Difference between revisions of "Health-and-Nutrition/C2/Football-hold-for-breastfeeding/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 415: Line 415:
  
 
|-  
 
|-  
| 10:57
+
| 10:56
| ఈ ట్యుటొరియల్ లో మనం పాలివ్వడానికి తల్లి మరియు తన బిడ్డ కొరకు సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం.,
+
 
+
|-
+
| 11:04
+
| పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు ఫుట్ బాల్ పద్దతిలో పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం గురించి నేర్చుకున్నాం.
+
 
+
|-
+
| 11:12
+
| ఈ టుటొరియల్ స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, ఐ ఐ టి బాంబె వారి సమర్పణ.
+
 
+
|-
+
| 11:18
+
| స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది.
+
 
+
|-
+
 
+
| 11:26
+
| ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
+
 
+
|-
+
| 11:30
+
| ఈ టుటొరియల్ కు వీల్స్ గ్లొబల్ ఫౌండెషన్ కొంత భాగం నిధులను సమకూర్చింది.
+
 
+
|-
+
| 11:38
+
| ఈ టుటోరియల్ మా ఔర్ శిశు పొషన్ ప్రాజెక్ట్ లొ ఒక భాగం. 
+
 
+
|-
+
| 11:44
+
| ఈ డొమైన్ సమీక్షకులు డా. రూపల్దలాల్, ఎం డి పీడియాట్రిక్స్. 
+
|-
+
| 11:50
+
 
| ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
 
| ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
 
పాల్గొన్నందుకు ధన్యవాదములు.
 
పాల్గొన్నందుకు ధన్యవాదములు.
 
|}
 
|}

Latest revision as of 14:18, 6 August 2020

Time Narration
00:01 తల్లి పాలివ్వడం కొరకు ఫుట్‌బాల్ హోల్డ్‌పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటొరియల్ లో మనం: పాలివ్వడానికి తల్లి మరియు తన బిడ్డ కొరకు సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం,
00:15 పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు ఫుట్‌బాల్ పద్దతిలో పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం లను గురించి నేర్చుకుంటాము.
00:23 మనం ప్రారంభిద్దాం.
00:24 ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు.
00:31 మునుపటి ట్యుటోరియల్‌లో వివరించినట్లుగా, ఒక తల్లి పాలివ్వడానికి ఆమె బిడ్డను పట్టుకోవడం కొరకు వాటిలో ఒక ఉత్తమమైన పద్దతి ఏదంటే-
00:41 తల్లి పాలివ్వడం పూర్తయ్యేవరకు తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సౌకర్యంగా ఉండడం,
00:48 బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉండగలగడం మరియు బిడ్డ తగినన్ని పాలను పొందడం.
00:56 పట్టుకునే విధానాలలో ఫుట్‌బాల్ హోల్డ్‌ అని పిలువబడే ఒకదాని గురించి తెలుసుకుందాం.
01:01 ఫుడ్ బాల్ హోల్డ్ అనేది వీరికి ప్రత్యేకంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది: తల్లికి సి‌-సెక్సన్ ద్వారా ప్రసవం అయినపుడు,
01:08 తల్లి పెద్ద స్తనాలను కలిగి ఉన్నపుడు,
01:10 ముందస్తుగా పుట్టిన లేదా తక్కువ బరువు ఉన్న బిడ్డను కలిగిఉన్నపుడు లేదా
01:14 కవల పిల్లలను కలిగిఉన్నపుడు
01:15 ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: తన బిడ్డకు పాలిచ్చే ముందు, తల్లి తప్పనిసరిగా తన చేతులను కడుక్కుని తడిలేకుండా బాగా తుడుచుకోవాలి.
01:22 తర్వాత ఆమె తప్పనిసరిగా ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
01:27 పాలిచ్చే తల్లులకు దాదాపుగా ఒక రోజుకి750 నుండి 850 మిల్లిలీటర్ల పాలు వస్తాయి.
01:34 అందువల్ల, వారు రోజు తాగుతున్న నీళ్లను పెంచి తాగాల్సిన అవసరం ఉంది.
01:38 తరువాత, మనం తల్లి ఏ భంగిమలో ఉండాలో చర్చిద్దాం.
01:43 తల్లి నేలపై కానీ లేదా మంచం పై కానీ కాళ్ళు మడచుకుని కూర్చొవాలి.
01:48 లేదా తన పాదాలు సమంగా నేలను తాకేలా పెట్టి కుర్చీపైన కూర్చోవాలి.
01:51 ఒకవవేళ కుర్చీ చాలా ఎత్తుగాఉండి ఆమె పాదాలు నేలను తాకక పోతె అప్ప్పుడు ఒక చిన్న పీటను లేదా దిండును నేలపై ఉంచి, వాటిపై ఆమె తన పాదాలను సమంగా ఉంచవచ్చు.
02:02 ఆమె కూర్చునేటప్పుడు వెన్ను నొప్పి రాకుండా నివారించడానికి, తన వెన్ను నిటారుగా ఉందని ఆమె నిర్ధారించుకోవాలి.
02:09 ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా సడలించబడతాయి.
02:13 ఇలా విశ్రాంతిగా ఉన్న ఈ భంగిమను తల్లి పాలిచ్చే సమయం అంతటా కొనసాగించాలి.
02:19 తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వబోతుందో ఆ వైపు 3 నుండి 4 తలగడలను ఉంచుకోవాలి.
02:26 అన్నిటికంటే పైన ఉన్న తలగడను మిగిలిన తలగడలపై వికర్ణంగా పెట్టి తల్లి తొడపై ఉంచాలి.
02:32 తరువాత తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వాలి అనుకుంటుందో ఆ వైపు వస్త్రాన్ని తొలగించాలి.
02:38 ఆమె తన బ్రా లేదా బ్లౌజ్ వలన తన రొమ్ము మీద ఒత్తిడి పడటంలేదని నిర్దారించుకోవాలి.
02:45 తల్లి సౌకర్యవంతంగా కూర్చున్నతర్వాత, బిడ్డను తల్లి దగ్గరకు తీసుకొని రావాలి.
02:49 తల్లి తన బిడ్డ యొక్క వీపును ఈ తలగడలపై ఉంచాలి.
02:53 తల్లి తాను ఏ వైపు స్తనం నుండి పాలిస్తుందో అదే వైపు ఉన్న చేతితో తన బిడ్డ యొక్క తలను పట్టుకొవాలి.
03:01 శిశువు యొక్క కాళ్ళు తల్లి యొక్క అదే చేతి చంక ద్వారా దిండుపైకి వెళ్ళాలి.
03:08 తల్లి ఈ చేతిని మరియు తన బిడ్డ కాళ్ళను తలగడలపై విశ్రాంతిగా ఉంచాలి.
03:13 ఈ చిత్రం లోని తల్లి తన కుడి వైపు స్తనం నుండి తన బిడ్డకు పాలిస్తుంది.
03:18 అందువల్ల, శిశువు యొక్క కాళ్ళు తల్లి యొక్క కుడి చంక గుండా వెళతాయి.
03:23 ఆమె తన బిడ్డ తల యొక్క దిగువ భాగాన్ని పట్టుకోవడానికి తన ఎడమ చేతి యొక్క బొటనవేలు మరియు మిగతావేళ్ళను ఉపయోగిస్తోంది.
03:31 తల్లి ఎప్పుడూ కూడా తన వెన్నును వంచి స్తనాన్ని బిడ్డకు అందేలా చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి.
03:37 ఇది ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు వెన్నునొప్పికి కారణమవుతుంది.
03:42 ఆమె ఎల్లప్పుడూ తన వెన్నును నిటారుగా ఉంచి, బిడ్డ తన రొమ్ము దగ్గరకు చేరేలా బిడ్డను పైకి ఎత్తాలి.
03:48 తర్వాత, బిడ్డ తలను పట్టుకోవడానికి తల్లి యొక్క బొటన వేలు మరియు మిగతావేళ్ళ ఉంచాల్సిన సరైన స్థితి ఏమిటొ చూద్దాం.
03:56 తల్లి బొటన వేలు బిడ్డ యొక్క ఒక చెవి వెనుక మరియు మిగతావేళ్లు మరో చెవి వెనుక ఉండాలి.
04:03 ఆమె బిడ్డ చెవి వెనుక ఉన్న తన బొటన వేలు మరియు మిగతావేళ్లను బిడ్డ మెడ దగ్గరకు జరపకూడదు.
04:09 ఆమె మణికట్టు శిశువు యొక్క భుజ ఫలకాలు మధ్య ఆనించి ఉండాలి.
04:13 ఆమె తన చేత్తో బిడ్డ యొక్క తల వెనుక భాగంలో ఒత్తిడి కలిగించకూడదు. ఇది పాలను త్రాగే సమయంలో బిడ్డను సౌకర్యంగా ఉంచుతుంది.
04:23 తరువాత, మనం బిడ్డ శరీరాన్ని ఎలా సరిగ్గా ఉంచాలో నేర్చుకుందాం.
04:27 బిడ్డ యొక్క ముఖం తల్లి ముఖానికి ఎదురుగా ఉండాలి.
04:31 శిశువు యొక్క శరీరం తల్లి శరీరానికి వ్యతిరేకంగా సున్నితంగా నొక్కాలి.
04:36 వారి శరీరాల మధ్య తక్కువ దూరం ఉంటె అది రొమ్మును చేరుకోవడానికి శిశువు చేసే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది.
04:41 మరియు దానివల్ల బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడం సులభం అవుతుంది.
04:47 బిడ్డ శరీరాన్ని సరిగ్గా ఉంచడంలో రెండవ అంశం బిడ్డ శరీర అమరిక.
04:51 మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉంటాయి.
04:57 అదే విధంగా, తల్లి పాలిచ్చేటప్పుడు శిశువు యొక్క తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉండాలి.
05:06 ఇది శిశువుకు పాలు మింగడాన్ని సులభం చేస్తుంది.
05:10 ఇప్పుడు మనము బిడ్డ శరీరాన్ని ఎలా ఉంచాలి అనేదానిలో మూడవ అంశానికి వచ్చాము.
05:16 తల్లి తన బిడ్డ యొక్క పూర్తి శరీరానికి ఆసరా ఇవ్వాలి.
05:22 లేకపోతే, బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉండటానికి చాలా శ్రమ పడవలసిఉంటుంది.
05:30 తరువాత, బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉంచాలో చూద్దాం.
05:34 బిడ్డ ముక్కు మరియు చనుమొన ఒకే రేఖ లో ఉండాలి.
05:39 ఇంకా తన గడ్డం ముందుకి ఉండి స్తనానికి చాలా దగ్గరగా ఉండాలి.
05:44 బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకునేటపుడు అరియోలా యొక్క దిగువ భాగాన్ని ఎక్కువగా తీసుకుంటుందని ఇది నిర్ధారిస్తుంది.

అందువల్ల, ఎక్కువ పాలను బాగా త్రాగడానికి బిడ్డ కింది దవడను ఉపయోగిస్తుంది.

05:55 దయచేసి గమనించండి అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం.
06:00 ఇప్పుడు, బిడ్ద సరైన స్థితి లొ ఉంచబదడింది.మనం స్తనాన్ని ఎలా పట్టుకొవాలో నేర్చుకుందాం.
06:07 తన మరో చేతి వేళ్ళను ఉపయోగించి, తల్లి తన రొమ్మును ప్రక్కనుంచి C ఆకారంలో పట్టుకుని కప్పాలి.
06:15 ఈ చిత్రం లో తల్లి తన ఎడమ చేతిని తన కుడి స్తనాన్ని పట్టుకొడానికి ఉపయోగిస్తుంది.
06:21 బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను సరిగ్గా ఎలా పెట్టాలో అర్థం చేసుకోవడానికి, చనుమొనను తల్లి యొక్క కుడి రొమ్ముపై గడియారానికి కేంద్రంగా ఊహించుకోండి.
06:30 ఈ గడియారంలో తల్లి తన ఎడమ బొటనవేలును 12 గంటల సమయం స్థానం వద్ద ఉంచాలి.
06:35 ఆమె తన ఎడమ చూపుడు వేలు మరియు మధ్య వేలును గడియారపు 6 గంటల స్థానం వద్ద ఉంచితే.
06:42 తల్లి యొక్క వేళ్ళు, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క పెదవుల దిశలో ఉంటాయి.
06:47 ఇలా ఎందుకు? ఒక సరళమైన ఉదాహరణను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
06:52 మనం వడా పావ్ లేదా బర్గర్‌ను తినేటప్పుడు మన పెదవులు అడ్డంగా తెరచుకుంటాయి.
06:58 ఒక పెద్ద ముక్కను కొరకడానికి మనం వడా పావ్ లేదా బర్గర్‌ను అడ్డంగా పట్టుకుంటాము.
07:03 ఇక్కడ, బొటనవేలు మరియు మిగతా వేళ్లు పెదవుల యొక్క దిశలో ఉంచబడతాయి.
07:10 ఒకవేళ మనం వడా పావ్ లేదా బర్గర్‌ ను నిలువుగా పట్టుకుంటే మనం దాని పెద్ద ముక్కను కొరకలేము.
07:16 అదేవిధంగా, శిశువు యొక్క పెదవుల దిశను గమనించండి.
07:21 పెదవులు ఇక్కడ అడ్డంగా ఉంటాయి.
07:24 అందువల్ల, మిగతా వేళ్లు మరియు బొటనవేలు కూడా రొమ్ముపై అడ్డంగా ఉంచాలి.
07:32 ఇది బిడ్డ దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది.
07:39 శిశువు యొక్క పెదవుల దిశలో ఉండటమే కాకుండా, తల్లి బొటనవేలు మరియు మిగతా వేళ్లు ఎల్లప్పుడూ చనుమొన నుండి 3 వేళ్ల దూరం వద్ద ఉండాలి.
07:50 మళ్ళీ, వడా పావ్ లేదా బర్గర్ ను తినేటప్పుడు, ఒకవేళ మనం దానిని చాలా దగ్గరగా పట్టుకుంటే, మన వేళ్లు పెద్ద ముక్కను కొరకనివ్వకుండా మన నోటికి అడ్డుపడతాయి.
08:00 ఒకవేళ మనం దాన్ని చాలా దూరంగా పట్టుకుంటే, దాని ఆకారం సరిగ్గా మన నోటిలోకి సరిపోయేలా ఉండదు.
08:07 అందువల్ల, పెద్ద ముక్కను కొరకడానికి మనం దానిని సరైన దూరం వద్ద పట్టుకుంటాము.
08:13 అదేవిధంగా బిడ్డ కొరకు కూడా సరైన దూరం అంటే చిత్రం లొ చూపిన విధంగా చనుమొన నుండి 3 వేళ్ల దూరం.
08:21 ఈ దూరం అనేది బిడ్డ దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి తల్లి వేళ్ళు అడ్డు రావు అని నిర్దారిస్తుంది.
08:31 చాల తక్కువ పాలను ఇస్తుంది కనుక తల్లి ఒక్క చనుమొనను మాత్రమే నొక్కదు.
08:36 ఎక్కువపాలు బయటకు వచ్చేలా చేయడానికి, తల్లి అరియోలా కింద ఉన్న పెద్ద పాల నాళాలపై నొక్కుతుంది.
08:42 మరియు బిడ్డ నోటితో లోతుగా పట్టుకోవడానికి సహాయపడేలా తల్లి స్థనం అనేది సరైన ఆకారంలో ఉంటుంది.
08:50 తల్లి బొటనవేలు అనేది రొమ్ము పైభాగంలో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి.
08:55 మరియు ఈ చిత్రంలో చూపిన విధంగా ఆమె 2 వేళ్లు రొమ్ము దిగువ భాగంలో ఉండాలి.
09:01 వడా పావ్ లేదా బర్గర్ యొక్క ఉదాహరణకి మనం తిరిగి వెళ్దాం.
09:06 వడా పావ్ లేదా బర్గర్‌ను సరిగ్గా పట్టుకున్న తరువాత,ఎప్పుడూ కూడా పెద్ద ముక్కను కొరకడానికి మనం దాన్ని నొక్కుతాము.
09:12 అదేవిధంగా, తల్లి తన రొమ్మును పక్క నుండి C ఆకారంలో పట్టుకుని తేలికగా నొక్కాలి.
09:18 ఇది బిడ్డకు స్తనం యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది.
09:23 కానీ గుర్తుంచుకోండి, తల్లి తన రొమ్మును కత్తెర ఆకారంలో పట్టుకుని నొక్కకూడదు.
09:30 కత్తెర ఆకారం లో నొక్కడం అనేది రొమ్మును గిచ్చుతుంది మరియు చనుమొన నుండి మాత్రమే పాలు తాగడానికి కారణమవుతుంది.
09:36 స్తనం పై బొటనవేలు మరియు మిగతావేళ్ళ యొక్క వత్తిడి అనేది సమానంగా ఉందని కూడా నిర్ధారించుకోండి.
09:43 లేకపోతే, చనుమొన అనేది పైదిశలో లేదా కిందిదిశలో మారిపోయి బిడ్డ స్థనాన్నిలోతుగా పట్టుకోలేకపోయేలా చేస్తుంది.
09:51 కొన్నిసార్లు, తల్లి తన బిడ్డను వేరె విధంగా పట్టుకోవాలని అనుకోవచ్చు.
09:56 ఈ చిత్రంలో, బిడ్డ ముఖం తల్లి ముఖం వైపు లేదు.
10:00 బిడ్డతలను తల్లి స్తనం దగ్గరికి స్తనం పక్కనుండి తీసుకురావాలి కిందినుండి కాదు.
10:07 బిడ్డ పెదవులు ఇక్కడ నిలువుగా ఉన్నాయి.అందువల్ల తల్లి తన చేతివేళ్ళను స్తనంపైన U ఆకారం లో నిలువుగా పట్టుకోవాలి.
10:17 గుర్తుంచుకోండి, ఏ విధానంలో పాలివ్వడానికయినా తల్లి వేళ్లు మరియు బొటనవేలు- రొమ్మును పట్టుకోవడం అనేది, ఎల్లప్పుడూ శిశువు యొక్క పెదవుల దిశలో ఉండాలి.
10:28 ఇప్పుడు, బిడ్డ పాలను త్రాగేందుకు తల్లి రొమ్మును పట్టుకోవడానికి ఫుట్ బాల్ హోల్డ్ లో సిద్ధంగా ఉంది.
10:34 బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
10:41 ఒకసారి బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న తర్వాత ఒకవేళ ఆ స్తనం అనేది పెద్దదిగా మరియు భారంగా లెకపోతే అప్పుడు-తల్లి తన రొమ్మును తన చేతి నుండి వదిలి పెట్టి ఆ చేతిని విశ్రాంతిగా ఉంచాలి.
10:53 దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
10:56 ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను

పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Debosmita, Simhadriudaya