Difference between revisions of "Linux-Old/C2/Ubuntu-Desktop-10.10/Telugu"
From Script | Spoken-Tutorial
Pravin1389 (Talk | contribs) m (moved Linux-Ubuntu/C2/Ubuntu-Desktop/Telugu to Linux/C2/Ubuntu-Desktop/Telugu: Combining Linux & Linux-Ubuntu FOSS Categories.) |
Nancyvarkey (Talk | contribs) m (Nancyvarkey moved page Linux/C2/Ubuntu-Desktop/Telugu to Linux-Old/C2/Ubuntu-Desktop-10.10/Telugu without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 17:15, 1 March 2020
Time | Narration |
---|---|
0:00 | ఉబంటు డెస్క్టాప్పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం. |
0:04 | ఈ ట్యుటోరియల్ను ఉపయోగించి, మనము జెనోమ్ పర్యావరణంపై ఉబంటు డెస్క్‌టాప్‌తో పరిచయం పొందగలము. |
0:12 | దీని కొరకు, నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
0:19 | ఇప్పుడు మీరు చూస్తున్నది, ఉబంటు డెస్క్‌టాప్. |
0:24 | మీరు మెయిన్ మెనూని పైభాగంలో ఎడమవైపు మూల చూడగలరు. |
0:31 | దీనిని తెరవడానికి, మీరు Alt+F1 నొక్కవచ్చు లేదా అప్లికేషన్స్‌కు వెళ్లి దానిపై క్లిక్ చేయండి. |
0:40 | ఈ అప్లికేషన్ మెనూ ఇన్స్టాల్ చేయబడిన అన్ని అప్లికేషన్లను వర్గీకరించబడిన క్రమంలో కలిగి ఉంటుంది. |
0:48 | ఈ అప్లికేషన్ మెనూలో, మనం కొన్ని ముఖ్యమైన అప్లికేషన్ల గురించి తెలుసుకుందాము. |
0:55 | దీనికోసం మనం Applications->Accessories->Calculatorకు వెళదాము. |
1:04 | కాలిక్యులేటర్ అంకగణిత, శాస్త్రీయ లేదా ఆర్ధిక గణనలకు సహాయపడుతుంది. |
1:12 | దీనిని మనం తెరుద్దాం, కాలిక్యులేటర్‌పై క్లిక్ చేయండి. |
1:18 | మనం సులభమైన గణనను ప్రయత్నిద్దాం. |
1:22 | 5*(ఇంటూ)8 టైప్ చేసి = గుర్తును నొక్కండి. |
1:32 | = గుర్తుకు బదులుగా, మీరు ఎంటర్ కీని కూడా నొక్కవచ్చు. |
1:39 | ఇప్పుడు క్లోజ్ బటన్ నొక్కి ఈకాలిక్యులేటర్ నుండి బయటకు రండి. |
1:46 | ఇప్పుడు మనం మరొక అప్లికేషన్ చూద్దాం. |
1:50 | దాని కోసం తిరిగి అప్లికేషన్స్‌కు వెళ్లి తరువాత యాక్సెసరీస్‌కు వెళ్లండి. |
1:59 | యాక్సెసరీస్‌లో, మనం టెక్స్ట్ ఎడిటర్‌ను తెరుద్దాం. దానిపై క్లిక్ చేయండి. |
2:09 | ఇప్పుడు మీరు తెరపై చూస్తున్నది జీ ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్. |
2:16 | నేను ఇప్పుడు కొంత టెక్స్ట్ టైప్ చేసి దానిని భద్రపరుస్తాను. "H-e-l-l-o W-o-r-l-d" అని టైప్ చేసాను. |
2:28 | దానిని భద్రపరచడానికి, నేను Clt+s నొక్కవచ్చు లేదా ఫైల్‌కు వెళ్లి సేవ్‌పై నొక్కవచ్చు. నేను ఫైల్‌కు వెళ్లి దానిని భద్రపరుస్తాను. |
2:45 | ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. అది ఫైల్ పేరు మరియు దానిని భద్రపరచవలసిన ప్రదేశాన్ని అడుగుతుంది. |
2:56 | దీని పేరు కోసం నేను "hello.txt" అని టైప్ చేస్తాను మరియు ప్రదేశం కొరకు డెస్క్టాప్ను ఎంచుకొని సేవ్ బటన్ నొక్కుతాను. |
3:15 | ఇప్పుడు మనం ఈ జీ ఎడిట్‌ను మూసేసి డెస్క్‌టాప్ మీద మన ఫైల్ భద్రపరచబడిందో లేదో చూద్దాం. దీన్ని మూసేయండి. |
3:24 | ఇప్పుడు మీరు డెస్క్‌టాప్ మీద hello.txt. ఫైల్ చూడవచ్చు. |
3:30 | అంటే మన టెక్స్ట్ ఫైల్ విజయవంతంగా భద్రపరచబడింది. |
3:35 | రెండు సార్లు ఫైల్‌పై క్లిక్ చేయడం ద్వారా నేను దానిని తెరుస్తాను. |
3:40 | వావ్!! మనం రాసిన టెక్స్ట్‌తో మన టెక్స్ట్ ఫైల్ తెరుచుకుంది. |
3:44 | జీ ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్‌పై ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంది. |
3:50 | http://spoken-tutorial.orgలో ఈవిషయంపై స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉంటాయి. |
4:00 | మనం ఈ టెక్స్ట్ ఎడిటర్‌ను మూసివేసి, అక్సస్సరీస్ నుండి టెర్మినల్ అనబడే యింకొక అప్లికేషన్‌కు వెళ్దాం. |
4:12 | అందుకు మనం Applications->Accessoriesకు ఆ తరువాత టెర్మినల్‌కు వెనుకకు వెళదాం. |
4:19 | టెర్మినల్‌ను కమాండ్ లైన్ అని పిలుస్తారు ఎందుకంటే మీరు కంప్యూటర్ను ఇక్కడ నుండి నియంత్రించగలరు. |
4:25 | నిజానికి ఇది GUI కంటే ఎంతో శక్తివంతమైనది. |
4:30 | ఇప్పుడు మనం టెర్మినల్ గురించి తెలుసుకోవడానికి ఒక సరళమైన కమాండ్‌ను టైప్ చేద్దాం. |
4:36 | దీనికి మనం 'ls' అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
4:41 | అది ప్రస్తుతం డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైల్స్ మరియు ఫోల్డర్స్‌ను చూపడాన్ని మీరు చూడవచ్చు. |
4:48 | ఇక్కడ అది హోమ్ ఫోల్డర్‌లోని ఫైల్స్ మరియు ఫోల్డర్స్‌ను ప్రదర్శిస్తోంది. |
4:55 | మనం ఈ ట్యుటోరియల్‌లో తరువాత హోమ్ ఫోల్డర్ అంటే ఏమిటో చూస్తాం. |
5:01 | టెర్మినల్‌తో మనం మరింత సమయాన్ని వెచ్చించం. http://spoken-tutorial.org.లో లైనక్స్ స్పోకెన్ ట్యుటోరియల్స్‌లో టెర్మినల్ కమాండ్స్ చక్కగా వివరించబడ్డాయి. |
5:17 | టెర్మినల్‌ను మూసేయండి |
5:20 | ఇప్పుడు మనం తరువాతి అప్లికేషన్ అంటే ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు వెళ్దాం. దానిని తెరుద్దాం. |
5:27 | దానికోసం applications-> Internet-> Firefox web Browserకు వెళ్లండి. దానిపై క్లిక్ చెయండి. |
5:36 | Firefox ద్వారా వరల్డ్ వైడ్ వెబ్‌లో ప్రవేశిద్దాం. ఇప్పుడు మీరు Firefox తెరచి ఉండటం చూడచ్చు. |
5:43 | ఇక్కడ మనం జీమెయిల్ సైట్‌కు వెళ్దాం. దానికోసం అడ్రస్ బార్‌కు వెళ్లండి లేదా F6 నొక్కండి. నేను ఇప్పుడు F6 నొక్కుతున్నాను. |
5:53 | ఆ! ఇప్పుడు నేను address barలో ఉన్నాను, యింక యిప్పుడు అడ్రస్ బార్ క్లియర్ చేయడానికి నేను బాక్ స్పేస్ నొక్కుతాను. |
6:00 | "www.gmail.com" అని టైప్ చేస్తాను |
6:04 | నేను టైప్ చేయగానే, Firefox కొన్ని సైట్లను సూచిస్తుంది. |
6:09 | మీరు వీటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు లేదా పూర్తి అడ్రస్ టైప్ చేసి ఎంటర్ నొక్కవచ్చు. |
6:15 | ఫైర్ఫాక్స్ నేరుగా వెబ్‌సైట్‌తో కలపవచ్చు లేదా ఒక లాగిన్ మరియు పాస్‌వర్డ్‌లను అడగవచ్చు. |
6:22 | ఇప్పుడు మనం యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌లను టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
6:36 | ఇప్పుడు మీరు తెరపై జీమెయిల్ వెబ్ పేజ్ తెరచి ఉండటం చూడగలరు. ఇక దీనిని మూసేసి తరువాత దానికి వెళ్దాం. |
6:45 | ఇప్పుడు మనం ఆఫీస్ మెనూ అనగా applications->Officeకి వెళ్దాం. |
6:53 | ఈ ఆఫీస్ మెనూలో మనకి ఓపెన్ఆఫీస్ వర్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్‌షీట్ మరియు ప్రజంటేషన్ ఉంటాయి. |
7:03 | ఈ విషయాలపై ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంది. |
7:07 | మా వెబ్సైట్ భవిష్యత్తులో ఈ విషయాలపై స్పోకెన్ ట్యుటోరియల్స్ కలిగి ఉంటుంది. |
7:12 | ఇప్పుడు మనం సౌండ్ & వీడియో మెనూ పరిశీలిద్దాం. దానికోసం Applications-> Sound & Videoకి వెళ్లండి. |
7:21 | దీన్లో మనకి ఒక ముఖ్యమైన అప్లికేషన్ ఉంది, అది మూవీ ప్లేయర్. అది వీడియోలు మరియు పాటల కొరకు ఉపయెగపడుతుంది. సాధారణంగా, ఇది ఓపెన్ ఫార్మాట్ వీడియో ఫైల్స్‌ను మాత్రమే ప్రదర్శిస్తుంది. |
7:35 | నేను నా పెన్- డ్రైవ్ నుండి ఒక ఫైల్‌ను ఉదాహరణగా చూపుతాను. ఇప్పుడు నేను usb స్లాట్‌లో పెన్-డ్రైవ్ ఉంచుతున్నాను. పెన్-డ్రైవ్ తెరుచుకుంది. |
7:48 | అది తెరుచుకోకపోతే, మీరు దానిని డెస్క్‌టాప్ నుండి పొందవచ్చు. |
7:53 | మనం క్రింద ఎడమవైపు మూల ఉన్న ఐకాన్ క్లిక్ చేద్దాం. మనం దానిని క్లిక్ చేస్తే, అది కేవలం డెస్క్టాప్ను మాత్రమే చూపుతుంది. మరలా దానిని క్లిక్ చేస్తే డెస్క్టాప్ను అప్పటికే తెరచి ఉన్న ఫైల్స్‌తో సహా చూపుతుంది. |
8:08 | విండోస్ కీ మరియు Dలను ఒకేసారి నొక్కడం ద్వారా కూడా మీరు డెస్క్‌టాప్‌కు వెళ్లవచ్చు. ఉబంటు యొక్క గత వెర్షన్స్‌లో డెస్క్‌టాప్‌కు వెళ్లడానికి ఉపయోగించింది Clt+Alt+Dగా ఉందని గమనించండి. యూజర్ ఒక రూపం నుండి మరొక రూపానికి ఆవిధమైన తేడాలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం విండోస్ కీ మరియు Dనొక్కుదాం. |
8:37 | ఇక్కడ మీ పెన్-డ్రైవ్ డెస్క్టాప్పై ఉండటాన్ని మీరు చూడగలరు. |
8:42 | దానిపై రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా మనం దానిని తెరుద్దాం. |
8:46 | నేను మూవీ ఫైల్‌ను చూపమని సెలక్ట్ చేసాను, అది Ubuntu Humanity.ogv. |
8:57 | ఇది నా ఫైల్, దానిని తెరవడానికి నేను రెండుసార్లు క్లిక్ చేస్తాను. |
9:09 | అది సాధారణంగానే మూవీ ప్లేయర్లో తెరుచుకుంటుంది. దీనిని మనం మూసేద్దాం. |
9:13 | ఇప్పుడు మనం డెస్క్టాప్పై మరిన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. |
9:18 | దానికోసం మనం ఈ సారి ప్లేసెస్ మెనూకి వెళదాం. దీనిలో, మనకి హోమ్ ఫోల్డర్ ఉంది. |
9:27 | మనం దీనిని తెరుద్దాం. హోమ్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి. |
9:29 | ఉబంటులో ప్రతి యూజర్ ఒక ప్రత్యేక హోమ్ ఫోల్డర్ కలిగి ఉంటాడు. |
9:34 | మనం హోమ్ ఫోల్డర్ని "our house"గా చెప్పవచ్చు, ఇక్కడ మనం మన ఫైల్స్ మరియు ఫోల్డర్స్ భద్రపరచుకోవచ్చు. |
9:42 | మన అనుమతి లేనిదే ఇతరులు వాటిని చూడలేరు. ఫైల్ అనుమతులపై మరింత సమాచారం http://spoken-tutorial.orgలో లైనక్స్ ట్యుటోరియల్స్‌లో లభ్యమవుతుంది. |
9:56 | మన హోమ్ ఫోల్డర్లో, డెస్క్‌టాప్, డాక్యుమెంట్లు, డౌన్లోడ్లు, వీడియోలు మొదలైన ఇతర ఫోల్డర్లను మనం చూడగలము. |
10:08 | లైనక్స్లో, ప్రతి విషయమూ ఒక ఫైలే. డెస్క్‌టాప్ ఫోల్డర్‌పై రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా మనం దానిని తెరుద్దాం. |
10:16 | మనం టెక్స్ట్ ఎడిటర్‌తో భద్రపరచిన "hello.txt" ఫైల్ ఇక్కడే ఉంది. |
10:25 | అంటే ఈ ఫోల్డర్ మరియు డెస్క్‌టాప్ ఒకటే. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ను మూసేస్తున్నాను. |
10:31 | ఒకే థీమ్ ఆఫ్ డెస్క్‌టాప్ చూసి మీరు విసుగు చెందలేదా? దానిని మార్చేద్దాం. |
10:37 | దానికోసం System->Preferences->Appearanceవెళ్లండి. దానిపై క్లిక్ చేయండి. |
10:44 | ఇక్కడ థీమ్స్ టాబ్ క్రింద, ముందే ఇన్స్టాల్ చేయబడిన అనేక థీమ్స్ ఉన్నాయి. మనం "Clearlooks" ఎంపికచేద్దాం. |
10:52 | మీరు దానిపై క్లిక్ చేయగానే మీ యంత్రంపై మార్పులు చోటుచేసుకోవడాన్ని గమనించవచ్చు. |
10:58 | క్రింద ఎడమవైపు మూల ఉన్న డెస్క్‌టాప్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు దానిని స్పష్టంగా చూడవచ్చు. మనం ఈ ఐకాన్‌పై మరలా క్లిక్ చేయడం ద్వారా తిరిగి ఫోల్డర్‌కు వెళదాం. |
11:10 | ఈ థీమ్స్‌లో మీకు నచ్చిన వాటితో ఆడుకోండి, బయటకు రావడానికి క్లోజ్ బటన్‌పై క్లిక్ చేయండి. |
11:18 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగిద్దాం. |
11:21 | ఈ ట్యుటోరియల్‌లో మనం ఉబంటు డెస్క్‌టాప్, మెయిన్ మెనూ మరియు ఉబంటు తెరపై కనిపించే ఇతర ఐకాన్ల గురించి నేర్చుకున్నాం. |
11:31 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రాజక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:41 | దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
11:47 | ఈ రచనకు సహాయపడింది –పి.వి.శైలజ(అనువాదంచేసిన వారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారు)--------------------------(ప్రదేశం పేరు)నుండి. ధన్యవాదములు మరియు శుభం. |