Difference between revisions of "Health-and-Nutrition/C2/Feeding-expressed-breastmilk-to-babies/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 186: Line 186:
 
|-  
 
|-  
 
| 06:40
 
| 06:40
| బదులుగా, పాలను అంచు వద్ద ఉంచండి, పాలు పట్టె సమయం అంతటా అదే స్థితిలో ఉంచండి.
+
| బదులుగా, పాలను అంచు వద్ద ఉంచండి, పాలు పట్టె సమయం అంతటా ఇదే స్థితిలో ఉంచండి.
  
 
|-  
 
|-  
Line 194: Line 194:
 
|-  
 
|-  
 
| 06:54
 
| 06:54
| ఒకవేళ అవసరమైతే, పాలు పడుతున్న వారి చేతిలో నుండి కప్పు పడిపోకుండా ఉండటానికి శిశువును కట్టుకోండి.
+
| ఒకవేళ అవసరమైతే, పాలు పడుతున్న వారి చేతిలో నుండి కప్పు పడిపోకుండా ఉండటానికి శిశువును కట్టేసుకోండి.
  
 
|-  
 
|-  
 
| 07:03
 
| 07:03
| ఎప్పలుడు శిశువును తన స్వంత వేగంతో పాలను పీల్చుకోనివ్వండి.
+
| ఎల్లప్పుడూ శిశువును తన స్వంత వేగంతో పాలను పీల్చుకోనివ్వండి.
  
 
|-  
 
|-  

Latest revision as of 16:33, 19 August 2020

Time
Narration
00:01 పిండితీసిన తల్లిపాలను బిడ్డలకు పట్టించడం పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి:

నిల్వ చేసిన తల్లిపాలను ఒక బిడ్డత్రాగడం కొరకు ఎలా సిద్ధం చేయాలి.

00:14 మరియు పిండి తీసిన తల్లిపాలను ఒక బిడ్డకు ఎలా పట్టించాలి.
00:19 మనం ప్రారంభిద్దాం.

తల్లిపాలను పిండి బయటకుతీయడం అనేది శిశువుకు మరియు తల్లికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.

00:26 తల్లిపాలను పిండి బయటకితీయడం ఇంకా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం అనేది ఇతర ట్యుటోరియల్ లలో వివరించబడింది.
00:34 ఇప్పుడు, మనం నిల్వ చేసిన తల్లిపాలను శిశువు త్రాగడం కొరకు ఎలా సిద్ధం చేయాలో నేర్చుకుందాం.
00:42 తల్లిపాలను ఉపయోగించడానికి ముందు, సంరక్షకుడు-

సబ్బు మరియు నీటితో తన చేతులను కడుగుకోవాలి ఇంకా వారి చేతులను బాగా ఆరబెట్టుకోవాలి.

00:52 గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ (పాత పాలు) ముందుగా నిల్వ చేసిన తల్లిపాలను మొదట వాడేయాలి.
00:59 గడ్డకట్టిన తల్లిపాలను ఉపయోగిస్తున్నప్పుడు, పాలను ఫ్రిజ్ యొక్క కింది అరలో ఒక రాత్రి మొత్తం ఉంచడం ద్వారా వాటిని కరిగించండి.
01:08 ఇంకా, ఈ కరిగించిన పాలను తరువాతి 24 గంటల్లో ఉపయోగించండి.
01:15 కానీ ఒకవేళ గడ్డకట్టిన తల్లిపాలు వెంటనే అవసరమైతే, ఫ్రిజ్ బయటకుతీసి వాటిని (డీఫ్రాస్ట్ చేయండి) ఇలా కరిగించండి. మొదట వాటిని చల్లని నీటితో ఉన్నపాత్రలో ఉంచండి,
01:25 ఆపై వాటిని గోరువెచ్చని నీటితో ఉన్న ఒక పాత్రలో ఉంచండి.
01:31 గోరువెచ్చని నీటిలో ఉంచి (డీఫ్రాస్ట్ చేస్తున్నప్పుడు) కరిగిస్తున్నపుడు - తల్లిపాలు ఉన్న డబ్బాను సున్నితంగా మరియు అప్పుడప్పుడు కదిలించండి.
01:38 దీన్ని తీవ్రంగా ఇంకా ఆపకుండా కదిలించడం చేయవద్దు.
01:42 ఉపయోగించడానికి ముందు తల్లిపాలున్న డబ్బా బయటివైపు ఒక శుభ్రమైన గుడ్డతో తుడిచి ఆరబెట్టండి.
01:48 ఈ కరిగించిన తల్లి పాలను 2 గంటల్లో వాడేయండి ఇంకా ఉపయోగించని మిగిలిన పాలను బయట పారేయండి.
01:56 (డీఫ్రాస్టెడ్) ఇలా కరిగించిన తల్లిపాల వాసన ఇంకా రుచి అనేవి తాజా తల్లిపాలకంటే తేడాగా ఉండవచ్చు.
02:03 శిశువు వీటిని తాగటానికి ఇష్టపడినంత కాలం ఇది మంచిది.
02:08 సంరక్షకుడు ఎల్లప్పుడూ తల్లిపాలను శిశువుకు పట్టించే ముందు వాసన చూడాలి.
02:16 ఒకవేళ పాలు పుల్లని వాసన వస్తుంటే, వాటిని ఉపయోగించవద్దు.
02:20 దయచేసి గుర్తుంచుకోండి- తల్లిపాలను నిల్వ చేసినప్పుడు, అది పాలనుండి (క్రీమ్) వెన్నను పైకి పోయేలా చేసి వేరుచేస్తుంది.
02:28 ఇది సాధారణం.ఉపయోగించే ముందు పాలలోకి (క్రీమ్) వెన్నను తిరిగి కలపడానికి వాటిని సున్నితంగా కదిలించండి.
02:36 శిశువుకు ఆహారం ఇవ్వడానికి ముందు తల్లిపాలను వేడి చేయడానికి-తల్లిపాలున్న డబ్బాను గోరువెచ్చని నీరుపోసిన గిన్నెలో 20 నుండి 30 నిమిషాల సేపు ఉంచండి.
02:47 మీ మణికట్టు మీద కొద్దిగా పాలను వేసి పాలు ఎంత వెచ్చగా ఉన్నాయో పరీక్షించండి.

ఇది వెచ్చగా అనిపించినప్పుడు పాలు సరిగ్గా ఉన్నట్టు.

02:56 తల్లిపాలను వేడి చేయడానికి వేడి నీటిని ఉపయోగించవద్దు. నిల్వ చేసిన తల్లి పాలను ఫ్రిజ్ నుండి నేరుగా ఉపయోగించడానికి ప్రయత్నించండి.
03:05 అధిక వేడి మరియు కాలిన గాయాల ప్రమాదాన్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది.
03:12 తల్లిపాలను నేరుగా పొయ్యి మీద ఉంచడం లేదా మైక్రోవేవ్‌లో పెట్టి వేడిచేయడం చేయవద్దు.
03:19 నేరుగా వేడిచేయడంవల్ల అది ప్రస్తుతం తల్లిపాలలో ఉన్న అనేక ఇన్ఫెక్షన్-పోరాట కారకాలను నాశనం చేస్తుంది.
03:27 తల్లిపాలు సిద్ధంగా ఉన్నప్పుడు, వాటిని శిశువుకు పట్టించండి.
03:32 అలా చేయడానికి, ఈ కింది పాత్రలను ఉపయోగించవచ్చు:

ఒక గోకురు, ఒక చిన్న కప్పు, ఒక చెంచా లేదా ఒక నిఫ్టీ కప్పు.

03:42 వీటిలో, శిశువుకు ఆహారాన్ని ఇవ్వడానికి ఒక చెంచా లేదా ఒక కప్పును ఉపయోగించడం మంచిది.
03:49 మొదట, సంరక్షకుడు ఎంచుకున్న పాత్రను సబ్బు మరియు నీటితో కడగాలి, ఆ తర్వాత దాన్ని పూర్తిగా గాలికి ఆరబెట్టండి లేదా ఒక శుభ్రమైన ఉపయోగించని వస్త్రంతో పొడిగా తుడవండి.
04:02 తరువాత, సంరక్షకుడు తన చేతులను సరిగ్గా కడుక్కుని చక్కగా ఆరబెట్టుకొవాలి.
04:10 వారు ఎంచుకున్న పాత్రను తల్లిపాలతో సగం నింపాలి లేదా మూడింట రెండొంతుల వరకు నింపాలి.
04:16 తరువాత, వారు శిశువును దాదాపు నిటారుగా ఉండే స్థితిలో వారి ఒడిలో పెట్టుకుని పట్టుకోవాలి.
04:23 వారి చేయి శిశువు తల మరియు మెడకు ఆసరా ఇవ్వాలి.
04:28 ఒకవేళ వారు బిడ్డకు పాలు పట్టడానికి గోకురును ఉపయోగిస్తున్నట్లయితే - వారు గోకురు యొక్క కొనను శిశువు నోటి మూలలో ఉంచాలి.
04:39 ఇది శిశువు యొక్క పెదవుల మధ్య తేలికగా పట్టుకోవాలి.
04:45 గోకురు యొక్క చివర అనేది శిశువు పై పెదవిని తేలికగా తాకాలి.
04:50 ఈ స్థితిలో, గోకురు యొక్క ముక్కు యొక్క అంచు వద్ద పాలు ఉండాలి
04:58 శిశువు పాలని పీల్చుతున్నపుడు - సంరక్షకుడు పాలను అంచు వద్ద కొద్దిగా ఉంచడానికి గోకురుని కొద్దిగా వంచాలి.
05:07 ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారం ఇవ్వడానికి ఒక చిన్న కప్పును ఉపయోగిస్తుంటే- వారు శిశువు పెదవుల మధ్య కప్పును తేలికగా పట్టుకోవాలి.
05:17 కప్పు యొక్క అంచు అనేది శిశువు యొక్క పై పెదవిని తేలికగా తాకాలి.
05:22 పాలు కప్పు యొక్క ఎగువ అంచుకు చేరుకునే వరకు వారు కప్పును కొద్దిగా వంచాలి.
05:28 ఇది బిడ్డ కప్పు యొక్క అంచు నుండి పాలు తీసుకోవడానికి అవునుగా ఉండాలి.
05:33 ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారం ఇవ్వడానికి ఒక చెంచా ఉపయోగిస్తుంటే- వారు శిశువు యొక్క పెదవుల మధ్య చెంచాను పట్టుకోవాలి.
05:42 చెంచా యొక్క అంచు అనేది శిశువు పై పెదవిని తేలికగా తాకాలి.
05:47 తరువాత వారు చెంచా అంచు వద్దకు పాలు వచ్చేవరకు చెంచాను కొద్దిగా వంచి ఉంచాలి.
05:54 బిడ్డ పుట్టిన తరువాత మొదటి కొన్ని రోజులు చెంచాతో ఆహారం ఇవ్వడం మంచిది.
05:59 ఎందుకంటే ఈ రోజుల్లో కొద్ది మొత్తంలో పాలు మాత్రమే అవసరమవుతాయి కనుక.
06:07 ఒకవేళ సంరక్షకుడు శిశువుకు ఆహారాన్ని ఇవ్వడానికి నిఫ్టీ కప్పును ఉపయోగిస్తున్నట్లయితే - వారు నిఫ్టీ కప్ యొక్క ధారవచ్చే ప్రదేశాన్ని శిశువు నోటి లోపల ఉంచాలి.
06:19 శిశువు పాలను పీల్చుకుంటున్నపుడు, వారు కప్పును కొద్దిగా పైకి వంచాలి.

ఇది ఖాళీగా ఉన్నందున ధార వచ్చేప్రదేశానికి పాలను చేర్చుతుంది.

06:31 శిశువుకు పిండితీసిన తల్లిపాలను పడుతున్నప్పుడు, శిశువు యొక్క నోటిలో పాలను పోయవద్దు.
06:38 దీనివల్ల శిశువు ఉక్కిరిబిక్కిరి కావచ్చు.
06:40 బదులుగా, పాలను అంచు వద్ద ఉంచండి, పాలు పట్టె సమయం అంతటా ఇదే స్థితిలో ఉంచండి.
06:47 ఎల్లప్పుడూ శిశువు పూర్తిగా మేల్కొని ఉందని, అప్రమత్తంగా మరియు ఆహారం తీసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉందని నిర్ధారించుకోండి.
06:54 ఒకవేళ అవసరమైతే, పాలు పడుతున్న వారి చేతిలో నుండి కప్పు పడిపోకుండా ఉండటానికి శిశువును కట్టేసుకోండి.
07:03 ఎల్లప్పుడూ శిశువును తన స్వంత వేగంతో పాలను పీల్చుకోనివ్వండి.
07:08 శిశువుకు తగినన్ని పాలు లభించాయని చూపించే సంకేతాల కోసం చూడండి,
07:13 ఇటువంటి సంకేతాలు - ఆమె చేతులను పైకి పట్టుకోవడం.
07:16 నిద్రలోకి జారుకోవడం లేదా నోరు మూసుకోవడం.
07:21 గుర్తుంచుకోండి, శిశువు యొక్క దిగువ పెదవిపై మరీ ఎక్కువ ఒత్తిడిని కలిగించవద్దు.
07:28 ఎల్లప్పుడూ పాత్ర యొక్క అంచును శిశువు పై పెదవిని తేలికగా తాకేలా ఉంచండి.
07:34 కప్పు, గోకురు లేదా చెంచా ఏదయినా శిశువు యొక్క నోటి లోపలికి ఉంచవద్దు.
07:41 పడుకున్న స్థితిలో పెట్టి శిశువుకు ఎప్పుడూ ఆహారం ఇవ్వకండి.
07:45 పిండితీసిన తల్లిపాలను శిశువుకు తాగించడానికి పాలసీసాను ఉపయోగించవద్దు.
07:51 శిశువుకు ఆహారం ఇచ్చిన తరువాత, కప్పు, గోకురు లేదా చెంచాను సబ్బు మరియు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇంకా, దాన్నిపూర్తిగా గాలికి ఆరనివ్వండి.
08:04 కొంతమంది పిల్లలు పిండితీసిన తల్లిపాలను తీసుకోవటానికి ఇష్టపడరు, ముఖ్యంగా మొదట్లో కొంతమంది వ్యక్తుల నుండి.
08:12 వేరొకరు వారికి ఇచ్చినప్పుడు బిడ్డ కొంచం తక్కువ అయిష్టాన్ని చూపించవచ్చు.
08:17 పిండితీసిన పాలను శిశువు తిరస్కరించినట్లయితే, చింతించకండి.
08:22 తల్లి పని నుండి తిరిగి వచ్చాక, బిడ్డ పొందకుండా తప్పిపోయిన ఆహారాన్ని, ఎక్కువసార్లు తల్లి పాలివ్వడం ద్వారా లేదా ఎక్కువసేపు తాగి పొందుతుంది.
08:32 గుర్తుంచుకోండి, తల్లిపాలను ఇలా సురక్షితంగా ఉంచండి:

చేతులు, డబ్బాలు మరియు పాత్రలు కడగడం, అవసరమైన వెంటనే పాలు పట్టడం లేదా వాటిని సురక్షితంగా నిల్వ చేయడం.

08:44 ఇది మనలను ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya