Difference between revisions of "Health-and-Nutrition/C2/Football-hold-for-breastfeeding/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 | Time | Narration |- |00:01 | తల్లి పాలివ్వడం కొరకు ఫుట్‌బాల్ హోల్డ్‌పై ఈ స్ప...") |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | ఫుడ్ బాల్ హోల్డ్ అనేది ప్రత్యేకంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది: తల్లికి సి-సెక్సన్ ద్వారా ప్రసవం అయినపుడు, | + | | ఫుడ్ బాల్ హోల్డ్ అనేది వీరికి ప్రత్యేకంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది: తల్లికి సి-సెక్సన్ ద్వారా ప్రసవం అయినపుడు, |
|- | |- | ||
Line 415: | Line 415: | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:56 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను | | ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను | ||
పాల్గొన్నందుకు ధన్యవాదములు. | పాల్గొన్నందుకు ధన్యవాదములు. | ||
|} | |} |
Latest revision as of 14:18, 6 August 2020
Time | Narration |
00:01 | తల్లి పాలివ్వడం కొరకు ఫుట్‌బాల్ హోల్డ్‌పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటొరియల్ లో మనం: పాలివ్వడానికి తల్లి మరియు తన బిడ్డ కొరకు సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం, |
00:15 | పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు ఫుట్‌బాల్ పద్దతిలో పట్టుకోవడం కొరకు దశల వారీ విధానం లను గురించి నేర్చుకుంటాము. |
00:23 | మనం ప్రారంభిద్దాం. |
00:24 | ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు. |
00:31 | మునుపటి ట్యుటోరియల్‌లో వివరించినట్లుగా, ఒక తల్లి పాలివ్వడానికి ఆమె బిడ్డను పట్టుకోవడం కొరకు వాటిలో ఒక ఉత్తమమైన పద్దతి ఏదంటే- |
00:41 | తల్లి పాలివ్వడం పూర్తయ్యేవరకు తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సౌకర్యంగా ఉండడం, |
00:48 | బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉండగలగడం మరియు బిడ్డ తగినన్ని పాలను పొందడం. |
00:56 | పట్టుకునే విధానాలలో ఫుట్‌బాల్ హోల్డ్ అని పిలువబడే ఒకదాని గురించి తెలుసుకుందాం. |
01:01 | ఫుడ్ బాల్ హోల్డ్ అనేది వీరికి ప్రత్యేకంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది: తల్లికి సి-సెక్సన్ ద్వారా ప్రసవం అయినపుడు, |
01:08 | తల్లి పెద్ద స్తనాలను కలిగి ఉన్నపుడు, |
01:10 | ముందస్తుగా పుట్టిన లేదా తక్కువ బరువు ఉన్న బిడ్డను కలిగిఉన్నపుడు లేదా |
01:14 | కవల పిల్లలను కలిగిఉన్నపుడు |
01:15 | ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: తన బిడ్డకు పాలిచ్చే ముందు, తల్లి తప్పనిసరిగా తన చేతులను కడుక్కుని తడిలేకుండా బాగా తుడుచుకోవాలి. |
01:22 | తర్వాత ఆమె తప్పనిసరిగా ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. |
01:27 | పాలిచ్చే తల్లులకు దాదాపుగా ఒక రోజుకి750 నుండి 850 మిల్లిలీటర్ల పాలు వస్తాయి. |
01:34 | అందువల్ల, వారు రోజు తాగుతున్న నీళ్లను పెంచి తాగాల్సిన అవసరం ఉంది. |
01:38 | తరువాత, మనం తల్లి ఏ భంగిమలో ఉండాలో చర్చిద్దాం. |
01:43 | తల్లి నేలపై కానీ లేదా మంచం పై కానీ కాళ్ళు మడచుకుని కూర్చొవాలి. |
01:48 | లేదా తన పాదాలు సమంగా నేలను తాకేలా పెట్టి కుర్చీపైన కూర్చోవాలి. |
01:51 | ఒకవవేళ కుర్చీ చాలా ఎత్తుగాఉండి ఆమె పాదాలు నేలను తాకక పోతె అప్ప్పుడు ఒక చిన్న పీటను లేదా దిండును నేలపై ఉంచి, వాటిపై ఆమె తన పాదాలను సమంగా ఉంచవచ్చు. |
02:02 | ఆమె కూర్చునేటప్పుడు వెన్ను నొప్పి రాకుండా నివారించడానికి, తన వెన్ను నిటారుగా ఉందని ఆమె నిర్ధారించుకోవాలి. |
02:09 | ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా సడలించబడతాయి. |
02:13 | ఇలా విశ్రాంతిగా ఉన్న ఈ భంగిమను తల్లి పాలిచ్చే సమయం అంతటా కొనసాగించాలి. |
02:19 | తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వబోతుందో ఆ వైపు 3 నుండి 4 తలగడలను ఉంచుకోవాలి. |
02:26 | అన్నిటికంటే పైన ఉన్న తలగడను మిగిలిన తలగడలపై వికర్ణంగా పెట్టి తల్లి తొడపై ఉంచాలి. |
02:32 | తరువాత తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వాలి అనుకుంటుందో ఆ వైపు వస్త్రాన్ని తొలగించాలి. |
02:38 | ఆమె తన బ్రా లేదా బ్లౌజ్ వలన తన రొమ్ము మీద ఒత్తిడి పడటంలేదని నిర్దారించుకోవాలి. |
02:45 | తల్లి సౌకర్యవంతంగా కూర్చున్నతర్వాత, బిడ్డను తల్లి దగ్గరకు తీసుకొని రావాలి. |
02:49 | తల్లి తన బిడ్డ యొక్క వీపును ఈ తలగడలపై ఉంచాలి. |
02:53 | తల్లి తాను ఏ వైపు స్తనం నుండి పాలిస్తుందో అదే వైపు ఉన్న చేతితో తన బిడ్డ యొక్క తలను పట్టుకొవాలి. |
03:01 | శిశువు యొక్క కాళ్ళు తల్లి యొక్క అదే చేతి చంక ద్వారా దిండుపైకి వెళ్ళాలి. |
03:08 | తల్లి ఈ చేతిని మరియు తన బిడ్డ కాళ్ళను తలగడలపై విశ్రాంతిగా ఉంచాలి. |
03:13 | ఈ చిత్రం లోని తల్లి తన కుడి వైపు స్తనం నుండి తన బిడ్డకు పాలిస్తుంది. |
03:18 | అందువల్ల, శిశువు యొక్క కాళ్ళు తల్లి యొక్క కుడి చంక గుండా వెళతాయి. |
03:23 | ఆమె తన బిడ్డ తల యొక్క దిగువ భాగాన్ని పట్టుకోవడానికి తన ఎడమ చేతి యొక్క బొటనవేలు మరియు మిగతావేళ్ళను ఉపయోగిస్తోంది. |
03:31 | తల్లి ఎప్పుడూ కూడా తన వెన్నును వంచి స్తనాన్ని బిడ్డకు అందేలా చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. |
03:37 | ఇది ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు వెన్నునొప్పికి కారణమవుతుంది. |
03:42 | ఆమె ఎల్లప్పుడూ తన వెన్నును నిటారుగా ఉంచి, బిడ్డ తన రొమ్ము దగ్గరకు చేరేలా బిడ్డను పైకి ఎత్తాలి. |
03:48 | తర్వాత, బిడ్డ తలను పట్టుకోవడానికి తల్లి యొక్క బొటన వేలు మరియు మిగతావేళ్ళ ఉంచాల్సిన సరైన స్థితి ఏమిటొ చూద్దాం. |
03:56 | తల్లి బొటన వేలు బిడ్డ యొక్క ఒక చెవి వెనుక మరియు మిగతావేళ్లు మరో చెవి వెనుక ఉండాలి. |
04:03 | ఆమె బిడ్డ చెవి వెనుక ఉన్న తన బొటన వేలు మరియు మిగతావేళ్లను బిడ్డ మెడ దగ్గరకు జరపకూడదు. |
04:09 | ఆమె మణికట్టు శిశువు యొక్క భుజ ఫలకాలు మధ్య ఆనించి ఉండాలి. |
04:13 | ఆమె తన చేత్తో బిడ్డ యొక్క తల వెనుక భాగంలో ఒత్తిడి కలిగించకూడదు. ఇది పాలను త్రాగే సమయంలో బిడ్డను సౌకర్యంగా ఉంచుతుంది. |
04:23 | తరువాత, మనం బిడ్డ శరీరాన్ని ఎలా సరిగ్గా ఉంచాలో నేర్చుకుందాం. |
04:27 | బిడ్డ యొక్క ముఖం తల్లి ముఖానికి ఎదురుగా ఉండాలి. |
04:31 | శిశువు యొక్క శరీరం తల్లి శరీరానికి వ్యతిరేకంగా సున్నితంగా నొక్కాలి. |
04:36 | వారి శరీరాల మధ్య తక్కువ దూరం ఉంటె అది రొమ్మును చేరుకోవడానికి శిశువు చేసే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది. |
04:41 | మరియు దానివల్ల బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడం సులభం అవుతుంది. |
04:47 | బిడ్డ శరీరాన్ని సరిగ్గా ఉంచడంలో రెండవ అంశం బిడ్డ శరీర అమరిక. |
04:51 | మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉంటాయి. |
04:57 | అదే విధంగా, తల్లి పాలిచ్చేటప్పుడు శిశువు యొక్క తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉండాలి. |
05:06 | ఇది శిశువుకు పాలు మింగడాన్ని సులభం చేస్తుంది. |
05:10 | ఇప్పుడు మనము బిడ్డ శరీరాన్ని ఎలా ఉంచాలి అనేదానిలో మూడవ అంశానికి వచ్చాము. |
05:16 | తల్లి తన బిడ్డ యొక్క పూర్తి శరీరానికి ఆసరా ఇవ్వాలి. |
05:22 | లేకపోతే, బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉండటానికి చాలా శ్రమ పడవలసిఉంటుంది. |
05:30 | తరువాత, బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉంచాలో చూద్దాం. |
05:34 | బిడ్డ ముక్కు మరియు చనుమొన ఒకే రేఖ లో ఉండాలి. |
05:39 | ఇంకా తన గడ్డం ముందుకి ఉండి స్తనానికి చాలా దగ్గరగా ఉండాలి. |
05:44 | బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకునేటపుడు అరియోలా యొక్క దిగువ భాగాన్ని ఎక్కువగా తీసుకుంటుందని ఇది నిర్ధారిస్తుంది.
అందువల్ల, ఎక్కువ పాలను బాగా త్రాగడానికి బిడ్డ కింది దవడను ఉపయోగిస్తుంది. |
05:55 | దయచేసి గమనించండి అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం. |
06:00 | ఇప్పుడు, బిడ్ద సరైన స్థితి లొ ఉంచబదడింది.మనం స్తనాన్ని ఎలా పట్టుకొవాలో నేర్చుకుందాం. |
06:07 | తన మరో చేతి వేళ్ళను ఉపయోగించి, తల్లి తన రొమ్మును ప్రక్కనుంచి C ఆకారంలో పట్టుకుని కప్పాలి. |
06:15 | ఈ చిత్రం లో తల్లి తన ఎడమ చేతిని తన కుడి స్తనాన్ని పట్టుకొడానికి ఉపయోగిస్తుంది. |
06:21 | బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను సరిగ్గా ఎలా పెట్టాలో అర్థం చేసుకోవడానికి, చనుమొనను తల్లి యొక్క కుడి రొమ్ముపై గడియారానికి కేంద్రంగా ఊహించుకోండి. |
06:30 | ఈ గడియారంలో తల్లి తన ఎడమ బొటనవేలును 12 గంటల సమయం స్థానం వద్ద ఉంచాలి. |
06:35 | ఆమె తన ఎడమ చూపుడు వేలు మరియు మధ్య వేలును గడియారపు 6 గంటల స్థానం వద్ద ఉంచితే. |
06:42 | తల్లి యొక్క వేళ్ళు, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క పెదవుల దిశలో ఉంటాయి. |
06:47 | ఇలా ఎందుకు? ఒక సరళమైన ఉదాహరణను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం. |
06:52 | మనం వడా పావ్ లేదా బర్గర్‌ను తినేటప్పుడు మన పెదవులు అడ్డంగా తెరచుకుంటాయి. |
06:58 | ఒక పెద్ద ముక్కను కొరకడానికి మనం వడా పావ్ లేదా బర్గర్‌ను అడ్డంగా పట్టుకుంటాము. |
07:03 | ఇక్కడ, బొటనవేలు మరియు మిగతా వేళ్లు పెదవుల యొక్క దిశలో ఉంచబడతాయి. |
07:10 | ఒకవేళ మనం వడా పావ్ లేదా బర్గర్ ను నిలువుగా పట్టుకుంటే మనం దాని పెద్ద ముక్కను కొరకలేము. |
07:16 | అదేవిధంగా, శిశువు యొక్క పెదవుల దిశను గమనించండి. |
07:21 | పెదవులు ఇక్కడ అడ్డంగా ఉంటాయి. |
07:24 | అందువల్ల, మిగతా వేళ్లు మరియు బొటనవేలు కూడా రొమ్ముపై అడ్డంగా ఉంచాలి. |
07:32 | ఇది బిడ్డ దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది. |
07:39 | శిశువు యొక్క పెదవుల దిశలో ఉండటమే కాకుండా, తల్లి బొటనవేలు మరియు మిగతా వేళ్లు ఎల్లప్పుడూ చనుమొన నుండి 3 వేళ్ల దూరం వద్ద ఉండాలి. |
07:50 | మళ్ళీ, వడా పావ్ లేదా బర్గర్ ను తినేటప్పుడు, ఒకవేళ మనం దానిని చాలా దగ్గరగా పట్టుకుంటే, మన వేళ్లు పెద్ద ముక్కను కొరకనివ్వకుండా మన నోటికి అడ్డుపడతాయి. |
08:00 | ఒకవేళ మనం దాన్ని చాలా దూరంగా పట్టుకుంటే, దాని ఆకారం సరిగ్గా మన నోటిలోకి సరిపోయేలా ఉండదు. |
08:07 | అందువల్ల, పెద్ద ముక్కను కొరకడానికి మనం దానిని సరైన దూరం వద్ద పట్టుకుంటాము. |
08:13 | అదేవిధంగా బిడ్డ కొరకు కూడా సరైన దూరం అంటే చిత్రం లొ చూపిన విధంగా చనుమొన నుండి 3 వేళ్ల దూరం. |
08:21 | ఈ దూరం అనేది బిడ్డ దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి తల్లి వేళ్ళు అడ్డు రావు అని నిర్దారిస్తుంది. |
08:31 | చాల తక్కువ పాలను ఇస్తుంది కనుక తల్లి ఒక్క చనుమొనను మాత్రమే నొక్కదు. |
08:36 | ఎక్కువపాలు బయటకు వచ్చేలా చేయడానికి, తల్లి అరియోలా కింద ఉన్న పెద్ద పాల నాళాలపై నొక్కుతుంది. |
08:42 | మరియు బిడ్డ నోటితో లోతుగా పట్టుకోవడానికి సహాయపడేలా తల్లి స్థనం అనేది సరైన ఆకారంలో ఉంటుంది. |
08:50 | తల్లి బొటనవేలు అనేది రొమ్ము పైభాగంలో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. |
08:55 | మరియు ఈ చిత్రంలో చూపిన విధంగా ఆమె 2 వేళ్లు రొమ్ము దిగువ భాగంలో ఉండాలి. |
09:01 | వడా పావ్ లేదా బర్గర్ యొక్క ఉదాహరణకి మనం తిరిగి వెళ్దాం. |
09:06 | వడా పావ్ లేదా బర్గర్‌ను సరిగ్గా పట్టుకున్న తరువాత,ఎప్పుడూ కూడా పెద్ద ముక్కను కొరకడానికి మనం దాన్ని నొక్కుతాము. |
09:12 | అదేవిధంగా, తల్లి తన రొమ్మును పక్క నుండి C ఆకారంలో పట్టుకుని తేలికగా నొక్కాలి. |
09:18 | ఇది బిడ్డకు స్తనం యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది. |
09:23 | కానీ గుర్తుంచుకోండి, తల్లి తన రొమ్మును కత్తెర ఆకారంలో పట్టుకుని నొక్కకూడదు. |
09:30 | కత్తెర ఆకారం లో నొక్కడం అనేది రొమ్మును గిచ్చుతుంది మరియు చనుమొన నుండి మాత్రమే పాలు తాగడానికి కారణమవుతుంది. |
09:36 | స్తనం పై బొటనవేలు మరియు మిగతావేళ్ళ యొక్క వత్తిడి అనేది సమానంగా ఉందని కూడా నిర్ధారించుకోండి. |
09:43 | లేకపోతే, చనుమొన అనేది పైదిశలో లేదా కిందిదిశలో మారిపోయి బిడ్డ స్థనాన్నిలోతుగా పట్టుకోలేకపోయేలా చేస్తుంది. |
09:51 | కొన్నిసార్లు, తల్లి తన బిడ్డను వేరె విధంగా పట్టుకోవాలని అనుకోవచ్చు. |
09:56 | ఈ చిత్రంలో, బిడ్డ ముఖం తల్లి ముఖం వైపు లేదు. |
10:00 | బిడ్డతలను తల్లి స్తనం దగ్గరికి స్తనం పక్కనుండి తీసుకురావాలి కిందినుండి కాదు. |
10:07 | బిడ్డ పెదవులు ఇక్కడ నిలువుగా ఉన్నాయి.అందువల్ల తల్లి తన చేతివేళ్ళను స్తనంపైన U ఆకారం లో నిలువుగా పట్టుకోవాలి. |
10:17 | గుర్తుంచుకోండి, ఏ విధానంలో పాలివ్వడానికయినా తల్లి వేళ్లు మరియు బొటనవేలు- రొమ్మును పట్టుకోవడం అనేది, ఎల్లప్పుడూ శిశువు యొక్క పెదవుల దిశలో ఉండాలి. |
10:28 | ఇప్పుడు, బిడ్డ పాలను త్రాగేందుకు తల్లి రొమ్మును పట్టుకోవడానికి ఫుట్ బాల్ హోల్డ్ లో సిద్ధంగా ఉంది. |
10:34 | బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
10:41 | ఒకసారి బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న తర్వాత ఒకవేళ ఆ స్తనం అనేది పెద్దదిగా మరియు భారంగా లెకపోతే అప్పుడు-తల్లి తన రొమ్మును తన చేతి నుండి వదిలి పెట్టి ఆ చేతిని విశ్రాంతిగా ఉంచాలి. |
10:53 | దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
10:56 | ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
పాల్గొన్నందుకు ధన్యవాదములు. |