Difference between revisions of "Health-and-Nutrition/C2/Kangaroo-Mother-Care/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Undo revision 56406 by Misbah (talk))
 
(One intermediate revision by the same user not shown)
(No difference)

Latest revision as of 15:57, 23 November 2023

Time
Narration
00:00 కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:05 ఈ టుటొరియల్ లొ మనము నేర్చుకునేవి-
00:08 కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అంటే ఏమిటి?
00:10 దానిలోని భాగాలు, ప్రాముఖ్యత మరియు.
00:13 కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) చేసే విధానం.
00:17 ముందుగా మనం కంగారూ మదర్ కేర్ పరిచయంతో ప్రారంభిద్దాం?
00:22 పేరు సూచించినట్లుగానే -
00:24 ఇది బిడ్డను తన చర్మంతో తల్లి చర్మాన్ని తాకేలా ఉంచుతుంది.
00:29 మరియు ఇది KMC గా ప్రసిద్ధి చెందింది.
00:32 గుర్తుంచుకోండి, KMC ను బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వాలి.
00:39 పుట్టుకతో తక్కువ బరువున్న శిశువులకు ఇది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది-
00:44 అంటే 2.5 కిలోగ్రాముల కన్నాతక్కువ బరువు తో పుట్టిన బిడ్డలకు మరియు,
00:48 నిరంతర పర్యవేక్షణ అవసరం లేని వారికి
00:52 ఏమైనప్పటికి, దీన్ని సాధారణ, ఆరోగ్యకరమైన పూర్తి-కాల బిడ్డలందరికి కూడా ఉపయోగించవచ్చు.
00:59 KMC రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది:
01:03 తల్లి మరియు తన బిడ్డ మధ్య ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతూఉండటం అనేది నిరంతరం మరియు సుదీర్ఘ కాలం సాగుతుంది.
01:09 మరియు బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం.
01:13 ఈ భాగాలను వివరంగా చర్చిద్దాం.
01:17 మొదటి భాగం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్(ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతూఉండటం).
01:21 ఇది లెట్ డౌన్ రిఫ్లెక్స్‌ను మెరుగుపరుస్తుంది.
01:24 చివరకు తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది.
01:28 లెట్ డౌన్ రిఫ్లెక్స్ గురించి ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్ లో వివరించబడింది.
01:34 రెండవ భాగం బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం.
01:38 గమనించండి-
01:40 బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడాన్ని మొదటి 6 నెలల కొరకు సిఫార్సు చేస్తారు.
01:45 తరువాత, కంగారూ కేర్ (కంగారు సంరక్షణ) యొక్క ప్రాముఖ్యతను చర్చిద్దాం.
01:50 KMC సమయంలో తల్లీబిడ్డల చర్మ స్పర్శ అనేది ఎక్కువ సమయం కొనసాగటం వల్ల ఇది బిడ్డ శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది
01:57 మరియు బిడ్డకు చాలా భద్రతాభావం కలుగుతుంది.
02:01 KMC వీటిని కూడా తగ్గిస్తుంది -
02:03 తరచుగా వచ్చె అంటువ్యాధులు మరియు
02:05 బిడ్డలకు ఊపిరి ఆడకపొవడం (ఆప్నియా) వంటి సమస్యలు రావటాన్ని.
02:09 ఆప్నియా అంటే మధ్య మధ్య లో ఊపిరి ఆడకపొవడం.
02:13 ఇవే కాకుండా-
02:15 KMC అనేది తల్లి బిడ్డకు పాలిచ్చే వేళలను మరియు సమయాన్ని మెరుగుపరుస్తుంది.
02:20 ఇంకా ఇది తల్లి మరియు ఆమె బిడ్డ మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది.
02:26 KMC అనేది బిడ్డకు కూడా సహాయపడుతుంది-
02:28 ఇది బిడ్డ బరువు పెరగటానికి ఇటివంటి వేరే ఇతర సంప్రదాయ పద్ధతుల కంటే మంచిది.
02:33 బిడ్డను ప్రకాశవంతమైన వేడిలో ఉంచడం.
02:36 ఈ పద్దతి బిడ్డకు మరియు తల్లికి ఒత్తిడిని సృష్టిస్తుంది.
02:40 KMC ఇది తల్లిలో సంతృప్తి మరియు విశ్వాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది-
02:45 ఆమె తన బిడ్డ కోసం అదనపు ప్రయత్నం చేస్తుంది.
02:49 ఆసక్తికరంగా, తల్లులే కాకుండా, KMC ను వీరి ద్వారా కూడా అందించవచ్చు-
02:54 తండ్రి లేదా
02:56 కుటుంబం లో ఎవరైనా పెద్దవారు కూడా.
02:58 మనము ఇప్పుడు బిడ్డకు KMC ను అందించేవారు అనుసరించాల్సిన అంశాలను చర్చిస్తాము:
03:04 బిడ్డకు KMC అందించేవారు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.
03:09 అతను లేదా ఆమె ఇటువంటి కనీస వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులను అనుసరించాలి- -
03:14 చేతులు కడుక్కోవడం,
03:16 రోజూస్నానం చేయడం,

గోళ్ళు కత్తిరించుకోవడం

03:18 జుట్టును కట్టి వేసి ఉంచడం
03:20 మరియు శుభ్రమైన బట్టలు
03:22 అతను లేదా ఆమె ఎటువంటి ఆభరణాలు, వాచీలు మరియు దారాలను ధరించకూడదు -
03:26 పరిశుభ్రతను పాటించడానికి ఇవి అవరోధాలుగా మారవచ్చు.
03:31 మరియు అవి బిడ్డకు గాయం కలిగించవచ్చు.
03:35 ఇప్పుడు, KMC సమయంలో దానిని అందించేవారు ధరించాల్సిన బట్టల గురించి చర్చిద్దాం.-
03:42 బట్టలు ముందు తెరచేలా మరియు తేలికైనవిగా ఉండాలి.
03:46 ఉదాహరణకు, చీర-జాకెట్టు లేదా ముందు తెరవడానికి వీలుగా ఉండే గౌను.
03:51 గమనించండి,

KMC ను అందించేవారు ఈ ముందు తెరవడానికి వీలుగా ఉండే గౌనును లేదా జాకెట్ ను KMC రాప్ చుట్టూ ధరించాలి.

03:58 కంగారూ బ్యాగులు లేదా బైండర్‌లను మార్కెట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
04:04 ఒకవేళ KMC ను ఎక్కువ కాలం చేయవలసి వస్తే ఇవి ఉపయోగపడతాయి.
04:09 ప్రత్యామ్నాయంగా, KMC ను అందించేవారు మృదువైన శుభ్రమైన కాటన్ బట్టల్ని ఉపయోగించవచ్చు.
04:16 అయితే, KMCను అందిస్తున్నసమయంలో బిడ్డకు తప్పకుండ-
04:19 ఒక టోపీ మరియు న్యాపీ ని వేయాలి.
04:22 ఒకవేళ KMC సమయంలో బిడ్డ మలం లేదా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు -
04:27 ఆమె బిడ్డను శుభ్రం చేసి చక్కగా ఆరేలా తుడవాలి.
04:30 తరువాత, మనము కంగారూ కేర్ (కంగారు సంరక్షణ) యొక్క విధానంలోకి వివరంగా వెళ్తాము.
04:36 మొదట, తల్లి నిటారుగా ఉండేలా నిలబడాలి.
04:40 తరువాత, ఒక ఆరోగ్య కార్యకర్త లేదా కుటుంబ సభ్యులెవరైనా ఈ క్రింది పనులను దశల వారీగా చేయాలి-
04:48 శిశువు యొక్క దిగువ భాగానికి మరియు తలకి మద్దతు ఇవ్వడం ద్వారా-
04:51 బిడ్డను నగ్నంగా ఉన్న తల్లి రొమ్ముల మధ్య నిటారుగా ఉండేలా ఉంచండి.
04:56 తర్వాత, బిడ్డ యొక్క తలను ఒక వైపుకు తిప్పండి.
05:00 శిశువు యొక్క తల కొద్దిగా వెనుకకు వంగి ఉంది అని నిర్ధారించుకోండి.
05:04 ఈ స్థితిలో ఉంచడం అనేది -

శిశువు యొక్క ముక్కు వాయుమార్గాలను తెరిచి ఉంచుతుంది.

05:08 మరియు బిడ్డను తన కళ్ళతో తల్లి కళ్ళలోకి చూడగలిగేల చేస్తుంది.
05:14 తర్వాత శిశువు యొక్క తుంటిని కొద్దిగా బయటికి వంచండి.
05:18 గుర్తుంచుకోండి -

శిశువు యొక్క చేతులను తల్లి స్తనాల పైన మరియు

05:23 కాళ్ళను తలి యొక్క స్తనాల కింద మరియు
05:27 తల్లి ఛాతీపై శిశువు యొక్క పొట్టను ఉంచడానికి.
05:29 బిడ్డను వస్త్రంతో చుట్టే ముందు-
05:32 ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే శిశువును దుప్పటితో కప్పండి.
05:36 ఇది శిశువు ను మరియు తల్లిని వెచ్చగా ఉంచుతుంది.
05:39 తర్వాత,

శిశువు మరియు తల్లి ఛాతీ ఇంకా పొట్ట చుట్టూ ఒక గుడ్డను చుట్టండి.

05:45 చుట్టేటప్పుడు వీటిని నిర్ధారించుకోండి -
05:47 గుడ్డ యొక్క మధ్య భాగం అనేది బిడ్డ పైన ఉండాలి.
05:50 ఇంకా గుడ్డ యొక్క రెండుచివరలు అనేవి -
05:53 తల్లి యొక్క చంకల గుండా వెళ్ళాలి.
05:56 ఇంకా వీపుభాగం వద్ద దాటిఉండాలి.
05:59 ఆ తరువాత గుడ్డ యొక్క చివరలను ముందుకు తీసుకుని రావాలి.
06:03 గుడ్డ యొక్క ఈ చివరలను బిడ్డ యొక్క దిగువ భాగం కింద బిడ్డకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ముడివేయాలి.
06:09 ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మరియు బిడ్డకు ఆసరా ఇస్తుంది.
06:14 ఇంకా ఇది బిడ్డ జారిపోకుండా చూసుకుంటుంది.
06:17 గుర్తుంచుకోండి-

తల్లి సౌకర్యవంతంగా ఉన్నతర్వాత ఆమె తనకు తానే వస్త్రాన్నిచుట్టుకోవడం నేర్చుకోవాలి.

06:24 KMC చేసే సమయంలో స్వయంగా తనకు తానే కట్టుకోవడం అనేది ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో వివరించబడుతుంది.
06:32 ఇది తల్లి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఆమెను స్వతంత్రురాలిగా చేస్తుంది.
06:37 ఒకవేళ వస్త్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు తల్లికి అసౌకర్యంగా ఉంటే, అప్పుడు ఆమె సాగే బ్యాండ్‌ను ఉపయోగించవచ్చు.
06:43 ఇది ఉపయోగించడానికి సులభం మరియు సౌకర్యంగా ఉంటుంది.
06:46 సాగే బ్యాండ్ ని ఉపయోగిస్తున్నప్పుడు-
06:49 బిడ్డ తలకు ఆసరా అయ్యేలాగా బ్యాండ్ యొక్క అంచుని బిడ్డ యొక్క చెవికి పైన సర్దుబాటు చేయండి.
06:54 తర్వాత,బిడ్డ తలను కొద్దిగా వంచండి-
06:57 సులువుగా ఊపిరి పీల్చుకోవడానికి మరియు
06:59 ముందు వివరించిన విధంగా తన కళ్ళతో తల్లి కళ్ళలోకి చూస్తుండేలా చేయటానికి.
07:04 చుట్టిన వస్త్రం లేదా సాగే బ్యాండ్ మరీ బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండకూడదు.
07:11 ఇది బిడ్డ సులువుగా ఊపిరి పీల్చుకునేంత సౌకర్యంగా ఉండాలి.
07:15 గుర్తుంచుకోండి, బిడ్డను KMC విధానంలో ఎత్తుకునిఉన్నపుడు, తల్లి వీటిని చేయగలిగేలా ఉండాలి-
07:20 నడవడం,నిలబడడం,కూర్చోవడం లేదా
07:23 వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం.
07:26 ఒకవేళ తల్లి చాలా సౌకర్యంగా ఉన్నట్టయితే -
07:29 కంగారూ కేర్ సమయంలో ఆమె పడుకోవచ్చులేదా నడుము వాల్చి చేరబడవచ్చు.
07:35 ఇప్పుడు KMC సమయంలో శిశువుకు పాలు ఎలా పట్టించాలో చర్చించుకుందాం -
07:40 తల్లయినా బిడ్డకు పాలివ్వొచ్చు-
07:43 చుట్టిన వస్త్రాన్ని వదులు చేయడం ద్వారా మరియు
07:46 పాలివ్వడం కొరకు బిడ్డను సరైన స్థితిలో ఉంచడం ద్వారా.
07:50 లేదా ఆమె తానే స్తనాన్నినొక్కి పాలను బయటకి తీయవచ్చు ఇంకా
07:54 ఒక కప్పు లేదా చెంచాతో బిడ్డకు ఆ పాలను పట్టవచ్చు.
07:57 గుర్తుంచుకోండి,

ప్రతి రోజు శిశువు 25 నుండి 30 గ్రాముల బరువు పెరగాలి.

08:03 ఒక నెలలో శిశువు యొక్క ఆశించిన బరువు పెరుగుదల అనేది 900 నుండి 1,000 గ్రాముల వరకు ఉంటుంది.
08:10 అందువల్ల, తల్లి లేదా ఆరోగ్య కార్యకర్త తప్పనిసరిగా-
08:13 సాధారణ ఆరోగ్య తనిఖీ సమయంలో బిడ్డ యొక్క బరువును చూస్తుండాలి.
08:17 ఒకవేళ బిడ్డ తగినంత బరువు పెరగకపోతే-
08:21 ఆరోగ్య కార్యకర్త తల్లి పాలిచ్చే పద్ధతిని పర్యవేక్షించాలి లేదా
08:25 శిశువు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తుందో తనిఖీ చేయాలి.
08:28 అలాగే, పాలివ్వడానికి సరైన పద్దతిలో పట్టుకోవడం గురించి తల్లికి అవగాహన కల్పించాలి.
08:32 బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
08:39 తరువాత,

మనం చుట్టిన వస్త్రం నుండి బిడ్డను ఎలా బయటకి తీయాలో నేర్చుకుందాం -

08:44 మొదట, తల్లి నిటారుగా ఉండే స్థితిలో కూర్చోవాలి.
08:48 తరువాత, ఒక చేతితో ముడి విప్పడం ప్రారంభించండి ఇంకా
08:53 చుట్టిన వస్త్రం బయటివైపు మరో చేత్తో బిడ్డ యొక్క కిందిభాగానికి ఆసరా ఇవ్వండి.
08:58 దాని తరువాత-

ముడిని విప్పడానికి ఇంతకుముందు ఉపయోగించిన అదే చేతితో చుట్టిన వస్త్రాన్ని వదులు చేయండి.

09:04 తరువాత-

బిడ్డ యొక్క కింది భాగానికి ఆసరా ఇస్తున్న చేతిని వస్త్రం కిందికి మార్చండి ఇంకా

09:11 వస్త్రం బయటవైపు నుండి బిడ్డ కిందిభాగానికి ఆసరా ఇవ్వడానికి మరో చేతిని ఉపయోగించండి.
09:16 తరువాత, బిడ్డను పైకి ఎత్తి, చుట్టిన వస్త్రం నుండి బిడ్డను తీయండి.
09:21 ఆ తరువాత, ఒక పద్దతిలో శిశువు తలని పట్టుకోవడం గుర్తుంచుకోండి-
09:26 ఇక్కడ బొటనవేలు ఒక చెవి వెనుక మరియు
09:28 మిగతా వేళ్లు మరో చెవి చుట్టూ ఉన్నాయి.
09:30 KMC ఇచ్చే సమయంలో కిందివి ఉంటె
09:32 తల్లి వెంటనే వైద్యుడిని మరియు ఆరోగ్య కార్యకర్తను తప్పనిసరిగా సంప్రదించాలి -
09:37 ఒకవేళ బిడ్డ అప్రమత్తంగా మరియు చురుగ్గా లేకపోతే
09:41 ఒకవేళ శిశువు చాలా వేగంగా ఊపిరి తీసుకుంటే లేదా ఊపిరి తీసుకోవడంలో ఎక్కువ విరామం తీసుకుంటుంటే.
09:46 ఒకవేళ బిడ్డ యొక్క పెదవులు లేదా నాలుక నీలం రంగులోకి మారితే
09:50 ఇంకా ఒకవేళ బిడ్డ పాదాలు చల్లగా ఉంటే
09:53 ఇంతటితో మనం కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
09:58 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Misbah, Simhadriudaya