క్లిక్ చేయగానే మీ యంత్రంపై మార్పులు చోటుచేసుకోవడాన్ని గమనించవచ్చు.
10:58 క్రింద ఎడమవైపు మూల ఉన్న డెస్క్‌టాప్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు దానిని స్పష్టంగా చూడవచ్చు. మనం ఈ ఐకాన్‌పై మరలా క్లిక్ చేయడం ద్వారా తిరిగి ఫోల్డర్‌కు వెళదాం.
11:10 ఈ థీమ్స్‌లో మీకు నచ్చిన వాటితో ఆడుకోండి, బయటకు రావడానికి క్లోజ్ బటన్‌పై క్లిక్ చేయండి.
11:18 దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగిద్దాం.
11:21 ఈ ట్యుటోరియల్‌లో మనం ఉబంటు డెస్క్‌టాప్, మెయిన్ మెనూ మరియు ఉబంటు తెరపై కనిపించే ఇతర ఐకాన్ల గురించి నేర్చుకున్నాం.
11:31 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రాజక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
11:41 దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:47 ఈ రచనకు సహాయపడింది –పి.వి.శైలజ(అనువాదంచేసిన వారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారు)--------------------------(ప్రదేశం పేరు)నుండి. ధన్యవాదములు మరియు శుభం.

Contributors and Content Editors

Nancyvarkey, Pravin1389, Sneha